TIRUVEMBAAVAAY-02
తిరువెంబావాయ్-02
*****************
" కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృదిభావయామి."
సందర్భము
మొదటి పాశురములో విన్సెవియో అంటూ శ్రవణేంద్రియ పరమార్థమును శ్రవణభక్తి విశేషములను "భద్రం కర్ణాణి శ్రుణు" అన్న ఆర్యోక్తిని తెలియచేసిన తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో ఆత్మజ్ఞాన అధ్యయనమును ప్రస్తావించుచున్నారు.
మనము గ్రహించవలసిన విషయము ఏమిటంటే ఈ సఖులు వారి విచిత్ర ప్రవర్తనము మన మనోవృత్తుల విధానమునకు సంకేతములే.దానిని గ్రహించి జన్మసార్థకతను పొందమని సందేశము.
"పాశం పరంజోది ఎంబాయ్ ఇరా వకల్నాం
పేశుం పోదే ఎప్పోదం పోదారమళిక్కే
నేశముం వైత్తనయో నేరిళై యార్ నేరిళై ఈర్
చీ చీ ఇవైయూం శిలవో విళైయాడి
ఏశుం ఇడమిదో విణ్ణోర్కళ్ ఏత్తుతర్కు
కూశుం మలర్పాదం తందరుళ వందరుళం
దేశన్ శివలోకన్ థిల్లై చిట్రంబలకుళ్
ఈశనార్కు అంబార్ యాం ఆడేలో రెంబావాయ్"
కూసుం మలర్ పాదం" స్వామి పాదపద్మములు" మనము సేవించుకొనుటకై తమకు తామే తరలివచ్చిన సందర్భము.స్వామి పాదసేవనమునకై స్వర్గవాసులైన దేవతలు ఎంతో ఆశగా వేచియుండగా మనలను ఆశీర్వదించుటకై స్వామి ఊరేగింపు య్త్సవముగా మన దగ్గరకు తానే వస్తున్నాడు.
ఓ చెలి నీవు ఇంకా నిదురించుచున్నావేమిటి? నిన్న మాతో
నాకు ఉన్న ఒకే ఒక బంధము "పాశం పరంజ్యోయి" పరంజ్యోతియే అన్నావు కదా.
అంతే కాదు అప్పుడప్పుడు కాదు ఇరపకల్వాన్ అంటూ రాత్రిబవలు అన్న భేదము లేకుండా ఎల్లప్పుడు నా బంధము స్వామితోనే కాని భవబంధములు కావు అన్నావుకదా.
భలే చమత్కారివే.ఇప్పుడేమో పానుపును వీడలేకున్నావు అని వేళాకోళము చేశారు ఓ భాగ్యశాలి అంటూ.
వారి పరిహాసములకు నొచ్చుకుని "నేనే కాదు నేరిడ ఈర్" మీరు కూడా భాగ్యశాలులే చెలులారా.పరిహాస వాక్యములకు ఇది సమయము కాదు.పదండి.మనమదర్ము పరిశుశుద్ధులమై స్వామి పాదములను దర్శించుకుని,అర్చించి,ధన్యులమగుదాము అంటూ వారిని సంసిద్ధులను చేస్తున్నది ఆ భాగ్యశాలి.
అంబే శివే దివ్య తిరువడిగళే శరణం.
ఏక బిల్వం శివార్పణం.

Comments
Post a Comment