Thursday, September 27, 2018

BAANAASURA KRUTA SIVASTOTRAM

 శివమే జగము-జగమే శివము-బాణాసుర కృత శివస్తోత్రము.
***************************************************************

1. మహాదేవ మహాగురు సురేశ్వర నీలకంఠ
   యోగబీజ యోగరూప యోగీశ్వర నమోనమః.

2.జ్ఞానబీజం జ్ఞానరూపం జ్ఞానానందం సనాతనం
  తపోఫలానుగ్రహం దైవం సర్వసంపత్ప్రదాయకం

3.తపోబీజం తపోరూపం తపోధనం సదాశివం
  కరుణబీజం కరుణరూపం చిన్ముద్రం చిదంబరం

4..నరకార్ణవతారణం భుక్తి-ముక్తి ప్రదాయకం
  అశుతోషం సుప్రసన్నం అవ్యాజము అనుగ్రహం

5.హిమవాసం చంద్రమౌళిం శ్వేతపద్మ ప్రకాశకం
  బ్రహ్మజ్యోతి స్వరూపము భక్తానుగ్రహ విగ్రహం.

6.పంచభూతం పంచేంద్రియం పంచామృతం బహురూపం
  జలరూపం అగ్నిరూపం నింగిరూపం దిగంబరం

7.వాయురూపం చంద్రరూపం సూర్యరూపం మహాత్మకం
  చిద్రూపం స్వస్వరూపం విరూపాక్షం విశ్వరూపం

8.శక్తిస్వరూపం ఈశ్వరం భక్తానుగ్రహ విగ్రహం
  వేదస్తుతం పరమపూజ్యం త్రిభువనరక్షకం.

  జగమే శివము-శివమే జగము.

9..అపరిచ్చిన్నం ఆదిదేవం అవాఙ్మానస గోచరం
  వ్యాఘ్రచర్మాంబరధరం మందస్మితం మహేశ్వరం
  త్రిశూల పట్టిధరం కరుణం చంద్రశేఖరం.

0.శంకరం చరణంశరణం నిత్యం బాణసన్నుతం
   భక్తహృదయనివాసం దుర్వాస ముని సంస్తుతం.

 11.సంపత్కరం స్తవప్రియం గంధర్వ మునివందితం
   పరమపదం ప్రణవం పవిత్రం పరమాద్భుతం

12.బాణస్తోత్రం మహాపుణ్యం సత్వరం పాపనాశనం
   దుష్టపీడనివారణం సర్వతీర్థ స్నానఫలం.

13.అపుత్రో లభతే పుత్ర పఠనం శ్రవణం స్తుతి
   అవిద్యాంలభతే విద్య శంకరం ఇది నిశ్చితం

4.గరళకంఠం కరంశూలం స్మరణం కృపాకరం
   అవశ్యం రోగహరణం ఇదిసత్యం వ్యాసవాక్యం

15.నెలకొకపరి పఠనము బాపు కళంకము
   కనికరమున తొలగించు సంకెలబంధము

16.రాజ్యహీనో లభతే రాజ్యం సదా  ధనంలభేత్
   శ్రవణం బాణస్తోత్రము సర్వాభీష్టఫలప్రదం

17.స్థిరచిత్తం శ్రవణం స్తోత్రం వర్షకాలం నిశ్చితం
   శివప్రసాదం లభ్యం సంప్రాప్తం సకల సంపదం.

8.నిటలాక్షస్తవ నిత్యశ్రవణ ఫలితమన
   నిజ భక్తునకలభ్యము కానగరాదిలన్ 

19.ఇదంస్తవం శుభకరం ఏకాకి బాంధవప్రియం
   అచలం సంపదాత్నిత్యం అచలాధీశానుగ్రహం

20 ఏకమాసము స్తువంపఠనం కిల్బిషనాశనం
   అభాగ్య లభతే భాగ్యం అంతేన సాయుజ్యప్రదం

21.మహామూర్ఖ బుద్ధిహీన శ్రవణం శంకరస్తుతి
   విద్యాబుద్ధి బలంలభ్యం తక్షణం శివానుగ్రహం.

2.దరిద్రం దుఃఖబంధుం హరం శ్రవణం భక్తితత్పర
   ప్రాప్తం విభవం సత్యం సకలాధారం సదాశివం

23.శుద్ధ త్రికరణభక్తి సేవతే తత్ర శంకరం
   అవ్యాజకరుణాసింధుం అభీష్టఫల సిద్ధిదం.

24.ఇహలోకే సుఖం ప్రాప్తం నానాప్రకారసేవితం
   త్రిసంధ్య పూజనం శ్రేష్ఠం నిత్యం స్తోత్రం ఉత్తమం.

 ఇతి శ్రీబ్రహ్మ వైవర్తనపురాణే బాణాసురకృత శివస్తోత్రం సంపూర్ణం.

   ( ఏక బిల్వం శివార్పణం.)

  ఓం తత్ సత్.


  శివ స్వరూపులు నా ప్రయత్నములోని లోపములను సవరించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.



Wednesday, September 26, 2018

RISHI PATANJALIKRUTA SADAASIVAASHTAKAMU.

సదాశివాష్టకము
   *************
1.స్వర్ణపద్మ సరోతీర సుందర మందిరవాసినే
  అనంతకోటి సూర్యతేజ గరుడగమన సేవితే
  ఫణిపతి కర్ణకుండల పాహి పార్వతీసమేత
  సదానమశ్శివాయతే సదాశివాయ శాంభవే.

2.భాగీరథిసహిత బాలేందు చంద్ర ధారియే
  భానుచంద్ర పావక భాసిత త్రినేత్రయే
  భుజంగరాజ కుండలే బుద్ధిశాలి బాంధవే 
  సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.

3.చతుర్ముఖానన వినుత చతుర్వేద కీర్తితే
  చతుర్భుజానుజ సమేత  శరీర దివ్యతేజసే
  చతుర్విధప్రదాత చతుర తాండవ ప్రియే
  సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.

4.శరత్చంద్ర కాంతులీను మందహాస మంజుల
   పగడపెదవి ప్రతిఫలించు ముఖప్రకాశ సుందర
   బ్రహ్మపుర్రె చేతదాల్చు సిరులతల్లి సోదర
     సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.

5. హరి సహస్ర కమలములతో ప్రారంభించెను వ్రతము
   హరులీలన కానరాదు పూజకు చివరి కమలము
   హరినేత్రము కమలమాయె వరమాయె సుదర్శనము
   సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.

6.ధరాతలము రథము సారథి విధాత
  ధనువు పసిడికొండ శరము చక్రధారి
  అనంతుడల్లెత్రాడు హయములు శృతములు
   సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.

.7. ఉగ్రరూప వీరభద్ర దర్శన భయభ్రాంత
   విగ్రహ,దక్షయాగ భీతజన రక్షణాయ
   నిగ్రహించరాని నిఖిలార్తనాద శ్రవణాయ
   సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.

8. దండపాణి మృకండముని తనుజ రక్షణే
   మంగళ గళ ప్రకాశ సుధచంద్రధారిణే
   అఖండ భక్తపాల అంత్య ముక్తిదాయినే
   సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.

9. బ్రహ్మ విష్ణు మహేశ సహిత దేవతాది
   నిత్య నిత్యమార్చిత హిత పాదపంకజాయ
   రజతసభ విరాజమాన మధుర రాజాయ.
   నమశ్శివాయతే సదాశివాయ శంభవ

 10.హాలస్య నాథాయ మహేశ్వరాయ
   హాలాహలాంకృత కంధరాయ
   మీనేక్షణపతయే శివాయ
   నమః శివ సుందర తాండవాయ

  ఇది  శివానుగ్రహ పాత్రుడు పతంజలి ఋషి విరచిత హాలస్యపురాణాంతర్గత సదాశివష్టకము.దీనిని చదివిన,వినిన,స్మరించిన,కనీసము విమర్శించినను శివానుగ్రహపాత్రులగుదురని సాక్షాత్తు పరమేశ్వరుడే పతంజలికి సెలవిచ్చెనట.

    యధావిధిగా ఏమాత్రమువిషయపరిజ్ఞానములేని నా దుస్సాహమును మన్నించి,నిర్హేతుక కృపతో సదాశివుడు తన స్తుతిని తానే వ్రాసుకున్నాడు.లోపములు నా అజ్ఞాన సూచితములు.శివస్వరూపులు పెద్దమనసుతో నన్ను క్షమించి,ఆశీర్వదించెదరు గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)

    ఓం తత్ సత్.




Sunday, September 23, 2018

CHARANA-SRNGA RAHITA NATESA STUTI-RISHI PATANJALIKRUTAM.

               
                చరణ-శృంగ రహిత నటేశ నవకం-పతంజలి కృతం.
                *******************************************
1. జగంబులు జయంబను చిదంబరపదం ఝణ ఝణం ఝణిత మంజుకడియం
   పతంజలి దృగంజన నిరంజన నిరంతర జయం జనన భంజనకరం
   కదంబ సుమలంకృత హరం శివం శంకరం శంభుం సుసుందర కంజయుగళం.
   సుమంగళి సగం బుధహృదయంబుజ రవిం నట చిదంబర భజం సంతతం.

2.హరమసురసంహరం అనంతఫణికంకణం  అఖండదయమంతరహితం
  ఇంద్రనుత సుందరం విరించి సుర సంహితం సర్వశుభలక్షణం శుభకరం
  భస్మలంకృత ప్రియం యమనియమ భంజనం నగజవందిత పంకజపదం
  శివంకరుణసింధుం మదమదన వంచన నట చిదంబర భజం సంతతం. 

 3.అఖండజగమనంత రక్షం భృంగి మృదంగ విజృంభిత పదనర్తనం
   ఉన్మత్తముత్తుంగ గంగ జట బంధనం విప్రరక్షం యమగర్వబల భంజనం
   విలంబిత కరం దశదిశం నిగమ మృగధరపర్వతవసం పశుపతిం
   ధనంజయ తిమిరసమ్హర చంద్ర నయనం నట చిదంబర భజం సంతతం.

.4.అనంత నవరత్న ఖచిత కడియం కింకిణి ఝణం ఝణ ఝణం ఝణరవం
  హరి విరించికర శబ్దపరికరం లయధ్వనిత ధిమిన్నర్తన శంకరం
  గరుడరథ నందిముఖ శృంగి రితి భృంగి షణ్ముఖ ప్రమథగణ వందితం
  సనకసనంద మునిసన్నుతపదశివం నట  చిదంబర భజం సంతతం.

5.అనంత భుజబల మఖిల సుర సన్నుతం మునిహృదంతర వసంతం శివం
  జల గగన పవనం ధరణి రవిచంద్రమనలం సంకలిత శుభంకరం
  త్రినయనం త్రిదళప్రియం త్రిపుర రణసంహరణం హరం త్రిజగద్రక్షణకరం
  సగుణం సకరుణమనంత నర్తనప్రియం నట చిదంబర భజ సంతతం

6.కుందవిరి సంభరిత స్పటికధవళం భృంగరుచిబంధురం కంఠయుగళం
  ముకుంద సుర ఇంద్రబృంద వందిత కర్ణ మణిభసితఫణికుండల ధరం
  స్థిర చలనస్థితి గుణం సుజనవత్సలనిధిం పర్వతవసం పశుపతిం
  ధనుంజయస్తుతం భక్త భవబంధ సంహరం   నట చిదంబర భజ సంతతం.

7.సురం సురవరం పురహరం పశుపతిం సురుచిర స్కంధ గణపతి సుతం
  శివం శంకరం భక్తసులభం ప్రమథగణ సన్నుతం సనకపంకజ రవిం
  అనంగదమనమసంగ పింగళజటం ఘనహితకరం గరళకబళం
  సనందవరదలంకృత చంద్రవదనం నట చిదంబర భజం సంతతం.

8.  క్షితిరథం  స్వర్ణ గిరిధనుం అనంతఫణిగుణం స్వయంభువమరిమర్దనం
    పశుపతి ధరం మృగశిశుం ఖండపరశుం డమరుక దర్శనం శుభప్రదం
    కరం హరిశరం హయం శృతిమయం ఋషి బుధస్తుతం  భక్తవశంకరం
    త్రిపురసంహరమంబికప్రియం హిమనగం నట చిదంబర భజం సంతతం.

9.మంగళ కరంబుజ పదం దిగంబర మఖిలమనంత కరుణం హిమవసం
  అనంగజ్వలనం హరమంతకరనుత అఖండ సురగణ వందిత పరం
  సుందరకుందరరవింద బృంద వికసిత రుచిం సంఘటిత సుగంధభరితం
  పతంజలి సన్నుతం  ప్రణవ పంజరశుకం నట చిదంబర భజం సంతతం.

10.భుజంగ పువకృతమితిస్తవం త్రికరణం పఠతి భక్తి  ప్రతిదినం
   సహస్రక్రతుఫలం సర్వశుభదం ఋషి సలలిత చరణ శృంగరహితం
   సమస్త పుణ్యఫలం సంచితహరం హరిప్రముఖ దివ్యనుత శంకర పదం
   సద్గతి పథం సర్వసిద్ధిప్రదం సుకృతం పరంపర ఖండితం జన్మవలయం. 


 శివలీలలు తెలుసుకొనుట ఎవరితరము.తన భక్తుడైన పతంజలి కృత చరణశృంగ రహిత నటేశ నవకము శివలీలామృతము.నంది భృంగి పతంజలి ౠషి చిదంబర నటరాజ నర్తనమును చూడవలెననుకొన్నసమయమున మానశిరము పాము శరీరముగల ఋఇషిని వారు హేళనచేసిరని,తత్ఫలితమే ఈ స్తోత్ర ఆవిర్భావము.ఇందు దీర్ఘాచ్చులు నిషేధించబడినవి.ప్రతి స్తుతి వాక్యము 26 అక్షరములతో ప్రకాశిస్తుంటుంది.శివలీలగ నా కరమును శివుడు పట్టుకొని శివుడు ఈ స్తుతిని తనకుతానే వ్రాసుకొనెను.ఇందులోని లోపములకు కారణము కేవలము నా అవగాహన రాహిత్యము.నన్నేలునులే ఆ మూడుకన్నులవాడు అను పసినమ్మకము.శివస్వరూపులు నా సాహసమును మన్నించి,పెద్దమనసుతో లోపములను సవరించుట శివపదర్చనగ తలచి,నన్ను ఆశీర్వదించెదరు గాక.

  ( ఏక బిల్వం  శివార్పణం.)

 ఓం తత్ సత్. 


Wednesday, September 12, 2018

APPAYYA DEEKSHITA MAARGABAMDHU STOTRAMU

మార్గబంధు స్తోత్రము-శ్రీ  అప్పయ్య దీక్షిత కృతము
*******************************************

 శంభో మహాదేవ శంభో 
 శంభో మహాదేవ దేవా
 శంభో మహాదేవ శంభో
 శంభో మహాదేవ దేవేశ- శంభో
 శంభో మహాదేవ దేవ.

1. తరిమింది జాబిలిని శాపం
   తరియించింది బాలేందు రేఖ కిరీతం
   కామ సంహారమే చేసింది నేత్రం
   శుద్ధ తేజస్వరూపం-భజే మార్గబంధుం భజే మార్గబంధుం.

2.త్రాగినది విషజ్వాల సర్పం
  వెన్నంటి నడిచినది శివుడే సమస్తం
  జతగూడె గంగమ్మ జగమేలు బంధం
  నిత్య చైతన్య రూపం- భజే మార్గబంధుం  భజే మార్గబంధుం.

3.నిత్యం చిదానంద రూపం
  కృతకృత్యం శార్దూల కరిచర్మ వస్త్రం
  దశకంఠ దర్పాతి నాశం
  భక్త మందార దైవం-భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం

4.తొలగినది మన్మథుని  గర్వం
  నెలవైనది కంఠమున ఘనమైన గరళం
  కుంద మందార దంత దరహాసం
  కోటి సూర్య ప్రకాశం భజే మార్గ బంధుం భజే మార్గ బంధుం.

5.కామితము తీర్చేటి వృక్షం
  కవ్వపుగిరిని తలదన్ను దారుఢ్యం
  కడలి లోతును గెలుచు గంభీరం
  సదా సచ్చిదానందం- భజే మార్గబంధుం భజే మార్గ బంధుం.  

.6అప్పయ్యదీక్షితుల స్తోత్రం
 నిరాటంకముగ చేయించు నీదైన పయనం
 ఈడేర్చు కోరికలు తథ్యం
 ఈశుడే సాక్షి ఇలను ఇది నిత్యసత్యం

భవానీ సమేతం -భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.

      ( ఏక బిల్వం శివార్పణం.)

  నిర్హేతుక కరుణ మార్గబంధు స్తోత్రమును వినిపించి,నన్ను కలముగా మలచుకొని పై స్తుతిని వ్రాసుకొనినది.

 అద్వైత సిద్ధాంతమును అవగతము చేసికొనిన,శ్రీ అప్పయ్య దీక్షితులు  విరించిపట్టణం వేలుపైన పరమేశుని,మాసదాశివుని మార్గ బంధువుగా గుర్తించి,ప్రయాణ సమయమునకీర్తించినది, ఈ స్తోత్రము.వివిధ శరీరములలో ఈ జీవి ప్రయాణములు అనంతములు.వాటిని సన్మార్గమున నడిపించమని వేడుకొనుటయే ఈ స్తోత్ర ప్రాశస్త్యము.
 దక్షునిచే శాపగ్రస్థుడై,కడలిని దాగినచంద్రుని శాపవిముక్తునిచేయుటయే కాక,తన సిగపూవుగా అలరారుటకు కారణుడైన పరమేశుని .భజించుచున్నాను.

  క్షీరసాగర మథనమున హాలాహలమును త్రాగువేళ,సహాయకారులై తామును విషమును గ్రహించి,స్వామికి ఆభరణములై ప్రకాశించుటకు మార్గమును చూపిన నాగాభరణునికి నమస్కరించుచున్నాను.

   మార్గ ముడులను విడిపించి,సన్మార్గమును చేర్చు త్రినేత్రుని భజించుఅదృష్టమును  స్వామి అనుగ్రహించును గాక.

         ( ఏక బిల్వం శివార్పణం.)

  ఓం తత్ సత్.
.

Monday, September 10, 2018

YAMAKRUTA SIVAKESAVA STUTI

       యమధర్మరాజకృత శివకేశవ స్తుతి
  ********************************
1.గోవింద మాధవ ముకుంద మురారి
  శూలపాణి శశిశేఖర శంభో శంకర
  అచ్యుత జనార్దన దామోదర వాసుదేవ
  స్మరణము యమభటులనుంచు దూరము.

2. అంధకాసురవైరి నీలకంఠ గంగాధర
   కైటభాసురవైరి వైకుంఠ పద్మపాణే
   భూతేశ ఖండపరశు మృదేశ చండికేశ
    స్మరణము యమభటులనుంచు దూరము.

3. నారసింహ మధుసూదన చక్రపాణి పరాత్పర
   గౌరీపతి  మహేశ్వర  చంద్రచూడ శంకర
   నారాయణ  అసురాంతక మాధవ శార్ఙధర
   స్మరణము యమభటులనుంచు దూరము.

4. ఉగ్రా! విషమేక్షణ కామవైరి మృత్యుంజయ
   శౌరి! పీతవసన శ్రీకాంతుడ  నీలమేఘ
   ఈశాన! కృత్తివసన త్రిపురారి లోకనాథ
    స్మరణము యమభటులనుంచు దూరము.

5. శ్రీకంఠ  దిగంబర గౌరీపతి పినాకపాణి
   శ్రీహరి  మధువైరి  శ్రీపతి పురుషోత్తమ
   శ్రీమంత నాగభరణ పశుపతి చంద్రమౌళి
   స్మరణము యమభటులనుంచు దూరము.

6.సర్వేశ్వర దేవదేవ త్రిపురాంతక శూలపాణి
  గరుడధ్వజ పరబ్రహ్మ నరకాంతక చక్రపాణి
  వృషభధ్వజ తుండమాలి నిటలాక్ష చంద్రమౌళి
   స్మరణము యమభటులనుంచు దూరము.

7.రమాపతి రావణారి రాఘవ శ్రీరామ
  భూతపతి మదనారి శంకర ప్రమథనాథ
  ఇంద్రియపతి చాణూరారి మురారి జగన్నాథ
  స్మరణము యమభటులనుంచు దూరము.

8. శూలి  బాలేందుమౌళి  హరా గిరీశ
   చక్రి కంసప్రాణాపహారి హరి  రాధేశ
   భర్గ త్రిపురాసురవైరి  హరా మహేశ
   స్మరణము యమభటులనుంచు దూరము

9.గోపీపతే యదుపతే మాధవ వాసుదేవ
  గౌరీపతే వృషభధ్వజ పాహి మహాదేవ
  కర్పూరభాస గోవర్థనధర దేహి దేవదేవ
   స్మరణము యమభటులనుంచు దూరము

10. స్థాణువు త్రినేత్రుడు పినాకపాణి
    కృష్ణా  కమలాకర శిఖిపింఛమౌళి
    విశ్వేశ్వర త్రిపధధర చంద్రమౌళి
    స్మరణము యమభటులనుంచు దూరము.

       కాశీఖండములో యమునిచే చెప్పబడిన శివకేశవ నామములను పఠించినవారి వద్దకు పోవద్దని యముడు తన భటులకు ఆనతిచ్చెనట.ధూర్జటి కవి అన్నట్లు సదాభజన చేయు మహాత్ముల పాదధూళిని నా శిరమున ధరించి, వారిని గౌరవిస్తాను.కనుక భటులు వారివద్దకు పోరాదని యమధర్మరాజు ఆన.శివ కేశవ నామములు స్మరించువారికి జన్మరాహిత్యము తథ్యము.

  ( ఏక బిల్వం శివార్పణం.)

   ఓం తత్ సత్.

Sunday, September 9, 2018

SIVA PAMCHAAKSHARI NAKSHATRAMAALAA STOTRAMU.

 శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రము శ్రీ శంకరాచార్యకృతము.
 ******************************
 1.శుభలక్షణమైన ఆత్మస్వరూపమునకు దండాలు శివా
   చిన్ని కాంతి సూర్యుడైన చిత్ప్రకాశమునకు దండాలు శివా
   సంతాపనాశకమైన చిదానందమునకు దండాలు శివా
   భవతారకమైన భక్త బాంధవునకు దండాలు శివా.

 2.బాలుని రక్షించిన కాలకాలునకు దండాలు శివా
  దక్షుని శిక్షించిన వీరభద్రునకుదండాలు శివా
  కార్య-కారణముల మూలకారణునకు దండాలు శివా
  నన్ను పాలించు దయాలవాలమునకు దండాలు శివా

3..ఋషివందిత ఋషభవాహనునకు దండాలు శివా
  ధర్మపు వంతెన సృష్టిరక్షకునకు దండాలు శివా
  దుష్టుల శిక్షించు ధూమకేతనునకు దండాలు శివా
  ఇష్టవస్తు ప్రదాత అష్టమూర్తికి దండాలు శివా.

4. ఆపదలు నశింపచేయు ఆయుధునకు దండాలు శివా
   పాపములు నశింపచేయు గంగాధరునకు దండాలు శివా
   శాపములు తొలగచేయు భక్తవశంకరునకు దండాలు శివా
   దండాలు స్వీకరించు దయాసింధువునకు దండాలు శివా.

5.ఆశాపాశమునకు అందనివానికి దండాలు శివా
  ఆకాశము కేశములైన వానికి దండాలు శివా
  పర్వతమును విల్లుగ మలచిన వానికి దండాలు శివా
  పాపములు దహించు స్మరణనామికి దండాలు శివా

6.ఆదిశేషువే కుండలములైన వానికి దండాలు శివా
  ఆ కాలునే కాలదన్నినవానికి దండాలు శివా
  వేదములే శిరములైన వానికి దండాలు శివా
  వేదార్థములే తానైన వానికి దండాలు శివా.

7. కందర్పుని భస్మముచేసిన వానికి దండాలు శివా
   కరిచర్మము వస్త్రమైన వానికి దండాలు శివా
   కనకకాంతి కవచమైన వానికి దండాలు శివా
   సామగానము ప్రియమైన వానికి దండాలు శివా

8.ముట్టడించిన మన్మథుని గుట్టువిప్పిన వానికి దండాలు శివా
  పుట్టుట-గిట్టుటను మట్టుపెట్టువానికి దండాలు శివా
  బెట్టుసేయక వరములిచ్చే పట్టుకొమ్మకు  దండాలు శివా
  గుట్టుగా  నాలోన దాగిన గుట్టదొరకు దండాలు శివా

9.అండజవాహన  (హరి) హృదయవాసికి దండాలు శివా
  అంగుడిలోనవేదములు దాచినవానికి దండాలు శివా
  అరచేతిలో అగ్నిపాత్ర కలవానికి దండాలు శివా
  కుబేర బంధువునకు  ముక్కంటికి దండాలు శివా

10.కృపాకటాక్ష అక్షర స్వరూపునకు దండాలు శివా
   ప్రకటిత ప్రకాశ యజ్ఞదీక్షితునకు దండాలు శివా
   నందివాహనుడు చిదానందమునకు దండాలు శివా
   సద్గతి ప్రసాదక భక్త మందారకునకు దండాలు శివా

11.శిశుశశిరేఖా ప్రకాశములవానికి దండాలు శివా
   సుందరంబగు దరహాసంబులవానికి దండాలు శివా
   వెండికొండ  చరియలందుండు వానికి దండాలు శివా
   మెండుగ కరుణించు పశుపతినాధునకు దండాలు శివా

12. దీనుల రక్షించు కామధేనువునకు దండాలు శివా
     కాముని శిక్షించిన వైశ్వానరునకు దండాలు శివా
     అసురత తొలగించు  ప్రకాశమునకు దండాలు శివా
     భక్తరక్షణగిరీశ మేరువునకు దండాలు శివా.

13.
    ఏక బిల్వమునకు సంతసించు వానికి దండాలు శివా
    అనేకజన్మ పాపములు హరించువానికి దండాలు శివా
    తేట తేనెలొలుకు పలుకు వానికి దండాలు శివా
    సాటిలేని కరుణ చిలుకు సామికి దండాలు శివా.

14.తేట తేనెలొలుకు ధర్మ భాషణములకు దండాలు శివా
   తేట తెల్లపరచు దయా భూషణములకు దండాలు శివా
   పాప పంకిలమును హరించు పాదములకు దండాలు శివా
   ఏక బిల్వ దానముతో పులకించు మదికి దండాలు శివా.

15. చల్లనైన చంద్రరేఖను ధరించిన వానికి దండాలు శివా
    కుటిలమైన దైత్యమాయను ఖండించిన వానికి దండాలు శివా
    సగమైన తల్లి పార్వతీ ప్రభువైన వానికి దండాలు శివా
    సర్వ జీవులను రక్షించు మహాదేవునికి దండాలు శివా.

16. కనికరించు కామ సంహారునకు కోటి దండాలు శివా
    మైమరపించు మోహనాకారునకు దండాలు శివ
    వరములిచ్చు వెండికొండ నిలయునకు దండాలు శివా
    ఉమ కొలుచు మనోహర దేహునకు దండాలు శివా.

17.శిరమున  గంగాతరంగముల వానికి దండాలు శివా
   సంగరమున  భంగపరచు వానికి దండాలు శివా
   అభంగముల  కురంగమున్న (లేడి) వానికి దండాలు శివా
   మంగళముల నొసగు మహేశునికి దండాలు శివా

18.రజత కాంతి ధిక్కరించు తేజమునకు దండాలు శివా
   రయమున కనికరించు  నైజమునకు దండాలు శివాయ
   కోరిన క్షణమున కోర్కె తీర్చువానికి దండాలు శివా
   సంసార దుఃఖమును దహించువేయువానికి దండాలు శివా

 19.సూర్య-చంద్ర-వహ్ని నయనములకు దండాలు శివా
   శూరునకు దక్షయజ్ఞ శూన్యునకు దండాలు శివా
   కూరిమి సత్కృపాకటాక్షములకు దండాలు శివా
   శరణాగత లోక రక్షకునకు దండాలు శివా
20.వేడుకొనే కింకరపాలితునికి దండాలు శివా
   వేదములే (జింక) చేతనున్నవానికి దండాలు శివా
   వేదనలనే సంకటనాశనునికి దండాలు శివా
   వేడుకనే లోకరక్షణైన వానికి దండాలు శివా.
21.జన్మకర్మ పాశనాశనునికి దండాలు శివా
   జన్న భస్మధారి ఈశ్వరునికి దండాలు శివా
   సర్వసంగ పరిత్యాగ సన్నిహితునికి దండాలు శివా
   సర్వ సంపద్ప్రదాత హరివందితుని దండాలు శివా.
22. శిష్టాచార హృదయమందిరములకు దండాలు శివా
    ఇష్టమైనదాత్మయన్న స్పష్టకు దండాలు శివా
    కష్టములను తొలగచేయు కరుణకు దండాలు శివా
    సత్యం-శివం-సుందరమైన స్వామికి దండాలు శివా
23.తరలివచ్చి బాలుని కాచిన వానికి దండాలు శివా
   తనదైన ప్రకాశము కలవానికి దండాలు శివా
   తనను అర్థము చేసుకోలేని వానికి దండాలు శివా
   తానే జగమంతా నిండిన వానికి దండాలు శివా.
24.
   సంతతము మూసియుంచు ఫాలనేత్రమునకు దండాలు శివా
   సంచితము తొలగించు ప్రసాదత్వమునకు దండాలు శివా
   సంకటములు తొలగించు శంకరునికి దండాలు శివా
   సంతసములు కలిగించు దేవదేవునికి దండాలు శివా.

25. యోగివంద్య భక్తదుఃఖ హరునకు దండాలు శివా
    యోగి పూజ్య భుక్తి ముక్తి ప్రదాతకు దండాలు శివా
    యోగి హృదయ కమల వాసునకు దండాలు శివా
    యోగీంద్రుడు జగతి సృష్టికర్తకు దండాలు శివా

26. యమునికి యముడై బాలకుని కాచిన వానికి దండాలు శివా
   కరిని కనికరించిన చర్మాంబరునికి దండాలు శివా
   జంతుతతికి స్వాంతన ప్రదాతకు దండాలు శివా
   సంతతాశ్రితుల చింతమాపు వానికి దండాలు శివా.

27. చెదిరియున్న వెర్రి బ్రహ్మ పుర్రెలకు దండాలు శివా
    కుదిరియున్న విరించి తుండ మాలకు దండాలు శివా
    చేత నున్న శూలము-కపాలమునకు దండాలు శివా
    శరణని చేరిన నీ చరణములకు దండాలు శివా.


      " శివ పంచాక్షరి" విలక్షిత అక్షరములకు దండాలు శివా
       శుభలక్షిత" నక్షత్రమాల"స్తోత్రమునకు  దండాలు శివా
       త్రినేత్ర స్తుతుల త్రికాల పఠనమునకు దండాలు శివా
       సాక్షాత్ శివస్వరూప ప్రసాదమునకు దండాలు శివా.
 
       (ఏక బిల్వం శివార్పణం.)

   ఏ మాత్రము పట్టులేని నా చేతిని పట్టుకొని సదాశివుడు తనకు తానుగా వ్రాసుకొనిన స్తోత్రములో తప్పులు దొర్లిన దానికి కారణము కేవలము నా అహంకారము.శివ స్వరూపులు పెద్ద మనసుతో నన్ను క్షమించి,ఆశీర్వదించెదరు గాక.శివానుగ్రహము మనలకందరకు కలుగుగాక.

   ఓం తత్ సత్.

 
    .

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...