Sunday, April 8, 2018

SAUNDARYA LAHARI-KALI-83

  సౌందర్య లహరి-మహాకాళి

  పరమ పావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  క్షిప్ర నదీతీరమున నెలకొనె- క్షిప్ర దయా స్వభావము
  కాలాతీతురాలు  కాళి- ప్రళయ రౌద్ర స్వరూపము

  సాందీపని-విక్రముడు-కాళిదాసాదులను బ్రోచిన
  సకల విద్యాప్రదానము హరసిద్ధిమాతా క్షేత్రము

  మన తమస్సు తాకెనమ్మ తల్లికి నల్లని రూపిక
  క్రిందకు సాగిన నాలుక తల్లి నిత్యత్వపు ప్రతీక

  మాయాసతి పైపలువరుస  మహాకాల మూర్తిగా
  తేజోమయమై నా కుజదోషమును తొలగించు వేళ

  నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి  ! ఓ సౌందర్య లహరి.

  "ఉజ్జయిన్యాం  మహాకాళి మహా కాళేశ్వరేశ్వరి
   క్షిప్రతిరస్థిత మాతా వాంచితార్థ ప్రదాయిని"

  కాలము అనగా తరిగిపోవునది.మింగివేయునది."కలయతీతి కాళి" కాలములోనున్న అఖండశక్తియే కాళిక.కలయతి నియతి కాళి అని కూడా అంటారు.కాలగతిని నడిపించునది.అయ్యవారు మహాకాళుడు.అమ్మవారు మహా కాళీ.లింగభేదమును పరిగణనలోనికి తీసుకోకుంటే కాలము/సమయమే కాళి.వస్తువుల పరిణామమును తెలియచేయునది కాలము కనుక "కాలో జగద్రక్షక"  అని అంటారు."కాల కాష్టేన రూపేణా' అనికూడా కాలికాదేవిని కొలుస్తారు.కాలాతీతురాలైన తల్లికి కాల నిర్దేశములేదు కనుక నాలుకను తెరచి దర్శనమిస్తుంది,అమ్మ నిత్యత్వమునకు ప్రతీకగా నాలుకను కిందకు సాచిఉంటుంది.అమ్మలీలను అర్థముచేసికొనుట దుర్లభము.అంతులేని అమ్మమహిమలను తెలుసుకోలేనితనము అమ్మ శరీరమును నల్లతనముగా (తమస్సుగా)  అల్లుకున్నదేమో.."కళా కాష్టాది రూపేన పరిణామప్రదాయిని" కాళీ. 

 చంద్రసేనుడను భక్తుని రక్షించుటకు శివుడు ఇక్కడ వెలిశాడని అంటూంటారు.విక్రమాదిత్యుడు,సాందీపని,మహాకవి కాళిదాసు తరించిన ప్రదేశము కనుక ,సాధనతో ఎందరో మహానుభావులు సిద్ధిపొందిన క్షేత్రము కనుకను,సిద్ధమాతా క్షేత్రమని కూడా వ్యవహరిస్తారు. అబంతీ పట్టణము కాలక్రమమున ఉజ్జయినిగా మారినది.దాని యందు మహాకాలుడుగా  అయ్యవారు,మహాకాళి గా అమ్మవారు ఆరాద్గింపబడుదురు.ఈ క్షేత్రమును మహా శ్మశానవాటిక అనికూడా అంటారు.అమ్మవారు రౌద్రరూపిగా పుర్రెలను మొలకు వస్త్రములుగా ధరిస్తుంది

   కాలము అనగా తరిగిపోవునది.మింగివేయునది."కలయతీతి కాళి" కాలములోనున్న అఖండశక్తియే కాళిక.కలయతి నియతి కాళి అని కూడా అంటారు.కాలగతిని నడిపించునది.అయ్యవారు మహాకాళుడు.అమ్మవారు మహా కాళీ.లింగభేదమును పరిగణనలోనికి తీసుకోకుంటే కాలము/సమయమే కాళి.వస్తువుల పరిణామమును తెలియచేయునది కాలము కనుక "కాలో జగద్రక్షక"  అని అంటారు."కాల కాష్టేన రూపేణా' అనికూడా కాలికాదేవిని కొలుస్తారు.కాలాతీతురాలైన తల్లికి కాల నిర్దేశములేదు కనుక నాలుకను తెరచి దర్శనమిస్తుంది,అమ్మ నిత్యత్వమునకు ప్రతీకగా నాలుకను కిందకు సాచిఉంచుతుంది.ది.అమ్మలీలను అర్థముచేసికొనుట దుర్లభము.అంతులేని అమ్మమహిమలను తెలుసుకోలేనితనము అమ్మ శరీరమును నల్లతనముగా (తమస్సుగా)  అల్లుకున్నదేమో.."కళా కాష్టాది రూపేన పరిణామప్రదాయిని" కాళీ.

  తల ఆలోచనలకు,చేతులు ఆచరణలకు సంకేతములు. అమ్మ తలలను చేతితో పట్టుకుని నడుముకు ధరించుట సత్భాషణ-సత్కార్యా విష్కరణకు సూచనగదా.  అమ్మ ధరించు కొలికిపూస లేని పుర్రెలదండ అసంపూర్ణ పుర్రెల మాలలకు సంకేతము.కాలతత్త్వ ఉపాసనయే కాళికోపాసన.

   రామకృష్ణపరమ హంసను అనుగ్రహించిన కాళిమాత కరుణతో నన్ను వీక్షించు సమయమున  చెంతనే
 నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
 (అసుర సంహారమును పూర్తిచేసిన కాళి ఆనందలాస్యము అవధులు మించగా దేవతలు,మహేశ్వరుని తల్లి తాండవమును ముగియునట్లు చేయమని ప్రార్థించిరట.జగములు జలమయమగు సమయమాసన్నమైనదనుదానికి సూచనగా అద్భుత నృత్యమును తిలకించుచున్న శివుడు కాళిని చూస్తు అడుగులు తడబడగా కాలి పాదముల క్రిందనే ఉండిపోయెనట తల్లి శాంతించువరకు. ఓం శాంతిః ) 


  


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...