ADITYAHRDAYAMU-14


 ఆదిత్యహృదయము-14

   ***************

  "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం

   కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం

   అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం

   సకలభువన వంద్యం  భాస్కరం  తం నమామి."

  పూర్వరంగము

  ****ఆతపీ మందల మధ్యస్థునిగా పరమాత్మను ప్రశంస్తూ,స్వామి విశ్వరచనా దక్షతను ఉత్తర-దక్షిణ అయన మార్గ సంచారమును వివరించిన,మహర్షి,

ప్రస్తుత శ్లోకములో స్వామివిశ్వర రచనా వైభవమును,తన పర-వ్యూహ-విభవ-అర్చా-అంతర్యామి స్వభావ మును లోకవిదితము చేయుచున్నారు.

శ్లోకము

*******

'నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః

తేజసామపి తేజస్వి "ద్వాదశాత్మం నమోస్తుతే".

ప్రస్తుత శ్లోకము నమోస్తుతే ఓ ద్వాదశాత్మన్ అంటూ, సూర్యభగవానుడు తన శక్తులను పన్నెండు విభాగములుగా ఏర్పరచి /వ్యూహరచనను చేసి,తద్వారా తన విభవమే సమస్తముగా మలచి,వానిలో తాను అంతర్యామియై,ప్రత్యక్ష అర్చనమునకు అనుగ్రహిస్తూ,అర్చామూర్తియై ఆరాధనములను  అనునిత్యము గ్రహిస్తూ,మనలను అనుగ్రహిస్తున్నాడు.

అనుసరిస్తూ,గ్రహించే అంతరిక్ష శరీరధారులే గ్రహములు.గోళాకారమును కలిగిన తొమ్మిది ముఖ్యగ్రహములు సూర్యలేక ఇతర నక్షత్ర కేంద్రకములుగా బరువును-గురుత్వాన్ని(ఆకర్షణ శక్తిని పొందుతూ,ఒక నిర్ణీత క్రమములో భ్రమిస్తూ,భూమి తన చుట్టు తాను తిరుగుతూ,సూర్యుని చుట్టు తిరుగుటకు సహాయపడుతుంటాయి.

సామాన్య వ్యవహారములో,నక్షత్రములు-తారలు సమానార్థక పదములుగా వ్యవహరిస్తున్నప్పటికిని,ఖగోళ విజ్ఞానము,వాటి మధ్యనున్న భేదమును స్పష్టీకరించినది.

అనేక నక్షత్రములున్నవని భావిస్తున్నప్పటికిని,అశ్వని-భరణిమొదలగు 27 నక్షత్రములు స్వయంప్రకాశములుగా ,

'తేజాసామపి తేజస్వి" అని పరమాత్మను ప్రస్తుతిస్తున్నాయి.

నక్షత్రము దివారాత్రములు ప్రకాశిస్తూనేఉంటాయి,కాని,

తారల ప్రకాశము సూర్య ప్రకాశముచే కప్పివేయబడుతుంది.

ఖగోళములో పరమాత్మ నక్షత్ర స్వరూపములలో-తారల స్వరూపములలో-గ్రహములస్వరూపములలో,అంతర్యామిగా ఉండిభువనభాండములను సమన్వయపరుస్తున్నాడు.

సంవత్సర కాలములో మాసములు అను పన్నెండు విభాగములలో ప్రత్యేక సౌరశక్తి స్వరూపములే ద్వాదశాదిత్యులు.

అవి ఒకదానికి మరొకటి అనుసంధానముగా తనచుట్టునున్న సహాయక శక్తులను మలచుకుంటూ సమర్థవంతముగా పాలించుచున్నవేళ,

' యన్మండలం జ్ఞానఘనం త్వ గణ్యం

త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపం

"సమస్త తేజోమయ దివ్యరూపం

పునాతు మాం తత్ సత్ వరేణ్యం"

" తం సూర్యంప్రణమామ్యహం."


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI