TIRUVEMBAAVAAY-PAASURAMU01

 


      తిరువెంబావాయ్-01

     *******************


 " కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం

   జటాధరం పార్వతీ వామభాగం

   సదాశివం రుద్రం అనంతరూపం

   చిదంబరేశం హృదిభావయామి."


  ఆదియుం అందముం ఇల్లారుం పెరుం

  శోదియై యాం పాడ కేట్టేయుం వాల్తడంగళ్


  మాదేవ  వళరుదియో వన్సెవియో నిన్సెవిదాన్

  మాదేవన్ వార్కళంగళ్ వాళ్తియ వాళ్తోళిపోయ్

  వీధివాయ్ కేట్టిలియో విమ్మి విమ్మి మెయ్ మరందు

  పోదార్ అమలి ఇన్ నిండ్రు పురందింగన్


  ఏదేను మాగాళ్ ఎడుందాన్ ఎన్నే ఎన్నే

  ఈదే ఎంతోళి పరిసేలో రెంబావాయ్.

  

    ద్రవడివేదముగా  సంకీర్తింపబడు తిరువెంబావాయ్ అను సంకీర్తన మార్గళి స్తోత్రము భవతారకము.భవుని అనుగ్రహ మార్గము.ఇది స్వార్థ రహిత సామూహిక శ్రేయమునకై ఆచరించెడి వ్రతము.తిరు మాణిక్యవాచగరు చే మనకు అనుగ్రహింపబడిన అద్భుత ఆరాధనము. 

  భగవదనుగ్రహమను చెరువులో (పొయిగై) మునిగి తరించు స్నానవ్రతము.ఆచరించువారు కన్యలు.కన్యలు అంటే అవివాహిత స్త్రీలు అనుకుంటే పొరబాటు.భగవంతుని భర్తగా గుర్తించలేని సకలజీవులు.

 "పంచేంద్రియములకు దాసుడను నేను-అతీతుడు భవుడు"

 దయాసముడ్రుడైన ఆ చిదంబరేశ్వరుడు  (మన హృదయములో నున్నవాడు) మనలను అనుగ్రహించుటకై తరలివచ్చినాడు.కనుక ఓ చెలులారా పరమపవిత్ర పాదార్చనమునకై సంసిద్ధులుకండి.తామో నిద్రను వీడి తరించమని చెలుల సంభాషణముల ద్వారా మనకు మార్గదర్శకమవుతున్నది ఈ నెలనోము.



 

   ప్రస్తుత పాశురములో చెలులచే నిదురలేపబడుతున్న కన్నియ పరమజ్ఞాని.తన వారితో శివమహిమలను అత్యద్భుతముగా చెబుతూ వారిని వ్రతమునకు సంసిద్ధులనుచేసినది.వీధిలో శివనామ సంకీర్తనము మథురాతిమథురముగా వినబడుతున్నది.స్వామిని అంబాసహిత పరంజ్యోతిగా ప్రస్తుతిస్తున్నది ఆ సంకీర్తనము.అంతేకాదు ఆది-అంతము లేని అరుణాచలేశునిగా స్మరణముచేస్తున్నది.

  ఆ దివ్యసంకీర్తనమును శ్రవణముచేయగలిగిన ఒక  ధన్యురాలు తనను తాను మరచి వెక్కి వెక్కి ఏడుస్తున్నది.పరమార్థమును పద అర్థములలో అనుభవించగలుగుతున్నది.ఇంద్రియలోలతను వీడి నేలపై బడి ఆత్మానుభూతిని ఆవిష్కరిస్తున్నది.

  ఓ చెలి!

  నీ చెవులు ఆ సంకీర్తనమును నీకు అందచేయుటలేదా?

       లేక

  నీవే దానిని లెక్కచేయుటలేదా?

   ఇదేమి విచిత్రము శివధ్యానముతో (ఇప్పటివరకు) నిండిన నీ మనము పూలపానుపును వీడకున్నదేమి?


   నీ నిద్రను(ధ్యానమును) వీడి మాతో వ్రతమును చేయించుటకు మేల్కొనమని సివనోమునకు సిద్ధము కమ్మని చెలిని వేడుకుంటున్నారు.

   అంబే దివ్య తిరువడిగళే శరణం.

  (ఏక బిల్వం శివార్పణం.)




Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI