Posts

Showing posts from December, 2017

POOJALU-SARASVATEE NAMOSTUTE

Image
సరస్వతీ నమోస్తుతే ******************* జగమున శారద నమోస్తుతే _ గగనపు శారద నమోస్తుతే సుత నారద నమోస్తుతే -సిత నీరద నమోస్తుతే ఇందిర సఖి నమోస్తుతే -ఇందు ముఖి నమోస్తుతే వేదసారమా నమోస్తుతే - ఘనసారమా నమోస్తుతే పటిమ అనుపమ నమోస్తుతే - పటీర ఉపమ నమోస్తుతే మాఘ శుక్ల పంచమి నమోస్తుతే - మరాళ వాహన నమోస్తుతే తల్లి ఆకార నమోస్తుతే -మల్లికాహార నమోస్తుతే నిషాద ఏలిక నమోస్తుతే - తుషార పోలిక నమోస్తుతే చేత కచ్చపి నమోస్తుతే - ఫేన స్వచ్చత నమోస్తుతే అజుని నాయికా నమోస్తుతే - రజతాచలమా నమోస్తుతే కాంతి సంకాశ నమోస్తుతే -కాస ప్రకాశ నమోస్తుతే పుష్ప కేశిని నమోస్తుతే- పూజ్య ఫణీశ నమోస్తుతే భక్త మందార నమోస్తుతే - కుంద మందార నమోస్తుతే వసుధ నాదనిధి నమోస్తుతే - సుధా పయోధి నమోస్తుతే ఆశ్రిత పోషిత నమోస్తుతే _ సిత తామరస నమోస్తుతే ఆగమ విహారి నమోస్తుతే -అమర వాహిని నమోస్తుతే ఓంకార రూప నమోస్తుతే - శుభాకార రూప నమోస్తుతే పోతన శుభస్తుత నమోస్తుతే - శ్వేత వస్త్రధర నమోస్తుతే సకల బుద్ధివి నమోస్తుతే - సకల సిద్ధివి నమోస్తుతే సర్వశుక్ల రూపమా నమోస్తుతే -సరస్వతీ నామమా నమోస్తుతే మనసా-వచసా- శిరసా సతతం స్మరామి. పురు...

AMMA-08

Image
"అవిదితం కిం" ( తల్లీ నీకు తెలియనిదా!!) కడుపున పడగానే కడు సంతోషిస్తానమ్మా ఎదుగుతున్నన్నాళ్ళు ఒదిగిఒదిగి ఉంటానమ్మా హోరాహోరి పోరులో "నేను" కేరుమంటానమ్మా నా ఏడుపు నీ గెలుపుకు "అభినందనలే" అమ్మా. నేను,నీ ఒడిలో పడగానే ఒడుపుగ పట్టుకుంటానమ్మా ఆడపిల్లేమోనని అనుమానపు దిగులున్న అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా ఏడాది నిండగానే తోడు నడుస్తానమ్మా ఆడపిల్లనని అక్కడే వదిలివెళ్ళుచున్న అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా పాల బువ్వ పెడుతూనే మురిపాలు పంచుతానమ్మా ఆకలవుతున్నదని నన్ను అమ్మకానికి పెట్టుచున్న అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా ఎదురుగా ఎదుగుతూనే మీ కీర్తిని ఎగురవేస్తానమ్మా ఆడపిల్ల నీవనుచు అవమాన పరచుచున్న అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా ఏడడుగులు నడిచినా ఎదలో నింపుకుంటానమ్మా జోలి నిండుతుందని ముసలికి ఆలిని చేయుచున్న అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా మెట్టినింట నేనున్నా పుట్టినింటికి వన్నె తెస్తానమ్మా వేరొక ఇంటిదీపం అని వివక్ష చూపించే అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా కాని,ఒక్కమాట అమ్మా, నీవు నాకొక అవకాశము ఇస్తేనే గదా నేను "అమ్మనై"" అభినందనలు" అందుకునే...

NAANNA-NAANNA CHAYI

Image
జగత: పితరే వందేం పార్వతీ పరమేశ్వరం తన్మయమున నన్ను చూస్తున్న ఒక అమృతమూర్తిని అమ్మ పరిచయము చేసింది అపురూపపు నాన్నని అందిస్తు నన్ను తన అమూల్యమైన చేతికి ఆ నిమిషము నుండి అరనిమిషము వదలకుండ ఆశీర్వదిస్తున్నది అనవరతము ఆ చేయి ......... చరచరమను జ్వరముతో విచారముతో నేనుంటే ఆచారిగ మారి నా నుదురును సరిచేసింది. అవమానముతో కృంగి అశ్రువులతో నేనుంటే కన్నతల్లి తానై నా కన్నీటిని తుడిచింది ఈడు హోరులోపడి చెడుదారిలో నే వెళితే చెవి పాశమై చతురతతో నా దారిని మళ్ళించింది చిరుతిళ్ళను ఆశించి చిల్లర నేనీయకుంటే ముక్కుపిండి నా పనులను చక్కగ చేయించావు మందు చుక్క మింగలేక మందముగ నేనుంటే కందకుండ బుగ్గనొక్కి అందగాణ్ణి చేసింది ముద్దను రానీయనని మారాముతో నేనుంటే గోరుముద్దగా పెదవిని గోముగా తాకింది బ్రతుకులో భయపడి నే కాస్త వెనుకాడితే అభయము తానై నన్ను వెన్నుతట్టి పంపింది ముళ్ళదారి నా పాదాలు కందిపోతాయని గుబళించు గులాబిగ నా అడుగుకు మడుగు అయ్యింది తన చేతలతో నా పై ప్రేమను చాటిన ఆ చేయి ఘనతను కనుగొని నమస్కరిస్తు నేనుంటే అనయపు ఆశీర్వచనమై నా తలపైన కూర్చున్నది ........................ వాస్తవాలను గుర్తించి ప్రస్తుతించలేని నాకు సమస్...

NAANNA- A SAMASTAAT

Image
ఆ-సమస్తాత్ ( తానే సర్వం) బాలమిత్ర పుస్తకములో బాలరాజు కథకాదు కాల దోష చరిత్రలో ఎన్నటికి చేరిపోదు మీ నాన్నా మా నాన్నా మనందరి నాన్నల కథ తరాలెన్ని మారినా తరలించలేని కథ. మమకార సామ్రాజ్యపు మహారాజు కథ. ****************************** ** దైనందిన పనులలో సైనికుడిని అంటాడు పనిచేసే వేళలలో సేవకుడిగా మారుతాడు అక్షరాల అర్చనలో ఆచార్యునిగా మారుతాడు క్రమశిక్షణ నేర్పుతూ ఆరాధ్యునిగా అవుతాడు తాను సంపాదించిన సర్వస్వము నా కోసము అంటాడు సంస్కారపు సంపదకు కోశాధికారి అవుతాడు చెడుజోడు చేరనీక అరికడుతు ఉంటాడు ఒడుపున దునుమాడే దండనాథుడవుతాడు ఒడిదుడుకులలో రక్షించి గట్టి భద్రతను ఇస్తాడు పట్టువదలక నన్ను పట్టభద్రునిగా చేస్తాడు కుళ్ళు కుతంత్రాలను కుళ్ళగించి వేస్తాడు మళ్ళీ దరిచేరని మంత్రాంగం చేస్తాడు ఖచ్చితముగా తన సంతోషము ఖర్చు చేస్తుంటాడు నన్ను మెచ్చుకునేలా చేయుటకు నిచ్చెన తను అవుతాడు ఎవరెంత పొగిడినా భేషుగ్గా వింటాడు ఏ మాత్రము మారడు భేషజమే లేనివాడు రాజువని నేనంటే రాజీ పడనంటాడు "నాన్న",తనపై పూజనీయతకు రోజు రోజు మరింత చోటునిస్తు.

PANDUGALU-RANJAAN

Image
ఈద్ ముబారక్ ************* మనసును "మక్కా" చేసిన మనిషి తెలుపు కృతజ్ఞత " ఈద్-ఉల్-ఫితర్" అను ఈద్ ముబారక్ కత. "నమాజ్-సలా-రోజ-జకాత్-హజ్" అను ఐదు పవిత్రతకు రూపాలు-పాటించవలసిన నియమాలు. తొమ్మిదవనెల "చంద్రరేఖ" తోడై చేయిస్తుంది " రం జాన్ నెల ప్రారంభము" ఆకలి-దప్పులను అధిగమించుటయేగ "రమదాన్" " అల్ల-హో-అక్బర్" అంటున్నది అమ్మీజాన్. ఆధ్యాత్మిక శిక్షణ అలవరచుకొనుటయేగ "రం జాన్" అర్థము వివరిస్తున్నాడు అందరికి బాబా జాన్. చేతగాని వారికి చేయూతగ సాయము చేయి "సహరీ" అందిస్తున్నాడు సలీం అనే అబ్బాయి. కుతూహలము ఆగదుకదా "కుత్బా" సమయము కొరకు కూలంకషమైన పరమ పవిత్రము ప్రతిపలుకు. విశ్వసోదరత్వమునకు అవుతాము గిరఫ్తారు విశిష్టతను వివరించు విందుయేగ "ఇఫ్తారు". ఖర్జూరపు మిఠయిలు-కమ్మనైన హలీములు తియ్యనైన పాయసాలు-తీరైన సలాములు. " అల్ల(హ్) అచ్చా కరేగా" అంటున్నది అమీనా "ఫిత్రా' నందుకున్న చేతులతో దీవిస్తూ అచ్చా పేట్ భరేగా అనుకున్నది ఆలియా ధాన్యమును దానమిచ్చు పద్ధతిని పాటిస్తూ. అంత...

PANDUGALU-NEW YEAR-2013

Image
ప్రతి నాసిక పీల్చని పరిమళాల గాలిని ప్రతి నాలుక రుచి చూడని షడ్రసోపేతములని ప్రతి భుజము మోయని ప్రగతి పంట బరువుని ప్రతి గుండెలో నిండని కరుణ అనెడి కడలిని ప్రతి కడుపు తేంచని పదార్థములతో నిండి ప్రతి చేయి జేకొట్టని బంగారు దేశానికి ప్రతి నడుము బిగించని ప్రతిజ్ఞా పాలనకి ప్రతి అడుగు కదలని ప్రశాంత జీవనానికి ప్రతి మేథ తరలని సుందర బృందావనానికి ప్రతిధ్వనులు వినిపించని జయజయ నినాదముకి. విశ్వమే విరబూయని శాశ్వత ఆనంద పూవులని .

pandugalu-new year 2012

Image
 నూతన సంవత్సర శుభాకాంక్ష  రమ్మన్నా,పొమ్మన్నా ముమ్మాటికి విననంటూ ఎవరేమనుకున్నాగాని తనదారే తనదంటూ మంచిచెడులు పంచుతూ కలిమిలేమి చెలిమిచేస్తూ సుఖదు:ఖముల శ్రీముఖములు చూస్తూ పెద్దతనమునేమాత్రము చిన్నబుచ్చనీయకుండా చిన్నతనము వెన్నుగా మిన్నతనము చాటుతూ మత్తులెన్నో తొలగిస్తూ గమ్మత్తులనెన్నో తెస్తూ వీడలేని వీడ్కోలు ఎంచలేని ఎదుర్కోలు ఇరుముఖములుగా గల జానుస్‌ జనవరిగా మారగా కాలపు కొలమానముగా యమ మాయాజాలముగా దోబూచులాడుతూ చీకటి వెలుగులుగా వాకిత్లో వరమైనది రెండువేల పద్నాలుగు.

PANDUGALU-BONALU

Image
బోనాలు శుభాకాంక్షలు .................. తల్లీ..బైలెల్లినాదరో సల్లంగ..సూసి నాదరో ................. జాతరల మోతలతో అసాడం..ఐతారం పిల్లగాళ్ళు..పైలమంటూ తల్లీ..బైలెల్లినాదిరో సల్లంగ..సూసినాదిరో .............. ఏ..పొద్దూ..కాపాడు మా..పెద్దతల్లి ముద్దైన..రూపాలు..ఇంగో..ఓ సద్దడి..చేస్తున్నయి తల్లీ..బైలెల్లినాదిరో సల్లంగ..సూసినాదిరో ........... పోచమ్మ,మైసమ్మ ఎల్లమ్మ,రేణుకమ్మ కొండలమ్మ,గాజులమ్మ అంకాలమ్మ,పోలేరమ్మ ముత్యాలమ్మ,సత్యాలమ్మ ఎన్నెన్ని.రూపాలతో తల్లీ..బైలెల్లినాదిరో సల్లంగ..సూసినాదిరో .......... పచ్చంగ..ఉండాలని పచ్చి కుండలను తెచ్చి అచ్చంగ..అమ్మరూపు ముచ్చటగ..దిద్ది ఘటనలను..తప్పింపగ ఘటములతో..మెప్పింపగ పచ్చన్నముతో..నీ..కాడికి వచ్చింది..పోచమ్మా ...... *ఊరడి* అందుకుని ఆరడులు..తోలేయి 11తల్లీ11 ......... దూకుడులను..తప్పించగ మూకుడులు..తెచ్చి ఆ..నాకము..దింపగ పానకము..పోసి బాగుకోరు..తల్లికి *సాకు* వార..బోయగ సాగింది..మైసమ్మ ..... *సాకు* నందుకుని మమ్ము సాకు తల్లీ 11తల్లీ11 ......... బండరాయి..మనసులను బండారుతో..మారిసి కొండేక్కని..దీపాలతో ఎండీ..కడియాలు..మోగ పాపాలను..తొలగించ ఏపాకులను..బట్టి శివశక్తి..రూపాలై చిందే...

PANDUGALU-BATUKAMMA-04

Image
బంగారు బతుకమ్మ తెలంగాణ పండుగ తెలుగుజాణ పండుగ సాయుధపోరాటానికి సాయమైన పండుగ అడవిపూల అందాలు విందుచేయు పండుగ మంత్రాల మేళాల తంతులేని పండుగ సింహాసనముల వాహనముల చింతలేని పండుగ పిండిముద్ద దండి అన్న మెండైన పండుగ వేయికనుల శిల్పక్కకు హాయి కలుగు పండుగ ప్రకృతి పరమాత్మ అను ఆత్మీయపు పండుగ ఛాందస మందబుద్ధిని మందలించు పండుగ చిన్నా పెద్దా తేడా సున్న అన్న పండుగ చిన్నచూపుకు కనువిప్పై మన్నించమన్న పండుగ పెద్దమనసు ముద్దన్న బతుకమ్మ పండుగ ఆడుతుపాడుతు కొలిచే ఆడపడచుల పండుగ సింగారాలొలుకు బంగరు బతుకమ్మ పండుగ-శుభాకాంక్షలు.

PANDUGALU-ENGILI PUVVU

Image
ఎంగిలిపువ్వు-వెలుగులురువ్వు        *********************** 1.వర్షాకాలములో చెరువులో బురద పేరుకుని ఉంటుంది.(మట్టి గౌరమ్మను)బొడ్డెమ్మను తయారుచేయుటకు గ్రామస్థులు తలాఇంత పూడిక తీయుటతో నీరు శుభ్రపడుతుంది. 2.పూలుపేర్చుట కొరకై పొలిమేరదాటి, కొండగట్టు,చేలగట్తు పక్కన నడచి వెళ్ళుటతో స్వచ్చమైన గాలి పీలుస్తుంటే ఆరోగ్యం బాగుంటుంది. 3.పూలను  తెంపుతున్నప్పుడు ఆ ప్రదేశంలో వెలువడు మూలికాపరమైన రసాయనములు ,గాలి,  వాతావరణము రోగనిరోధకశక్తిని పెంపొదిస్తుంది . 4.పూలను   పేర్చుటలో రంగులు అద్దుటలో,ఆట-  పాటలలో లయ ప్రాధాన్యత వినోద,విజ్ణాన,సందేశాత్మక విలువలు ద్యోతకమౌతాయి. 5.సదాచారమనే చాందసవాద ముసుగులో కొన్ని పూలను మాత్రమే పరిమితం చేసి పూజకు   పనికి రావన్న గునుగు,తంగేడు,రుద్రాక్ష,బంతి,బీ ర మొదలగు పూలకు పెద్దపీట వేసి,ప్రకృతి రూపంలో పరమాత్మునిప్రసాదమైన ప్రతిపువ్వు చిరునవ్వేనని తెలియ చేస్తుంది . 6 . అహల్యశాప సమయమున ఇంద్రునికి శరీరమంతా కన్నులుగా శాపము లభించిందని,తనువంతా కనులు కలిగిన సీతాఫలము నైవేద్య నిషేధమనిన కుహనా సంప్రదాయమునకు తెరతీసి ,మనకు మధురత...

PANDUGALU-BATUKAMMA-03

Image
పదహారణాల తెలంగాణ ఆడి పాడుచున్న వేళ పుత్తడి బతుకమ్మ ఉయ్యాలో పూల బుట్టబొమ్మ ఉయ్యాలో రాగి తాంబాళంలోన ఉయ్యాలో భోగ భాగ్యాలమ్మా ఉయ్యాలో గుమ్మడాకు మీద ఉయ్యాలో పసుపు పచ్చని బొమ్మ ఉయ్యాలో అడవిపూల అందాలు ఉయ్యాలో అమ్మ అందెలమ్మా ఉయ్యాలో చెట్టు చేమ సొబగు ఉయ్యాలో చెమ్మ చెక్కలాట ఉయ్యాలో కొండ కోన మురిసె ఉయ్యాలో కోలాట మాడంగ ఉయ్యాలో ......... సిత్తు సిత్తుల బొమ్మ ఉయ్యాలో సితి కాలి బతుకునమ్మ ఉయ్యాలో ఎర్ర కలువల చుట్లు ఉయ్యాలో ఎర్రిపెత్తనమును మొట్టె ఉయ్యాలో తామర పూలదండ ఉయ్యాలో ఏడుగురన్నల చెల్లి ఉయ్యాలో తంగేడు పూల చుట్లు ఉయ్యాలో తరుణి తాగమమ్మా ఉయ్యాలో పూజలందు నిలిచె ఉయ్యాలో చోళరాజ బిడ్డ ఉయ్యాలో నాడు మూసిన కన్నులు ఉయ్యాలో దోసిట పువ్వులు నేడు ఉయ్యాలో ....... చెరువులు నిండేను ఉయ్యాలో కరువు తీరేనంట ఉయ్యాలో గుమ్మాడి పూలచుట్ట ఉయ్యాలో అమ్మాడి చిరునవ్వు ఉయ్యాలో గునుకపూలు మెరిసె ఉయ్యాలో బతుకమ్మ పలువరసై ఉయ్యాలో చెడ్డతనమును తరుము ఉయ్యాలో మా దొడ్డ బొడ్డెమ్మ ఉయ్యాలో ... వదినల్లు వచ్చారు ఉయ్యాలో బతుకమ్మ ఆడంగ ఉయ్యాలో పిల్లా పాపాలంత ఉయ్యాలో తల్లి చల్లంగేలగాను ఉయ్యాలో సంబరాలు సాగ ఉయ్యాలో శిల్పక్క రుచులమ్మ ఉయ్యాలో నీళ్ళ ...

PANDUGALU-NEE NOMU NAE NOMUDU

Image
నీ నోము నేనోముదు ఏమేమి పాటొప్పునే గౌరమ్మ ఏమేమి ఆటొప్పునే పాదేటి పాటొప్పునే గౌరమ్మ ఆడేటి ఆటొప్పునే పాడేటి పాటలోన సాగు ఏరుల్లార,మోగు గాలుల్లార,ఊగు పైరుల్లార రాగి తాంబాళాన అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగుతంగేడులు,సేరు సేమంతులు,రంగు రుద్రాక్షలు,ఎలిగేటి దీపములు,సద్ది గౌరమ్మలు పూచేటి పూలలోన గౌరమ్మ గుమ్మాడి నేనౌదును కాసేటి పండ్లలోన గౌరమ్మ శిల్పక్క నేనౌదును..... ఆడేటి ఆటలోన లేగదూడల్లార,సోగ కన్నుల్లార,కాలి అందెల్లార రాగి తాంబాళాన అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగు తంగేడులు,సేరు సేమంతులు,రంగు రుద్రాక్షలు,ఎలిగటి దీపములు,సద్ది గౌరమ్మలు మొక్కేము ఎలగపండే గౌరమ్మ రెండేసి దోరపందే మొక్కేము ఎలగపందే గౌరమ్మ రెండేసి దోర పండే గౌరమ్మను పిలిచి,తానాలు చేయించి,అక్షింతలద్దించి,గంధాన కడిగించి,కుంకుమను జారించి,పసుపును పూయించి,పూవాన తేలించి,ఇందయని ముద్దనిడి,బతుకమ్మ తల్లితో చద్దులే ఆడుచు,తోటనే సేరంగ బంగారు పండ్లవనమే గౌరమ్మ సింగారమే తోచెనే... మా అమ్మ జాతరలో రాగితాంబాళాన అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగుతంగేడులు,సేరు సేమంతులు,రంగు రుద్రాక్షలు,ఎలిగటి దీపములు,సద్...

PANDUGALU-ERUVAKA PUNNAMI

Image
Vimala Kowtha   < vimalaklp@gmail.com > Jun 18 to  me ఏరువాక (సీతా యజ్ఞము ) ************************ మట్టిపై మమకారమాయె రైతు కంట కారమాయె అన్నదాత కళ్ళుసూడ ఆగని జలధారలాయె గుండె పగిలి సెరువాయె ఆ సెరువు నీటితోనైన సేద్యము సేద్దామన్న ఏడున్నది ఏరువాక? ఎన్నడమ్మ దాని రాక? అరకొర వానలాయె అరక దూపు తీరదాయె అన్నదాత పెయ్య సూడ సిక్కిన బొక్కల గూడాయె బుక్కెడు బువ్వ లేకపోయె ఆ బొక్కలగూడు కాడెయైన దుక్కి దున్నుదామన్న ఏడున్నది ఏరువాక? ఎన్నడమ్మ దానిరాక? దళారీ దందాలాయె ధర అసలు గిట్టదాయె అన్న దాత బతుకు సూడ ఆగమవుతున్నదాయె ఆశలు బుగ్గిపాలాయె ఆ ఆగము నాగలిచేసియైన సాగు సేద్దమనుకుంటే ఏదమ్మ ఏరువాక? ఎన్నడమ్మ దానిరాక? దేశపు వెన్నెముక ఆయె దేనికి వెనుకాడడాయె అన్నదాత తెగువ సూసి పశువులకు పూజలాయె పంట పనులు షురువాయె నేడే కద ఏరువాక నేటిరైతు ఆశారేఖ!!!!!!!!!!. (స్పూర్తినిచ్చిన శ్రీమతి శారద రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదములతో.)  

PANDUGALU-GANESH POOJA

Image
జై.బోలో.గణేష్.మహరాజకి.జై అభివందనం..గణపతి ఆదిపూజ్య.....గణపతి ఇక్షుదండ....గణపతి ఈశపుత్ర......గణపతి ఉత్సవరూప...గణపతి ఊహాతీత.....గణపతి ఋషిపూజ్య...గణపతి ఎలుకవాహన..గణపతి ఏకదంత......గణపతి ఐశ్వర్య......గణపతి ఒద్దికైన.....గణపతి ఓంకార.......గణపతి ఔదుంబర.....గణపతి అంబాసుత......గణపతి దు:ఖహర.....గణపతి ..............ఈ స్వరార్చనను గైకొనరా సర్వార్చనగా.గణపతి ............... కలుషహర....గణపతి ఖలవిదూర..గణపతి గణనాయక...గణపతి ఘన వరముల.గణపతి జ్ఞానదాత..గణపతి ........ చవితిపూజ్య.గణపతి చత్రధర...గణపతి జయమునీయ...గణపతి ఝషరూప....గనపతి విజ్ఞానము......గనపతి ......... టంకపు.ఓ.గణపతి హఠయోగప్రియ.గణపతి డమరుహస్త..గణపతి ఢంకా.నాద.గణపతి ప్రణవరూప....గణపతి .............. తరియించగ..గనపతి రథారూఢ..గనపతి హ..గణపతి దయారూప..గణపతి ధర్మతేజ..గణపతి నగపౌత్ర.గణపతి ............ పండితశుభ.గణపతి ఫలదాయక..గణపతి బతుకునీయ..గణపతి భద్రతీయ..గణపతి మధురహాస.గణపతి ........... యతిసేవ్య.గణపతి రక్షకుడు.గణపతి లక్ష్మీపతి..గణపతి వక్రతుండ.గణపతి శత్రుహర..గణపతి షణ్ముఖ సోదర.గణపతి సకలము.శ్రీ.గణపతి హరిద్రా..గణపతి కళలధారి..గణపతి క్షమాహృదయ.గణపతి ఱాతి..రూప.గణపతి ...........

JAI SREEMANNAARAAYANA-04

Image
" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే" ఓం నమో నారాయణాయ-3 ********************** విచిత్రముగ నామది " శ్రీ విల్లి పుత్తూరు" గా మారినది "విష్ణుచిత్తీయమై" శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది. పునీతులు-గోపికలు పురుషార్థ ప్రదమైన పుణ్య స్నానములు చేయుచున్న తీర్థములలో నింగి-నేల స్నేహముతో హితము రంగరించినదైన పల్లెతల్లి పులకింతల పచ్చని పంట పొలములలో నింగి-నేల-జలము దాగుడుమూతలాడుచున్నవైన పారుచున్న సరసులోని చేపల కేరింతలలో మరుగుజ్జు రూపమున ముజ్జగములు కొలిచిన వాడైన ఆ వామనమూర్తి త్రివిక్రమ పరాక్రమములో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము పుష్కర తీర్థములలోను,పంట పొలములలోను,వాటి మధ్యనున్న సరసులలో ఆడుచున్న చేపలలోను,మరుగుజ్జు రూపములో యాచకునిగా మారి ముజ్జగములను కొలిచిన వామన మూర్తి పరాక్రమములోను నిమగ్నమైన నా మనసు,మీ అందరితో కలిసి, పాశురములను కీర్తించుచు,భక్తి పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను, స్వామి...

JAI SREEMANNAARAAYANA-04

Image
" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే" ఓం నమో నారాయణాయ-3 ********************** విచిత్రముగ నామది " శ్రీ విల్లి పుత్తూరు" గా మారినది "విష్ణుచిత్తీయమై" శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది. పునీతులు-గోపికలు పురుషార్థ ప్రదమైన పుణ్య స్నానములు చేయుచున్న తీర్థములలో నింగి-నేల స్నేహముతో హితము రంగరించినదైన పల్లెతల్లి పులకింతల పచ్చని పంట పొలములలో నింగి-నేల-జలము దాగుడుమూతలాడుచున్నవైన పారుచున్న సరసులోని చేపల కేరింతలలో మరుగుజ్జు రూపమున ముజ్జగములు కొలిచిన వాడైన ఆ వామనమూర్తి త్రివిక్రమ పరాక్రమములో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము పుష్కర తీర్థములలోను,పంట పొలములలోను,వాటి మధ్యనున్న సరసులలో ఆడుచున్న చేపలలోను,మరుగుజ్జు రూపములో యాచకునిగా మారి ముజ్జగములను కొలిచిన వామన మూర్తి పరాక్రమములోను నిమగ్నమైన నా మనసు,మీ అందరితో కలిసి, పాశురములను కీర్తించుచు,భక్తి పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను, స్వామి...

ANANDA LAHARI-15

    గయే  మాంగల్య గౌరికా  " గదాధర సహోదరి గయా గౌరీ నమోస్తుతే    పితౄణాంచ సకర్తౄణాం దేవి సద్గుణదాయిని    త్రిశక్తిరూపిణీ మాతా సచ్చిదానందరూపిణి    మహ్యం భవతు సుప్రీతా  గయా  మాంగళ్య గౌరికా"   ఫల్గునితీర  బీహారు రాష్ట్రములోని  గయ అను ప్రదేశములో పడిన మాయాసతి యొక్క వక్షోజములు ,దయయే ధర్మముగా గల మాంగల్య గౌరీదేవిగా ప్రకటింపబడి, ఆ క్షేత్రమును "పాలనా పీఠముగా" కీర్తింపబడుచున్నది.మంగళగిరి కొండలపై తూర్పు ముఖాభిముఖియైన్ గుహాలయములో తల్లి స్థితికారకత్వముగల తన రెండు స్తనములను,రెండు శిలారూపములుగా దర్శింపచేస్తూ,దయ చూపిస్తున్నదని పద్మ,విష్ణుస్థలపురాణములు కీర్తించుచున్నవి.       " గయ" అను శబ్దమునకు అనేక మూలములు కలది అను అర్థము కలదు.విష్ణువుచే ఖండించబడిన గయుని శరీరపు ముక్కలు అనేకములు ఈ పవిత్ర క్షేత్రమున అనేక అచలములై(కొండలై) అచంచల భక్తితో అమ్మను ఆరాధించుచున్నవి.   గయ అను పదమునకు పునీతముగావింపబడిన ప్రదేశము అని మరొక అర్థము కలదు.సుదర్శన చక్ర స్పర్శచే పునీతము గావింపబడిన అసురుని శరీరభాగములకు గయ అను నామము సార్థకమగును. ...

ANANDA LAHARI-19

Image
. శ్రీశైలే భ్రమరాంబికా ***************** " శివ పార్శ్వావస్థిత మాతే శ్రీశైలే శుభపీఠికే భ్రమరాంబిక మహాదేవి కరుణారస వీక్షణ" " శ" కారము సుఖ బీజము."ర" కారము అగ్ని బీజము."ఈ" కారము చిఛ్చక్తి స్వరూపము.ఎటువంటి పరిస్థితినైనను అనుకూలముగా చేయగలది "శకారము." శకార-ర కార-ఈ కార సమ్మిళితము శ్రీశైలము. శ్రీశైలమునకు సిరిగిరి,శ్రీగిరి,శ్రీ పర్వతము మొదలైన నామాంతరములున్నవి.శ్రీ అనగా సంపద. శైలము అనగా పర్వతము."శ్రీశైలము" అనగా సంపద్వంతమైన పర్వతము.దీనికి శ్రీ కైలాసము అనుపేరు కూడా వ్యవహారములో కలదు.మహేశ్వరులు శ్రీ కైలాసమునందున్నారని 13 వ శతాబ్దపు శాసనము తెలియచేయుచున్నది కృష్ణానదీ తీరమున,దట్టమైన నల్లమల అడవుల గుట్టలపై పడిన మాయాసతి మెడ భాగము "భ్రమరాంబికా దేవి" గా భక్తులను అనుగ్రహించుచున్నది.అయ్యవారు మల్లిఖార్జున స్వామి. శ్రీ సిరివరపు నాగమల్లిఖార్జున శర్మగారి అభిప్రాయము ప్రకారము శ్రీశైలము ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవది.అష్టాదశ శక్తిపీఠములలో ఆరవది.దశ భాస్కర క్షేత్రములలోను ఆరవది. అమ్మవారి గర్భగుహ లోపల అగస్త్యముని భార్య లోపాముద్రా దేవి,మ...

ANANDA LAHARI-18

Image
1 ఓఢ్యాణే గిరిజాదేవి " ఓఢ్యాణే గిరిజాదేవి పితృర్చన ఫలప్రదా బిరజ పరా పర్యాయస్థిత వైతరిణితటే త్రిశక్తీనాం స్వరూపాచ లోకత్రాణ పరాయణా నిత్యం భవతు సాదేవి వరదా కులవర్ధని." వైతరిణి నదీతీరమున కల ఓఢ్యాణపురములో మాయాసతి నాభిభాగము పడి వరప్రదాయిని గిరిజాదేవిగా కొలువైనది.ఒడిషా/ఒరిస్సా/ఒడియా/ఒరియా అని పిలువబడుచున్న, ప్రదేశములోని జాజ్ పూర్ ప్రాంతమును జగజ్జనని తన నివాసముగా ఎంచుకున్నది.నాభి ప్రదేశమును నడుమును ఒడ్డానముతో ప్రకాశించు తల్లి ఉన్న ప్రదేశము కనుక ఓఢ్యాణపురము అని కూడా భావిస్తారు.హిమవన్నగము మేనకలను తల్లితండౄలుగా అనుగ్రహించిన తల్లి కనుక గిరిజాదేవి అని అమ్మను కొలుస్తారు.విరజ అనగా శుభ్రపరచు అను అర్థమును అన్వయించుకుంటే మన పాపములను శుభ్రపరచుచు మనలను పునీతులను చేయు తల్లికనుక విరజాదేవి అని పూజిస్తారు.ఆర్యా స్తోత్ర ప్రకారము ఉత్కళరాజ్యస్థులు విరజా దేవిని తమ కులదేవత గా ఆరాధించెడివారు. తల్లి మహాలక్ష్మి-మహాశక్తి-మహా సరస్వతిగా పరిపాలిస్తుంటుంది.అమ్మ నాభి ప్రదేశము పడిన ప్రదేశము అని కొందరు భావిస్తే,గయాసురుని నాభి పడిన ప్రదేశమని మరికొందరు ఇక్కడ బావిదగ్గర పితృకార్యములను నిర్వహిస్తుంటారు దాని వలన ...

ANANDA LAHARI-17

Image
  కాశ్మీరేతు  సరస్వతి  " శారద  నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా    హార  తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం    దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా    కారతనొప్పు నిన్ను మది గానగ నెన్నడు కల్గు భారతీ" అని,  శ్రీమదాంధ్ర మహాభాగవతములో పోతనామాత్యునిచే కీర్తింపబడిన సరస్వతి పీఠము మాయాసతి కుడిచేయి పడిన ప్రదేశముగా చెబుతారు. సర్వస్వాత్ సరస్వతి అను నానుడి కలదు.స్వాత్ లోపల నిండియున్న సర  సర్వము.మనలోపలనిండి సమయ సందర్భానుసారము ప్రకటితమయే శక్తియే  సరస్వతి అని సారస్వతమని  పండితులు భావిస్తారు. సంగీతములో సాహిత్యములో నిండియున్నా  స్వర ప్రస్థానములే  సరస్వతీ రూపముగా భావించే శాక్తేయ సంప్రదాయము కలదు.       " అక్షరాభ్యాసములోనే" యోగశక్తి  నిక్షిప్తము అయివున్నది..వర్ణము అనగా అక్షరము-రంగు అని రెండు అర్థములు కలవు.సర్వశుక్లా  సరస్వతీ అన్న సూక్తిని గ్రహించినట్లయితే అమ్మవారు శుద్ధసత్వమైన తెల్లనితెలుపు రంగు.కనుక సర్వ వర్ణోప శోభితా అను స్తుతి వాక్యమును మనము అన్ని అక్షరముల స్వరూపముగా భావించినట్లయితే,మాతా సరస్వ...