Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-63

ఓం నమః శివాయ-63 ********************* తన తలపైన గంగమ్మ ఉన్నదన్న తలపులేక తపతి నర్మదాది నదులను త్వరపడి సృష్టించాడు తన ఇల్లుగ మంచుకొండ ఉన్నదన్న తలపులేక ఎగుడుదిగుడుగా ఎన్నో కొండలు సృష్టించాడు తన సృష్టికి లయకర్త తానే అను తలపులేక జాగరూకతను మరచి జగములు సృష్టించాడు తళుకు మగువ పంపకములో తనకు మిగలదన్న తలపులేక అమృతమునకు బదులుగ విషమును స్వీకరించాడు తల్లి పార్వతితో సహా తనకు అన్ని ఉన్నాయన్న తలపులేక తనవారికి బాధలంటు తల్లడిల్లుతుంటాడు తన దగ్గర ఏమున్నవో తెలిసికొనే తలపులేని వాడవని నిన్ను వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా. శివుడు తన దగ్గర ఉన్న వస్తువులను గమనించలేని స్వభావము కలవాడు.అందులకే దాహము వేస్తే నీరు ఉండాలనే తలపుతో నదులను,ఉండుటకు ఇల్లు ఉండాలనే తలపుతో కొండలను సృష్టించాడు.హరి తనకు అమృతమును మిగల్చడు అను తలపులేక,అది దొరకక,చేసేది ఏమీలేక దాని బదులు విషమును స్వీకరించుటతో సరిపుచ్చుకున్నాడు.స్వామి నీవు మహదైశ్వర్య వంతుడవు సాంబశివా అని చెబుతుంటే అది గ్రహించకుండా నా వాళ్ళందరు కష్టాలతో-కన్నీళ్ళతో ఉన్నారనుకుంటూ తల్లడిల్లుతుంటాడు.పంచకృత్యములపాలనలో తాను సృష్టించిన జగములను తానే లీనము చేసుకోవాలని తెలివిలేక తిరిగి తిరిగి సృష్టి కార్యమును చేస్తుంటాడు.శివుడు ఒక ప్రణాళిక లేనివాడు-నింద. తలపు నమః శివాయ-వలపు నమః శివాయ ఆర్తి నమః శివాయ-స్పూర్తి నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ పరమశివుడు పరమ దయాసముద్రుడు.జగత్పతి.ఇంద్రియ సంబంధములకు అత్తీతుడు.సకల చరాచర జీవరాశుల మనుగడకై సకలము పంచభూతరూపముగా సంస్థాపనము చేసినాడు. " వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...