Tuesday, May 29, 2018

TIRUPAANNAI ALWAR

సంభవామి యుగే యుగే-సాక్ష్యములు హరిఆభరణములు
 ధర్మ సంస్థాపనమేలక్ష్యమైన మన ఆళ్వారులు

 ఉరైయూరులోని వరివెన్ను నుండి అయోనిజుడుగ
 ప్రశంసలతో ప్రకటితమైనది హరి శ్రీవత్సపు అంశ(పుట్టు మచ్చ)

 మాల దాసరి ఇంట గోక్షీరముతో  పెరుగుచు
 విష్వక్సేనునిచే పంచకర్మ సంస్కారములనందినది

 ఆలయ ప్రవేశము లేకున్నను, అద్భుత వీణాగానము
 సారంగ ముని భుజమునెక్కి యోగివాహనునిగా చేసెను

 పక్కకు తొలగలేదని ఆళ్వారును  రాళ్ళతో కొట్టగా
 చక్కని భక్తిని  తెలుపగ స్వామి తాను భరించెనుగా

 నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
 పరమార్థము చాటిన  తిరుప్పాణాళ్వారు పూజనీయుడాయెగ.


శ్రీ తిరుప్పాణాళ్వారు శ్రీహరి శ్రీవత్సపు 9ఎదమీది పుట్టుమచ్చ) అంశగా గానముతో-వాద్యవిశేషములతో స్వామిని అర్చించు పనర వంశమున,శ్రీ రంగపట్టణ సమీపమునందలి అలకాపురిలో అవతరించెను.తన ఆరాధనలతో పెరుమాళ్ గా ప్రఖ్యాతిగాంచెను.
అంటరానితనమును అంటుకొనియున్న నాటి సమాజపు పెద్దలు తిరుపాణ ను ఆలయప్రవేశమునకు అనుమతించలేదు.అంతేకాదు వారు ఉపయోగించుకొను జలతీర్థములను తాకరాదని ఆంక్షలను విధించిరి.వారిని ఎదిరించు ఉద్ద్యేశములేని తిరువణ్ణ ఒకనాడు భగవద్గుణజలధిలో మునిగి,తాదాత్మ్యమును చెందుతూ,పరిసరములను పరిశీలించలేదు.దాని ఫలితమే స్వామి అర్చకునిచే విపరీతముగా దండింపబడినాడు.స్వామిని అనుగ్రహమునకుముందుగా ఆటంకములను తొలగించుటకు పరీక్షించినాడేమో.ఆలయమునకు తిరిగివెళ్ళిన అర్చకుస్వామి,రక్తసిక్తమైయున్న శ్రీరంగనాథుని చూసి
అపరాథముతెలియక,ఆందోళనతో నున్న సమయమును,సర్వము సాక్షాత్కరింపచేసెనట.పశ్చాతపుడైన అర్చకుడు మన ఆళ్వారుని తన భుజములమీద నెక్కించుకొని స్వామి దర్శనమునకు తీసుకొని వెళ్ళెనట.మునివాహన వందనములు.

జై శ్రీమన్నారాయణ.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...