Saturday, April 6, 2019

NA: PRAYACHCHAMTI SAUKHYAM-04

 నః ప్రయచ్చంతి సౌఖ్యం-07
  " ఓం తస్కరాణాం పతయే నమః"
  ********************************
 ఒక్కడే! దిక్కొక్కడే ! పెద్ద దొంగ ఒక్కడే
 అదుపుతప్పుచున్న అరిషడ్వర్గములను దోచు

 దొంగ ఒక్కడే

 దేవుడు-జీవుడు ఒక్కడే
 ధర్మము-మర్మము తానొక్కడే.

 లోకాన దొరకాదు దొంగవని చాటాను
 నా పాపరాశులన్నీ దొంగల్లే దోచేశావు

 అని స్తుతింపబడిన మహేశ్వరుని చోరకళా విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.ఓం నమః శివాయ.

  చోరాన్  మారయ మారయ
  ------------------------
  " భగవంతుడు-భక్తుడు ఇద్దరు దొంగలే"

     దొంగలరూపములో నున్న ఈశ్వరచైతన్యమునకు నమస్కారము.ఈశ్వర చైతన్యము చర్మచక్షువులకు కానరాకుండా,సకలచరాచర జీవరాశులయందు దాగియుండి వాటిని శక్తివంతముగా ప్రకటించు చున్నది.ఎందుకంటే ,

రుద్రుడు "స్తేనానం పతి". గుప్తచోరుడు.మనకు దొరకకుండ రహస్యముగా మనలోనే దాగియున్నాడు.నమో నమః.

 ఏ వికారములేని పరమాత్మ అనేక చోరులరూపములలో ప్రకటింపబడుతు పాపములను దోచుకొనుచు ప్రాణులను సంస్కరిస్తుంటాడు.బహురూపములైన భగవత్తత్త్వమును భజించరాదే ఓ మనసా!

1.స్తేనానాం పతయే నమః.
****************************
    యజ్ఞశర్మ కుమారుడైన "గుణనిధి" ని (గుప్తచోరునిగా మనము పరిశీలిస్తే) శివలీలావైభవమును స్తుతించకుండ ఉండలేము.వ్యసనలోలుడైన గుణనిధి తన విలాసములకు కావలిసిన ధనమునకై,తండ్రి పాండిత్య ప్రతిభా పురస్కారముగా లభించిన వజ్రపుటుంగరమును రహస్యముగా దొంగిలించినప్పటికిని,స్వామి దవ్వునున్న రవ్వంత పుణ్యఫలమును దరిచేర్చి,పాపములను దొంగిలించి,సామీప్య-సాయుజ్యములనిచ్చి సంస్కరించెను." ఓం నమః శివాయ."

2.తస్కరాణాం పతయే నమః.
   **********************

    ప్రకటిత దొంగలు,ప్రత్యక్ష దొంగలు వీరు.వీరికి నాయకుడు మన నిటలాక్షుడు. ఎంతటి విలక్షణుడో!విరూపాక్షుడు.

   మైసూరు సమీపములోని నంజనగూడు ప్రాంతములో మల్లుడు అను తస్కరుడు కలడు.అతను దారిమూలలో దాక్కొని, బాటసారుల సంపదను భయపెట్టి దోచుకునేవాడు.మరొక విధముగా అన్వయించుకుంటే సన్మార్గులకు ఆటంకములను కలిగించేవాడు

నమః కకుభాయ నిషంగిణే స్తేనానాం పతయే నమః

 స్తేన అనగా పట్టుకొనలేని రహస్యపు దొంగ.

 ఉభయ నమస్కార గ్రహీత అయిన రహస్యము దొంగకు ,మల్లునిపై అవ్యాజదయ యో అనునట్లు వానిని ఒక నియమబధ్ధుని చేసెను.కర్త-కర్మ-క్రియ మూడును తానైన శివుడు.హరోం హర.





.ఏ పూజావిధానము తెలియని వాడు వీడు కాని ఏ పూర్వపుణ్యమో తెలియదు కాని,కళ్ళుమూసికొనినప్పుడల్లా ఏలినవాడు ఎదముందుండేవాడు.సహ ఉద్యోగిపై .సహృదయతకు సాఖ్యమేమో.
" నమః స్సోభ్యాయచ ప్రతిసర్యాయచ" పుణ్య-పాపములముండు పరమేశ్వర ప్రణామములు.

   మల్లుడు మార్గములందున్న మూలలలో (బహుశ అష్టమూర్తి పర్యవేక్షణమేమో) దాగి బాటసారులను బెదిరిచి సర్వము దోచుకొనేవాడు.చతుషష్టికళలో స్థానము సంపాదించిన కళ కనుక ఆ పని అతనికి ఏ మాత్రము తప్పుగా అనిపించలేదు.కాలాతీతుని లీలగా కాలక్రమేణ బందిపోటు మల్లన గా ప్రసిధ్ధిగాంచెను.పెరుగుట తరుగుట కొరకేనేమో. 

కాల భ్రమణములో మల్లుని నియమపాలన సమయము రానేవచ్చినది రాబోవు పరిణామములకు సూచనగా.

.మల్లునికి ఒక నియమము కలదు సంవత్సరాంతమున తాను దోచిన ధనమును మొత్తము ఉపయోగించి " కాట్రేడు జాతరను" కాటి-రేడు. ఘనముగా జరిపించి  అమితానందమును పొందెడివాడు.ప్రతి సంవత్సరము ఇదే వీడివరస.వీడి పేరుపై "కల్లన మూలై" ఇప్పటికి విరాజిల్లుతోంది.నాటకమును రక్తి కట్టిస్తున్నాడు నందివాహనుడు.




 ప్రణవస్వరూపుడు స్వర్గము కోరువారికి స్వర్గమును,ముక్తి కోరువారికి ముక్తిని అనుగ్రహించువానికి,

    " నమో సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః" అన్న స్తుతులు వినిపించినాయా అన్నట్లుగా బాటసారులను రక్షించాలానకున్నాడు భవుడు.మల్లుని మనసున దూరాడు.మనిషిని చేసాడు.

  : నమః ప్రతరణాయచ-ఉత్తరణాయచ" 



 ఆ "దౌర్జనపు గట్టునుండిమల్లుని దయార్ద్ర గట్టునకు చేర్చేశాడు".

 కాఠిన్యమును కాల్చివేసినాడు ఆ కాముని కాల్చినవాడు.



మధురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా!

  కనుగొన  ఇహ-పర సాధనమే
  పలుకగ  సురుచిర పావనమే

  భావజ సంహార-మమ్ముల కావగ రావయ్యా. అంటూ,-
 బాటసారులు తమ సంపదను స్వచ్చందగా సమర్పించేవారు.మరింత వైభవముగా మల్లుడు మల్లేశ్వరుని జాతర జరిపిస్తు,స్వామి సాన్నిధ్యమును పొందగలిగాడు మల్లుడు." నమః శర్వాయచ పశుపతియే నమః.

2.తస్కరాణాం పతయే నమః.
   **********************

    ప్రకటిత దొంగలు,ప్రత్యక్ష దొంగలు వీరు.వీరికి నాయకుడు మన నిటలాక్షుడు. ఎంతటి విలక్షణుడో

   మైసూరు సమీపములోని నంజనగూడు ప్రాంతములో మల్లుడు అను తస్కరుడు కలడు.అతను అతడు దారిమూలలో దాక్కొని బాతసారుల సంపదను భయపెట్టి దోచుకునేవాడు.ఏ పూజావిధానము తెలియని వాడు వీడు కాని ఏ పూర్వపుణ్యమో తెలియదు కాని,కళ్ళుమూసికొనినప్పుడల్లా ఏలినవాడు ఎదముందుండేవాడు.సహ ఉద్యోగిపై .సహృదయతకు సాఖ్యమేమో.
" నమః స్సోభ్యాయచ ప్రతిసర్యాయచ" పుణ్య-పాపములముండు పరమేశ్వర ప్రణామములు.

   మల్లుడు మార్గములందున్న మూలలఓ దాగి బాటసారులను బెదిరిచి సర్వము దోచుకొనేవాడు.ఆ పని అతనికి ఏ మాత్రము తప్పుగా అనిపించలేదు.క బందిపోటుగా ప్రసిద్ధిగాంచెను.మల్లునికి ఒక నియమము కలదు సంవత్సరాంతమున తాను దోచిన ధనమును మొత్తము ఉపయోగించి " కాట్రేడు జాతరను" కాటి-రేడు. ఘనముగా జరిపించి  అమితానందమును పొందెడివాడు.ప్రతి సంవత్సరము ఇదే వీడివరస.వీడి పేరుపై "కల్లన మూలై" ఇప్పటికి విరాజిల్లుతోంది.నాటకమును రక్తి కట్టిస్తున్నాడు నందివాహనుడు.

   ఇంతలో " నమో సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః" అన్న స్తుతులు వినిపించినాయా అన్నట్లుగా బాటసారులను రక్షించాలానకున్నాడు భవుడు.మల్లుని మనసున దూరాడు.మనిషిని చేసాడు.అంతే బాటసారులను బాధించుట మానివేసాడు.
సేవలకే అని గ్రహించిన బాట సారులు పత్రం-పుష్పం-ఫలం-తోయం శక్త్యానుసారముగా 



తమదగ్గర దోచుకొన్న సంపద మల్లన్నను సేవలకే అని గ్రహించిన బాట సారులు పత్రం-పుష్పం-ఫలం-తోయం శక్త్యానుసారముగా 
 తమ సంపదను స్వచ్చందగా సమర్పించేవారు.మరింత వైభవముగా మల్లుడు మల్లేశ్వరుని జాతర జరిపిస్తు,స్వామి సాన్నిధ్యమును పొందగలిగాడు మల్లుడు." నమః శర్వాయచ పశుపతియే నమః.

" నమ:శంగాయచ-పశుపతయేచ" సర్వజీవులకు శుభములను కలిగించు సర్వేశ్వరా! దొంగల రూపములలో నున్న ఓ పెద్దదొంగ నీవు వారి కర్మఫలములను కానరాకుంద కనుమరుగు చేయుచున్నావు.వాటిని తిరిగి వారి దరిచేరనీయుట లేదు.వారిని జీవన్ముక్తులుగా చేయుచున్న " ప్రణత దు:ఖద్రావక" నమో నమః.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

   ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...