Saturday, June 24, 2017

ఎగురుతోంది పతాక

69 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
దేశ విదేశాలలో దేదీప్య మానముగా
ఎల్లలే ఎరుగని అల్లరి చల్లని తల్లిగా
పాప బోసినవ్వులా పరిమళపు పువ్వులా
ఏలిక సంకేతముగా ఎగురుతోంది పతాక
......
కమ్ముకున్న చీకట్లకు కమ్మని వేకువగా
కలవరపు ఇక్కట్లకు చెల్లింపు సంతకముగా
నింగికెగురు గువ్వలా నినదించు మువ్వలా
ఏరువాకగా మారి ఎగురుతోంది పతాక
.......
జనగణమన మన గళముగ జనగణముల మంగళముగా
జై కిసాన్ పొలముగా జై జవాన్ బలముగా
తెలుగింటి అమ్మాయిగా వెలుగుచిమ్ము కొమ్మగా
ఎగురుతోంది పతాక ఎద నిండిన ప్రియ గీతిక
.........
అమ్మ లార రండి రండి అయ్యలార రారండి
పిల్లా పాపలు అందరు పరుగు పరుగున రండి
శ్రీ పింగళి వెంకయ్య,శ్రీ బంకిం చంద్ర చటర్జీ
ఠాగూరు,ఇక్బాలు ఎందరో దేశ భక్తులు
........
తిలకిస్తున్నారు తన్మయత్వముతో తీరైన పండుగను
దేశ భక్తి గీతాలను ఆలకిస్తారు ఆనంద భాష్పాలతో
దేశాభివృద్ధి చేతలను ఆశీర్వదిస్తారు ఆనంద హృదయముతో
మనల చేరు వాత్సల్యము మహి స్వర్గ తుల్యము

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...