Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-83

ఓం నమః శివాయ-83 ******************** మరుని శరము నిన్ను చేరి మనువాడమని మదనుడు అనగానే గౌరీపతివి అయినావు క్షీరసాగర మథనమున విషమును స్వీకరించమని అమ్మ నిన్ను అడగగానే గరళకంఠుడివి అయినావు గంగవెర్రినెత్తిమీద సుతిమెత్తగ మొత్తమని భగీరథుడు అనగానే గంగాధరుడుగ మారినావు గంగిరెద్దు మేళములో నీకు రంగవస్త్రమౌతానని కరిరాజు అనగానే గజచర్మధారివి అయినావు భృంగి సైగ చేయగనే నీ సింగారపు నాట్యమట " సంధ్యారంభ విజృంభితవు" నీవు కావని " సంజ్ఞారంభ విజృంభితుడవు" పాపం నీవని పెక్కుమార్లు విన్నానురా ఓ తిక్క శంకరా. శివుడు తాను స్వంతముగా ఆలోచించి పనులను చేయలేని వాడు కనకనే ఇతరులు చెప్పిన పనులను చేస్తూ,దానికి తగినట్లుగా గౌరీపతి-గరళకంఠ-గంగాధర-గజచర్మాంబరధర-సంధ్యారంభ విజృంభిత నాట్య అను కొత్త పేర్లను కలుపుకుంటాడు.కన్నుల పండుగగా నున్నానని సంతోషపడుతుంటాడు కాని అందరు వారికిష్టమైన -కష్టమైన పనులను శివునిచే చేయించి,లబ్ధిని పొందుతున్నారన్న విషయమును గ్రహించలేని అమాయకుడు-నింద. చర్మము నమః శివాయ-మర్మము నమః శివాయ బాణము నమః శివాయ-భార్య నమః శివాయ నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ " భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీస్ఫురన్మాధమా హ్లాదో నాదయుతో మహాసి తవపుః పంచేమణాచాదృతః సత్చక్షు స్సుమనో వనేషు న పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసే విభుః" శివానందలహరి. స్వామీ నీ కరుణను అర్థము చేసుకోలేని మా అజ్ఞానము వీడినది.శ్రీశైల భ్రమరాంబికాపతి,భృంగిని సంతోష పరచుటకు అతని కనుసన్నలలో నాట్యముచేస్తున్నట్లు నటిస్తున్నావు.కరిని కనికరముతో అనుగ్రహించి కరిచర్మాంబరధరుడివి అయినావు.నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రుడవైన పరమశివా నీవు మన్మథునికి సహకరించవలెనను తలపుతో దానికి లక్ష్యముగా మారినావు.నీ ఈ పనులన్నిటికి కారణము నీకు మాపైగల అవ్యాజానుగ్రహమే కాని నీ అసమర్థత ఏమాత్రమును కాదు.సదాశివా! నా మనసనే సరస్సులో సదా విహరించుచు,సకలజగములను చల్లగా కాపాడు తండ్రీ.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...