BRAHMOEPADAESAMU

  శ్రీరస్తు                శుభమస్తు.

  బాలుడు మారుచున్నాడు బ్రహ్మచారిగ నేడు
  ఉపనయన సంస్కారముతో అంగరంగ వైభవముగ


  సంస్కారములను జరిపిస్తున్నారు శాస్త్రోక్తముగా
  సందడి చేస్తున్నారు  వేల్పులు వేదోక్తముగా

  గురువగుచున్నాడు తండ్రి బ్రహ్మోపదేశము చేసి
  గురుతరమైనది తల్లి ఆదిభిక్ష తాను వేసి

  ఆనందముతో అమ్మమ్మ-నానమ్మ, ఆ తాతలు ఇద్దరు
  అందించుచున్నారు ఆశీసులు-ఆదిదంపతులు వారు

  మహనీయులు చేయుచున్న మంగళాశాసనములతో
  త్రివిక్రముడైనాడు చూడు దివ్యతేజముల వాడు

  ఎడమచేత కర్రతో-కుడిచేతను జోలితో
  భిక్షమడుగుచున్నాడు -సాక్షాత్తు వామనుడు

  అందరు అందిస్తున్నారు దీవెనలను భిక్షగా
  వందేళ్ళు వర్ధిల్లగ వాడు శ్రీరామ రక్షగా

  " చిరంజీవి సారంగపాణి శర్మ మేడూరి"

  ఇహ-పరముల సాధనముగ ఈ క్షణము నుండి నీవు

 " గాయత్రీమాతను  గౌరవముగా ధరిస్తూ
   గాయత్రీ మంత్రమును నియమముగా జపిస్తూ"

  అరిషడ్వర్గములను అల్లంత దూరమునుంచు
  మనో వాక్కాయకర్మలను మంగళప్రదమొనరించు

  అలుపెరుగని సాధనతో-అమ్మ-నాన్న దీవెనలతో

  పటుతర వటువుగా నీ పయనము కొనసాగాలి
  ప్రతి అడుగు ప్రతిభగా నిన్ను దీవించాలి.


    మంగళం మహత్.

 
 

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)