SIVA SANKALPAMU-65

ఓం నమః శివాయ-76 ******************** పట్టుబడతానన్న భయముతో పరుగుతీసిన దొంగ ప్రదక్షిణము చేసానని ప్రగల్భమే పలుకుతాడు సోమరియై నిదురపోవు తామసియైన దొంగ నిష్కళంక సమాధియని నిబ్బరముగ అంటాడు సందుచూసి విందు భోజనము చేయుచు ఒక దొంగ వివరపు నైవేద్యమంటు వింతగ మాటాడతాడు కడతేరుస్తారేమని కవచధారియైన దొంగ కానుకగా ప్రాణమంటు పూనకమే పూనుతాడు మాయదారి పనులనే మానసపూజలు అంటూ ఆయాసము లేకుందా ఆ ఆ యశమే కోరుతుంటే పోనీలే అనుకుంటూ నువ్వు వారిని ఏలేస్తుంటే ఇంకెక్కడి న్యాయమురా ఓ తిక్కశంకరా. శివుడు చెప్పలేనంత అమాయకుడు.బూటకపు మాటలను మాట్లాడిన వారిని కూడా నిజభక్తులనుకొని,వారిని అనుగ్రహిస్తుంటాడు.అదే అదనుగా దొంగ భక్తులు ప్రదక్షిణమును చేసానంటు,ధ్యానము చేసానంటూ,మహానైవేద్యము సమర్పించానంటూ అచ్చిక బుచ్చిక మాటలతో,అచ్చమైన భక్తుల వలె అనగానే,అసలు విషయమును గ్రహించకుండ అనుగ్రహించేస్తుంటాడు.నిజానిజములను విచారించలేడు.నింద. దక్షిణ నమః శివాయ-ప్రదక్షిణ నమః శివాయ వేద్యుడు నమః శివాయ-నైవేద్యుడు నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ "నమో నిషంగిణ ఇషుధిపతే తస్కరణాం పతయే నమః" రుద్ర నమకము. దొంగలు గుప్తచోరులు-ప్రకటిత చోరులు అని రెండు వర్గములుగా విభజింపబడినారు.మూడో కంటికి తెలియకుండ దొంగతనమును చేయువారు గుప్తచోరులు.వారి దొంగతనమును కేవలము వారి రెండు కన్నులు మాత్రమే చూడగలవు.ఎదుటపడి మనకు తెలుస్తుండగనే దొంగిలించువారు ప్రకటిత చోరులు. రుద్ర భాష్యము నిషంగిణ అను పదమునకు విల్లు ఎత్తి పట్టుకుని ఉన్నవాడు అను వాచ్యార్థమును చెప్పినప్పటికిని,అంతరార్థముగా దొంగతనమునందాసక్తిని ప్రదర్శించువాడని విశ్లేషిస్తున్నది.ఎవరీ దొంగలు? వారి పూర్జన్మ పాపఫలితములను దొంతనపు వాసనలతో పుట్టిన జీవులు.వారి దుష్కర్మలు వారి పాపక్షయమును వారే దోచుకొనునట్లు చేస్తుంది.అదియే ఈశ్వరానుగ్రహము.లీలా మానుషధారియైన శివుడు వారి సర్వపాపములను-వాటికర్మలను దొంగిలించి,వారిని పునీతులను చేస్తుంటే,విచిత్రముగా వీరు శివుని ఎదురుగా నిలబడి మాట్లాడుతూ,స్వామి అనుగ్రహ కటాక్షమను విశేషమును దోచుకొని ధన్యులైనారు.వారి భాగ్యమును నేనేమనగలను? స్వామి అవ్యాజకరుణ తక్క.కాసేపు తాను దొంగిలిస్తూ,మరికాసేపు తాను దొంగిలింపబడుతూ దోబూచులాడు దొంగలదొరను సేవించుకొనుట తప్ప.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)