ADITYAHRDAYAMU-22


 


ఆదిత్యహృదయము-శ్లోకము-22


***********************


ప్రార్థన


*******


"జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం


కిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం


అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్య మూర్తిం


సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."



పూర్వరంగము


***********


పూర్వ శ్లోకమును "తప్త-చామీకరాభాయ వహ్నియేవిశ్వకర్మిణే"అంటూ పరమాత్మను ప్రస్తుతిస్తుంది.


చామీ కరము-బంగారు కిరణము.ఆ బంగారు కిరణము మేరుపర్వతమును పరమాత్మ స్పృశించుటచే ఏర్పడినది.

.ఆ బంగారు కిరణము స్వామి అనుగ్రహమే.


వేడిచే-వెలుగుచే తప్తమైనది/కాల్చబడినది.అంటే ఇతర లోహ ధాతువులను సైతము విడదీయలేంతగా తనలో కలుపుకొనిన బంగారపుకొండ స్వామి స్పర్శచే దోషములను ఆవిరిరూపములో/ద్రవరూపములో కరిగించుకుని/తొలగించుకుని,తప్తము చేసికొని,పుటమై,మేలిమిముద్దగా ప్రకాశిస్తున్నది.ఇది వాచకము.


జీవుల ఉపాధి/దేహము మేరుపర్వతమే..అది మంచి-చెడులను విడదీయలేనంతగా తనలో కలుపుకుని సందిగ్ధములో ఉంది.స్వామి తన కరుణ అనే అగ్నితో దానికి పుటము వేసి శాశ్వతమైన-ఆత్మను-అశాశ్వతమైన ఉపాధిని వేరుచేసి ప్రకాశింపచేయుచున్నాడు.అదియే కదా,


న ఛిందంతి శస్త్రాణి-న దహతి అన్న ఆత్మ వివేక సారము.


పూర్వశ్లోకము కృతఘ్నఘ్నాయ అన్న ప్రళయసంకేతికమైన పదముతో ముగిసినది.దానికొనసాగింపుగా,ప్రస్తుత శ్లోకము,ప్రారంభమగుతున్నది,


నాశయత్యేష వైభూతం అన్న పదముతో,ప్రళయ తరువాత స్థితికి సూచనగా.


శ్లోకము


******


" నాశయత్యేష వైభూతం తదేవ సృజతిప్రభుః


  పాయత్యేష-తపత్యేష-వర్షత్యేష గభస్థిభిః"




భూతము అనగాజీవి.అది యే ఉపాధి యైననుకావచ్చును.పరమాత్మ ఆ ఉపాధుల సమస్తమును మొదట నశింపచేస్తాడట.


తదేవ-తత్-ఏవ .తిరిగిమొత్తముగా దానిని,ఏ ఒక్క చిన్న విశేషమును వదలకుండా సృజతి.సృష్టిస్తాడు.


తిరిగి సృష్టిస్తాడు.


తనయొక్క కాంతులతో/ప్రభలతో .


ఇది సారాంశము.ఏ విధముగా సంహార-సృష్టి విధానమును నిర్వహిస్తున్నాడు అన్నది వివరణ.మూడు పనులక్రమముగా చేస్తూ,

పాయత్యేష-తపత్యేష-వర్షత్యేష అన్నవి ఆ క్రియాపదములు.


వివరణకు ముందు సహాయకారిగా ఒక చిన్న విషయమును ప్రస్తావించుకుందాము.


అరటిచెట్టు గెలవేసినది-వెంటనే దానిని నరికి వేశారు.కాని పిలకను/దుంపను మాత్రము ఉంచారు.


ఈ విధానమే పాయత్యేష.పారత్యేష కంటే ఉత్తమమైనది పాయత్యేష అన్న పదము శిక్షిస్తున్నట్లుగా అనిపించే రక్షణము.పారయత్యేష-ఒడ్దునకు చేర్చుట.పాయత్యేష అనగా తిరిగి సంసారమనే సాగరములోనికి ప్రవేశపెదతాడు.


ఏవిధముగా అంతే,


1.పాయత్యేష-నశింపచేస్తూ-సృజింపచేస్తూ.


ఏ విధముగా సృజింపచేస్తున్నాడు అంటే,


నరికివేయబడిన అరటిచెట్టు దుంప/మూలము భూమిలోనే ఉంచాడు.దానిని,


2. తన ఘర్మసర్జన కిరణములను ప్రసరింపచేసి,వేడినికలిగించి,మొక్కగా మారుటకు అనుకూల స్థితిని ఏర్పరిచి,


ఇప్పుడు, మొక్క ప్రస్పుటముగా కనబడుతోంది.కాని అదిపెద్దదై తిరిగి గెలవేయగలగాలి.అందుకు జలము అవసరము.


3.వర్షత్యేష- ఎదుగుచున్నమొక్కకు ఆహారమును అందించుటకు/పత్రహరితమును సమకూర్చుకొనుటకు అనుకూలమైన కిరణ ప్రసారముచేస్తూనే,జలసర్జన కిరణములను ప్రవేశింపచేస్తాడు వర్ష రూపములో.


అవి అరటిచెట్టు ఎదిగి పూవుపూసి,గెలవేసి అనేకానేక అరటిపండ్లను,అరటి దూటను,పూవును మనకు అందిస్తుంది.


అంటే,రశ్మిభావను కలిగినపరమాత్మ సముద్యంతుడై తేజసామపి తేజస్వి యై,


సహస్ర రశ్ముడై,తనకరములతో/కిరణములతో పంచభూతములను కార్యనిర్వహణ శక్తులను చేసి,భగ భగ మనుచు,గభ గభ వ్యాపిస్తూ ఆదాన-ప్రదానకుడై,ఇచ్చి-పుచ్చుకుంటూ ,


ప్రాణానాం ఆయతనం భవతి గా సంస్కృతములోను,


"సద్గుణ ప్రాప్తి యే సద్గతి ప్రాప్తి "అని వివరిస్తూ,తెలుగులో,


" చుట్టము పక్కముం గురువు చూపును-ప్రాపును-గాపును-జ్ఞానజ్యోతియున్" అని తెలుగులో ప్రస్తుతించుచున్న వేళ,


" తం సూర్యం ప్రణమామ్యహం." 



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI