Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-79

ఓం నమః శివాయ-79 ********************* అంతా ప్రకాశమే నేనంటూ ఆర్భాటము చేస్తావు అభిషేకములు జరిగేవి అంతంత మాత్రమేగ ఋషుల తపోశక్తులను సర్పములుగా మలిచావు నాగాభరణుడనంటు సాగదీస్తు ఉంటావు ఋషిపత్నులపై శంకవేస్తు పులిని పుట్టించావు వ్యాఘ్రేశ్వరుడను అంటు గుడిని కట్టించావు పసిడిబిల్వహారములతో పరిచయము అవుతావు తెరచాటుగ కథలను దొంతెరలుగ నడుపుతావు కొమ్ములున్న వారమంటు నెమ్మది తీసేస్తావు కాళ్ళులేని వాడివంటు ముళ్ళు గుచ్చమంటావు నిన్ను కొలుచు పతంజలికి నిలువెల్ల పరీక్షలని మొక్కుటెందుకటర నిన్ను ఓ తిక్కశంకరా. ఆ-సమస్తాత్- ఆ అంటే అంతట.కాశము-వెలుగు.అంతట వెలుగుతో నిండినది ఆకాశము.శివుడు అది నేనే అని గొప్పలు చెప్పుకుంటాడు కాని అక్కడ తనకు (మూలవిరాట్) రోజు అభిషేకము చేయరని మాత్రము చెప్పుకోడు.ఋషుల యజ్ఞ ఫలమును సర్పములుగా మార్చునట్లు వారిచే చేయించి,వాటిని తాను ఆభరణములుగా ధరిస్తాడు.ఋషిపత్నులపై ఋషులకు అనుమానమును కలిగించి వారిచే ఒక పులిని సృష్టింపచేసి,దాని తోలుతో ఒక వస్త్రమును-ఆసనమును చేసుకొన్నాడు.మూడు స్వరూపాలు-ఐదు మండపాలు అని గొప్పలేకాని,తెర వెనక నక్కి కథలను బాగానే నడిపిస్తాడు.అందుకేగా పాపం నంది విజ్ఞతను మరచి పతంజలిని కొమ్ములు లేనివాడని ఎగతాళిచేసాడు.మూడుకాళ్ళ భ్రంగి కాళ్ళులేనివాడవంటు పదునైన మాటలతో బాధించాడు.శివుడు తాను సరిగా ఉండడు.తన దగ్గరనున్నవారిని సత్ప్రవర్తనతో నుండనీయడు.-నింద. కాళము నమః శివాయ-కాశము నమః శివాయ శంకలు నమ: శివాయ-శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " నమో రుద్రేభ్యో యేంతరిక్షే యేషా వర్షమిషవత్" రుద్రము. అంతరిక్ష స్వరూపమైన సదాశివా అనుగ్రహమును వర్షింపుము నీకు నమస్కారములు. ఋషుల అహంకారమును నిర్మూలించి,పతంజలి మహర్షి యొక్క భక్తిని-భాషా పటిమను లోక విదితము చేస్తూ అనేకానేక అద్భుత గ్రంధములను మనలకు అనుగ్రహించిన అవ్యాజ కరుణాసాగరా-అంబికాపతి అనేకానేక నమస్కారములు.స్తుతి. ఏక బిల్వం శివార్పణం. Posted 30th June by taetatelugu.com

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...