Sunday, May 31, 2020

OM NAMA SIVAAYA-52


   ఓం నమః శివాయ-52
   ********************

 పెద్ద దేవుడనని నీవంటే మద్ది తెల్లబోయింది
 అంబే శివుడనని నీవంటే జంబు బెంబేలెత్తింది

 భూతనాథుడనని నీవంటే చూతము చూతము అంది
 యోగిని నేనని నీవంటే రేగి ఆగిపోయింది

 చెలకని వాడనని నీవంతే చెరుకు ఊరుకున్నది
 మీరేడునని నీవంటే మారేడు చేరమన్నది

 ఉబ్బులింగడనని నీవంటే కొబ్బరి తబ్బిబ్బయింది
 నిర్వాహకుడినని నీవంటే ఉర్వాకము నవ్వింది

 దొడ్డవాడనని నీవంటే గడ్డి అడ్డుచెప్పకుంది
 "వృక్షేభ్యో-హరికేశేభ్యశ్చః" నమకము అనగానే

 అన్నిచెట్లు నీవంటే అక్కసుతో పచ్చియని,నిన్ను
 వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా.

OM NAMA SIVAAYA-51


   ఓం నమః శివాయ-51
   ********************

  నీ నెత్తిమీద గంగను చూసి నదులు బెంగపడ్డాయట
  మా నీత్తిమీదికి ఏ ఆపద ముంచుకొస్తుందోనని

 నీ కంఠమంటిన పామును చూసి కొండచిలువలు బెంగపడ్డాయట
 మా కంటిముందు ఏ దందన వెన్నంటి ఉందోనని

 నీ చేతిలోని మృగమును చూడగనే సుఖము మృగ్యమైపోయిందట
 వాడిబాణమేదో తమను దాడిచేయనుందని

  నీ గజచర్మమును చూసి గజములు గజగజలాటేనట
  పొట్టచీల్చి ఎవరు తమను పొట్టనుపెట్టుకుంటారోనని

  నీ బ్రహ్మపుర్రెలు చూసిన జనులు కుర్రో-మొర్రోలేనట
  రిమ్మతెగులు తగులుకొని దుమ్మునోట కొడతావని

 "దయనీయశ్చ-దయాళుకాస్తి" అని సువర్ణమాల అనగానే,నే
  ముక్కున వేలేసానురా ఓ తిక్క శంకరా.

om nama sivaaya-50


 

 ఓం నమః శివాయ-52
 ****************


 చంద్రుని అమృతధారలు ఔషధములను ఇస్తే
 చమత్కారివై నేను గొప్ప వైద్యుడనంటావు

 సూర్యుడు నేరుగా పత్రహరితమును అందిస్తే
 సూటిగా  నేనే హరికేశుడనని అంటావు

 డమరుకము అనవరతము అమరనాదమును చేస్తుంటే
 డాంబికముతో  నేనే గొప్ప గురువునని అంటావు

 గంగమ్మ జీవనదిగా జలధారలను ఇస్తే
 దగాకోరువై నేనే ధాన్యరాశి నంటావు

 పదములకడ ప్రమథగణము పరిచర్యలు చేస్తుంటే
 పనిచేయకనే నేను పరిపాలకుడనంటావు

 సొమ్మొకడిది-సోకొకడిది అన్నారు ఇదేనేమో
 పక్కా మోసగాడవురా ఓ తిక్క శంకరా.


 చంద్రుడు-సూర్యుడు-డమరుకము-గంగమ్మ-ప్రమథగణము కష్టపడుతుంటే,శివుడు వాటి శ్రమను ప్రస్తావించకుండా,అన్ని పనులను తానే చేస్తున్నానని గొప్పదనము తనకు ఆపాదించుకుంటాడు.-నింద.

 చంద్రుడు నమః శివాయ-సూర్యుడు నమః శివాయ
 ధాన్యము నమః శివాయ-ధ్యానము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ

 " నమ ఉర్వర్యాయచ ఖల్యాయచ" రుద్ర నమకం.

 ధాన్యరూపమున భూమినుండి పుట్టిన రుద్రునకు నమస్కారములు.అంతేకాదు ధాన్యమును నూర్చెడి భూమిలో పశువులను కట్టుటకు పాతిన గుంజ రూపమున నున్న రుద్రునకు నమస్కారములు.సదాశివా నీ మా శ్రేయస్సుకై ధాన్యముగా మారుతావు.ఆ ధాన్యోత్పత్తికి సహకరించు సూర్యచంద్రులుగాను మారతావు.అంతే కాడు ప్రణవ స్వరూపా నీ డమరుక నాదము సర్వవేదములను సంపదలను మాపై వర్షించుట నీ అనుగ్రహమేకదా తండ్రీ.మా బాగోగులను పరిశీలిస్తు మా శారీరక-మానసిక ఆరోగ్యమునకి సర్వదా జీవమనే ఔషధమును మాపై కురిపిస్తు,వైద్యుదవై మమ్ములను శక్తివంతులను చేయుచున్న వైద్యనాధా ప్రణామములు తండ్రీ.నీవు చేయని పనిఏది-నిన్ను ప్రస్తుతించగల పలుకేది.కనుక మేము ఏ విధముగా నిన్ను స్తుతిస్తే దానిని సమగ్రముగా భావించి,మమ్ములను సంరక్షించు శివా.నమస్కారములు.-స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.








OM NAMA SIVAAYA-49

ఓం నమ శివాయ-49
***************

  ముక్కంటినిన్ను ముద్దాడ నే మూఢునిగా మారాలా
  ఇక్కట్లను కలిగించిన నిగమశర్మ ధర్మంలా

  గరళ కంఠుని దయకై నే గంగలో మునగాలా
  విశ్వమంత జ్వాలలతో విషమును విరజిమ్మాలా

  కపర్ది కనికరమునకై నే కైలాసము చేరాలా
  ఆర్ద్రతతో నినదించే రుద్రవీణ నాదములా

  నిటలాక్షుని వీక్షణకై నేను నిర్దయతో ఉండాలా
  పశుపక్షుల వేటాదగ సంధించు  శరములా

  పరమేశా నీ పాదమును చేర నే పాపిలా మారాలా
  అణువణువు అతినీచపు పనుల గుణనిధిలా

  పాడిలేని వాడవై నన్ను రాపాడుతున్నను,నా
  హక్కు వదులుకోనురా  ఓ తిక్క శంకరా.


OM NAMA SIVAAYA-48


  ఓం  నమః శివాయ-48
  ******************

  మాతంగపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి
  గణపతి అవతరించాడు కరివదనముతో

  అశ్వపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి
  తుంబురుడు వచ్చాడు గుర్రపు ముఖముతో

  నాగపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి
 పతంజలి వచ్చాడు పాము శరీరముతో

  వానర పతిగ నీవుంటే ఏదిరక్షణ వాటికి
  నారదుడు వచ్చాడు వానర ముఖముతో

  సింహపతిగ నీవుంటే ఏదిరక్షణ వాటికి
  నరసిమ్హుడు వచ్చాడు సింహపు ముఖముతో

  పశుపతిగా నీవుంటే అశువుల రక్షణ లేకుంటే
  ఇంకెక్కడికి పోవాలిరా ఓ తిక్క శంకరా.
OM  NAMA SIVAAYA--48

OM NAMA SIVAAYA-47


  ఓం నమః శివాయ-47
 ******************
  కన్నుల నిప్పులు రాలచ కరుణ ఎట్లు అగునురా
  కరమున పుర్రెను దాల్చిన వరదహస్తమా అది

 గళమున గరళము నిలిపి మంగళమనమంటావు
 పాములను చుట్టుకొని మా సామివి నీవంటావు

 గంగ నీత్తిమీద ఉన్న తీరిన బెంగయా అది
 విషమరూపుడా నిన్ను అనిమిషుడంటున్నారు

 అసురభయముతో నున్నగాని శూరుడవని అనుకుంటు
 తాండవముతోనే దుష్ట తాడనమును చేస్తావట

 కనులు తెరిచిన కదనము-కనులు మూసిన ప్రణవము
 కనులపండుగ ఏది నిన్ను చూడ కనులు కాయలు కాచిన

తనకు తోచిన తీరే-మమ్ము తరియింపచేయడని ఒక్కడినే

 దిక్కుతోచక నున్నారురా ఓ తిక్క శంకరా.

OM NAMA SIVAAYA--46


  ఓం నమః శివాయ-46
  ***************

 రూపివా/అరూపివా/అపురూపివా? శివా నీవు
 కన్నతండ్రిని చూడ నే కాశిపోవ కానరాడు

 దేవతల మోహమడచ మొదలు-చివర కానరాడు
 చిదంబరము పోయిచూడ చిన్నగను కానరాడు

 అటుచూడని-ఇటుచూడని ఆటలెన్నో ఆడతాడు
 నింగిలోకి సాగుతాడు-నేలలో  దాగుతాడు

 అగ్గినంటి ఉంటాడు-గాలినేనే అంటాడు
 జ్యోతిని నేనంటాడు-ప్రీతిని నీకంటాడు

 ఈ వలసలు ఎందుకంటే చిద్విలాసమంటాడు
 దాగుడుమూతలు ఆడుతు  పట్టుకోమంటాడు

 సుందరేశ్వరడునంటాడు ముందున్నానంటాడు
 ఒక్కరూపునుండవేమిరా ఓ తిక్కశంకరా.

OM NAMA SIVAAYA-45


 శివాయ గురవే నమః-42
 ******************
గడ్డి పరకలతో చేసే బహుదొడ్డవైన పూజలు
మే,మే అని స్తుఇంచే మేకతల రుద్రాలు
కమ్ముకోను మేమనే నమ్ముకున్న తుమ్మిపూలు
ప్రత్యర్థుల బెదిరింపుకు పుట్టమైన పులితోలు
తప్పనిసరి ఐతేనే విచ్చుకునే కన్నులు
పరుగుతీయలేనట్టి మృగమున్న చేతివేళ్ళు
అమ్మ బాబోయ్ చలి అంటు మూతపడ్డ గుడులు
హద్దులు మీరుతు ఆకాశాన్నితాకే జడలు
దుమ్మెత్తిపోస్తుంటే గమ్మత్తుగ నవ్వులు
పాడుబడ్డగుహనున్నావని పాడుచున్న భక్తులు
పరిహాసాస్పదుడవగుచు పరమ శివుడు నేనంటే
ఫక్కున నవ్వుతారురా ఓ తిక్క శంకరా.
............
చులకనయైన గడ్డిపోచ పూజలు,మేకతల పలికెడి మే మే మంత్రాలుకప్పుకున్న పులితోలు,ఎప్పుడు మూసిఉండే కన్ను ,ఆరునెలలు మూసిఉండే గుళ్ళు,హద్దులులేని జటలు,దుమ్మెత్తిపోసే జనాలు,ఉంటున్న పాడుబడ్డ గుహలు నిన్ను పరమ శివుడు అంటే పగలబడి నవ్వుతారు-నింద

  మేక నమః శివాయ-మేథ నమఃశివాయ
  గుడులు నమహ్శివాయ-గురుతు నమః శివాయ

 నమః శివాయ నమహ్ శివాయ ఓం నమః శివాయ 

 " నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః"--రుద్రనమకం.
  లేతపచ్చిగడ్డివలె ఎరుపు-పసుపు కలిసిన కాంతితో ప్రకాశించు రుద్రునకు నమస్కారములు.ఉపాసకులకు జీవన్ముక్తికి మార్గమును చూపు శివునకు నమస్కారములు.

 "అనంత సంసార సముద్రతార
 నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం
 వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం
 నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం."
    (గురుపాదుకా స్తోత్రము)

 అంతులేని సంసారమను సముద్రమును సాటుటకు నౌక వంటివి,పెద్దల పట్ల గొప్పభక్తిని కలిగించునవి,వైరాగ్య సామ్రాజ్యమునొసగునట్టి పూజ్య పరమేశ్వర పాదపద్మములకు మరల మరల నమస్కరించెదను.

  భూయో భూయో నమామ్యహంస్తుతి.

ఏక బిల్వం శివార్పణం.

OM NAMA SIVAAYA-44

ఓం నమ: శివాయ
శ్రీ కాళి విశ్వేశ్వర ఆలయములో స్పటికలింగ స్వామివి
కాళేశ్వర క్షేత్రములో రెండులింగాల స్వామివి
భీమేశ్వర క్షేత్రములో రెండురంగులున్న స్వామివి
కొత్త కొండ క్షేత్రములో కోరమీసాల సామివి
కాకాని క్షేత్రములో కరుణామయ లింగ స్వామివి
కోటప్ప కొండలో త్రికూటేశ్వర స్వామివి
అమరావతి క్షేత్రములో అతి పొడుగు స్వామివి
పలివెల క్షేత్రములో కొప్పు లింగేశ్వర స్వామివి
గుడిమల్లన క్షేత్రములో పురుషాంగపు స్వామివి
విరూపాక్ష పురములో అర్థనారీశ్వర స్వామివైతే
ఎక్కడరా నీ మూలము ఓ తిక్క శంకరా.
.............................................................................................................................................................................................................................కార్తీక సోమవారముకదా మనసారా శివుని మూలరూపమును పూజించవలెనని మూలమూర్తికై వెదుకుచున్న భక్తునికి వివిధ ప్రదేశములలో వివిధ రూపములలో దర్శనమిస్తూ తికమక పెడుతున్నాడని నింద.నిరాకార నిరంజనుడిగా తన ఉనికిని చాటిచెప్పుచున్నాడు.ఏ రూపమైన అది అపురూపమైన భగవద్రూపమని భవతరణమని స్తుతి. 
తక్కువ చూపు

OM NAMA SIVAAYA-43

ఓం నమ: శివాయ-34
*******************

నీకు పూజచేస్తే పున్నెమని విన్నానురా,వినయముతో
కాళ్ళుచేయి కడుగ నీళ్ళకెలితే గంగ కస్సుమన్నదిరా
"స్నానమెట్లు చేయిస్తు" సముదాయించర గంగను

"నిన్ను కూర్చోమనగానే" వేటకై తుర్రుమన్నదిరా పులి

"జందెమైన ఇద్దమన్న" చరచర పాకింది పాము

"కట్టుకోను బట్టలన్న" కనుమరుగయింది కరి

"నైవేద్యము చేయబోవ" విషజంతువులన్ని మాయము

వెతుకులాడి వెతుకులాడి" వేసారితిరా శివా"
అక్కజమేముందిలే నీ అక్కర తీరిందేమో
ఒక్కటైన కలిసిరాదు "చక్కనైన పూజసేయ"

వాటికి తక్కువేమైనదని ఒక్కటైనగాని నిన్ను
 లెక్కచేయదెందుకురా ఓ తిక్కశంకరా.

ఓ శివా! భవహరమగు నీ పూజ భయావహము అగుచున్నది.-నింద.అర్ఘ్య,పాద్య,ఆచమనీయ అభిషేకములు చేద్దామంటే గంగ ఇష్టపడుటలేదు.నిన్ను కూర్చోమనగానే తన చర్మము అడుగుతావని పులి పారిపోయింది.జందెమును ఇద్దామంటే పాము చర చర పాకి మాయమైనది.బట్టలిద్దామనుకోగానే ఏనుగు భయపడి పారిపోయింది.నైవేద్యము సమర్పించుకుందామంటే విష జంతువులన్నీ పరుగో పరుగు.శివ పూజకు ఏవీ సహకరించుట లేదు.-నింద.

 సుముఖం నమః శివాయ-విముఖం నమః శివాయ
   సుగుణం నమః శివాయ-సుకృతం నమః శివాయ


  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ




  శివా నీ అనుగ్రహముచే నా అజ్ఞానము తొలగుచున్నది. (శివానందలహరి)

 " కరస్థే హేమాద్రే గిరిశ నికటస్థే ధనవతౌ
   గృహస్థే స్వర్భూజమర సురభి చింతామణిగణే
   శిరస్థే శీతాంశౌ చరణ యుగలస్థేఖిలశుభే
   కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః."

 స్వామి! నీ చేతిలో బంగరు కొండయున్నది.నీ వద్దే కుబేరుడున్నాడు.కల్పవృక్షం-కామధేనువు-చింతామణి నీ ఇంటిలోనే ఉన్నవి.నీ తలపై చంద్రుడున్నాడు.సమస్త శుభములు నీ పాదములను ఆశ్రయించుకొని యున్న సమయమున శంకరా! నా మనస్సు తప్ప నేను నీకేమివ్వగలను? -స్తుతి.
 మేరుపర్వతము విల్లుగా కలవాడు-వైశ్రవణుని ఐశ్వర్యవంతుని గా అనుగ్రహించినవాడు,కల్పవృక్షము కామధేనువు-చింతామణి తన వద్దనే కలవాడు అన్నింటికిని మించి,సర్వశుభములను పాదాక్రాంతము చేసుకొనిన పరమేశ్వరుని నిశ్చల మనముతో స్తుతించెదను.
   .




( ఏక బిల్వం శివార్పణం )




OM NAMA SIVAYA-42

నీ పిరికితనమును చూసి నీ నామము భయపడింది
 ఎందుకైన మంచిదని పొంచి పొంచి దాగినది

 రెండు వేదముల మధ్య యజుర్వేదమును పెట్టినది
 యజుర్వేద మధ్యలో రుద్రాధ్యాయమును చూసినది

 అష్టమ వాకము రక్షణ అని సుస్పష్టము చేసినది.
 రక్షణదాయినిగా పంచాక్షరిని పట్టుకుంది

  రెండక్షరముల దాచలేని దైవము నీవేనంది
 పంగ నామము పెడతావని నీనామము  అనుకుంటోంది

 గంగపాలు చేస్తావేమో నన్ను నీ చేతకానితనముతో
 ఆది మధ్యాంత రహితుడా వాదనలేలర కావర


 ఇన్నాళ్ళు నమ్ముకున్న నన్ను ఇప్పుడు కాదంటే 
 ఎక్కడికి పోవాలిరా ఓ తిక్క శంకరా
.....................................................................................................................................................................................................నీ వీరత్వము మీద నమ్మకములేక "శివ"అను నీ పేరు వేదముల మధ్యనున్న యజుర్వేద మధ్యలోనున్న ,రుద్రాధ్యాము మధ్యలోనున్న అష్టమవాకమున చేరి,ధైర్యము చాలక "నమ:"అయ" అను రెందింటి మధ్య దాగినది నింద

.శివ అను నామము వేదపూజ్యమై,వేదనను పూజ్యము(సున్న)చేయుచున్నది స్తుతి.
.

OM NAMA SIVAAYA-41

ఓం నమ: శివాయ

" అనిశము వశమగుతావు" పశునామములకు నీవు
"పశుపతి" అని పిలువగానే పరవశమేగా నీకు

"కాల భైరవుని" కాశికాపురపతిని చేసావు
"శరభమువై" నరసిమ్హుని శాంతింప చేసావు

మిక్కుటమగు ప్రేమగల "కుక్కుటేశ్వరుడివి" నీవు
వ్యాళము మీద మోజుగల "కాళేశ్వరుడివి" నీవు

"స్కంధోత్పత్తికి" వనమున లేడిగ క్రీడించావు
వ్యాఘ్రమునకు మోక్షమిచ్చి "వ్యాఘ్రేశ్వరుడివి" అయ్యావు

జంబుకమును అనుగ్రహించిన " జంబుకేశ్వరుడివి"

శ్రీ,హస్తి,కాళములను దయ తలచిన "శ్రీ కాళ హస్తీశ్వరుడవు"

" పాశమేసి" నన్ను బ్రోవ రమ్మంటే,నా భక్తిని
"కప్పల తక్కెడ" అంటావురా ఓ తిక్క శంకరా.

భావము
శివుడు పశుపతి కనుక పశువులన్నా, పశునామములన్నా మిక్కిలి ఇష్టము.కనుక కోడిగానో,పాముగానో,నక్కగానో,కుక్కగానో, పులిగానో, శరభముగానో , దర్శనమిస్తుంటాడు.".శ్రీకాళ హస్తీశ్వరుడిగా" భక్తులను అనుగ్రహిస్తున్నాడు.కాని నర రూపమున నున్న భక్తుని, (నన్ను) అనుగ్రహించమంటే,నా భక్తి నిశ్చలమైనది కాదంటున్నాడని-నింద.
పశువు అంటే జంతువులు,క్రిమి కీటకములు మాత్రమే కాదు.మోహ పాశము,తక్కిన బంధములచే బంధింపబడిన మానవులు సైతము పశువులే.భక్తితో పరమేశ్వరుని కొలిచిన కరుణ అను పాశముతో మనలను కటాక్షించు( ను) "పశుపతి" అయిన పరమేశ్వరుడు. -స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం) 

OM NAMA SIVAAYA-40

ఓం నమ: శివాయ-36
***************

తిరుగుచున్న భూమి అనే తీరులేని "రథముతో"
నారి కట్టలేని మేరుకొండ అనే" వింటితో"

చేతి నుండి జారిపోవు కోతి అనే" అస్త్రముతో"
ఎదుటిసేన కాంచలేని" ఎగుడు దిగుడు కన్నులతో"

బారెడైన కప్పలేని కరిచర్మపు " కవచముతో"
పుర్రెతప్ప మోయలేని "కుర్రదైన చేతితో"

వీరముపై నీళ్ళుజల్లు " నెత్తిమీద కుండతో"
శత్రువుల మూలమెరుగలేని "శూలముతో"

పురములు దగ్గరైన" రిపుజయ శాపమున్న వారితో"
నేనెవరో తెలుసా అంటూ నీవు" డంభముతో"

లోహ త్రిపురులను జయించి " ఆహా అనుకుంటుంటే" నేను
"బిక్కమొగము" వేసానురా! ఓ తిక్క శంకరా.


శివుని రథమునకు కుదురులేదు.వింటికి నారి కట్టుట కష్టము.బాణములకు నిలకడ లేదు.బేసి కన్నులతో గురి చూచుట సాధ్యము కాదు.చేయి బలమైనది కాదు.నీ పౌరుషమనే అగ్నిపై నెత్తిమీది గంగమ్మ నీళ్లు చల్లుతుంది.శూలమునకు పదును లేదు.మూడు పురములు దగ్గరైన ఓడిపోవుదురను శాపమున్నవారిని ఓడించానన్నది శివుని పరాక్రమము-నింద.


  సహనం నమః శివాయ-సమరం నమః శివాయ్
  త్రిపురం  నమః శివాయ-త్రిగుణం నమ: శివాయ.

  " నమో దుందుభ్యాయచ-హనన్యాయచ" రుద్ర నమకం.

  భేరి యందు శబ్దరూపమున పుట్టినవానికి,దానిని వాయించు దండనమునందు తాడన రూపమున నున్న వానికి నమస్కారములు.

 "నమో ధృష్ణవేచ ప్రమృశాయచ" శతృసైన్యముల బలాబలములను తెలుసుకొనువాడును,యుధ్ధమునందు వెనుదిరుగని వానికి నమస్కారములు.


 తారకాసురుని కుమారులైన తారకాక్షుడు-కమలాక్షుడు-విద్యుత్మాలి బ్రహ్మ గురించి ఘోర తపస్సును చేసి,బ్రహ్మచే విచిత్రమైన వరమును పొందిరి.మృత్యువును జతించుట జరుగని పని కనుక రథముకాని రథముపై,అస్త్రము కాని అస్త్రముతో తప్ప వారికి మరణము లేని వరమును పొందిరి.వారు మూడు పురములను కూడ పొంది తున్నారు.అవి బంగరు-వెండి-ఇనుముచే చేయబడినవి.అవి దగ్గరకు జరుగనంత కాలము వారికి మరణము లేదు.వారు దుష్కృత్యములతో ధర్మమునకు గ్లాని కలిగించసాగిరి.

  ధర్మ సంస్థాపనకై భూదేవిని రథముగాను,సూర్య-చంద్రులను రథచక్రములుగాను,వేదములను గుఱ్ఱములుగను
,బ్రహ్మను రథచోదకునిగను,మేరుపర్వతమును విల్లుగాను,ఆదిశేషువును నారి తాడుగాను ఏర్పరచి,నారాయణుడు తానే స్వయముగా ప్రకటించుకొని,పరమేశ్వరునితో యుధ్ధము చేయించి,త్రిపురులకు మోక్షమును ప్రసాదించెను.-స్తుతి.(శివ మహా  పురాణము)











కరుణ తప్ప కాఠిన్యము లేని శివుని పరాక్రమము మనలో త్రిగుణములైన సత్వ,రజో,తమో గుణములను జయించి శివజ్యోతిని దర్శింప చేస్తుంది.-స్తుతి.

( ఏక బిల్వం శివార్పణం ) 

OM NAMA SIVAYA--39

నీ పిరికితనమును చూసి నీ నామము భయపడింది
 ఎందుకైన మంచిదని పొంచి పొంచి దాగినది

 రెండు వేదముల మధ్య యజుర్వేదమును పెట్టినది
 యజుర్వేద మధ్యలో రుద్రాధ్యాయమును చూసినది

 అష్టమ వాకము రక్షణ అని సుస్పష్టము చేసినది.
 రక్షణదాయినిగా పంచాక్షరిని పట్టుకుంది

  రెండక్షరముల దాచలేని దైవము నీవేనంది
 పంగ నామము పెడతావని నీనామము  అనుకుంటోంది

 గంగపాలు చేస్తావేమో నన్ను నీ చేతకానితనముతో
 ఆది మధ్యాంత రహితుడా వాదనలేలర కావర


 ఇన్నాళ్ళు నమ్ముకున్న నన్ను ఇప్పుడు కాదంటే 
 ఎక్కడికి పోవాలిరా ఓ తిక్క శంకరా


..నీ వీరత్వము మీద నమ్మకములేక "శివ"అను నీ పేరు వేదముల మధ్యనున్న యజుర్వేద మధ్యలోనున్న ,రుద్రాధ్యాము మధ్యలోనున్న అష్టమవాకమున చేరి,ధైర్యము చాలక "నమ:"అయ" అను రెందింటి మధ్య దాగినది నింద

 వేదము నమః శివాయ-వేలుపు నమః శివాయ
 నామము నమః శివాయ-నాథుడు నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


" పంచాక్షరీ శివ వేదేన విభాతి నిత్యం
  రుద్రస్తయా స్పురతి తేన చతుర్థ కాండః
  కాండేన తేన యజురేవ విభాతి నిత్యం
  ఋక్సామమధ్య మణినాచ విభాంతి వేదాః"

  పంచాక్షరీ మంత్రము శివ పదముచేత ప్రకాశించుచున్నది.అట్టి శివపంచాక్షరిని పేశంసించి నిర్దేశించుటచే రుద్రాధ్యాయము ప్రశస్తమగుచున్నది.అట్తి రుద్రాధ్యాయముచే తైత్తరీయ సంహిత చతుర్థ కాండము మహిమాన్వితమైనది.శివా నీ నామమునకు స్థానములై,యజుర్వేద-ఋగ్వేద-సామవేదములు సన్నుతింపబడుచున్నవి.శివా నీ దివ్య నామము వేదములనే ప్రకాశవంతము చేసినది.నిరంతరము దానిని జపించే భాగ్యమును అనుగ్రహింపుము.-స్తుతి.

శివ శివ శివ యనరాదా-శివనామము చేదా

 శివ పాదము మీద నీ శిరసునుంచ రాదా .( శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు)




































   











.శివ అను నామము వేదపూజ్యమై,వేదనను పూజ్యము(సున్న)చేయుచున్నది స్తుతి.
.

OM NAMA SIVAYA-38



మౌనము మాటాడునట మాయేదో చేసావులే
 మేథా దక్షిణా మూర్తిగా బోధించేది మాయేలే

 మూగయు మాటాడునట మాయేదో చేసావులే
 మూక పంచశతిగా కీర్తించేది మాయేలే

 కాళ్ళకింద పద్మాలట మాయేదో చేసావులే
 పద్మపాదుడు అతడట గురుభక్తి మాయేలే

 పూవులే పళ్లట మాయేదో చేసావులే
 పుష్పదంతుడు అతడట పుణ్యాల మాయేలే

 బోడిగుండు శివుడట మాయేదో చేసావులే
 శంకర భగవత్పాదుడట శంక లేనే లేదులే

 మాయా సతిని చూసి అమ్మయ్య అని నీవు మోస్తుంటే,నే
 బిక్కచచ్చి పోయానురా ఓ తిక్క శంకరా.


  శివుడు మౌనముగానే జ్ఞానమందించే అతీతశక్తులు కలవాడనని చెప్పుకుంటాడు.మూగవానిని మాట్లాడించగలను అని కూడ అంటాడు.అంతే కాదు గంధర్వుని శాప పరిహారమునకై వాని దంతములను సుగంధభరితములు చేసానని చెబుతాడు,పెద్దప్రవాహములో తనను నమ్మి నడుచు భక్తుని పాదముల క్రింద పద్మములను సృష్టించానని తనకు శ్రీ శంకర భవత్పాదులకు భేదములేదని,ఎలా ఎన్నో-ఎన్నెన్నో మాయమాటలు చెప్పే మొసగాడు.కనుకనే దక్షయజ్ఞకుండమునుండు ప్రభవించిన మాయాసతికి-మాత సతికి తేడాను గుర్తించలేక మాయా మోహితుడై భుజము మీదికెక్కించుకొని మోయుచున్న మోసగాడు.-నింద.

మౌనం నమః శివాయ- ధ్యానం నమః శివాయ
మోహం నమ:శివాయ-మోక్షం  నమః శివాయ.

నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే.

అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపురే మహాలక్ష్మీ, మాధుర్యే ఏకవీరికా.

ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా, ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే.

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగల్యగౌరికా.

వారాణస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సరస్వతీ, అష్టాదశ సుపీఠాని యోగినా మపి దుర్లభమ్.

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వ శత్రువినాశనం, సర్వ హరం దివ్యం రోగ సర్వ సంపత్కరం శుభం.


................................................. శివుని మౌన వ్యాఖ్య,మూక పంచశతి,పద్మపాదుడైన సునందుని స్తుతి పుస్పదంతుని భక్తి,సాక్షాత్ శివ స్వరూపమైన ఆది శంకరుని స్తోత్రములు శివుని పూజనీయుడిని చేస్తున్నాయని స్తుతి
శివుడు మాయామోహ పూరితుడై దక్షయజ్ఞ కుండమునుండి తిరిగి వచ్చిన మాయా సతిని ,తన భార్య అనుకుని మోసుకెళ్లాడని నింద.
అలా శివుడు మాయ నటించినది అష్టాదశపీఠ ఆవిర్భావమునకు అని స్తుతి.

OM NAMA SIVAAYA-37


   ఓం  నమః శివాయ-43
   *******************

దారుణ మారణ కాండను కారుణ్యము అంటావు
పొట్ట చీల్చి గజాసురుని మట్టి కరిపించావు
చుట్టుకుంది అతని తల నీ సుతు శరీరమునే
కన్ను తెరిచి మన్మథుని కన్ను మూయించావు
కన్నుల పండుగ ఐనది నీ కళ్యాణముతో
బాణమేసి వరాహము ప్రాణమే తీసావు
పాశుపతము చేరినది అర్జునునికి ఆశీర్వచనమై
హరిని అస్త్రముగా వాడి త్రిపుర సమ్హారము చేసావు
విరచితమైనది వీరముగా హరి మహిమ
ఎటు చూసిన పాతకమే నీ గతముగా మారితే
నీకు "మహాదేవం,మహాత్మానాం,మహా పాతక నాశనం" అని స్తుతులా అంటే
చక్క బరచుట అంటావురా ఓ తిక్క శంకరా.
భావము
శివుని గతము అంతా పాపమయము-నింద.చెడును దునిమాడాననుకొని తానే నష్ట పోతూ ఉంటాడు.పొట్ట చీల్చి గజాసురుని చంపాననుకుంటే ఆ ఏనుగుతల తనకొడుకుని చుట్టుకొంది.మన్మథుణ్ణి జయించాననుకుంటే,ఆ బాణమునకు లొంగి పార్వతీపతిగా మారాడు.పందిని గెలిచాననుకుంటే,పాశుపతమును పోగొట్టుకున్నాడు.త్రిపురాసురులను జయించాననుకుంటే,ఆ ఘనత అస్త్రముగా మారిన హరికి దక్కింది.ఇలా ప్రతిసారి శివుడు తాను గెలిచాననుకుంటూ,ఓడిపోతూ ఉంటాడు-నింద.


 బాణము నమః శివాయ-ప్రాణము నమః శివాయ
 గతము నమః శివాయ-పాతకము నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ

 "నమో మృగయభ్యశ్శ్వనిభ్యశ్చవో నమః" రుద్రనమకం.

వేటాడు వారికొరకు వారిరూపమున నున్న రుద్రునకు నమస్కారములు.మృగములను చంపుటకు వానిని సమీపించు రుద్రుడా కొంచము ఆగు స్వామి.నాదొక విన్నపము.



 " స్వామిన్నాది కిరాత మామక మనః కాంతార సీమంతరే
   వర్తంతే బహుశో మృగా"  శివానంలహరి.

  ఓ ఆదికిరాతకుడా! నీవు అటు-ఇటు పోకుము. నా మనసనే మహారణ్య ప్రాంతములో మాత్సర్యము-మోహము మొదలగు మదించిన మృగములు విచ్చలవిడిగ సంచరించుచున్నవి.మృగయాసక్తుడవైన ఓ శివా! వేట అనే నీకు ఆనందకరమైన వినోదముతో వాటిని చంపి,నన్ను ఉధ్ధరింపుము.--స్తుతి.


( ఏక బిల్వం శివార్పణం)

OM NAMA SIVAAYA-36



ఓం నమ: శివాయ-35***************


కొండమీద నీవున్నావని కొలువగ నేవస్తే
బండరాయి కూడ నిన్ను తనతో పోల్చుకుంది


బావిలోన నీవున్నావని భక్తుడిగా నేవస్తే
బావిలోని కప్ప నిన్ను తనతో పోల్చుకుంది

బీడునేల నీవున్నావని తోడు కొరకు నేవస్తే
జోడువీడు అంటు బీడు తనతో పోల్చుకుంది

అటవిలోన ఉన్నావని అటుగా నేవస్తే
జటలు చూడు అంటు అడవి తనతో పోల్చుకుంది

చెట్టులోన ఉన్నావని పట్టుకొనగ నేవస్తే
పట్టులేక ఉన్నావని చెట్టు తనతో పోల్చుకుంది

సఖుడివి నీవై సకలము పాలిస్తుంటే
ఒక్కరైన పొగడరరేర ఓ తిక్క శంకరా.

భావము

శివుడు కప్ప వలె బావిలో,బండరాయిలా కొండ మీద, బీడు నేలలా పొలములో,జటలతో ఊడలమర్రిలా ,,అడవిలొ పటుత్వము లేని మద్ది చెట్టులా ఉన్నాడని నింద


 బీడు నమః శివాయ-తోడు నమః శివాయ బండ నమః శివాయ-అండ నమః శివాయ
  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

" నమః కూప్యాయచావట్యాయచ"
  రుద్రనమకం.
  బావులలోని జలములయందున్నవానికి,పల్లము స్థలముయందున్న వానికి నమస్కారములు.బావి లోని నీరు నిర్మలముగా ఉంటుంది.పల్లపు నీరు మలినముగా ఉంటుండి.రుద్రుడు నిఎర్మలమైన నీటిలోను-మలినమైన నీటిలోని సర్వసమానత్వమును పాటిస్తు ఉంటాడు.అదే విధముగా సజ్జనులను మందభాగ్యులను కనికరిస్తుంటాడు.

 
 "అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే" రుద్ర చమకము.
     పరమేశ్వరా సర్వము నీవై శోభించుచున్నవాడ! నాకు నా ప్రయత్నమును సమర్థవంతము చేసికొనుటకు నాకు రాళ్ళు-మట్టి-పర్వతములు-చెట్లు మొదలగు బానిని అనుగ్రహింపుము అని సాధకుడు రుద్రుని అర్థించుచున్నాడు.






  " గుహాయాం గేహేవా బహిరపి వనే వాద్రి శిఖరే    జలేనా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలం    సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ వదే    స్థితం చేద్యోగోసౌ స చ పరమ యోగీచ స చ సుఖీ."
శివానందలహరి..
      చిత్తునందు చిత్తము నిలుపని వాడు గుహలలో-అడవిలో-పర్వతశిఖరములలో-నీటిలో-అగ్నిలో-ఎక్కడెక్కడో నిన్ను వెతుకుచున్న ఏమిలాభము? ఎవడి మనస్సు నీ పాదపద్మములయందు స్థిరముగా నుండునో అతడే సుఖప్రద గొప్పయోగి.-స్తుతి.

తనలో దాగిన కప్పకు ఆహారమును,ఉనికినిచ్చు బావి వలె,వజ్ర సంకల్పమైన రాయివలె,ఏ ఆకర్షణకు లోనుకాని నిశ్చలత్వము వలె,బీడుగా పైకి కనపడుచున్నను ఆర్ద్రతతో కడుపునింపు పంటచేను వలె,తన పిల్లలు అందుకొనుటకు కరుణ పాశమను తాటిని వేలాడదీయు జడల వృక్షము వలె,తీగెలకు ఆలంబనమైన మద్ది వృక్షము వలె శివుడు ప్రకాశించుచున్నాడు.-స్తుతి. 
   ఏక బిల్వం శివార్పణం.



















































 



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...