Saturday, September 30, 2017

CHIDAANAMDA ROOPAA-MOORKHA NAAYANAAR


 చిదానందరూపా-10



 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 తొండైనాడులో నుండెను పరమమూర్ఖ నాయనారు
 అన్నసంతర్పణములుచేసి అమితానందమునొందెడివాడు

 ఆస్తి కరిగిపోయింది, ఏమి చేస్తావని అడిగింది
 పస్తులు తానున్నా సంతర్పణ కొనసాగిస్తానన్నాడు

 జూద సంపాదన ధనము ఈశ్వరసేవా ఇంధనమైనది
 నిర్బంధ వ్యవహారమో,భవబంధ పరిహారమో ఇది

  న్యాయము ఏమొ  కాని ఇది నారద ఉపదేశమునందించినది
  శివసాయుజ్యమునొందగ జూదము కారణమాయెగ

  చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక
  చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక.

మురుగ్గ నాయనారుతొండైనాడులోని తిరువెర్కాడులో జన్మించెను.చిన్నప్పటి నుండి శివ భక్తుడు.శివ భక్తులకు మధుర పదార్థములను వడ్డించి,వారు తృప్తిగా తినుటనుశివారాధనగా భావించెడివాడు. కపర్ది పరీక్ష అనగా కలిమిహరించుకుపోయినది.కాని కలిమి దూరమైనను శివ సంతర్పణల చెలిమిని వీడలేదు. శివభక్తులకు అన్నసంతర్పణలు ఆగిపోలేదు..మంచుకొండవానిమీద భక్తి ధనార్జనకు మంచిచెడుల విచక్షణను చేయనీయలేదు.అన్ని దానములలో అన్నదానము గొప్పదని ఆర్యోక్తి.
శివ సంతర్పణములకు కావలిసినధనమునకై చతుషష్టి కళలలో ఒకటైన జూదమును ఎంచుకొని,నిష్ణాతుడైనాడు.మంచు కొంద దేవుని మీది భక్తి మంచి-చెడుల విచక్షనను మరచినది.అందరిని జూదమాడుతకు పిలువసాగాడు.రానన్న వారినినిర్బంధముచేయసాగాడు.ఎక్కువ సొమ్మును పందెముగా ఒడ్డమనే వాడు.ఓడిన,ధనమును నిర్దాక్షిణ్యముగా తీసుకోసాగాడు.
ధనమును ఈశ్వరార్చనకు ఉపయోగించెడివాడు.తనకొరకు అసలు వినియోగించెడివాడు కాదు.జూదగాడిని మెచ్చిన శివుడుగా సుందరారుచే కీర్తింపబడినాడు.వేదపురీశ్వర ఆలయములోమూర్ఖ నాయనారు విగ్రహము కలదు.కార్తీక మూలా నక్షత్రమునందు భక్తులచే పూజలందుకొనుచున్న నాయనారును అనుగ్రహించిన నాగాభరణుడు మనందరినిరక్షించునుగాక.

( ఏక బిల్వం శివార్పణం.)

CHIDAANAMDAROOPAA-TIRUMOOLANAAYANAR


 చిదానంద రూపా-9

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 అగణిత భక్తితత్పరుడు అగస్త్యమహాముని దర్శనార్థము
 అడుగులు వేయసాగె దక్షిణదిశగ,మార్గ మధ్యమున

 కావేరి స్నానమాచరించి,దేవర సేవకు బోవుచుండగా
 కాపరిలేడని గొల్లుమను గోవులమందను చూచె జాలిగా

 సకలదేవతా సాధుజీవులకు  సంతసమును తానందీయగ
 ప్రాణములేకయున్న మూలరు కాయము ప్రవేశించెగ

 చెట్టున పెట్టిన సాధుకాయము కనికట్టుగ మాయమాయె
 పరమపదంబును పొందగ పరకాయ ప్రవేశమె కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.

 తిరునంది దేవారు ఎనిమిది మంది శిష్యులలో ఒకరు తిరుమూల నాయనారు.మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేసినందుకు తిరుమూలారు అయినాడు.తిరుమూలారు అగస్త్యముని సందర్శనార్థము దక్షిణ దిశగా బయలుదేరాడు.కావేరీనదీ స్నానమును చేసి దైవదర్శనమునకు వెల్లుచుండగా,కాపరిని కోల్పోయి ఒక ఆవులమందవిచారముగా కన్నీరు కారుస్తూ కనిపించింది. గౌవాగ్ని అనునది శ్రుత వాక్యము. అగ్నితో సమానమైన గోమాత ఎలా ప్రభవించింది?ఒక సారి బ్రహ్మదేవుడు ద్వదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను,అష్ట వసువులను పిలిచి ఒకసంవత్సరము పాటు తీవ్ర తపస్సును చేసిన, తత్ఫలితముగా ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడును గాక.ముప్పదిమూడు కోట్ల దేవతల యొక్క పవిత్రత దానియందు నిక్షిప్తము అగుగాక అని దీవించిరి.వారి అచంచల తపోవైభవ విశేషమే గోమాత జననము.నిష్ఠా గరిష్టతతో అగ్నికార్యమునుచేయలేని వారికి,సులభముగా సుసంపన్నులగుటకు  గోసేవా భాగ్యము కల్పించబడినదన్న విషమును తెలిసిన ,.నాయనారు ఆవులను దుఖః విముక్తులను చేయ దలిచాడు. ఆది శంకరుల వారిని స్మరించి,నిష్కాముడై తన శరీరమును చెట్టు తొర్రలో పెట్టి మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేశాడు. కాపరిని చూసి గోవులు సంతసించాయి.గ్రామమునకు తిరిగి వెళ్ళిన నాయనారు,కాపరి భార్య చింతనను ఆధ్యాత్మికత వైపు మళ్ళించాడు.రావి వృక్షము క్రింద తీవ్ర తపమును ఆచరించాడు.సమాధి స్థితిలో మూడువేల సంవత్సరాలుండి,సంవత్సరమునకొకసారి బహిర్ముఖుడై ఒక పద్యమును చెప్పుచు,మూడువేల పద్యముల "తిరు మందిరము"ను అందించిన తిరుమూల నాయనారును అనుగ్రహించిన సదా శివుడు మనందరిని అనుగ్రహించు గాక.

 ( ఏక బిల్వం శివార్పణం.) 

Thursday, September 28, 2017

CHIDAANAMDAROOPAA-ADIPATTA NAAYANAARU

చిదానందరూపా-ఆదిపత్త బెస్త నాయనారు-9

 ఆదిపత్త బెస్త నాయనారు పరమ భక్తి వాత్సల్యముతో
 మడుగులో చేపలు పట్టిన వెంటనే,తన మనసు మెచ్చినవాడని

 ప్రతిదినమును వ్రతముగ ఒక మత్స్యమును సమర్పించెడివాడు
 ఏమాయెనొ  ఏమో మడుగున చేపలన్నియు వీనిని  మాయదారి జాలరివాడు

 మనలను కాపాడుకొందమనుచు  మడుగువీడి పోవగా,రోజుకొక
 మత్స్యము మాత్రమే వలలో పడుచుండెను,వాని పూజకు రివాజును పోనీయక

 భగ్గున కాముని కాల్చినవాడు,బెస్త భక్కిని నిగ్గును తేల్చగ
 పసిడి చేపను వలలో వేసెను నాయనారు ధర్మానురక్తిని దీవించగ

 తాత్సారముచేయక  పరవశంబున పసిడిచేపను పరమేశ్వరార్పణమును చేయగ
 విస్తారపు కరుణను పొందగ బెస్తకు కనకపు చేపయే కారణమాయెనట

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక.

"పత్రం-పుష్పం-ఫలం-తోయం' వీనిలో దేనినైనా భక్తితో సమర్పిస్తే,పరమేశ్వరుడు ప్రీతితో స్వీకరించి అనుగ్రహిస్తాడని పెద్దలు చెబుతారు.జలచరములైన జలపుష్పములను నిష్ఠగ సమర్పించి శివసాయుజ్యమును పొందిన బెస్త ఆదిపత్త నాయనారు."మత్స్య-కూర్మ-వరాహస్య-నారసింహస్య-వామన అన్న సూక్తినాధారముచేసుకొంటే ప్రళయానంతరము స్వామి ధరించిన మత్స్యావతారము అత్యంత మనోహరము.బాహ్యమునకు నాగ పట్టాణము దగ్గరనున్న నూలైపాడులో జన్మించిన ఆదిపత్త నాయనారు తాను పట్టిన చేపలలో ఒకదానిని క్రమము తప్పక శివనైవేద్యముగా నీటిలోని జారవిడిచేవాడు.సూక్ష్మమును చూస్తే హరిని సేవించి హరునికి దగ్గరగా చేర్చేవాడు.హరిహరతత్త్వమే ఆదిపత్త నాయనారు.
నిజ భక్తులను పరీక్షించుటయే నీలకంఠుని లీల.వరుసగ కొన్నిరోజులు ఆదిపత్త వలలో ఒకే ఒక చేప పడసాగింది.ఆహారమునుగురించి గాని,తనఆదాయమును గురించి గాని ఆలోచించకుండ నియమ ప్రకారము పడిన చేపను పరమేశ్వరార్పణము చేసేవాడు.పస్తులుండుటకుచింతించలేదు.పంతము అంతము చూడాలంటు త్రిపురాంతకుడు ఒకనాడు వలలో ఒకేఒక పసిడి చేపను పడవేసెను.ప్రలోభములను దరిచేరనీయకుండ
నిష్కళంక పూజగా దానిని పరమేశ్వరార్పణము చేసాడు నాయనారు.పరిణితి చెందిన భక్తిలో పరీక్షలకు తట్టుకునే శక్తి ఉంటుంది కదా.ఏ వేదంబు పఠించె లూత ,ఏ వేదంబు పఠించె ఆదిపత్త నిను చేర నిశ్చలభక్తి సోపానమని తెలియచేసిన ఆదిపత్త నాయనారును మెచ్చి అనుగ్రహించిన ఆ ఆదిదేవుడు మనందరిని ఆనుగ్రహించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)


TIRU KURIPPA TOMDA NAAYANAAR


 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 తిరుకురిప్ప తొండనాయనారు  నియమము
 రజకవృత్తియందే యతిరాజ భక్తి సంయమనము

 మాసిన బట్తల,మసిపూతల రేడు ఆ చాకిరేవులో
 నాయనారు వ్రతభంగము చేసినాడు జోరువానలో

 అపరాధము జరిగినదని ఆ బండరాయికే,తన
 తలనుబాదుకొనుటయే సరియనినాడు,వెంటనే

 తగదని,నిలుమని,కపర్ది కరుణించగ నాయనారు
 తరియించగ తడివస్త్రము కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.

రుకొరిప్పు తొండనాయనారు
వృత్తిరీత్యా చాకలి.స్వధర్మో నిధనో శ్రేయ: అను సూక్తిననుసరించి శివ భక్తుల అవసరములను గుర్తించి,వారి మలిన కౌపీనములను శుభ్రపరచి తిరిగి వారికి పరమానందముతో ఇచ్చెడివాడు.స్వధర్మములోనే స్వామి సేవా ధర్మమును మిళితము చేసికొనిన తొండనాయనారు భక్తిని పరీక్షించి,లోకారాధ్యునిగా చేయాలనుకున్నాడు.ఒకపేదశివయోగి వలె మలినవస్త్రములతో తొండనాయనారును సమీపించాడు.శివసేవా భాగ్యము లభించిన సుదినమని నాయనారు యోగినిసమీపించి,మలిన కౌపీనమును శుభ్రపరచుటకు అనుమతినివేడుకొన్నాడూ.తనకొకటే కౌపీనము ఉన్నందున(ధరించినది కాక) సంధ్యాసమయమునకు తన కౌపీనమును శుభ్రపరచి అందచేసెదెననిన అంగీకరింతునన్నాడు ఆ యోగి.సూర్య ప్రభల్తో చుర్రుమంటున్న వాతావరణమును చూసి,షరతుకు అంగీకరించాడు శివుడు.
" పవి పుష్పంబగు- అగ్ని మంచగు" అన్న ధూర్జటి మాట ప్రాపునకే కాదు పరీక్షకు కూడా నిజమే అవుతుంది. మన సక్కియనాయనారు రాళ్ళ పూజను పుష్పార్చనగా మార్చగలిగినది ఆ సదాశివుని కరుణయే కదా.ఉత్తర గర్భముననున్న పరీక్షిత్తుపై చేసిన దుష్ట ప్రయోగము మంటలు కక్కుతు అగ్ని వలె తాకబోవ పరమాత్మ తనలీలగా మంచుగా మార్చి శిశువునకు చల్లదనమును అందించెను కదా.విరోధాభాసమైన విశ్వేశ్వరుడు అదే విధముగా భానుని బాధ్యతను తొలగించి వరుణునికి వర్షించమన్నాడు.పరమేశ్వర లీలల పరమార్థమును తెలుసుకొనెననుట వెర్రిమాట.వజ్రము పువ్వుగా మారినట్లు శివుని లీలగా ఎండ వానయై కౌపీనమును తడిపేసినది.అన్నమాట నిలుపుకోలేదని తనతలను బండకు కొట్టుకున్న నాయనారును, అడ్డుకొని రక్షించిన అడ్డనామాలసామి మనందరిని రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)



CHIDAANAMDAROOPAA-MOORTI NAAYANAARU.

"న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః 
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం "

  చిదానందరూపా--మూర్తి నాయనారు
  ************************************
 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా

 డెందమున భక్తిమరందము చిందులువేయుచునుండ
 ఆనందపుచందనపుసేవ  ఆ  కపర్దికి చేరుచునుండ

 శివద్వేషిగ రాజు మతమార్పిడికోరెనాయె
 వినలేదని చందనమివ్వరాదని శాసనమిడె

 కాలకంఠుని ఆనతో కాలము వింతగ కఠినమాయెగా
 చేతిని చందనపుచెక్కగ మలచిన పంతము జటిలమాయెగా

 చయ్యనబ్రోవగ దలచినచిదానందుని మాయగ
 భక్తితో తీసినరక్తచందనమే కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలుగాక
 చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

   గంధము అనే భక్తిబంధమును భగవంతునికి బిగించిన భాగవతోత్తములో ఎందరో.ఉదాహరణకు"  గంధము పూయరుగా" అంటు త్యాగరాజు,"మృగమదా మోదాంకితం చందనం" అంటు
,"కుంకుమచందన లేపిత లింగము" అంటు ఆది శంకరులు,శ్రీకృష్ణునిచే "సుందరి" అని పిలువబడి
అతిలోక సుందరిగామారిన"కుబ్జ" మొదలగువారికి కైవల్యమును ప్రాప్తింపచేసినది వారు అలదిన చందనపు చందమే కదా!

 అసలు భగవంతునికిచందనమలదుటలోని అంతరార్థమేమిటి?గంధము పూయుటయేనా? అయితే ఆ గంధము ఎటువంటిది? ఎందువలన అంత మహిమాన్వితమైనది?

  కొంచము నిశితముగా పరిశీలిస్తే, లేడిపిల్లలా చెంగుచెంగున పరుగులు తీసే మన మనసును భక్తి అనే తాడుతో కట్టి స్థిరచిత్తమును చేయునదియే సాన.సర్వేశ్వరుని అనుగ్రహ గుణగణములు గంధపుచెక్క.నిత్య నిరంతర మననము అరగదీయుట.నిరంతర సాధనతో లభించిన సంస్కారములు సుగంధములై పరిమళములను వ్యాపింపచేస్తు,పరమేశ్వర సన్నిధికి మనలను చేరుస్తాయి.

  తన మోచేతిని గంధపుచెక్కనుచేసి నియమపాలను అను సానపై రక్తగంధమును తీసిన నాయనారును అనురక్తితో కరుణించిన చందనచర్చిత సాంబశివుడు మనందరిని కరుణించును గాక.

  ( ఏక బిల్వం శివార్పణము.)  
Attachments area


 

Wednesday, September 27, 2017

CHIDAANAMDAROOPAA-TIRUNAVUKKARASAARU

  చిదానందరూపా-తిరునవుక్కరసారు.6

  కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
  కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా

  మనసులోని చీకట్లను తరిమేసే మరుల్ నీకియారు
  అచంచల భక్తులలో అతనికెవరు  సాటిరారు

  వ్యాధి దరిచేరి అప్పారును రాజధిక్కారిగ మార్చినది
  కఠిన శిక్షరూపమై బండతో పాటుగ కడలిలో ముంచినది

  తేవారములే నాయనారును కడతేర్చే పరిహారములైనవి
  పశ్చాత్తాప పల్లవ గుణభారవీహారముగా  మార్చినది

  తిరువాయుమూరుకు  తిరిపెమెత్తువాడు రమ్మనుట
  వాగీశనాయనారు ముక్తికి వ్యాధియే  కారణమగుట

  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
  చిత్తముచేయు శివోహం  జపంబు నా చింతలు తీర్చుగాక.

  మరుల్ నీకియారు అనగా చీకట్లను పారద్రోలేవాడు.భావి సూచకముగా తండ్రి సార్థక నామధేయుడవుతాడని ఆ పేరును పెట్టారేమో.తల్లితండ్రులను కోల్పోయిన బాలుని అక్క తిలకవతి తల్లియై సాకింది.తిలకవతి శివభక్తురాలు.తమ్ముడు శివుని నమ్మకపోయినా శివ వైభవములను నిరంతరము చెబుతుండేది.మరుల్ నీకియారు శివ దూషణ చేస్తూ మూర్ఖ వాదనలను చేసేవాడు.ఇలా వుండగా శూలవ్యాధిసోకి ఎంత ప్రయత్నించినను తగ్గలేదు.నిరాశతో కృంగిన నాయనారు పశ్చాత్తాపముతో పరమేశుని పాదములను పట్టుకున్నాడు

. "భువంతయే వారివస్కృతాయౌషధీయాం పతయే నమో నమః" 



  సర్వ వ్యాధులను హరించు భిషక్కు (వైద్యుడు) పాదము పట్టిన వ్యాధిని ఉపశమింపచేశాడు.



   స్వామి కరుణను పొందిన నాయనారు అతిశయ భక్తితో తేవారములను కీర్తించుటను విని ఆకాశవాణి నాయనారును "తిరునవుక్కరసారు గా కీర్తించినది అనగా మధురమైన వాక్కు గలవాడు అని,వాగీశుడిగా కీర్తింపబడతాడని దీవించింది.

  కటాక్షించిన సామియే కఠిన పరీక్షను తలపెట్టినాడు.రాజోద్యోగులు మహరాజుకు నాయనారును అపరాధిగా,రాజద్రోహిగా చిత్రిస్తూ చాడీలు చెప్పారు.రాజు విచారనకు రమ్మంటే తిరస్కరించేటట్లు చేసాడు ఆ తిక్క సంకరుడు.కోపించిన రాజు రాజాజ్ఞ ధిక్కారమునకు శిక్షగా గుదిబండకు నాయనారును కట్టి సముద్రములో పడవేయమన్నాడు.వారు శిరసావహించారు.శివ శివ నీ లీలలు ఎంచ నేనెంతవాడిని.సంసారపు గుదిబండనుండి నన్ను విముక్తుని చేయదలచావా అంటు సాంబశివుని ప్రార్థించాడు.క్షిప్ర ప్రాది కరుణతో చవి పుష్పమయ్యింది .పూలపడవ గా మారిపోయింది.నాయనారును ఆశీర్వదించిన ఆ సదాశివుడు మనందరిని ఆశీర్వదించుగాక.

  ( ఏక బిల్వం శివార్పణం.

Monday, September 25, 2017

CHIDAANAMDAA-SAKKIYA NAAYANAAR


  చిదానందరూపా-5

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 శివపూజకు అనుమతిలేని  పాలనలో
 ఏమి తక్కువచేసెను   స్వామి లాలనలో

 కనపడులింగము పూర్వము తానును  రాయియే కదా
 ఆ రాయికి  రాతిపూజ అపూర్వపు సేవయే కదా

 దూషణలన్నియు చేరు నిన్నుప్రదోష పూజలుగ  చాలు చాలు
 భావము గ్రహియించలేని నిన్ను భజియించుట భావ్యము కాదు కాదు

 అనినను,లెక్కకుమించిన పున్నెము సక్కియ నాయనారుకు
 సదాశివుని కరుణను పొందగ విసిరిన రాళ్ళే కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.

  నిథనపతిని ప్రసన్నము చేసుకొనుటకుకావలిసినది భక్తి తత్పరత యను ధనము కాని బాహ్యాడంబరము కాదని నిరూపించినాడు సక్కియ నాయనారు అని పిలువబడే శాక్య నాయరారు. మగేశ్వరుని మానసపూజకు పాషాణమునకు -పారిజాతమునకు తారతమ్యములేదని తాదాత్మ్యమునొందిన సక్కియ నాయనారు తొండైనాడు ప్రాంతానికి సంబంధించిన భాగవతోత్తముడు.ఇతని ఈశ్వరసేవాతత్పరతను తెలియచేయు రెండు కథలు ప్రచారములో నున్నవి.

  బౌద్ధములో తనబుద్ధి నిలువనందున శివ పాదములను ఆశ్రయించి,రమించుచు ఒక రాయిని అప్రయత్నముగా స్వామిపై ఉంచిన,పరమ ప్రీతితో శివుడు దానిని స్వీకరించుటచే,ఆ పూజా విధానమునే కొనసాగించి కైవల్యమును పొందెననునది ఒక కథ.

  శివుడు సర్వాంతర్యామి అని గ్రహించిన వాడు కనుక శివపూజను వీడలేని పరిస్థితి.శివద్వేషులైన జైనులు పాలన కనుక శివభక్తిని ప్రకటించుకోలేని దుస్థితి.శివద్వేషిగా బాహ్యములో-శివ దూతగా ఆంతర్యములో పరమ విశేష పాషాణపూజను చేసిన సక్కియ నాయనారును అనుగ్రహించిన సదాశివుడు మనందరిని అనుగ్రహించును గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)

నిథనపతిని ప్రసన్నము చేసుకొనుటకుకావలిసినది భక్తి తత్పరత యను ధనము కాని బాహ్యాడంబరము కాదని నిరూపించినాడు సక్కియ నాయనారు అని పిలువబడే శాక్య నాయరారు. మగేశ్వరుని మానసపూజకు పాషాణమునకు -పారిజాతమునకు తారతమ్యములేదని తాదాత్మ్యమునొందిన సక్కియ నాయనారు తొండైనాడు ప్రాంతానికి సంబంధించిన భాగవతోత్తముడు.ఇతని ఈశ్వరసేవాతత్పరతను తెలియచేయు రెండు కథలు ప్రచారములో నున్నవి.
బౌద్ధములో తనబుద్ధి నిలువనందున శివ పాదములను ఆశ్రయించి,రమించుచు ఒక రాయిని అప్రయత్నముగా స్వామిపై ఉంచిన,పరమ ప్రీతితో శివుడు దానిని స్వీకరించుటచే,ఆ పూజా విధానమునే కొనసాగించి కైవల్యమును పొందెననునది ఒక కథ.
శివుడు సర్వాంతర్యామి అని గ్రహించిన వాడు కనుక శివపూజను వీడలేని పరిస్థితి.శివద్వేషులైన జైనులు పాలన కనుక శివభక్తిని ప్రకటించుకోలేని దుస్థితి.శివద్వేషిగా బాహ్యములో-శివ దూతగా ఆంతర్యములో పరమ విశేష పాషాణపూజను చేసిన సక్కియ నాయనారును అనుగ్రహించిన సదాశివుడు మనందరిని అనుగ్రహించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)




CHIDAANAMDA ROOPAA-GUGGILAM NAAYANAAR.


    చిదానందరూపా-4

  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

  కాముని చంపినవానికి చేయు ఆ గుగ్గిలపు సేవ
  క్షామమునింపగ ఇంటను,తినుబండారములను

  చేకొని రావగ,చేత తాళితో శివ శివ అనుచు,భక్తి
  నిగ్గుతేల్చగ కదిలెను  ఆ, బుగ్గిపూతలవాడు

  గుగ్గిలమునమ్మువానిగా  బిగ్గరగ అరచుచు, సమీపించగ
  మొగ్గును చూపి కలయ, గుగ్గిలమంతయు పొందె తాళితో


  లింగము వంగిన వేళను, తాళక తనమెడ ఉరిబిగించె
  స్వామి ఆలింగనమును పొందగ ఆ గుగ్గిలము కారణమాయెగ

  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక

సంబరేను చెట్టువలన గలిగిన ధూపద్రవ్యము సాంబ్రాణి.పది సుగంధ వృక్షముల బెరడు,కాడ,ద్రవము,ఆకు మొదలగు వానినుండి దశాంగములతో కూడిన గుగ్గిలమును ధూపముగా వేస్తూ "త్రయంబకం యజామహే  సుగంధిం పుష్టి వర్ధనం " అంటూ తిరుక్కడవూరులోని అమృత కలశేశ్వరుని అర్చిచు మహా భక్తుడు గుగ్గిల కలశ నాయనారు. 


దేవతలు అసురులు అమృత కలశముతో తిరుక్కడవూరికి వచ్చారట.ఆ కలశమును నేలపై ఉంచి ,స్నానము చేయుటకు నదికి వెళ్ళి వచ్చు సరికి ఈశ్వరేచ్చగా  ఆ కలశము లింగముగా మారిపోయినదట.మార్కండేయుని మృత్యుంజయుని చేసిన అభిరామాదేవి సహిత అమృతేశ్వర స్వామి మనగుగ్గిలపు కలశ నాన్యనారుని భక్తిని మథించి లోకపూజ్యతను ప్రసాదించాడు.

  సుగంధధూపములు దశాగంతో వేయబడునవి.జ్ఞానేంద్రియ-కర్మేంద్రియములను సుగంధభరితము చేయుచు చేయు అర్చన ఆ నాయనారుది.తనభార్య మాంగల్యమును అమ్మి గుగ్గిలమును కొని దానిని  స్వామికి అర్పించుచు పరవశించు శివ ధ్యానీ.పాలున్ బువ్వ యు పెట్టెదన్ అని ధూర్జటి ప్రస్తావించిన శివుడు వాత్సల్య లక్ష్మి లీలావచనములన్నట్లు నాయనారు కుటుంబమును సర్వైశ్వర్యములతో తులతూగునట్లు చేసినాడు.ఇదిలా ఉండగా నాయనారు భక్తికి పతాక సన్నివేశమన్నట్లు సద్యోజాతుడు గొడగూబ అన్న ఒక చిన్ని బాలికచేత ఒక తుమ్మిపువ్వునుంచి తనకు పెట్టమన్నాడు.లింగము చాలా ఎత్తుగానున్నది పాపకు అందదు.నింగిని తాకు జటలున్నవాడు కిందికి వంగి పువ్వును స్వీకరించాడు.లింగము వంగినదని దానికి ఇనుపగొలుసులు కట్టి ఏనుగులచే లాగించ సాగారు.ఉబ్బు లింగనికి దెబ్బ తగిలిందని,ఆగొలుసు తన మెడకు బిగించుకున్న గుగ్గిలపు నాయనారును అనుగ్రహించిన ఆ సదా శివుడు మనందరిని అనుగ్రహించును గాక.      
  చిత్తము చేయు "శివోహం" జపంబు, నా చింతలు తీర్చుగాక.

CHIDAANAMDAROOPAA-NAKKA NAYANAAR


    చిదానందరూపం శివోహం-శివోహం
    ****************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా కటాక్షించిన  వరమనుకుందునా

 సాలీడు పాకగ  స్వామి శరీరము పొక్కిపోయె
 గ్రహచారము చాలక ఎర్రగ కందిపోయె

 పాయని భక్తి  తానొక ఉపాయము సేసి వేగమే
 జాలము చేయక ఉపచారము చేయుచు సాగిపోయె ఆ

 నక్కనయనారుని ధర్మపత్ని,గమనించిన నాయనారు
 క్షమియించగ కోరగ,ఆమె వైద్యమే సరియనె సాంబుడు

గాఢత ఎంత ఉన్నదో కద  ఆ మూఢపు భక్తిలో
నెమ్మదినీయగ స్వామికి తల్లి  ఉమ్మియె కారణమాయె

చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని  లీలలు గాక
చిత్తముచేయు   "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక.


CHIDAANAMDAROOPAA-NEELAKAMTHANAAYANAARU




సౌవర్ణే నవరత్నఖణ్డరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖణ్డోజ్జ్వలం
 తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు "


 చిదానందరూపా-నీలకంఠ నాయనారు
 ******************************


  కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

  నీలకంఠ నాయనారు  వృత్తిరీత్యా కుమ్మరి
  గృహస్థధర్మములోనున్న శివకీర్తనా నేర్పరి

  రక్షకుడు శివుడంటు భక్తులను కొలిచెడివాడు
  భిక్షకులకు దానముగా భిక్షాపాత్రలనిచ్చేవాడు

  కాలపు పరిహాసమేమొ  కామవశుడైనాడు
  కానిపనికి శిక్షగా  భార్యను తాకకున్నాడు

  ఒకయోగి భిక్షాపాత్ర నాయనారు యోగమునే  మార్చినది
  కామేశుడు కరుణించుటకు కామము కారణమాయెగ

  చిత్రముగాక ఇదేమిటి చిదానందుని లీలలు గాక
  చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చుగాక.


 ధర్మము భక్తుడు నిర్దేశించినది.భక్తి భగవంతుడు అనుగ్రహించినది.నీలకంఠ నాయనారు భగవత్ నిర్దేశితమైన గృహస్థధర్మమును పాటిస్తూ.ఈశ్వరానుగ్రహ భక్తితో శివభక్తులకు భిక్షాపాత్రలను దానమిస్తూ శివుని సేవించెడివాడు.కాముని చంపిన వాని ఆట ఏమో ఒకసారి కామవశుడైనాడు.దాని పరిహారముగా తన భార్యను తాకక బ్రహ్మములో చరించసాగాడు.భక్తుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చుటకు శివయోగి వారిని సమీపించగా,"అతిథిదేవోభవ" యనుచు వారు తమ ఆతిథ్యమును స్వీకరించమని ప్రార్థించిరి.అందులకు యోగి తనకొక నియమము కలదని దంపతులు చేతులు పట్టుకొని పుణ్యస్నానము చేసిన తరువాత ఆతిథ్యమును స్వీకరిస్తానన్నాడు.పెద్ద ధర్మ సంకటము.స్నానము చేసిన నియమ భంగము అవుతుంది.స్నానమును చేయకపోతే అతిథిని నిరాదరించినట్లు కదా.తీవ్రముగా ఆలోచించి వారు ఒక కర్రను తమమధ్య అడ్దముగా పెట్టుకొని స్నానమాచరించసాగిరి.సంతసించిన సదాశివుడు వారిని తరింపచేసినట్లే మనలను తరింపచేయును గాక. 

 ( ఏక బిల్వం శివార్పణం.) 
Attachments area

CHIDAANAMDAROOPAA-AMARANEETI NAAYANAAR



" రత్నై కల్పితం ఆసనం,హిమజలై స్నానంచ దివ్యాంబరం
 నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం
 జాతి చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తధా
 దీపం దేవ దయానిధే  పశుపతే హృత్కల్పితం గృహ్యాతాం"

 చిదానందరూపా-అమరనీతి నాయనారు.
********************************************
.

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 అమరనీతి  నాయనారు అను  బంగారునగల వ్యాపారి
 మఠములను కట్టించినాడు ఆ  గంగాధర పూజారి

 పరమశివ భక్తుల  పాదములను  కడుగుతాడు
 కాశి విశ్వేశ్వరులంటు  కౌపీనములను ఇస్తాడు

 కాలచమత్కారమేమొ  బ్రహ్మచారి కౌపీనము
 కఠిన పరీక్షనే పెట్టింది తులాభార రూపముగా 

 కుటుంబమే కూర్చున్నది కౌపీనమును తూయగా
 కారుణ్యము కురిపించగ కౌపీనము కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  "శివోహం" జపంబు చింతలు తీర్చు గాక.


  కనకాభరణములు తనను చుట్టిముట్టియున్నను అమరనీతి మనసు చుట్టేది మాత్రము మహేశ్వర పాద సన్నిధిని మాత్రమే.తిరువల్లూరు దేవాలయములోని తిరుశివ నిత్యదర్శనమును సేవనమును కోరి, మఠములను నిర్మించి,,శివభక్తులకు అన్న వస్త్రదానములతో అమితానందమునొందుచుండగా,ఆదిదేవుడు బ్రహ్మచారిగా మఠమున ప్రవేశించి,తన పొడి కౌపీనమును భద్రపరచమని అమరనీతికిచ్చి తాను నదీస్నానమునకు వెళ్ళెను.తిగివచ్చిన బ్రహ్మచారికి ఇవ్వవలసిన కౌపీనము మాయమైనది.అమరనీతి కౌపీనమునకు బదులుగా తులాభారములో సమముగా తూగగలిగినది   నిశ్చలభక్తి యొక్కటే యని నిరూపించబడినది.విషయభోగములను విషనాగులబారి పడకుండా విశేషఫలమునందించుటకు కౌపీనమును కారణముచేసిన శరణాగత రక్షకుడు మనలను కటాక్షించును గాక.

  (ఏక బిల్వం శివార్పణం.) 

.

Tuesday, September 19, 2017

KASMEERAETU SARASVATEE.


    కాశ్మీరేతు  సరస్వతి

 " శారద  నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
   హార  తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం
   దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా
   కారతనొప్పు నిన్ను మది గానగ నెన్నడు కల్గు భారతీ" అని,

 శ్రీమదాంధ్ర మహాభాగవతములో పోతనామాత్యునిచే కీర్తింపబడిన సరస్వతి పీఠము మాయాసతి కుడిచేయి పడిన ప్రదేశముగా చెబుతారు. సర్వస్వాత్ సరస్వతి అను నానుడి కలదు.స్వాత్ లోపల నిండియున్న సర  సర్వము.మనలోపలనిండి సమయ సందర్భానుసారము ప్రకటితమయే శక్తియే  సరస్వతి అని సారస్వతమని  పండితులు భావిస్తారు. సంగీతములో సాహిత్యములో నిండియున్నా  స్వర ప్రస్థానములే  సరస్వతీ రూపముగా భావించే శాక్తేయ సంప్రదాయము కలదు.

      " అక్షరాభ్యాసములోనే" యోగశక్తి  నిక్షిప్తము అయివున్నది..వర్ణము అనగా అక్షరము-రంగు అని రెండు అర్థములు కలవు.సర్వశుక్లా  సరస్వతీ అన్న సూక్తిని గ్రహించినట్లయితే అమ్మవారు శుద్ధసత్వమైన తెల్లనితెలుపు రంగు.కనుక సర్వ వర్ణోప శోభితా అను స్తుతి వాక్యమును మనము అన్ని అక్షరముల స్వరూపముగా భావించినట్లయితే,మాతా సరస్వతి అక్షర శక్తులు రేకులుగా గల పద్మమునందు వసించునది. " అమృత,ఆకర్షిణి,ఇంద్రాణి,ఈశాని,ఉషకేశి,ఊర్థ్వ,ఋద్ధిద,ౠకార,ఌకార,ఌఊకార ,ఏకపద,ఐశ్వర్య,అంబిక,అక్షర అను అమ్మ శక్తులు పదహారు రేకుల "విశుద్ధి చక్రము" యై కంఠమునందు,తక్కిన అక్షరములు వివిధచక్రములుగా ,అక్షర లక్షణములుగా భాసించుచున్నవి..

  కాని ఉచ్చారణ విధానమును పరిసీలించినపుడు అక్ష్రములు హ్రస్వ-దీర్ఘ-ప్లుతములుగాను,తిరిగి ఒక్కొక్కటి,ఉదాత్త-అనుదాత్త-స్వరముగాను తొమ్మిది విధములుగా మారుతాయి.ఈ తొమ్మిది విధముల ఉచ్చారణ అను నాసికముగాను,నిరను నాసికముగాను (ముక్కు సహాయముతో-ముక్కు సాయములేకుండా) పలుకుచుండుట వలన తొమ్మిదిని రెండు తో హెచ్చవేసిన పద్దెనిమిది విధానములే అష్టాదశ శక్తిపీఠములు.(వివరించిన శ్రీ సామవేదము వారికి పాదాభివందనములు.)

     " కశ్మీరేతు సరస్వతి". క శబ్దము శిరస్సును సూచిస్తుంది.కశ్మీరము జ్ఞానప్రధాన కేంద్రము.ఇక్కడిది సర్వజ్ఞపీఠము. ఏ ప్రదేశమునుండి పండితులు ఇక్కడకు వచ్చి విజయము సాధిస్తారో ఆ వైపు ద్వారము తెరువబడేదట. ఆదిశంకరులు తమ ప్రతిభచే అప్పటివరకు తెరువని దక్షిణ ద్వారమును తెరిచారట.కశ్మీరమును శైవీ ముఖము అనికూడా అందురు.శివ జ్ఞానమును శైవీముఖము అందురు.ఇక్కడ జ్ఞాన విచారణకు ప్రాధాన్యతగలదు.

    జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
    మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ

    పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడుతనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.

      తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.

     దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు
   భాతృజనము వచ్చి పంచుకోరు
   విశ్వ వర్ధనమ్ము విద్యా ధనమ్మురా
   లలిత సుగుణ జాల తెలుగుబాల""

  ఏ దుర్మార్గులు కశ్మీరములోని జ్ఞానశక్తిని విధ్వంసము చేయలేరు. జ్ఞాన సరస్వతి ప్రవాహమును బంధించుట ఎవరి తరము?

  దేవి శరన్నవరాత్రులందును,మాఘ శుద్ధ పంచమియందును (వసంత పంచమి) మూలా నక్షత్రమునందును పలుచోట్ల ప్రత్యేక పూజలందు ,ఆ సరస్వతీ మాత మనకు జ్ఞాన భిక్షను ప్రసాదించును గాక.

    శ్రీ మాత్రే నమః.

   

  అష్టాదశ పీఠ శక్తి స్వరూపిణ్యై నమః.
  *******************************************
  అమ్మా!

పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

నల్లనైన చీకట్లో నేను అల్లరులే చేస్తున్నా
అల్ల కల్లోలమైన మనసు నన్ను సన్నగా గిల్లుతోంది

ఎర్రనైన కోపముతో నేను వెర్రి పనులు చేస్తున్నా
చిర్రు బుర్రులాడు మనసు నాపై గుర్రుమంటోంది

తెల్లనైన తెలివిలో నేను తెలుసుకొనగ తప్పులన్నీ
తెల్లబరచె నాలోని తెలివితక్కువ తనాన్ని


సత్వ,రజో,తమో గుణములు సద్దుమణుగు చుండగా
నా ఆత్మనివేదనమే మహానైవేద్యమైన వేళ

నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.

       భావము

నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ.తమోగుణమనే నల్లని చీకట్లో నేను చేసిన తలపులు,పనులు నన్ను బాధించుచున్నవి.రజోగుణమనే ఎర్రని కోపముతో నేను కోల్పోయిన విచక్షణ నన్ను కృంగ తీస్తున్నది.సత్వగుణము అనే తెల్లని తేజము నా తెలివితక్కువ తనాన్ని తెలియచేయుచు,నీ పాద రజ కణమును పరిచయము చేయుచుండగా,ఆత్మార్పణకై నా మనసు తహతహలాడుచున్న సమయమున,నీ చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.సర్వజనులను రక్షించుమమ్మా.  అనేక వందనములు.

  భగవత్ బంధువులారా,

      మనమందరము మాయామోహితులమగుచు మనసనే లేడిని అనుసరిస్తూ  అటుఇటు పరుగులు తీస్తుంటే భవసాగరమనే వేటకాడు అరిషడ్వర్గములనే బాణములతో ఆగామిసంచితమనే విల్లుతో మనలను వేటాడాలని కర్కశంగా చూస్తుంటాడు  వాని నుండి తప్పించుకోవాలంటే అమ్మ పాద శరణాగతి తప్ప అన్యము లేదు..అష్టాదశశక్తి స్వరూపిణి  మనము శిష్టచారులమైతే మెచ్చుకుంటుంది.కాకపోయినను పొనీలే పిచ్చివారని మచ్చికతో తన ఒడిలోనికి తీసుకుంటుంది.అమ్మ ఒడిలో నున్న లేడిపిల్లను చూసిన వేటగాడు ఏమిచేయగలడు. ఏమి చేయాలో తెలియక విస్తుపోతూ చూస్తుంటాడు.అమ్మ దయ అయితే అమ్మను,అమ్మ ఒడిలో నున్న లేడిని ప్రస్తుతిస్తాడు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ, నా చిన్ని ప్రయత్నమును పెద్ద మనసుతో ఆదరించిన మీ అందరికి పేరుపేరునా హృదయపూర్వక నమస్కారములు. అమ్మ ఒడిలో లేడిపిల్లలమై, ఆడుకుందాము.అమ్మ దయనే వేడుకుందాము.

  మాతా కృపా కటాక్ష ప్రాప్తిరస్తు.

  " దసరా  పండుగ శుభాకాంక్షలు."

  సర్వే జనా సుఖినో భవంతు-సమస్త సమ్మంగళాని భవ0తు. స్వస్తి.

Monday, September 18, 2017

VAARANAASYAAM VISAALAAKSHI


     వారణాశ్యాం విశాలాక్షి

   " కాశంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం
   విశ్వేశం దేవం ఆలోక్య ప్రీతివిస్తారితే క్షణా
   సానురాగాచసా గౌరీ దద్యాత్ శుభపరంపరాం
   వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణ పరాకృతీ
   అన్నం జ్ఞానదదతీ సర్వాన్ రక్షతి నిత్యశః
   త్వత్ ప్రసాదాన్ మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే."

   " వారణాస్యాం విశాలాక్షి నైమిశే లింగధారిణి
   ప్రయాగే  లలితాదేవి  కామాక్షి గంధమాదనే."
   
    గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.
"వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది.'వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

      మణికర్ణిక అను పదమునకు కర్ణమునకు (చెవికి) ధరించిన మంగళప్రద ఆభరణము.మాతసతి చెవిపోగు ఇక్కడపడిన ప్రదేశములో ప్రకటింపబడిన తల్లి కనుక "మణికర్ణికా దేవి" అని కూడా తల్లిని కొలుస్తారు.మణికర్ణికా ఘాటు   విష్ణువుచే నిర్మించబడినదిగా ఒక కథ ప్రచారములో ఉంది.విశాలాక్షి తీర్థము భక్తుల పాపప్రక్షాళనము చేస్తోంది.

     కలియుగ కైలాసమును ఎందరో కవులు,ఋషులు,యోగులు కీర్తించారు.కీర్తించుచున్నారు-కీర్తిస్తారు.

   
 " మోక్ష ద్వార కవాట పాటనకరీ కాశి పురాధీశ్వరి
  భిక్షాందేహి కృపావలంబనకరీ   మాతాన్నపూర్ణేశ్వరి."

    ఒకసారి స్వామిలీలగా వ్యాస మహర్షికి ,అతని శిష్యులకు  వారమురోజులపాటు భిక్ష లభించలేదట.అందులకు కోపిచిన వ్యాసుడు కాసిని శపించబోవు సమయమున పార్వతీ పరమేశ్వరులు వృద్ధ బ్రాహ్మణదంపతులుగా మారి వ్యాసుని అతని
 శిష్యులకు మృష్టాన్న భోజన ఆతిధ్యమునిచ్చిరి.అనతరము వ్యాసుని ఆగ్రహవశత్వమును క్షమించని శివుడు వ్యాసునికి కాశి బహిష్కరణను శాసించెను.వ్యాసుడు పశ్చాతప్తుడై పరమ శివుని వేడుకొనగా అతని పాదస్పర్శచే  దక్షిణకాశిగా ధన్యతనొందునని వరమిచ్చెను .

    అసి వరుణ అనే నదులు గంగలో సంగమిస్తాయి.అసి-వరుణ మధ్యనున్న ప్రదేశమును వారణాసి అంటారు.ఇరుకైన సందుల గుండా విశాలాక్షి అమ్మవారి గుడికి భక్తులు చేరుకుంటారు.గర్భగుడి ముందు భాగములో ఆదిశంకరులు ప్రతిష్టించిన శ్రీచక్రము సువాసిని పూజలను అందుకుంటుంటుంది.సర్వాభరణ,సర్వ పుష్పాలంకృతయై,సర్వాభీష్ట ప్రదాయినిగా సాక్షాత్కరిస్తుంది తల్లి.అమ్మవారి మూర్తి వెనుక మరొక మూర్తి మహిమాన్వితయై మనలను కాపాడుతుంటుంది.

  అమ్మవారిని దర్శించిన తరువాత సర్వశుభకరుడైన కాశీ విశ్వనాథుని దర్శించుకుంటూ
భక్తిపరవశులై

  "విశ్వేశం మాధవం డుండిం దండపాలంచ భైరవం
   వండే కాశిం గుహాం గంగాం భవానీం మణి కర్ణికాం" అని కీర్తిస్తుంటారు.

   అహం కాశి గమిష్యామి.నేను కాశికి వెళుతున్నాను అని తలచినంత మాత్రముననే "భావనా మాత్ర సంతుష్టయైన తల్లి భవబంధముక్తులను చేస్తుందట.ఎంతటి వారైన కాశిక్షేత్రములో తమ తుదిశ్వాస విడవాలనుకుంటారు.చివరి క్షణమున పరమేశ్వరుడు కుడిచెవిలో ప్రణవమును చదువుతుంటే,విశాలాక్షి తన పవిటను వింజామరచేసి,విశ్రాంతిని ఇస్తుందట.సకలదేవతలు సాక్షాతాకరించి సన్నిధానమును చేరుస్తారట .

  "కాశి" అను పదమునలు జ్యోతి.ప్రకాశము అను అర్థములుగలవు,అష్టాదశ శక్తిపీఠము-ద్వాదశ జ్యోతిర్లింగము-సప్తమోక్షపురము-అష్ట మాతృకా స్థలము అయిన కాశి లో వెలిసిన విశాలాక్షి మాత మనలను రక్షించుగాక.

   శ్రీ మాత్రే నమః.    

 

GAYAE MAANGALYA GAURIKAA.

" గదాధర సహోదరి గయా గౌరీ నమోస్తుతే
   పితౄణాంచ సకర్తౄణాం దేవి సద్గుణదాయిని
   త్రిశక్తిరూపిణీ మాతా సచ్చిదానందరూపిణి
   మహ్యం భవతు సుప్రీతా  గయా  మాంగళ్య గౌరికా"

త్రిమూర్తులలోఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, "గౌరి", భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. 

బీహారు రాష్ట్రములోని  గయ అను ప్రదేశములో పడిన మాయాసతి యొక్క వక్షోజములు ,దయయే ధర్మముగా గల మాంగల్య గౌరీదేవిగా ప్రకటింపబడి, ఆ క్షేత్రమును "పాలనా పీఠముగా" కీర్తింపబడుచున్నది.మంగళగిరి కొండలపై తూర్పు ముఖాభిముఖియైన్ గుహాలయములో తల్లి స్థితికారకత్వముగల తన రెండు స్తనములను,రెండు శిలారూపములుగా దర్శింపచేస్తూ,దయ చూపిస్తున్నదని పద్మ,విష్ణుస్థలపురాణములు కీర్తించుచున్నవి.

      " గయ" అను శబ్దమునకు అనేక మూలములు కలది అను అర్థము కలదు.విష్ణువుచే ఖండించబడిన గయుని శరీరపు ముక్కలు అనేకములు ఈ పవిత్ర క్షేత్రమున అనేక అచలములై(కొండలై) అచంచల భక్తితో అమ్మను ఆరాధించుచున్నవి.
  గయ అను పదమునకు పునీతముగావింపబడిన ప్రదేశము అని మరొక అర్థము కలదు.సుదర్శన చక్ర స్పర్శచే పునీతము గావింపబడిన అసురుని శరీరభాగములకు గయ అను నామము సార్థకమగును.

 ఇక కుడి ఎడమైతే పొరపాటులేదోయ్ అన్నారు పెద్దలు.వర్ణవ్యత్యయమును పరిశీలిస్తే గయ అను పదము యగ గా యాగ గా అన్వయించుకుంటే బ్రహ్మర్షుల యజ్ఞవాటిక (యజ్ఞము జరిగిన దేహము) గాను ప్రకాశిస్తున్నదిమంగళగౌరీదేవి అనుగ్రహించిన అనేకానేక కథలు ప్రచారములో కలవు.శ్రావణ మాసములో,ఆశ్వయుజ ,కార్తీక మాసములలోనవరాత్రులందును అమ్మవారి పూజలు వైభవోపేతముగా జరుగును.ప్రతి మంగళవారము.శుక్రవారము ప్రత్యేక పూజలు జరుగును.వక్షద్వయ ప్రతీకలుగా రెండు గోపురములు ఆకలిదప్పికలను తీర్చుచుండును. శాక్తేయులకు-బౌద్ధులకు గయాక్షత్రము కొంగు బంగారము.శ్రాద్ధకర్మ ఫలితమును పితృదేవతలకు అందించు అద్భుతము..

    పూర్వము మగధదేశములో కుండిన నగరములో ధర్మపాదుడూ అను వైశ్యుడు కలడు.అతని భార్య మహా సాధ్వి,ఒక సాధువు ఆమె బిక్షను ప్రతి రోజు తిరస్కరించుచున్నాడని వగచి,తన భర్తకు చెప్పగా,బంగారు కాసులను సాధువునకు భిక్షగా ఇమ్మటాడు ధర్మపాదుడు.మరునాడు ఆమె అత్లే చేయబోవగా సాధువు కుపితుడై భిక్ష నిరాకరణకు కారణమును తెలియచేసి,సాధువులను బంగారు భిక్షతో అవమానపరచినందులకు సంతానము కలుగకుండునుగాక అని శపించెను.పశ్చాత్తాపము పొందిన ఆ పతివ్రతను కరుణించి,సంతానమునకు ఒక ఉపాయమును సూచించి వెడలెను.

  అమ్మ తలచుకుంటే అసాధ్యమేముంది.ధర్మపాదుడు ఊరిచివరగల చూతవృక్షమును సమీపించెను. చూడముచ్చటగ  చూతఫలములతో చూలింతవలెనున్న ఆ చెట్టును చూసిన వెంటనే దురాశ ధర్మపాదునిలో ప్రవేశించి ఆనతిని మీరి,ఒక ఫలమును గాకుండా అనేక మామిడిపండ్లతో తనఒడిని నింపెను.ఎవరికెంత ప్రాప్తమో అంటే కదా.అన్ని పండ్లు ఒక్క పండుగా మారిపోయెను.చేసేదిలేక అయోమయముగనున్న ధర్మపాదునిపై అమ్మ ఆగ్రహించి,ఆ ఫల భక్షణము వలన వారికి అల్పాయుష్కుడగు కుమారుడు కలుగునని సెలవిచ్చి,అంతర్ధానమయ్యెను.

    అమంగళము ప్రతిహతమగుగాక.

     వారికి అత్త్యుత్తముడైన బాలుడు జన్మించెను.వానికి శివుడు (శుభప్రదుడు) అను నామకరణమును చేసిరి.పుణ్యతీర్థ స్నానము-పుణ్యక్షేత్ర దర్శనము సర్వపాపహరమని తలచి శివుని మేనమామ అతనిని కాశి క్షత్రమునకు తీసుకుని వెళ్ళగా,అక్కడ మంగళగౌరీ భక్తురాలైన సుశీల అను సద్గుణాల రాసితో వివాహమై,ఆమె పాతివ్రత్యమహిమ తల్లి ఆగ్రహమును అనుగ్రహముగా మార్చి ఆశీర్వదించగా వారు ఆనందముగా కలకాలము అమ్మను సేవించి తరించిరి.అకళంకరహిత స్వర్ణవర్ణ శోభితను

   శ్రీకృష్ణుడు ధర్మరాజుతో త్రిపురాసుర సంహారసమయమున శివుడు ఈ తల్లిని పూజించెనని చెప్పెను.
  అంగారకుడు మంగళగౌరిని పూజించి కుజగ్రహ అధిపతియైనాడని మంగళుడు అను పేరును పొందెనని చెబుతారు.
   ఇంకా ఎందరో కథకాటుకను ధరించి కనులకున్న అహంకారపొరలను తొలగించుకున్నారనుట
  నిస్సందేహము

  ఎల్లోర గుహాలయమునందు "కళ్యాణ వైభోగమే గౌరీ కళ్యాణ ...అనుగ్రహమే అయిన తల్లి మనలను అనుగ్రహించుగాక.

    ( శ్రీ మాత్రే నమః.)


 

GAYAE MAAMGALYA GAURIKAA.


    గయే  మాంగల్య గౌరికా

 " గదాధర సహోదరి గయా గౌరీ నమోస్తుతే
   పితౄణాంచ సకర్తౄణాం దేవి సద్గుణదాయిని
   త్రిశక్తిరూపిణీ మాతా సచ్చిదానందరూపిణి
   మహ్యం భవతు సుప్రీతా  గయా  మాంగళ్య గౌరికా"

  ఫల్గునితీర  బీహారు రాష్ట్రములోని  గయ అను ప్రదేశములో పడిన మాయాసతి యొక్క వక్షోజములు ,దయయే ధర్మముగా గల మాంగల్య గౌరీదేవిగా ప్రకటింపబడి, ఆ క్షేత్రమును "పాలనా పీఠముగా" కీర్తింపబడుచున్నది.మంగళగిరి కొండలపై తూర్పు ముఖాభిముఖియైన్ గుహాలయములో తల్లి స్థితికారకత్వముగల తన రెండు స్తనములను,రెండు శిలారూపములుగా దర్శింపచేస్తూ,దయ చూపిస్తున్నదని పద్మ,విష్ణుస్థలపురాణములు కీర్తించుచున్నవి.

      " గయ" అను శబ్దమునకు అనేక మూలములు కలది అను అర్థము కలదు.విష్ణువుచే ఖండించబడిన గయుని శరీరపు ముక్కలు అనేకములు ఈ పవిత్ర క్షేత్రమున అనేక అచలములై(కొండలై) అచంచల భక్తితో అమ్మను ఆరాధించుచున్నవి.
  గయ అను పదమునకు పునీతముగావింపబడిన ప్రదేశము అని మరొక అర్థము కలదు.సుదర్శన చక్ర స్పర్శచే పునీతము గావింపబడిన అసురుని శరీరభాగములకు గయ అను నామము సార్థకమగును.

 ఇక కుడి ఎడమైతే పొరపాటులేదోయ్ అన్నారు పెద్దలు.వర్ణవ్యత్యయమును పరిశీలిస్తే గయ అను పదము యగ గా యాగ గా అన్వయించుకుంటే బ్రహ్మర్షుల యజ్ఞవాటిక (యజ్ఞము జరిగిన దేహము) గాను ప్రకాశిస్తున్నదిమంగళగౌరీదేవి అనుగ్రహించిన అనేకానేక కథలు ప్రచారములో కలవు.శ్రావణ మాసములో,ఆశ్వయుజ ,కార్తీక మాసములలోనవరాత్రులందును అమ్మవారి పూజలు వైభవోపేతముగా జరుగును.ప్రతి మంగళవారము.శుక్రవారము ప్రత్యేక పూజలు జరుగును.వక్షద్వయ ప్రతీకలుగా రెండు గోపురములు ఆకలిదప్పికలను తీర్చుచుండును. శాక్తేయులకు-బౌద్ధులకు గయాక్షత్రము కొంగు బంగారము.శ్రాద్ధకర్మ ఫలితమును పితృదేవతలకు అందించు అద్భుతము..

    పూర్వము మగధదేశములో కుండిన నగరములో ధర్మపాదుడూ అను వైశ్యుడు కలడు.అతని భార్య మహా సాధ్వి,ఒక సాధువు ఆమె బిక్షను ప్రతి రోజు తిరస్కరించుచున్నాడని వగచి,తన భర్తకు చెప్పగా,బంగారు కాసులను సాధువునకు భిక్షగా ఇమ్మటాడు ధర్మపాదుడు.మరునాడు ఆమె అత్లే చేయబోవగా సాధువు కుపితుడై భిక్ష నిరాకరణకు కారణమును తెలియచేసి,సాధువులను బంగారు భిక్షతో అవమానపరచినందులకు సంతానము కలుగకుండునుగాక అని శపించెను.పశ్చాత్తాపము పొందిన ఆ పతివ్రతను కరుణించి,సంతానమునకు ఒక ఉపాయమును సూచించి వెడలెను.

  అమ్మ తలచుకుంటే అసాధ్యమేముంది.ధర్మపాదుడు ఊరిచివరగల చూతవృక్షమును సమీపించెను. చూడముచ్చటగ  చూతఫలములతో చూలింతవలెనున్న ఆ చెట్టును చూసిన వెంటనే దురాశ ధర్మపాదునిలో ప్రవేశించి ఆనతిని మీరి,ఒక ఫలమును గాకుండా అనేక మామిడిపండ్లతో తనఒడిని నింపెను.ఎవరికెంత ప్రాప్తమో అంటే కదా.అన్ని పండ్లు ఒక్క పండుగా మారిపోయెను.చేసేదిలేక అయోమయముగనున్న ధర్మపాదునిపై అమ్మ ఆగ్రహించి,ఆ ఫల భక్షణము వలన వారికి అల్పాయుష్కుడగు కుమారుడు కలుగునని సెలవిచ్చి,అంతర్ధానమయ్యెను.

    అమంగళము ప్రతిహతమగుగాక.

     వారికి అత్త్యుత్తముడైన బాలుడు జన్మించెను.వానికి శివుడు (శుభప్రదుడు) అను నామకరణమును చేసిరి.పుణ్యతీర్థ స్నానము-పుణ్యక్షేత్ర దర్శనము సర్వపాపహరమని తలచి శివుని మేనమామ అతనిని కాశి క్షత్రమునకు తీసుకుని వెళ్ళగా,అక్కడ మంగళగౌరీ భక్తురాలైన సుశీల అను సద్గుణాల రాసితో వివాహమై,ఆమె పాతివ్రత్యమహిమ తల్లి ఆగ్రహమును అనుగ్రహముగా మార్చి ఆశీర్వదించగా వారు ఆనందముగా కలకాలము అమ్మను సేవించి తరించిరి.అకళంకరహిత స్వర్ణవర్ణ శోభితను  

   శ్రీకృష్ణుడు ధర్మరాజుతో త్రిపురాసుర సంహారసమయమున శివుడు ఈ తల్లిని పూజించెనని చెప్పెన
  అంగారకుడు మంగళగౌరిని పూజించి కుజగ్రహ అధిపతియైనాడని మంగళుడు అను పేరును పొందెనని చెబుతారు.
   ఇంకా ఎందరో కథకాటుకను ధరించి కనులకున్న అహంకారపొరలను తొలగించుకున్నారనుట
  నిస్సందేహము

  ఎల్లోర గుహాలయమునందు "కళ్యాణ వైభోగమే గౌరీ కళ్యాణ ...అనుగ్రహమే అయిన తల్లి మనలను అనుగ్రహించుగాక.

    ( శ్రీ మాత్రే నమః.)

    

Sunday, September 17, 2017

JVAALAAYAAM VAISHNAVEEDAEVI

  jvaalaayaam  vaishNaveedaevi

   "సర్వ మంగళ మాంగళ్యే  శివే సర్వార్థ సాధికే
   శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే."

    "కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః".తల్లి తన చేతివేళ్ళగోళ్ళనుండి దశావతార నారాయణులను సృష్టించి,వారిని ధర్మ సంస్థాపనకు ఉపకరణములు చేసి,వారి శక్తులను తనలో అంతర్లీనము(కల్కి)తప్ప అంతర్లీనము చేసుకొన్నది.ఇది చర్మ చక్షువులకు అర్థమైనది.సూక్షమను ఒకింత ఆలోచిస్తే 1.కర్త-2.కరణము-3.కార్యము-4.ఫలము/ఫలితము అని నాలుగుగా విభజింపబడిన శక్తియొక్కటే.కనుక కర్తగా తలపోసి,కరణములను సృష్టించి,కార్యరూపము దాల్చి,ఫలితములను ఫలములను అందుకొనుచున్నది అమ్మ.చిఛ్చక్తియే  సర్వవ్యాపకమై (వైష్ణవమై)  త్రికూటాచల పర్వత మధ్యమున మాయాసతి శిరోభాగము సర్వ శ్రేష్ట జ్వాలాయాం శక్తిపీఠముగా మనలను అనుగ్రహించుచున్నది.

    త్రికూటాచల పర్వతశ్రేణులలోని జ్వాలా క్షేత్రములో,మాయాసతియొక్క శిరోభాగము పడిన ప్రదేశములోఒకే శిలపై ఊర్థ్వ భాగమున శక్తిస్వరూపము గాను,అథోభాగమున మహాలక్ష్ని-మహావాణి-మహా గౌరి శక్తులైన మూడురూపములలో ద్యోతకమగుతు,మనలను దీవిస్తుంటుంది తల్లి.

  త్రికూట పర్వతము ఏనుగు దంతాకారముగాను,పై భాగము ఏనుగు నుదురుగాను లక్ష్మీసంకేతములై,అమ్మను పూజించుచున్నవి.

        స్థలపురాణము ప్రకారము బంచాలి గ్రామములో శ్రీధరుడు అను పండితోత్తముడు సదాచార సంపన్నుడై,సంతానము కొరకు అమ్మని అత్యమ్యభక్తితో ఆరాధించేవాడట.అతనిని కరుణించదలచిన తల్లి,

  " అధాత: సంప్రవక్ష్యామి కుమారీ కవచం శుభం
    త్రైలోక్య మంగళం నామ మహాపాతక నాశనం."

    శ్రీధరుని కరుణించిన కౌమారిదేవి అతనికి దర్శనమిచ్చి,అన్న సంతర్పణమును చేయమని కోరినది.పేదరికిముతో స్నేహముచేయు అతడు అమ్మ మాటలకు విస్తుపోయి,తల్లి
ఆనను శిరసావహించి,అన్న సంతర్పణకు ఊరిజనమునందరిని ఆహ్వానించి,ధ్యానమగ్నుడాయెను.అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లేకదా.భావనా మాత్రముచేతనే బహుపదార్థములు ప్రత్యక్షమాయెను.పంక్తి భోజనమును కౌమారి మాత్రుప్రేమతో మమతలుపంచుచు వడ్డించుచున్న సమయమున,దురహంకారియైన భైరవుడనువాడు అమ్మను మద్య-మాంసములను తినుటకు వడ్డించమన మనెను.వీలుకాదనిన అమ్మపై వాడు ఆగ్రహించి,బంధించుటకు ప్రత్నించిచిన మార్గమే,ఆట-పాటలతో అలుపన్నది తెలియక భక్తులు చేయు వైష్ణవీదేవి ఆధ్యాత్మిక అద్భుత యాత్ర.

       అమ్మ తొలిమజిలీ హంసవిల్లి గ్రామము.ఇక్కద దేవామాయి మందిరము ఉంది.శ్రీగురుడనే భక్తునికి అమ్మవారు బాలెంతగా దర్శనమిచ్చినదని,కై ఖండోబా మాత అని కూడ కొలుస్తారు.అక్కద అంతర్ధానమయిన తల్లి అనేక మజిలీలు చేస్తున్నప్పుడు అమ్మను అనుసరిస్తున్న నరులకు/వానరులకు దాహమేసి,డస్సిపోయిన తరుణమున అమ్మ  బాణమేసి జలను అందించినదట.దీనిని "బాణగంగ" అంటారు.అమ్మ తన కేశములతో ఈ జలమును పవిత్రము చేసినదని "బాల్ గంగ" అని పిలుస్తారు.ఉత్తరాది వాడుక భాషలో బాల్ అంటే కేశములు/శిరోజములు అని అర్థము.శిరోజానుగ్రమును పొందిన గంగ కనుక శిరోజ తీర్థము అని కూడా అంటారట.    భైరవుడు తనను ఇంకా వెంబడిస్తున్నాదేమో నని అమ్మ ఒకనిముసము వెనుతిరిగి చూసినదట.ఆ సమయములో అమ్మపాదుకలు భక్తులను ఆశీర్వదించుటకు అక్కదే నిలిచిపోయాయట.అందుకే ఆ స్థలము చరణ పాదుకా తీర్థమని కొలుస్తారు.
  కాలస్వరూపమైన కౌమారి తన లీలగ అక్కడ గుహలో తొమ్మిదినెలలు గర్భస్థశిశువు మాదిరి దాగి బయటకు వచ్చినదట.
 లీలారూపిణి కొంతముందుకుసాగి జ్యోతి స్వరూపిణియై, ,అవలీలగ బైరవునికి ముక్తిని ప్రసాదించినది.జైమాది నమో నమ:.


  కట్రా త్రికూట పర్వత ప్రారంభములో ఉంది.నడవలేని వారు గుఱ్ఱాల మీద,పల్లకీ లలో వెళతారు.అమ్మ
 నామస్మరణతో,ఆశీస్సులతో బయలుదేరిన భక్తులు ముందుగా
 దర్శించేది 'కోల్  కండోలి మాతను.మాత దయతో ముందుకు సాగుతూ, దేవీమాయాను దర్శించుకుంటారు. తల్లి పిలవాలే కాని మనము
  తలచుకుంటే వెళ్ళలేము .కదులుతున్న కొన్ని మజిలీల తరువాత భైరవుడు తనను ఇంకా
  వెంబడిస్తున్నా
  డేమోనని ఒకసారి వెనుదిరిగి చూచిన
  దట.అనుగ్రహముగా అమ్మ
  చరణములు అక్కదనే తమ ముద్రికలను నిలిపాయట.కనుక ఈ ప్రదేశమును
  చరణ పాదుకా ప్రదేశముగా కొలుస్తారు.

   అమ్మను అనుసరిస్తు నడుస్తున్న నరులు/వానరులు దప్పిగొని బడలినవారైనా
  రట.కనికరించిన తల్లి తన బాణమును సంధించి జలమును అందించినదట.అ పవిత్ర తీర్థమును 'బాణ గంగ" అని కొలుస్తారు.మరి కొందరు అమ్మ తన
  శిరోజములతో అ జలమును అతిపవిత్రము గావించినదని "బాల్-గంగ" అని కొలుస్తారు.కేశతీర్థము అనికూడా కొలుస్తారు.

  అమ్మ అ తాంత్రికుని బారినుండి తప్పించుకొనుటకు, అక్కడి గుహాలయములో తొమ్మిది నెలలు ,గర్భస్థ శిశువు వలె ఘోరతపమాచరించినదట.అందువలన
  అమ్మను ఆదికుమారి అని కొలుస్తారు.  గర్భజూన్  అనికూడ అం
  టారు.
  అక్కడ భైరవుడు తలప
  డబోగా అమ్మ వానిని ఎదిరించి ,క్షమించి అంతర్ధానమయ్యెను.సాగుతూ సాగుతూ
  త్రికూటమను
  పర్వత మధ్యభాగమునకు చేరెనట.మూర్ఖుడైన భైరవుడు తన తప్పిదమును,అమ్మ క్షమాగుణమును గుర్తిం
  చని భైరవునితలను తన ఖడ్గముతో దునిమి,వాని కోరికపై,వాని తలను దర్శించిన తరువాతనే వైష్ణోదేవి తీర్థ యాత్ర ముగియునట్లు వరమిచ్చెను.

      "జంబూ కటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే" నే శ్లోకమాధారముగా ఈ
  స్థానములో అర్జునుడు అమ్మను ఆరాధించే వా
  డని,పాండవులు అమ్మ మందిరమును నిర్మించారని తెలుస్తోంది. శ్రీధర పండిత వం
  శస్థులే ఇప్పటికిని అమ్మను ప్రధాన అర్చకులుగా సేవిస్తున్నారు.

     యజ్ఞములు నాలుగు విధములు.అవి,
 1.విధి యజ్ఞము.
 2. జప యజ్ఞము
 3.ఉపాంశు యజ్ఞము
 4.మానస యజ్ఞము.

  వీనిలో విధి యజ్ఞము
  శరీరమునకు సంబంధించినది.జప-ఉపాంశు యజ్ఞములు వాక్కునకు సంబంధించినవి.మానస యజ్ఞము మనస్సునకు సంబంధించిన,

  నిరాడంబర నిత్యోత్సవము.కనుక భక్త మహాశయులారా ఏ కారణము
  వలనైనను యాత్రచేయలేకపోయామన్న అసంతృప్తిని విడిచి,

 "పదరండి పరవశులై తత్క్షణమే
  పరమేశ్వరి పిలిచిన ఈ క్షణమే"

   అంటూ మానస సరోవరములో పరమహంసలుగా మారి,ప్రార్థిస్తున్న మనలను అమ్మ రక్షించు గాక.

  జై మాతాది-జై మాతాది.

Friday, September 15, 2017

PRAYAAGE MAADHAVAESVARI.


    prayaagae maadhavaeSvari

     " త్రివేణి సంగమోద్భూత త్రిశక్తీనాం  సమాహృతి
    ప్రజాపతి కృతాశేష యుగమారాభివందితా
    బృహస్పతి కరాంతస్థ పీయూష పరిసేవితా
    ప్రయాగే  మాధవీదేవి సదాపాయాత్ శుభాకృతీ"

    ప్రజాపతి ఎక్కువ యాగములను చేసిన ప్రదేశము కనుక ప్రయాగ అని పేరువచ్చినది.ప్రకృష్ట యాగ వాటికగా ప్రసిద్ధి పొందిన క్షేత్రము కనుక ప్రయాగ అని తలచేవారు ఉన్నారు.బృహస్పతి మోహిని వదిలిన అమృతభాండమును తీసుకెళ్ళుచుండగా కొన్ని బిందువులు పడిన ప్రదేశము కనుక " అమృత తీర్థము" అని కూడ పిలుస్తారు.విష్ణుపాదోద్భవ గంగ యమున నదులను ఇళ-పింగళ నాడులుగాను,సరస్వతిని సుషుమ్నగాను గౌరవిస్తారు.మూడునదుల సంగమము  ముక్తిప్రదమనుట
 నిర్వివాదాంశము..అమ్మతత్త్వము సాకారము-నిరాకారము,సద్గుణము-నిర్గుణము.నిరంజనము-నిత్యము.తన లీలా విశేషముగా అమ్మ సాక్షాత్కరించి వెంటనే అంతర్ధానమయినదట.ఒక కొయ్య  స్థంభములో మాత తన శక్తిని నిక్షిప్తపరచినదని భావిస్తారు.కొందరు విశాలమైన అరుగు ప్రేదేశమును అమ్మగా తలుస్తారు.యద్భావం తద్భవతి.

     అమ్మవారిని అరూపిగాను,చెక్క ఊయలపై చిద్విలాసముగా ఊగుచున్న ఉమాదేవిగాను కొలుస్తారు.అమ్మను దీపాలను వెలిగించి,పుష్పాలతో వాటిని అలంకరించి ఆరాధిస్తారు.అమ్మవారిని నూతన వధువుగా అన్వయించుకుంటూ,ఒకసారి నూతన వధువుగా పల్లకిలో తల్లివెళ్ళుచున్న సమయములో కొందరు దొంగలు బోయీలను,బంధుమిత్రులను హింసించి,వధువును బంధించ ప్రయత్నించగా అమ్మ పల్లకినుండి దూకి అంతర్ధానమయినదని,పల్లకిని కూడ అమ్మ ప్రతిరూపముగా భావించి,నూతన వధూవరులు అమ్మను దర్శించి,ఆశీర్వచనములు పొందుతారు.అమ్మను అలోపి అనగా ఎటువంటి లోపములులేని మూర్తిగా భావించి,కొలుస్తారు.


  అమ్మవారి కొయ్యస్తంభము ముందు భక్తులు దీపములను వెలిగించి వానిని పూవులతో అలంకరిస్తారు.అమృతబిందువులు పడిన తీర్థము కనుక దీనిని తీర్థరాజముగా గుర్తించి కుంభమేళ ఉత్సవములను అత్యమ్యవైభముగా జరుపుతారు.ఇక్కడి మహావట వృక్షము అత్యంత మహిమాన్వితమై మూలమునందు ఆంజనేయస్వామి,శనీశ్వరునితో కొలువుతీరి భక్తుల కొంగుబంగారముగా కీర్తించబడుతుంది.సప్తమోక్షపురముగా ప్రయాగ మాధవేశ్వరినిలయము ప్రకాశించుచున్నది.ఆలయసమీపమున మాభగవతి-జ్వాలాదేవి ఆలయములు కలవు.సీతారామ మందిరము శ్రీకరముగా నెలకొనియున్నది.ఏకత్వములో అనేకత్వమునకు రూపారూపా మూర్త్యాయమూర్త్యా మాధవీదేవి అమ్మ మహిమను చాటుతున్నట్లు ప్రధాన గోపురము అనేకానేక గోపురములతో అమ్మతత్త్వమునకు ప్రతీకగా ప్రకాశిస్తు ఉంటుంది.

   శ్రీమద్భాగవతము ప్రకారము శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు వటవృక్షమహిమను వివరించినట్లు తెలుస్తోంది.అమ్మవారు మాధవేశ్వరీదేవిని మాయాసతి శరీరభాగమైన చేతివేళ్ళు పడిన చివరి ప్రదేశముగాను పరిగణిస్తారు.అయ్యవారు  మాణిక్యేశ్వరుడు.త్రిశూల సర్ప పడగలతో సాక్షాత్కరిస్తుంటాడు.
.

   స్వామి బ్రహ్మానంద అమ్మను ఇక్కడ మూడు జటలుగల బాలగా దర్శించారని నమ్ముతారు.నూతన వధూవరులు అమ్మను దర్శించి ఆనందపరవశులవుతారు.తల్లి నూతన వధువుగా పల్లకి నుండి దూకి అంతర్ధానమయినదని అమ్మను అలోపిగాను పూజిస్తారు.

  "మననాత్-ధ్యాత్ లభ్యతే ఇతి మాధవేశ్వరి" మనలను రక్షించును గాక.
 
      శ్రీ మాత్రే నమః.
   

Thursday, September 14, 2017

HARIKSHAETRAE KAAMAROOPAA


      హరిక్షేత్రే  కామరూపా

   " కామాఖ్యే కామదే దేవి నీలాచల నివాసిని
    కామస్య సర్వదే మాత మాతృసప్తక సేవితే
    జామదగ్నస్య రామస్య మాతృహత్యా విమోచని
    పంచ శంకర సంస్థాన భక్తపాలన తత్పరా
    కళ్యాణదాయిని మాతా విప్రదర్శన నర్తనా
    హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా  భవసర్వదా."

   మాయాసతి యోని భాగము పడిన ప్రదేశము మహాకాళి మహాలక్ష్మి మహాగౌరి త్రిశక్త్యాత్మకమై కామాక్ష్యాదేవిగా నీలాచల పర్వతమందు ప్రకటితమై మనలను పరిపాలిస్తున్నది.ఒకానకొప్పుడు తల్లి స్వామితో ఆనందవిహారమును చేయగోరిన స్థలమని,అందువలన సత్సంకల్పములు నెరవేరతాయని విశ్వసిస్తారు.బ్రహ్మపుత్రా నదిఒడ్డున కల ఈ ప్రదేశములలో ౠషులు,సత్పురుషులు అచలములై అచంచల భక్తితో అమ్మను ఆరాధించి పునర్జన్మా రాహిత్యమును పొందిరి.అమ్మ నిర్మాల్యము సహితము సర్వదుఖః హరము  .

  దేవి భాగవత ప్రకారము గుహరూపముననున్న దేవాలయ సొరంగము ఒక పవిత్రస్థలమునకు దారితీస్తుంది.అక్కడ ఏ విధమైన రూపము మనకు (చర్మ చక్షువులకు) గోచరించదు.కాని భూగర్భములోని సహజమైన నీటిబుగ్గలోని నీరు యోని ఆకారముగల గండశిల పగులులోంచి ప్రవహిస్తూ ఉంటుంది.ఆదిశక్తి కాళియే కాళివిద్యగా,కామాఖ్యా దేవతగా మనలను అనుగ్రహిస్తున్నది యోనిరూప విరాజితయై.ఊర్వశి గుండములో పుణ్యస్నానమాచరించిన తరువాత అమ్మవారి దర్శనము చేసుకొందురు".కమనీయాత్వాత్ కామః "రమణీయత్వము నిర్వచించుట అసాధ్యము.

     "ఆత్మవిద్యా మహ విద్యా శ్రీవిద్యా కామసేవితా"

  తిరిగి  రూపమును పొందిన మన్మథుడు దానికి సార్థకతను కలిగించుటకై,అరవై కోట్ల యోగినీ దేవతలు,పద్దెనిమిది భైరవ శక్తులు,దశమహావిద్యలు అమ్మవారి చుట్టు చేరి ఆరాధింపబడుచున్న కామాఖ్యాదేవి ని సేవిస్తూ,తన వంతుగా విశ్వకర్మచే అత్యద్భుత ఆనంద నిలయమును నిర్మింపచేసి,అమ్మను అక్కడ ఉండమని ప్రార్థించెనట.

    శ్రీ మహావిష్ణువు నల్లని కొండరూపములో నీలాచలమను పేర అమ్మను అచంచల భక్తితో ఆరాధిస్తుంటాడు అని ప్రబల విశ్వాసము.గిరి ప్రదక్షిణము చేయు సమయమున వారిని దర్శించి ధన్యులైనవారు కోకొల్లలు.అందులన ఈ ప్రసిద్ధ క్షేత్రమును "కామగిరి" కామవాటిక" అని కూడా భావిస్తారు.దేవతలు ఈ పవిత్ర ప్రదేశమునందు అమ్మను కొలిచి ఖేచరత్వమును (ఆకాశయానము) పొందిరట.
  నీలాచల రూపములో హరినివాసముకనుక "హరిక్షేత్రము" అని కూడా పిలువబడుతున్నది.
  ఇచ్ఛాశక్తి స్వరూపమే కామాఖ్యాదేవి అని ప్రస్తుతించబడుచున్నది.

   

   అంబువాషీ అను నది అమ్మవారి ప్రత్యేక మహిమకు నిదర్శనము.జగన్మాత రజస్వల అని కూడా వ్యవహరిస్తారు.ప్రతి ఆషాఢ మాస సుక్ల పక్షములోని అరుద్రా నక్షత్ర/మృగశిరా నక్ష్త్ర సంధి కాలములో అమ్మవారి రజస్వల ఉత్సవమును మూడురోజుల పాటు పాటిస్తారు.ఆ సమయములో భూమిపూజలు,వాస్తు పూజలు ,భూసంబంధిత పనులు నిలిపివేస్తారు.అమ్మవారి వస్త్రములు,అమ్మవారి జలములు ఎరుపు వర్ణముతో ప్రకాశిస్తుంటాయి.
  ఇక్కడి పూజారులను గారోలు అంటారు.వారు వామాచార-దక్షిణాచార (కుడి-ఎడమ) పద్ధతులలో పూజలను నిర్వహిస్తారు.
  అమ్మవారికి మానసపూజ అను మరొక వార్షికోత్సవ పూజను భక్తితో చేస్తారు. శరన్నవరాత్రులలో అత్యంత వైభవముగా తెప్పోత్సవము జరుగుతుంది.

   " కామాఖ్యాం పరమం తీర్థం  కామాఖ్యాం పరమం తపః
     కామాఖ్యాం పరమం ధర్మం  కామాఖ్యాం పరమం గతిం
     కామాఖ్యాం పరమం విత్తం కామాక్యాం పరమం పదం."  అని

   మహేశునిచే స్వయముగా పలుకబడిన కామాఖ్యాదేవి మన కామితములను తీర్చుగాక.
 
   శ్రీ మాత్రే నమః.

   

MANIKYAE DAKSHAVAATIKAA.

 మాణిక్యే  దక్షపీఠికా

  " ద్రక్షావతి స్థితశక్తి విఖ్యాత మాణిక్యాంబికా
   వరదా శుభదా దేవి భక్త మోక్ష ప్రదాయిని

     పంచభూతములు  సమతౌల్యమును పాటించు పవిత్ర ప్రదేశము "ఆరామము".అమరారామము,ఖీరారామము,సోమారామము,భీమారామము,దక్షారామము అను పంచారామములో "దక్షారామము" ఒకటి.ఆరామము అనగా అతిమనోహరము అను అర్థము కూడాకలదు.ఆరామ అనగా శ్త్రీ అనే అర్థము ఉండి.స్త్రీత్వముతో అనగా మాతృత్వముతో అనుగ్రహించెడి పవిత్ర క్షేత్రములు ఆరామములు అని భావించుటలో తప్పులేదేమో.మాయాసతి ఎడమబుగ్గ పడిన ప్రదేశము ఎనలేని వాత్సల్యమై
 మాణిక్యాదేవియై మనలను ఆశీర్వదించుచున్నది.పార్వతీ పరమేశ్వరులు కైలాసము నుండి,కాశికి ,కాశి నుండి దక్షారామమునకు విచ్చేశారని స్థలపురాణము చెప్పుచున్నది.దక్షుడు నిరీశ్వర యాగము చేసిన ప్రదేశము తిరిగి భీమేశ్వరునిచే సంస్కరించబడినది కనుక దక్షారామము అని పేరు వచ్చినదని చెబుతారు.దక్షప్రజాపతి పుత్రిక దాక్షాయణి పేరుతో దాక్షాయిణి పురమని కూడా పిలుస్తారు.కాలక్రమేణ ఆరామము ఉద్యానవనముగా వ్యవహరింపబడుచున్నది.

    త్రిలింగ శైవ పుణ్యక్షేత్రాలుగా కీర్తింపబడుతున్న కాళేశ్వరము,శ్రీశైలము,భీమేశ్వరములలోని భీమేశ్వర పుణ్యక్షేత్రమే దక్షారామము.
దక్షారమము భోగ క్షేత్రము(అయ్యవారు) మరియు యోగ క్షేత్రము(అమ్మవారు).అర్థనారీశ్వరమైన స్వామి పక్కన అమ్మవారు యోగ ముద్రలో కూర్చుని దర్శనమిస్తారు.

    సూర్యభగవానుడు నిత్యము అతిపొడవైన భీమేశ్వర స్పటిక లింగమును అభిషేకించెడివాడని,అభిషేకము తరువాత
 సప్తర్షులు సైతము ఆ వేడిని భరించలేక,సమీపించలేక పోయెడివారని,పరమేశుడు వారిని అనుగ్రహించి,గోదావరినదీ ఏడుపాయల జలముతో చల్లబరచుకొనుచు వచ్చి తమను సేవించుకొనమని సెలవిచ్చాడట.అందు వలన
 ఏడుపాయలుగా చీలిన గోదావరి సప్తగోదావరిగా ప్రసిద్ధికెక్కినది.అందులో భరధ్వాజ,జమదగ్ని,విశ్వామిత్ర
 ఋషుల తపోశక్తులు అంతర్లీనముగా ప్రవహిస్తూ ఉంటాయట. సప్త
 గోదావరిగుండము తాను పునీతురాలై భక్తులను పునీతులను చేస్తుందట.

      అతి పొడవైన భీమేశ్వరస్వామి లింగము రెండు భాగములుగా ద్యోతకమగుతు,రెండస్థుల దేవాలయములో దేదీప్యమానముగా దీవెనలను ఇస్తుందట.తుండి గణపతి-నాట్య గణపతి ద్వారపాలకులుగా స్వాగతించు ఈ దేవాలయము వేంగీ రాజైన భీమునిచే పునర్నిర్మింపబడినదని అంటారు.

  మాణిక్యాంబను గురించి వేర్వేరు కథలు ప్రచారములో కలవు.

    చనిపోయిన తన కుమార్తె రూపమును  స్వర్ణప్రతిమగా చేయించుకొని,మణిమాణీఖ్యములను అలంకరించి ఒక విప్ర పూర్వ సువాసిని ఆరాధించెడిదట.ప్రసన్నురాలైన తల్లి అదేరూపములో ఆమెను కరుణించెనట.

   మరొక కథనము ప్రకారము భీమేశ్వరుని పతిగా ఊహించుకొనుచు కొలుచు ఒక వేశ్యను
 అనుగ్రహించిన తల్లి ఆమె పుత్రికగా జన్మించి,కరుణించినదట.

     ఇంకొక స్థలపురాణము ప్రకారము తారకాసురుడు పరమశివుని అర్చించి.వరముగా ఆత్మలింగమును పొందెను.దానిని తన కంఠమున ధరించి,వరగర్వితుడై అనేక
 దుష్కృత్యములు .సాధువులను,సజ్జనులను,దేవతలను హింసించ దేవతలు తల్లిని వేడుకొనగా తన తనయుడైన కుమారస్వామిచే తారకుని తుదముట్టించి శివుని ఆత్మలింగమును తన అరచేత ధరించి ఆదిశక్తిగా అమ్మ మనలను,శ్రీచక్రముపై అధిస్ఠించి అనుగ్రహిస్తున్నదని తలుస్తారు.

  "పృధ్వి పదునెనిమిది యోగశక్తి
   గణములలో నెంచ సర్వ శృంగారి యగుచు
   భీమ నాథుని సన్నిధి ప్రేమవెలయు
   మాణికాదేవి సకల కళ్యాణమూర్తి" అని కవి సార్వభౌమ శ్రీనాథ మహాకవి అమ్మను దర్శించినాడు.

  సంతానార్థము వచ్చినవారిచే నాగప్రతిష్టలను చేయించుకుని, వారిని అనుగ్రహించు మాణిక్యాదేవి మనలను కాపాడు గాక.

  శ్రీ మాత్రే నమః.

Wednesday, September 13, 2017

ODHYAANAE GIRIJAADAEVI.


   ఓఢ్యాణే  గిరిజాదేవి

   " ఓఢ్యాణే గిరిజాదేవి  పితృర్చన ఫలప్రదా
   బిరజ పరా పర్యాయస్థిత  వైతరిణితటే
   త్రిశక్తీనాం స్వరూపాచ లోకత్రాణ పరాయణా
   నిత్యం భవతు సాదేవి వరదా కులవర్ధని."


  వైతరిణి నదీతీరమున కల ఓఢ్యాణపురములో మాయాసతి నాభిభాగము పడి వరప్రదాయిని గిరిజాదేవిగా కొలువైనది.ఒడిషా/ఒరిస్సా/ఒడియా/ఒరియా అని పులువబడుచున్న ప్రదేశములోని జాజ్ పూర్ ప్రాంతమును జగజ్జనని తన నివాసముగా ఎంచుకున్నది.నాభి ప్రదేశమును నడుమును ఓడ్డానముతో ప్రకాశించు తల్లి ఉన్న ప్రదేశము కనుక ఓఢ్యాణపురము అని కూడా భావిస్తారు.హిమవన్నగము మేనకలను తల్లితండౄలుగా అనుగ్రహించిన తల్లి కనుక గిరిజాదేవి అని అమ్మను కొలుస్తారు.విరజ అనగా శుభ్రపరచు అను అర్థమును అన్వయించుకుంటే మన పాపములను శుభ్రపరచుచు మనలను పునీతులను చేయు తల్లికనుక విరజాదేవి అని పూజిస్తారు.ఆర్యా స్తోత్ర ప్రకారము ఉత్కళరాజ్యస్థులు విరజా దేవిని తమ కులదేవత గా ఆరాధించెడివారు.

  తల్లి మహాలక్ష్మి-మహాశక్తి-మహా సరస్వతిగా పరిపాలిస్తుంటుంది.అమ్మ నాభి ప్రదేశము పడిన ప్రదేశము అని కొందరు భావిస్తే,గయాసురుని నాభి పడిన ప్రదేసమని మరికొందరు ఇక్కడ బావిదగ్గర పితృకార్యములను నిర్వహిస్తుంటారు దాని వలన ఇక్కక్కడ ప్రవహిస్తున్న వైతరిణి నది వారిని యమలోకబాధలనుండి విముక్తిని ప్రసాదించి,తరింపచేస్తుందని నమ్ముతారు.

   అమ్మ కిరీటము చంద్రరేఖ,గణేశుడు,లింగముతో ప్రకాశితూ ఉంటుంది.అమ్మ ఒకచేతిని మహిషుని హృదయములో గండ్రగొడ్డలిని గుచ్చుతూ,మరొక చేతితో వాని తోకను పట్టుకుని దర్శనమిస్తుంటుంది.విరజాదేవితో పాటు భగళాముఖి అమ్మవారు కూడా ఇక్కడ నెలవైయున్నారు.గిరిజాదేవి లీలలను వివరిస్తు,సప్తమాత్రికలను సందర్శింప చేస్తూ ఇక్కడ అద్భుతమైన మ్యూజియము కలదు.

   ఇంతకీ ఎవరా మహిషాసురుడు? ఏమా కథ?

     కశ్యప ప్రజాపతికి దనదేవి యందు జన్మించిన దానవులలో రంబుడు-కరంబుడు అను ఇద్దరు అన్నదమ్ములు అత్యంత శక్తివంతమైన సంతానము కొరకు పరమేశ్వరుని ఈ క్రిందివిధముగా ధ్యానించసాగిరి.

  రంబుడు దక్షిణాగ్ని,ఉత్తరాగ్ని,పశ్చిమాగ్ని,ప్రాగగ్ని ఉపరితలమున కల ప్రచంద సూర్యాగ్ని మధ్యమున నిలిచి ఘోరతపమును ఆచరించసాగెను.అతని తమ్ముడైన కరంబుడు జలదిగ్బంధనములో కఠోర తపమాచరించు చుండగా,దాని వలన కలుగు దుష్పరిణామ నివారణకై,ఇంద్రుడు మొసలిరూపమున దాగి,వానిని సంహరించెను.

   విషయమును తెలిసికొనిన రంబుడు పగతో రగిలిపోతూ,శత్రువులను జయించాలంటే బలాఢ్యుడైన పుత్రుని సహాయము ఎంతో కలదని గ్రహించి,అగ్ని దేవుని ప్రార్థించ సాగెను.ఫలితము కానరాకున్న,తపమును మరింత ఉదృతమును కావించెను.అయినను అగ్నిదేవుడు కరుణించలేదని,తన తలను అగ్నికి సమర్పించగా ఉద్యుక్తుడాయెను రంబుని నిష్ఠనుకు సంతసించి అగ్ని వరమును కోరుకోమనెను.

    రంబుడు బాగుగా ఆలోచించి కామరూపి ,అజేయుడు,ముల్లోకములను జయించగల కుమారుని కోరుకొనెను.అందులకు అగ్ని రంబుడు వెనుదిరిగి వెళ్ళునప్పుడు దేనిని చూసి/లేదా ఎవరిని చూసి మోహవివశుడగునో వారికి జనించిన కుమారుడు రంబుని కోర్కెను తీర్చగలడని పలికి అంతర్ధానమయ్యెను.

       వెనుదిరిగి చనునపుడు ఎందరో సౌందర్యవతులు,అప్సరసాంగనలు తారసపడినా రంబుడు ఎటువంటి మన్మధ వికారమును పొందలేదు.ప్రయాణమును కొనసాగించుచుండగా అక్కడ ఒక మహిష్మతి అను గంధర్వ కన్య మరీచి మహాముని శాపవశమున మహిషమును చూచినంతనే మోహితుడాయెను.తత్ఫలితముగా మహిషము గర్భమును ధరించినది.రంబుడు ఆ మహిషమును తన నగరమునకు తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా చూసుకొనసాగెను.ఒక ముహూర్తమున ఆ మహిషము దున్నపోతు తల-మానవ శరీరము గల ఒక దూడను ప్రసవించి ,శాప విమోచినియై తన గంధర్వ లోకమునకు పోయెను.

    దైవ నిర్ణయ ప్రకారము మహిషుడు బ్రహ్మగురించి ఘోరతపమును చేయగా,సంతసించిన బ్రహ్మ ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను.మహిషుడు తనకు మరణములేని వరమును ప్రసాదించమనెను.అందులకు తనకా శక్తి లేదని,కల్పాంత సమయమున తానును నిష్క్రమించువాడనని,మరేదైనా వరమును అనుగ్రహించెదననెను.మహిషుడు అహంకారముతో "అబలలను అరికాలితో అణచివేయగలను" అని తలచి స్త్రీలు తప్ప ఎవరు తనను సంహరించని వరమును పొందెను.
      మహిషుడు లేని సమయానుకూలతతో దేవతలు అతని రాజ్యమును ఆక్రమించిరి.
 క్రుద్ధుడైన మహిషుడు అనేకానే బలసంపన్నులగు సైన్యములతో,దేవతలపై దండెత్తిజయించి ఇంద్రునితో సహా అందరిని తరిమివేసెను.అకారణముగా నిస్సహాయులైన దేవతలను రక్షించుటకు త్రిమూర్తుల ముఖవర్ఛస్సు నుండి ఒక అధుతశక్తి ఉపన్నమైనది.సకలదేవతలు తమ వర్చస్సును ఆ తల్లియందు ప్రవేశ పెట్టిరి.ఆ శక్తి ఒక రౌద్ర స్త్రీమూర్తిగా పరిణామము చెంది,దేవతలందించిన వివిధ మహిమాన్విత ఆయుధములతో మహిషునిపై దండెత్తి,మంచి-చెడుల సంఘర్షణయైన మహాయుద్ధములో కాసేపు మహిషునితో ఆదుకొని,సమయమాసన్నమవగానే.ఒకచేతితో వాని మదమను హృఇదిపై తన గండ్రగొడ్దలి నుంచి.రెండవచేతితో వానితోకను పట్టుకుని,వాని రాక్షసత్వమును మర్దించెను.అమంగళమును ప్రతిహతముగావించినది ఆ గిరిజాదేవి.

 
  అమ్మ వారికి శారదీయ దుర్గాపూజ మహాలయ కృష్ణపక్షమునుండి ప్రారంభమై ఆశ్వయుజ శుక్లనవమి వరకు అత్యంత వైభవముగా జరుగును.శుక్ల అష్టమినుండి శుక్ల నవమి మధ్య సమయములో (జంతు) బలిదానములుబలిదానములు జరుగుచుండును.పూరి జగన్నాధ యాత్ర వంటి వైభవోపేతమైన శోభారథయాత్రతో మనలను పులకింపచేయు ఆ గిరిజా దేవి మన మనోరథములను నెరవేర్చును గాక.

   శ్రీ మాత్రే నమః


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...