Friday, July 14, 2017

SRI TANIKELLA DASABHARANI-2.

శ్రీ తనికెళ్ళ భరణిగారికి నమస్కృతులతో.
నీలోన శివుడు గలడు-----దాగి
నెనరు దీవించగలడు.
1."ఎందరో మహానుభావులు" నిన్ను, అందరిలో ఒకరిగా
అందించాడు వందనీయ రామలింగేశ్వరుడు.
2."నక్షత్రము" నీవని,"నక్షత్ర దర్శనము"ను చేయిస్తావని
"దశ భరణి" అని నామకరణమును చేశాడు ఆ నాగాభరణుడు.
3.మిక్కుటమగు ప్రేమతో చిక్కులను విడదీస్తు
"కుక్కుటేశ్వరుడు" దాగి "కొక్కొరోకో" అన్నాడు.
4."శ్రీ రాళ్ళబండి" రూపములో రాళ్ళుతాకు బాట అను
"గ్రహణము" విడిపించాడు అనుగ్రహము కలవాడు.
5."స్త్రీ దుస్తుల దర్జీ" గా "పరికిణి" నువు కుడుతున్నప్పుడు
సున్నితపు సూదియైనాడు ఆ బూదిపూతలవాడు.
6."శివ" అని వినబడగానే శుభములు అందించుటకు
ఘంటము తాను ఐనాడు కంట మంటలున్నవాడు.
7."అర్థనారీశ్వరపు ఒద్దిక" అను "మిథునము" నకు
తోడై నడిపించాడు నిన్ను ఆ మూడుకన్నుల వాడు.
8."గార్దభ అండమును"కోరు మాయను మర్దింపచేసి
ఆర్ద్రత నిలిపాడు నీలో "ఆట కదరా శివా" అని అంటూ
9."యాస" ఉన్న బాసలో "శభాష్ శంకరా" అనబడ్తివి
నీ రంధిని మార్చేసిండు గమ్మున ఆ నిధనపతి.
10."చల్ చల్ గుర్రం" అనే చంచలమైన మనసుకు
మంచి బాట వేస్తున్నడు ఆ మంచుకొండ దేవుడు.
11.పసిడి మనసు, పసివయసులోనే ముసలివైన నీతో
"త్వమేవాహం" అంటున్నాడురా ఓ తనికెళ్ళ భరణి.
12.కామేశ్వరి పతి వాడు,కామితార్థమీయ గలడు
కదలకుండ ఉంటాడు కరుణను కురిపిస్తాడు.
శతమానం భవతి- శుభం భూయాత్.. ****

SREE TANIKELLA DASA BHARANI.-1

  విశిష్ట వినయ విద్వత్తుకు మోకరిల్లుతూ
  *******************************
నిత్య కళ్యాణమైన
ఆ,సత్యలోకమునందు
దివ్యసుతుని కోరె వాణి
చతురతతో చతుర్ముఖుడు చేసినాడు వీణ్ణి
........................
గణనాథుని కనికట్టుతో
ఘనత కట్టబెట్టగా
సరసిజాక్షి,సరస్వతి
సరసను కూర్చుండబెట్టుకుని
సారస్వతామృతమును వరుసగ తినబెట్టెనేమొ
..............
ఆనందపు ఆలినిగని,సుతు
దరిచేరె, విరించి నాడు
గారపు ఆలింగనతో
వేదసారము గ్రహియించె వీడు
..........
అపహరణము నేరమనుచు
మందలించె అమ్మ నాడు
భవతరణము అనుచు *మాటల నాంది*
వేసినాడు నాడే చూడు.
..........
వీని కులుకు పలుకు నేర్వ తన
చిలుకనంపె చదువులమ్మ,దాని
*అభినయనము*ను దోచె
వినయముగా...ఒద్దికగా
..........
వల్లమాలిన వలపుతో నీ
నీ దరిచేరింది వాణి వల్లకి
నిను గెలుచుట వల్లకాక,మోసింది
నీ సాహిత్యపు పల్లకి
...........
క్షీర,నీర నీతి చేరిన ఆ హంసను
ఏమార్చి నీ ప్రశంసగా మార్చావు
..............
నీ అల్లరి భరించలేక నిను
చల్లని కొండకు పంపగా
*శభాష్..శంకరా*అని ఆనందివై
ఆ నందిని ఏమార్చావు
........
గురుతెరిగి గరుడుడు రయముగా
పరుగులిడె
.......
ఇవి..నీ..లిపి..పరిహాసములా
చిలిపి దరహాసములా
రమణీయ కవీంద్ర
తనికెళ్ల భరణీంద్ర
............
ఈ అమృతానంద విభావరి
కొనసాగనీ మరీ..మరీ

SREEPATI PANDITAARAADHYULA BAALASUBRAHMANYAM GARU.

                  మంగళం మహత్
                  *******************
 హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి హాయి హాయి హాయి
 తీయ తీయనైన పాటపాడనీయి బాధపోయి రానీ హాయి
    అంటున్న గాన గంధర్వుని జన్మదినం మనకు సుదినము,

  బాలుగారు బహుశా....
.
  శకుంతములు నేర్పాయి సుస్వరములు శుభాంగికి
 మీ ఆలాపన ప్రారంభం ..ఆ  గర్భగుడిలో

 హరికథలు అందించినవో సుధలను ఆ.సాంబునికి
 మీ సాధన సాకారం ..ఆ  మాధవ మాసములో

 సీమంతపు ఆశీసులు మంత్రించినవో శిశువుని
 మీ గాత్రపు సొబగులు ఆ  నాడుల సవరింపులో

 జననపు జవ్వాజులు పంచమస్వర కోకిలకి
 మీ స్వరముల సరిగమలు  ఆ  ఆమని రాకలో

 నామకరణ శ్రీకరములు నారద తుంబుర పాటకి
 మీ ఉంగాల రాగములు ఆ నాదోపాసనలో

 అన్నప్రాసపు జన్నముల పున్నెములు శిక్షణకి
 మీ బహుముఖ ప్రజ్ఞాపాటవము ఆ  అమృతోత్సవములో

 అక్షరాభ్యాసపు లక్షణపు అక్షింతలు దక్షతకి
 మీ పండితారాధ్య పట్టాలు ఆ స్నాతకోత్సవములో

 అర్థాంగి కుటుంబము ఆసరగ యజమానికి
 మీ ఆత్మీయపు ఆస్తులు ఆ గృహస్థాశ్రమములో

 అభ్యాసపు స్వరవరములు అహర్నిశల శ్రామికునికి
 మీవైన ప్రశంసలు ఆ అభిమాన నందనములో

 అభిననల అలరింపులు అల్లరి తాతయ్యకి
 జిలిబిలి మనవళ్ళ,మనవరాళ్ళ  ఆ సుతిమెత్తని ఉయ్యాలలో

 ఆయురారోగ్యములు,అష్టైశ్వర్యములు అనుగమించని
 మీ ఆనంద జీవితాన  ఆ ఆదిదంపతుల అవలోకనములో....వినబడనీ
 .........
" శతమానం భవతి..శతాయుష్ పురుషస్య వేంద్రియే ప్రతితిష్ఠతి."

.

SREEPATI PANDITAARAADHYULA BAALASUBRAHMANYAM GAARU-2

 పత్రం,పుష్పం,ఫలం,తోయం
*********************************
1.నాగుల తలలూగించే నారద తుంబుర గానమునకు
  నాగవల్లి పత్రములో ముత్యము కస్తురి నుంచి
  వీనుల విందు చేయమని వినతి పత్రముతో నే వస్తే
  నీ ప్రశంసాపత్రములు వినయముగా నన్ను పలుకరించె
................
2.శారదా లబ్ధమైన శ్లాఘనీయ శబ్దమునకు
  శబ్ద,స్పర్స,రూప,గంధ,రస సంపత్తి పూల నుంచి
  మంగళకర గళమునకు కైదండలు నే వేయ వస్తే
  నీ పద్మములు మృదు సంభాషణలుగా నన్ను పలుకరించె
..........................
3.ప్రతిఫలమును కోరని పండిత ఆరాధ్యునకు
  ప్రతి,ఫలము  దోరగ పండిన మధురిమలనుంచి
  ఈప్సిత ఫలమునకై తపస్సులా నే వస్తే
  నీ పండిన సంస్కారము పండుగగా నన్ను పలుకరించింది

  .ఆప్తుడైన  సప్తస్వర సంధాన కర్తకు 
  సప్తసాగరాలను తోయముగా ఊహించి
  అర్ఘ్య,పాద్య రూపాలని మూర్ఖతతో నేను వస్తే
  నీ తోటివారిపై కరుణ తోయదమై నన్ను పలుకరించె
...............................
5.స్వచ్చందపు రూపమైన స్వచ్చత రాయబారమునకు
  ప్రచ్చన్నతలోనున్న ఉచ్చత్వమును గమనించి
  ముందు వెనుక చూడలేని  మందమతిగ నేను వస్తే
  నీ నందుల సందోహము ఆనందముగా నన్ను పలుకరించె
...............
 మనిషిగ నే వచ్చి ఓ మనీషిని దర్శించా
 రాగము వినదలచి వచ్చి జీవనరాగమునే తెలుసుకున్నా

 వినవలసినది పదనిసలు  మాత్రమే కాదని,పరిణితి చెందుటకు పదమని
 ప్రగతి పథము ఆశిస్తా,ప్రతి గతిలో శ్వాసిస్తా.

SREEPATI PANDITAARAADHYULA BALASUBRAHMANYAM GARU-1

చంద్రునికో నూలుపోగు.
శ్రీవాణి ముద్దుబిడ్డ చిరంజీవ శ్రీపతి
ప్రణవనాద ఉద్దండ సుఖీభవ పండిత
స రి గ మ ప ద ని అను సప్తస్వర ఆరాధ్యుల
శకుంతల- సాంబమూర్తి దంపతుల గారాబాల
సుస్వరాల-శుభగుణాల సుపుత్రా! సుబ్రహ్మణ్యం
జయీభవ!!!! విజయీభవ!!!
ఆజానుబాహువుల అతిశయమెరుగని రూపం
ఆ నారద-తుంబురుల సంగీతపు ప్రతిరూపం
ఆ గళము స్వరములతో గారడీలు చేస్తుంటే
నమ్మరుకాని అది అమ్మచేతి గోరుముద్ద
ఆ పలుకులు బహుముఖముల గమ్మత్తులుచేస్తుంటే
అచ్చంగా నాన్నవీపుమీద చేయు సవారీ
నవరస నవోన్మేష నటనను కనపరుస్తుంటే
చెంగు-చెంగు ఎగురుచున్న తువ్వాయి గంటలు
కొప్పరపు కవులను మెప్పించిన వివరణలు
చప్పుడుగాకుండా చప్పరించు పిప్పర్మెంట్లు
అర్థశతాబ్దపు పాటల ప్రపంచ ప్రస్థానము
జైత్రయాత్ర ఎగరేసిన జాతీయ పతాకము
శతవసంత మూర్తిమత్వ సినిమా పురస్కారము
శతమానం భవతి అను శుభ ఆశీర్వచనము
ముందు-ముందు రాబోవు సందడి సందర్భములు
మా అందరిని ఊరించే చెట్టుమీది దోరపండ్లు
మీ విజయకీర్తి కేతనము వినువీధిని ముద్దాడుతుంటే
మీ వినయమూర్తి తొణకని నిండుకుండై నేలను ముద్దాడుతోంది
"చంద్రునికో నూలుపోగు-మన బాలుగారు సిరుల తులతూగు.""
పుట్టినరోజు శుభాకాంక్షలు

Wednesday, July 12, 2017

KULUKULA PALUKULU PAGE-01


   ముందు-మాట
  ***************
  ప్రతి మనిషి నిత్యవిద్యార్థి.ఎంతో మంది పిల్లలు  తమ భావాలను,తేనె లొలికే తేట తెలుగులో మౌఖికముగా..వ్యక్తీకరించగలిగినప్పటికి..లేఖనానికి,పఠనానికి,లిపి దోషము,ఉచ్చారణ  దోషము,సంకెళ్ళుగా మారి,వారు.తడబడుతు,పొరబడుతు ఉండటం మనము గమనిస్తూనే.ఉంటాము.ఆ..ఒడిదుడుకులను.అధిగమించి..విద్యార్థులు..వర్ణమాలను,గుణింతములను,ఒత్తులను,జాతీయములను..స్పష్టముగ..గుర్తించడము..వలన..వారిని..మథుర..మకరందాస్వాదన..   చేసే..మధుపములుగా మార్చేందుకు..నేను.వేసే..తప్పటడుగులే ఈ.*కులుకుల  పలుకులు*మేము.చల్లే..ఈ.విత్తులు.ఎందరో..సాహితీ..కర్షకులకు..(బాలలకు)అందాలని,పత్ర,పుష్ప,ఫలభరితము..చేసేందుకు..ఆచార్యులు అశీర్వచన అమృత ధారలు
      కురిపించాలని..ప్రార్థిస్తున్నాను.నా..ఈ.చిన్ని ప్రయత్నమును..పెద్ద..మనసుతో ప్రోత్సహించి..తగిన..సూచనలు..ఇస్తారని..ఆశిస్తున్న...మీ...సోదరి
                శుభం భూయాత్.

KULUKULA PALUKULU PAGE-02

   ఒకే అక్షరముతో పదాలు

  కాకి
  పాప
  మామ
  జాజి
  పీపా
  జేజే
  కేక
  నేను
  కాకా
  రారా

 పాప పీపా
 కాకికేక
 దాదా దీది

KULUKULAPALUKULU PAGE-03

పదాలు-చివరి అక్షరం మార్పు
*********************************
తమ-తమకం
,కంద-కందకం
,తార-తారకం
,పాత-పాతకం
,కీల-కీలకం
,ధార-ధారకం
,పంప-పంపకం
,వాడ-వాడకం,
కంచు-కంచుకం
,తిల-తిలకం
,ఫల-ఫలకం,
తవ్వ-తవ్వకం
,కల-కలకం,
నగ=నగరం
,సమ-సమరం
.భ్రమ=భ్రమరం
,మధు-మధురం,
ఉత్త-ఉత్తరం,
లక్ష-లక్షణం

,బల-బలపం,బలగం
,సమ-సమయం,సమరం
,భవ-భవనం
వాయ-వాయనం,వాయసం
,సంత-సంతకం,సంతసం
,యుగ-యుగళం,
మంగ-మంగళం,
ఉత్త-ఉత్తమం,ఉత్తరం
,శక-శకటం,
తడవ-తడవటం
,ఆరా-ఆరాటం
,పోరా-పోరాటం
,పది-పదిలం,
చంచ-చంచలం,
కుండ-కుండలం
,వంద-వందనం
.మన-మననం
,కల-కలం
,కుశ=కుశలం
,విష=విషమం,విషయం 
,పగ-పగడం,
పంచ=పంచడం
,ఊడి-ఊడిగం
,మరక-మరకతం
,ఆశ=ఆశయం
,కడి-కడియం,
మలి-మలినం
,వస-వసనం
,శోభ-శోభనం
,వద-వదనం
,తెగ-తెగటం,
చేర-చేరటం
,పాక-పాకటం
,పొగడ-పొగడటం
,మూగ-మూగటం
,వేప=వేపటం
గార-గారవం,
మర-మరణం
,లవ-లవణం
,వాన-వానరం
,శిఖ-శిఖరం,
పావు-పావురం,
నగ-నగరం,
కల-కలశం
,సహా-సహాయం,
వాయ-వాయసం,వాయనం,
వంగ-వంగడం
,దండ=దండకం
,కద-కదనం

KULUKULA PALUKULU PAGE-04

  కులుకుల-పలుకులు-పుట1
అ-పదాలు
అరక
అచట
అమల
అనగ
అలక
అరవ
అబల
అలసట
అజగర
అర..
.......
ఆ-పదాలు
ఆట
ఆశ
ఆన
ఆలన
ఆనప
ఆగడం
ఆమడ
ఆతపం
ఆదరం
ఆయన
....
ఇ-పదాలు
ఇల
ఇక
ఇది
ఇటు
ఇళ
ఇచట
ఇసుక
ఇనుము
ఇవి
ఇరుకు
....
-పదాలు
ఈత
ఈల
ఈక
ఈశ
ఈగ
ఈతె
ఈసు
ఈనాడు
ఈయన
ఈడు
......
ఉ-పదాలు
ఉమ
ఉష
ఉనికి
ఉరుము
ఉచితం
ఉదారం
ఉడుత
ఉడిపి
ఉలూచి
ఉడుము
ఉదరం
.....
ఊ-పదాలు
ఊహ
ఊళ
ఊసు
ఉతం
ఊడ
ఊపు
ఊరుపు
ఊయల
ఊదా
ఊరు
....
ఋ-పదాలు
ఋషి
ఋషి
ఋణం
ఋతువు
ఋజువు
ఋతము
ఋష్యశృంగుడు
ఋక్షధ్వజుడు
ఋష్యేంద్రమణి
ఎ-పదాలు
ఎనుము
ఎలుక
ఎద
ఎదురు
ఎవరు
ఎపుడు
ఎలుగు
ఎరుక
ఎరువు
ఎగుమతి
.....
ఏ-పదాలు
ఏడు
ఏనుగు
ఏలిక
ఏతము
ఏకము
ఏడాడి
ఏపుగా
ఏరువాక
ఏరు
ఏమరు
....ఐ
ఐదు
ఐతే
ఐదువ
ఐపాడ్
ఐసుక్రీం
ఐరావతం
ఐకమత్యం
......ఒ
ఒర
ఓకటి
ఒనరు
ఒదుగు
ఒడలు
ఒరులు
ఒంటె
ఒరవడి
ఒడ్డాణం
.....ఓ
ఓర్పు
ఓద
ఓలి
ఓటు
ఓజనం
ఓపిక
ఓతమి
ఓగిరం
ఓలగం
ఒరుగల్లు
....ఔ
ఔను
ఔటు
ఔర
ఔషథం
ఔదార్యం
ఔన్నత్యం
ఔదుంబరం
ఔపవిభక్తికం
ఔత్సాహికం
....అం
అంబ
అంగడి
అంబలి
అంతట
అందము
అంజలి
అంబకము
అందలము
అంపశయ్య
అంచ

KULUKULA PALUKULU PAGE-05

  పుట-2
క..పదాలు
కల
కథ
కసి
కపి
కవి
కని
కళ
కరి
కలము
కమలం
....ఖ
ఖగము
ఖనిజం
ఖననం
ఖలుడు
ఖరీదు
ఖచ్చితం
ఖద్దరు
ఖరారు
ఖర్జూరం
ఖగోళం
ఖజానా
......గ
గద
గరిక
గడప
గగబం
గనులు
గతము
గళము
గజము
గడియ
గరళము
....ఘ
ఘటము
ఘనము
ఘర్మజలం
ఘనాపాటి
ఘటోత్కచ
ఘటికుడు
ఘటన
ఘటకేసర్
ఘరానా
......

KULUKULA PALUKULU PAGE 06

   పుట-3
చతుర
చదరం
చలనం
చపలం 
చరణం
చంపకం
చకితం
చకోరం
చమకం
చరమం
.....చ
చత్రం
చత్రపతి
చలోక్తి
చందస్సు
చత్తీస్ గడ్
వాంచ
లాంచనం
పించము
ఉంచవృత్తి
.....జ
జయము
జగడము
జగము
జపము
జననము
జటరము
జతనము
జలజము
జఘనము
జనుము
....ఝ
ఝషము
ఝరి
...ఇన్జ
ఆజ్ఞ
ప్రజ్ఞ
విజ్ఞత
యజ్ఞము
విజ్ఞానము
అనుజ్ఞ
పతిజ్ఞ
రసజ్ఞత
శాస్త్రజ్ఞత
ప్రాజ్ఞనన్నయ

KULUKULA PALUKULU PAGE -07

కులుకుల..పలుకులు-పుట3
ట=పదాలు
టకటక
టమాట
టంగ్ స్టన్
టమాట
.....ఠ
ఠక్కున
కంఠము
పాఠసాల
శుంఠ
...డ
డమరు
గడ
జడ
వడ
మెడ
...ఢ్
ఢంక
గాఢము
మూఢుడు
....ణ..చివరగ
అణ
రమణ
కరుణ
రావణ
.....ప
పలక
పనస
పడవ
పరక
....ఫ
ఫలకము
ఫలము
ఫణి
ఫటా Fఅత్
....బ
బలము
బలపము
బకము
బలగము
.....భ్
భరణి
భజన
భంగము
భగవంతుడు
.........మ
మరక
మనము
మగ
మతి
....య
యతి
యమున
యశము
యవనులు
....ర
రమణి
రథము
రవిక
రభస
....ల
లత
లలన
లంక
లవణం
....వ
వదిన
వలువ
వనజ
వరము
....శ
శకము
శతము
శకటము
సనివారము
.....ష
ఉష
వేషము
మేషము
ఝ్షము
....స
సరము
సకలం
సదన
సరంగు
....హ
హలము
హతము
హవనము
హరితము
....ళ్
ఊళ
కళ
వేళ
కాళము
.....క్ష
లక్ష
శిక్ష
రక్ష
కక్క
....-ర్
చె-రువు
క-ర్ర
త్ప్-ర్ర
బు-ర్ర
గు-ర్రము.

KULUKULA PALUKULU PAGE-08

  పుట-8     కవలలు
 **********************
మమత
లలన
పాపాలు
గాలులు
బలులు
నెలల
మామామ
నానాటి
చిన్నన్న
చెలులు
పైపైన
సిసింద్రీ
మానిని
పనిని
కలల
రేరేడు
మీమీద
పులులు
నోరారా
శిశిరం
కాకాని
లేలేత
బాబాయి
గగనం
సతతం
మననము
ఆననము
ఖననము
జననము
వివిధము
లోలోపల
వీచుచున్న
సమమని
ముముక్షువు
బాబా
ఆయుధధరి
మృగగమనం
డుడు బసవన్న
చాచానెహ్రూ
ప్రచార రథము
మంగగళం
మథురరవం
మిత్రత్రయం
మమకారము

KULUKULA PALUKULU PAGE-09

తేడా..చూడండి--పుట5
మ-య
క్షమ-క్షయ
మమ-మయ
మతి-యతి
మానము-యానము
మంత్రము-యంత్రము
ప్రమాణం-ప్రయాణం
విషమం-విషయం
మోము-మోయు
......
ప-వ
...
పద్దు-వద్దు
పస-వస
పరము-వరము
పంచిన-వంచిన
పరులు-వరులు
పయసు-వయసు
పంతులు-వంతులు
పంచన-వంచన
పటువు-వటువు
........
న..స
నత్తి-సత్తి
నిగ-సిగ
నడి
సడి
నలుపు-సలుపు
నెలవు-సెలవు
నగము=సగము
నరులు-సరులు

KULUKULA PALUKULU PAGE-10

మహా-ప్రాణాలు-page 10
కాళి=ఖాళి
మక-మఖ
జరీ-ఝరీ
కంటి-కంఠి
బావ-భావ
కని-ఖని
కాపీ-కాఫీ
పోను-ఫోను
దార-ధార
వద-వధ
బావి-భావి
గాటు-ఘాటు
గంత-ఘంత
పాట-పాఠ
నక-నఖ
కాకి-ఖాకి
శంక-సంఖ
పాల-ఫాల
కరము-ఖరము
గనులు-ఘనులు
రతము-రథము
గడియ-ఘడియ
గనము-ఘనము
అనగ-అనఘ
ప్రదానము-ప్రధానము
మదిర-మధిర
చందము-ఛందము
అదరము-అధరము

KULUKULA PALUKULU PAGE-11

పుట 8..తలకట్టు-దీర్ఘము (అర్థభేదము)
*****************************************
ధన్యము-ధాన్యము
ప్రసాదం-ప్రాసాదం
రజితం-రాజితం
పత్రము-పాత్రము
శకము-శాకము
కషాయం-కాషాయం
ఫలము-ఫాలము
పలక-పాలక
వరము-వారము
భవనం-భావనం
ప్రకారం-ప్రాకారం
పనుపు-పానుపు
నగరం-నాగరం
మరుపు-మారుపు
యతన(0)-యాతన
క్షమము-క్షామము

KULUKULAPALUKULU PAGE-12

  తలకట్టు-గుడి
******************

-పుట-9
కనుక-కినుక
గరిక-గిరిక
చక్కని-చిక్కని
చలికి-చిలికి
దశలు-దిశలు
తరము-తిరము
నరుడు-నిరుడు
పలక-పిలక
బలము-బిలము
నలుపు-నిలుపు
మధ్య-మిధ్య
వరులు-విరులు
వచ్చిన-విచ్చిన
వనము-వినము
వడిగ-విడిగశరము-శిరము
హంస-హింస
హతుడు-హితుడు

KULUKULAPALUKULU PAGE-13

 పుట=10-

తలకట్టు-గుడిదీర్ఘము
****************************
కలక-కీలక
కరము-కీరము
గతము-గీతము
చలము-చీలము
జడులు-జీడులు
జవము-జీవము
తరులు-తీరులు
నలుడు-నీలుడు
నడలు-నీడలు
పడని-పీడని
పరులు-పీరులు
బరువా-బీరువా
బడులు-బీడులు
మగడ-మీగడ
మనము-మీనము
మసాలా=మీసాలా
వరుడు=వీరుడు

KULUKULA PALUKULU PAGE-14

పుట-14-తలకట్టు-కొమ్ము
కలము-కులము
కరులు-కురులు
కమ్మరి-కుమ్మరి
కములు-కుములు
గండము-గుండము
చట్టాలు-చుట్టాలు
తమ్ములు-తుమ్ములు
తరుము-తురుము
పరము-పురము
పన్నాగ-పున్నాగ
పలుపు-పులుపు
మదము-ముదము
శకుని-శుకుని
సరస-సురస
సతులు-సుతులు
సన్నము-సున్నము

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...