SIVA SANKALPAMU-60

ఓం నమః శివాయ-60 ***************** కుమ్మరివి నీవంటే ఓటికుండ నవ్వుకుంది కమ్మరివి నీవంటే లోహము నమ్మకమే లేదంది వడ్రంగివి నీవు అంటే కొయ్యముక్క అయ్యో అంది విల్లమ్ములు నీవంటే రెల్లుపూజ చెల్లు అంది పంటచేను నీవంటే పంట పంటలేసుకుంది వైద్యుడివి నీవంటే ఔషధ నైవేద్యాలే అంది గురువువి నీవంటే స్వరము విస్తుబోయింది చల్లని ఇల్లు నీదంటే ఇల్లరికము అదేనంది ముల్లోకములు నీవంటే వల్లకాడు గిల్లుకుంది "నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో"అంటు అన్నిరూపములు నీవేనంటే చాల్లే గొప్పలు అని నిన్ను వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా. శివుడు తాను కుమ్మరినని చెబుతాడు కాని పనితనములేక ఓటికుండలను తయారుచేస్తాడు.ఇనుమునకై పనిమంతుడన్న నమ్మకమెలేదు.కొయ్యముక్కలను కూడ అడ్దదిడ్దముగా కోస్తుంటాడు.అంతటితో ఆగకుండ తాను గొప్పవైద్యుడనని చెప్పుకుంటు ఎప్పుడు మందులే తింటు ఉండాలంటాడు.-నింద. ఏకము నమః శివాయ-అనేకము నమః శివాయ లోపము నమః శివాయ-లోకువ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ వివిధ వస్తువుల సృష్టికి కారకుడుగా పరమాత్మ తదనుకూల రూపములతో ప్రకాశిస్తున్నాడు.సృష్టిలో భగవంతుడు జీవులుగా ప్రకటింపబడుచున్నప్పుడు వృక్షములను సృష్టించి,వాని దేహధాతువులగుచెక్క పదార్థమును నిర్మించి,చెట్ల రూపమును కలిగించును.జంతువుల దేహములను రథముల వలె నిర్మించును.శరీరము జీవికి రథము వంటిది.శరీరములోని ధాతువుల కొరకు మట్టిలోని ఖనిజములను రసాయినక ధాతువులను స్వీకరిస్తూ జీవులు తమ దేహధాతువులను నిర్మించుకొనును.భూమినుండి జనించిన ఆహారమును స్వీకరిస్తూ,జలమును తాగుతూ,వాయువును పీలుస్తూ,దేహపుష్టిని,మానసిక వికాసమును పొందుతున్నాడు కనుక విశిష్ట కుమ్మరి-కమ్మరి-వడ్రంగి-అన్ని వృత్తులు-వానినిష్ణాతులు శివస్వరూపములే.నిస్సందేహముగా వైద్యనాథునిగా సదాశివునకు సాష్టాంగ నమస్కారములు.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI