Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-78

ఓం నమః శివాయ-68 ***************** మాతంగపతిగ నువ్వుంటే ఏది రక్షణ వాటికి? గణపతి అవతరించాడు కరివదనముతో అశ్వపతిగ వుంటె నీవు ఏదిరక్షణ వాటికి? తుంబురుడు వచ్చాడు గుఱ్ఱపు ముఖముతో నాగపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి? పతంజలి వచ్చాడు మనిషి ముఖముతో వానరపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి? నారదుడు వచ్చాడు వానర ముఖముతో సింహపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి? నరసింహుడు వచ్చాడు సింహపు ముఖముతో పశుపతిగ నీవుంటే అశువులకు రక్షణలేదని ఒక్కటే గుసగుసలు ఓ తిక్కశంకరా. శివుడు తాను పశుపతినని,వాటిని సంరక్షిస్తానని చెప్పుకుంటాడు కాని కళ్ళెదురుగానే శిరము వేరు-మొండెం వేరుగా ఎన్నో రూపములు కనిపిస్తూ,శివుని చేతగానితనమును ఎత్తిచూపిస్తున్నాగాని కిమ్మనక ఊరుకుంటాడు కాని దురాగతములను ఆపడు.-నింద.తాను కూడ శరభ రూపమును ధరించి మరొక్కసారి ఋజువు చేసాడు. శిరము నమః శివాయ-మొండెము నమః శివాయ పశువు నమః శివాయ-మనిషి నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. " ఛందఃశాఖి శిఖాన్వితైర్ద్విజవరైవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజవృధా సంచార మంత్యైరలం నిత్యం శంకర పాదపద్మ యుగలీనీడే విహారం కురు." శివానంద లహరి. మనసా! నీ అవివేకపు ముసుగును తొలగించి అన్నిటింలో శివస్వరూపమును దర్శించుటకు ప్రయత్నించు.స్వామి నిరాకారుడు.ప్రకటింప బడుతున్న-ప్రకటించేయ బడుతున్న ఈ బాహ్య ఆకారములు స్వామి లీలలనె విభూతులు.కనుక నీవు వ్యర్థముగా అటు-ఇటు సంచరించకు.శంకరుని పాదపద్మములనే శుభప్రదమైన గూటిలో విహరించు.ఎందుకంటే ఆ గూడు వేదములనే చెట్టును ఆశ్రయించుకొని యున్న,వేదాంతము అనే కొమ్మలతో,వాని వాలి యున్న మంచి పండితులనే పక్షులతో ప్రకాశిస్తుంది.అనుగ్రహమును ప్రసాదిస్తుంటుంది.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం. Posted 23rd July by taetatelugu.com 0 Add a comment

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...