దూరీం కర్తుం వాంఛసి కిం-మనీష-02
" అన్నమయాత్ అనమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్
"ద్విజవర" దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛేతి"
అన్నది పాఠము.
అన్నమయ-చైతన్యమయ/దృక్-దృశ్య వివేక సముపార్జనము పాఠ ఉద్దేశ్యము.
1.అన్నమయాత్ అన్నమయం
అద్ అను ధాతువు నుండి జనించిన పదము అన్నము.
మనము తినునది /మనలను తినునది.మయాత్-విభజింపబడి ఉండి ప్రకాశించునది.
భగవద్గీత సైతము పరమాత్మను ' అన్నమన్నాద ఏవచ " అని కీర్తిస్తుంది.అన్నము/అన్నమును భుజించువాడు ఆ చైతన్య స్వరూపుడు.
అద్ ధాతువు నుండి పరిణామము చెందిన అద్యతే అను పదము తినుట అను క్రియా సూచకమైతే,
అన్నము నుండి పుట్టి,
అన్నముతో పెరిగి,
అన్నములో లీనము చెందు ఉపాధి అన్నమయ శరీరము/క్షేత్రము.
ఉపాధులు ఆకారములలో,వృత్తులలో,వేషభాషలలో,ఆహార వ్యవహారములలో భిన్నముగా కనపడుతుంటాయి.
ఈవిషయమునే రుద్ర చమకము,
"కృష్ట పచ్యంచమే-అకృష్ట పచ్యంచమే ' అంటూ దున్న్న క్షత్రము/దున్నని క్షేత్రము అంటు సంకేతిస్తాయి.అజ్ఞానమనే కలుపును తీసివేస్తే క్షత్రజ్ఞుడు కనపడతాడు/వినబడతాడు.
కాని స్థితి స్వానుభవముతో తెలుసుకోవలసినదే.
ఆ దున్నిన/ఫలవంతమైనభూమి రైతు యే క్షత్రజ్ఞుడు.అతను అవిభాజ్యుడు.సర్వ వ్యాపి.ఉపాధిలో అంతర్యామిగా నున్నప్పటికిని దాని స్వభావమునకు అతీతుడు.
"జీవ న్రహ్మ ఏకం" అన్నది వేదవిదితము.
ఏకో దేవః సర్వభూతేషు అన్నది యదార్థము.
ఆ ఏకాత్మ,
విశ్వన్ ఏకాత్మన్ పశ్యత్
కాని
న ప్రశంసే-న గర్హయే.
2.ద్విజవర -సంబోధనము గురించితెలుసుకుందాము.
వర-శ్రేష్ఠుడు
ద్విజ -రెండు జన్మలెత్తిన శ్రేష్ఠుడు.మొదటిది భౌతికము/రెండవది అధ్యయనము.
కాని ఇప్పుడు/ఇక్కడ ఈపద సంబోధనము ఆక్షేపణము.
ఎందుకంటే,
' జన్మనాత్ జాయతే శూద్రః
కర్మణాత్ ద్విజ ఉచ్యతే"
జగద్గురువులు పలికిన "గఛ్చ-గచ్ఛ శబ్దము " ఉదాహరణము.
పాంచభౌతిక ఉపాధిని సాధనముగా మలచుకుని పరమాత్మను అనుభవించగలగటే ఈ సంభాషణము యొక్క ప్రయోజనము.
సర్వం శివమయం జగత్.
ఏకబిల్వం శివార్పణం.
Comments
Post a Comment