దూరీకర్తుం వాంఛసి కిం-03
"కిం గంగాబుంధి బింబితే అంబర మణౌ చాండాలవీధీ పయః
పూరేవమంతర్మస్తి కాంచనఘటీ మృత్కుంభయోవ2హ్ అంబరే
ప్రత్యక్ వస్తుని నిస్తరంగ సహజానంద అవబోధాంబుధౌ
విప్రోయం శ్వపచోయం ఇత్యపి మహాన్ "కోయం" విభేద భ్రమః."
పద విభజన
అంబరమణి-బింబితే గంగాంబుధి
అంబరమణి బింబితే చాండాల వీధీ పయః
అంబర మణి -సూర్యబింబము.
ఇక్కడ సూర్యునికి శుభ్ర-అశుభ్ర వ్యత్యాసములు లేవు.కనుకనే తన కిరనములను శుభ్రమైన గంగాజలములపై వ్యాపింపచేసినను,
అశుభ్రముగానున్నఛండాల వీధిజలములో వ్యాపింపచేసినను వాటి స్థితిచే ఏ మాత్రమును ప్రభావితము కావు.
అంబర పదమునకు ఆకాశమునకు అన్వయించుకుంటే ఆకాశము యొక్క ప్రతిబింబము మట్టికుండ యందైనాను/స్వర్ణకుంభమునందైనను వాటి లోహ ప్రభావమును స్వీకరించక ఒకే విధముగా ఉన్నట్లుగా పరమాత్మ చైతన్యము పరిమితముగా మారినప్పట్కిని అది అపరిమితమే.
మృత్ కుంభము-మట్టికుండ
పాత్రలలోనికి ప్రవేశించిన జలము పరిశుద్ధము.పాత్రలు జలమును ప్రభావితము చేయలేదు.
సూర్యకిరణములు-జలము చైతన్యమునకు ప్రతీకలుగాను,
చెప్పి,
మరియు చండాల ఈ విధముగా అంటున్నాడు
మహాన్-ఓ మహాత్మా (ఆక్షేపణ)
సహజానంద అంబుధౌ-సహజానందమనే సముద్రము
నిస్తరంగ-పడిలేచే అలలు లేని ఒక సముద్రమున్నది
అందులో
ప్రత్యగ్ వస్తుని-ప్రత్యగ్/పరమాత్మ వసిస్తున్నాడు కనుక నిశ్చలమై
ఉంటుంది.ఇది నీకు తెలియని సంగతికాదు.
నీవు విశేష ప్రజ్ఞావంతుడవు కనుక విప్రుడవు.
బ్రహ్మమును తెలిసికొనిన వాదవుకనుక బ్రాహ్మణుడవు.
నేను వర్ణాశ్రమ ధర్మములను నాల్గింటిలో లేని పంచముడను.కాని ఈ విభేదములు కేవలము ఉపాధికి సంబంధించినవే కాని వానిలో దాగిన ఉనికిది కాదు.
అయం విభేద భ్రమః కిం?
సర్వం శివమయం జగత్
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment