Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-64

ఓం నమః శివాయ-75 ******************* అగ్నికార్యఫలితములు అన్నీ ఇంద్రునికైతే బృహస్పతి చేరాడు బుధ్ధితో ఇంద్రుని సరస్వతి చేరింది బృహస్పతిని చూసి వరుణుడు చేరాడు ఆదరణకై ఆ ఇంద్రుని భూమికూడ చేరింది ఈవి కోరి ఆ ఇంద్రుని గాలివీచసాగింది నేరుగా ఆ ఇంద్రుని అవకాశము ఇది అని ఆకాశము చేరింది ఆశ్వనీదేవతలు ఆశ్రయించారు ఇంద్రుని పంచభూతములు కలిసి నిన్ను వంచించేస్తుంటే పంచాల్సిన ఫలితమును అంతా దోచేస్తుంటే స్వార్థమంత గుమికూడి అర్థేంద్రముగా మారింది నిన్నొక్కడినే వేరుచేసి ఓ తిక్కశంకరా. వేదశాస్త్ర ప్రకారము దేవతలు యజ్ఞకృత హవిస్సును ఆహారముగా స్వీకరిస్తారు.వారికి ఆ అవకాశమును అనుశివుడేగ్రహించాడు.కాని వారు శివుని లెక్కచేయక,శివునికి తెలియకుండా,చెప్పకుండా,తామందరు కుమ్మక్కై ,శివుని యజ్ఞ హవిస్సులో సగభాగమును ఈయకుండా,తామే స్వీకరించాలని వెళ్ళిన శివుడు వారినేమి అనకుండా మౌనముగా చేతకాని వలె నున్నాడు-నింద. యజ్ఞం నమః శివాయ-యజ్వ నమః శివాయ కర్త నమః శివాయ-భోక్త నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " అగ్నిశ్చమ ఇంద్రశ్చమే-సోమశ్చమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే-బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే" రుద్రచమకము లోని ఆరవ అనువాకము అర్థేంద్ర అనువాకముగా ప్రసిధ్ధిపొందినది.చమకము అగ్నా- విష్ణూ, రెండు మహత్తర శక్తులను జతగా వచ్చి,జయమును కలిగించమంటుంది.అదే విధముగా స్థితికార్యమును నిర్వహించు సమయమున మగేశ్వరుడే మహేంద్రుడిగా కీర్తింపబడుతుంటాడు.యజ్ఞ నిర్వహణకై మహేశ్వరుడు తన నుండి కొన్ని అద్భుత శక్తులను ఆవిర్భవింపచేసి,వాటికి కొన్ని బాధ్యతలను అప్పగిస్తాడు.వాటి సద్గుణములే దివ్యనామములై విరాజిల్లుచున్నవి.స్వామి వాటిని విస్తరింపచేయగలడు.అవసరము లేదనుకుంటే తనలో విలీనము చేసుకోగలడు.సాధకుని యజ్ఞమును సమర్థవంతము చేయుటకు ఇంద్రునిగా తాను వారిని వెంటపెట్టుకుని వచ్చి,యజ్ఞ హవిస్సులలో సగభాగమును వానికిచ్చి,మిగిలిన సగమును తాను స్వీకరించి "లోకాన్ సమస్తాత్ సుఖినో భవంతూ అను ఆర్యోకిని నిజము చేస్తాడు యజ్ఞము-యజ్ఞకర్త-యజ్ఞభోక్త -యజ్ఞహర్త అయిన పరమేశ్వరుడు. స్తుతి. ఏక బిల్వం శివార్పణం. .

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...