ADITYAHRDAYAMU-06
ఆదిత్యహృదయము-06
****************
"జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం
కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం
అరుణకరుణగమ్యం ఆదిం ఆదిత్యరూపం
సకల భువన వంద్యం భాస్కరం తం నమామి.
స్వామి రశ్ములు సర్వలోకములపై సంపూర్ణముగా విస్తరించి, చైతన్యపరుస్తున్నాయన్న మహర్షి,ప్రస్తుత శ్లోకములో"రశ్మిభావనను" విశదీకరిస్తున్నారు.
నిద్రయను స్వల్పకాలిక లయము,ప్రళయము అను దీర్ఘకాలిక లయములను తదుపరిజాగృతమును తేజస్విగా (మూలబీజముగా)నిర్వహించు స్వామిని ప్రస్తుతిస్తున్నాడు.
శ్లోకము
*******
" సర్వదేవాత్మకోహ్యేష తేజస్వి రశ్మిభావనః
ఏష దేవాం సురగణాంలోకాన్ పాతి గభస్తిభిః"
సర్వదేవతా అసురశక్తుల సమన్వితమైన లోకములను చైతన్యపరచుటకు మూలకారణమే "రశ్మి భావనము"
రశ్మిభావనము అనగా,
"లోకంబులు లోకేశుడు లోకస్థులు
తెగినతుది నలోకంబగు పెంచీకటి
అవ్వలనెవ్వండేకాకృతి ' పరమాత్మను సేవిస్తానన్నాడు బమ్మెర పోతనామాత్యుడు.
" న ఉదయితి-నాస్తమేతి: స్వల్పకాలిక లయ (రేయిం-పగలు)దేశ.కాలగమనములో ఆదిత్యునకు ఉదయాస్తమానములుండవు.
కాని దీర్ఘకాలికలయమునందు లోకములు-లోకస్థులు కానరావు.అవి అసలున్నవోలేవో కూడా తెలియదు.సమస్త ప్రపంచము లుప్తమై-గుప్తమై పోతుంది.సకలము తనను తాను మరగుపరచుకొనిన మర్మస్థితి.
నేను-నాది అన్న ద్వంద్వములు-త్రిగుణములు-చతుర్విధపురుషార్థములు-పంచభూతములు-అరిషడ్వర్గములు-సప్తలోకములు-అష్టదిక్కులు-నవగ్రహములు ,భూగోళ-ఖగోళములు తమ ఉనికిని ప్రకటింకొనగలిగిన స్థితిని స్వామి అనుగ్రహించుటయే
, "రశ్మిభావనము" పరమాత్మ తన సంకల్పముతోరశ్ములను వివశ్వము గావించుటచే,,ప్రాణశక్తుల కదలికతతో,
ఏకము-అనేకమై -మనలను మమేకము చేస్తుంది.,అదియే పునః-సృష్టి. .
రశ్మి భావనము-సర్వదేవాత్మకునిచే సమస్త దేవ-అసుర గుణములతో కూడిన జంగమ స్థావరాదులను ప్రకటింపచేస్తున్నది.దైవాసుర సంపదను స్పష్టీకరిస్తున్నది.
కొన్ని ఉపాధులు దైవగుణములను ఎక్కువగా-మరికొన్నిఉపాధులు అసురగుణములను ఎక్కువగా తమను ప్రేరేపిస్తుంటే-వాటిని కర్మలుగా మలచుకొని-ఫలితములను అనుభవిస్తుంటారు.
ఇదే విషయము మనము రామ-రావణులలో గమనిస్తుంటాము.
" అహంకారం-బలం-దర్పం కామం క్రోథంచ సంశ్రితా
మామాత్మపరదేహేషూ-అసుర గుణములుగాభగవానుడు
గీతలోవివరించాడు.
"అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం
దయాభూతేషు" అని దైవీగుణములనుప్రస్తుతించినది భగవద్గీత.
ఆలోచనపూరిత స్వభావము దైవీసంపద-ఆలోచనరహిత స్వభావము అసుర సంపద.రెండింటి సమన్వయే సమస్త లోకములు.తాను సృష్టించిన సమస్తమును తన ప్రకాశ గమన లక్షణముతో/పాలించుచున్న/ పోషించుచున్న ఆదిత్యుని సేవింపుము అని స్తోత్రమును రామచంద్రునకు అగస్త్యుడు వివరించుచున్న తరుణమున,
" తం సూర్యంప్రణమామ్యహం."

Comments
Post a Comment