Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-62

ఓం నమః శివాయ-73 ********************* రూపులేని గాలిని అన్నిరూపులలో నిలుపుతావు అలసటలేకుండ కదులుతు ఉండాలంటావు కల్పవృక్షాలనైన కాళ్ళతో నీళ్ళుతాగమంటావు కాస్తంత బంధించి కొమ్మలను కదుపుతుంటావు భూమాతను సైతము కాళ్ళతో తాడనము చేస్తావు కనికరములేకుంద కదులుతుండాలంటావు ఆకాశము నే చూడమంటు హడావిడి చేస్తావు వ్యోమకేశుడిని అంటు వదలక తాకుతునే ఉంటావు అంబకమను పేరుతో అగ్గిని బంధించావు గంగను బంధించి చుక్కచుక్క తాగుతునే ఉంటావు పంచభూతములని చూడవు పంచమంటుంటావు తొక్కేసినావుర వాటిని ఓ తిక్క శంకరా. శివుడు దయలేనివాడు.కనుకనే శివుని చేష్టల వలన పంచభూతములు వంచనకు లోనైనవి.అగ్గిని కన్నుగా చేసుకొని బంధించాడు.జలమును గంగగా మార్చి కట్టివేసాడు.ఆకాశమును తాను విస్తరింప చేసిన జటలతో తాకుతు చీకాకు పెడతాడు.ఎంతమొత్తుకున్నా వినకుండా అయ్యో పాపం నీకు రూపులేదని బాధ పడుతున్నావా,నిన్ను అన్ని రూపులలో నింపుతాను అని అదేదో గొప్ప ఘనకార్యముగా భావించి,దానిని ఎప్పుడు ఉఛ్ఛ్వాస-నిశ్వాసములు కలిగి ఉండాలని క్షణము తీరిక లేకుండా చేసాడు.దైవ స్వరూపములైన వృక్షాలను మర్యాద లేకుండా మీరు మీ వేళ్ళతో భూమి నుండి నీళ్ళు తాగాలని నియమమును పెట్టాడు.పైగ వాటికి కింద భాగమును కదలకుండా-పైభాగమునకు మాత్రము స్వల్ప చలనమును కలిగిస్తు వాటిని ఇబ్బంది పెడుతున్నాడు.భూమాత సాక్షాతు సహనానికి ప్రతీకను నిరంతరము తాండవమను పేర తన్నటమే కాకుండ ఒక్క క్షణము కూడ ఆగక నిరంతరము కదులుతూనే ఉండాలని కఠోర నియమమును పెట్టాడు.పాపము అవి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిట్టూర్పులతో ఉన్నాయి-నింద. శాఖ నమః శివాయ-శ్వాస నమః శివాయ నియమం నమః శివాయ-నిఖిలం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ పంచభూతాత్మికమైన ప్రపంచపు ప్రతిరూపమే పరమాత్మ.భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు సెలవిచ్చినట్లు, " నైనం ఛిందతి శస్త్రాణి-నైనం దహతి పావకః నః ఛిన్నం క్లేదయంతి అపోనః శోషయతు మరుతః" నింగి-నీరు-నిప్పు-నేల-గాలి అను ఐదు భూతములతో(భూతము అనగా ఉన్నది అని అర్థము కనుక)వీటిలోనే ఉన్నప్పటికిని,వీటి ప్రభావము ఏమాత్రము సోకని సత్ చిద్రూపమును ధ్యానించెదను.-స్తుతి ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...