Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-73

"పెద్ద దేవుడనని" అని నీవంటే" మద్ది" తెల్లబోయింది "అంబే శివుడిని" అని నీవంటే "జంబూ" బెంబేలెత్తింది "భూత నాథుడిని" అని నీవంటే "చూతము" చూతమంది "దొడ్డవాడిని" అని నీవంటే " గడ్డి" అడ్డుచెప్పకుంది "చెలకని వాడను" అని నీవంటే "చెరకు" ఊరుకున్నది "మీ రేడును" అని నీవంటే "మారేడు" మారాడకున్నది "ఉబ్బు లింగడిని" అని నీవంటే "కొబ్బరి"నిబ్బరించుకుంది "నిర్వాహకుడిని" అని నీవంటే "ఉర్వారుకము"నవ్వింది "యోగిని" అని నీవంటే నీవంటే "రేగి" ఆగి పోయింది " వృక్షేభ్యో- హరికేశేభ్యో" అని మొహమాటముతో అనగానే "అన్ని చెట్లు" నీవంటే "అక్కసుతో" పచ్చి అని,నిన్ను వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా. భావము మద్ది చెట్టు,నేరేడు చెట్టు,మామిడి చెట్టు,రేగి చెట్టు,గరిక,చెరకు,మారేడు చెట్టు,కొబ్బరి చెట్టు,దోస పాదు, హరితమునందిస్తుంటే భక్తులు శివుని పచ్చనైన కేశములతో విరాజిల్లు హరికేశునిగా పొగడగానే శివుడు వాటి గొప్పదనమును తనపై ఆపాదించుకొను చున్నాడు-నింద శ్రీశైల స్థల వృక్షమైన మద్దిచెట్టు,జంబూ ద్వీపముగా ప్రసిద్ధి చెందిన నేరేడు చెట్టు,పావన బదరికా వనముగా రేగి చెట్టు,త్రిగుణాత్మకతతో పువ్వులు లేకుండానే కాయలు అందించే మారేడు చెట్టు,కంచిలో ఆమ్రేశ్వర రూపమైన మామిడిచెట్టు, అచంచలతకు ప్రతీకయైన కొబ్బరి చెట్టు,తుఫాను సైతము కదల్చలేని గడ్డి,హింసించినను మధురతను ఇచ్చు చెరుకు,మృత్యుంజయ మంత్ర వివరణ యైన దోస పాదు,పరమేశ్వరుని దయచే జగత్పూజ్యములైనవి. (ఏక బిల్వం శివార్పణం ) Image may contain: 1 person

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...