ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM-03
"కోశేషు పంచ్ర్హస్వధిరాజమానా
బుద్ధిర్భవానీ ప్రతి దేహ గేహం
సాక్షీ శివః సర్వగతోంతరాత్మా
సా కాశికాం నిజబోధరూపా."
పదవిభజనము
ప్రతి దేహగేహం-ప్రతి దేహమనే ఇంటిలో
కోశేషు పంచః- అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ-
ఆనందమయ అని ఐదు ప్రత్యేక స్వభావములు గల తొడుగులలో
అదిరాజ మాన-విరాజమానమై యుండియును
వానిచర్యలను గమనిస్తున్నప్పటికిని
సాక్షీ శివః-వాటిని పట్టించుకోకుండా
సాక్షిగా చూస్తున్న శివుడే/ ఆ ప్రకాశమే తత్త్వబోధను తెలియచేయుచున్న ప్రకాశము.
పరమాత్మ కర్తృత్వము-భోక్త్వత్తమును ద్ధ్తానేనిర్వహ్పిస్తున్నప్పటికిని
రెండుగా ప్రకటితమగుచున్నాడు.ఒక్కదానిని అర్థముచేసుకొనుటకు రెండు స్వరూప-స్వభావములు సహాయపడుతుంటాయి.
అవే,
1. భవాని-దేహము-----భవుడు ఆత్మ
2.భవాని-జీవాత్మ-భవుడు-పరమాత్మ
3.భవాని-విభాజ్యము (పంచకోశములు-పంచేంద్రియములు-పంచతన్మాత్రలు -భవుడు-అవిభాజ్యము
4.భవాని-సగుణము-భవుడు నిర్గుణము
5.భవాని-సాకారము-భవుడు నిరాకారము
6.భవాని-ఇంద్రియసహితము-భవుడు ఇంద్రియ రహితము
7.భవాని క్షత్రము-భవుడు క్షత్రజ్ఞుడు
8.భవాని కర్మాచరనము-భవుడు సాక్షీభూతము
9.భవాని-కృత్యము-భవుడు కర్త
10.భవాని వికార సహితము-భవుడు నిర్వికారము.
క్షత్రజ్ఞుడు ఒకే సమయములో సర్వవ్యాపకత్వముతో విరుద్ధ లక్షణములను . కలిగియుండి దేహమునుగురించి తెలుపుతుంటుంటాడు.
Comments
Post a Comment