Sunday, March 15, 2020

VARTULAAVRTAM KAALAM-VAANCHITAM VISVASRAEYADAM.

ఆర్యులు "ఉ" అను అక్షరమును నక్షత్ర సంకేతముగాను," గ" అను అక్షరమును గమన సంకేతముగాను నిర్వచించి,ఉగాది అను సంవత్సరారంభమును బ్రహ్మకల్ప ప్రారంభముగాను గుర్తించారు.యుగ అనే పదమును ద్వయముగా అన్వయించుకుంటే ఈ నక్షత్ర గమనము ఉత్తరదిక్కు-దక్షిణ దిక్కు అను రెండితి వైపు ఉన్నది కనుక యుగాది గాను భావిస్తారు.తెలుగు సంవత్సరాల నామములు వాటి స్వరూప-స్వభావాలను స్పష్టీకరిస్తుంటాయనుట నిర్వివాదము.ఉదాహరణకు సృష్టి ప్రకటితమైన కాల నామమును ప్రభవ అని ముగియు నామమును క్షయ అని తిరిగి ప్రభవిస్తుంది కనుక అక్షయ అని పేర్కొన్నారు.

    క్షమాపణ అభ్యర్థిస్తూ

  సంవత్సరాది ప్రత్యేకతను తల్లిగా-తండ్రిగా-గురువుగా గుర్తించి,గణుతించే ప్రయత్నము చేస్తున్నాను.

బ్రహ్మ కూడ తన నియమిత కాలము ముగియగానే అంతరించి,తిరిగి ప్రభవిస్తాడు సృష్టి రచనకు అని అంటారు.వసంటం ప్రారంభమైన చైత్రశుధ్ధ పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా బ్రహ్మ రస జగత్తును సృష్టిచేస్తాడని ఐతిహాస వచనము.శార్వరి నామ సంవత్సర చైత్రశుక్ల పాడ్యమి బుధ వారము ఉషకాలమను తల్లి కొత్తసంవత్సరమునకు జన్మ నిచ్చి పురుడు పోసుకున్నది.ఔషధ స్వభావముతో,తన సంతతిని సమర్థవంతముగా సంతోష వంతులుగా చేయుటకు తన సర్వ శక్తులను స్సన్నధ్ధము చేస్తున్నది.అవసరమైన కొన్ని వనరులను పుర్వ సంవత్సరమైన వికారి నుండి స్వీకరించి తన తరువాత వచ్చు కొత్త సంవత్సరమునకు అందించే తలంపుతో నున్న ఈ జగతికి కొత్తదనమును అందించే కాలమా! మాతృదేవో నమః.



 "తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్" తనచే సృష్టింపబడిన సకలచరాచరములందు ప్రవేశించు పరమాత్మకు ప్రణామములు.ఎవరు ఉష స్వరూప-స్వభావముతో సకలమును సృష్టిచేసారో వారే శర్వ (విష్ణు) నామ గుణముతో పోషణకర్త (జగత్పిత) గా స్థితికార్యమునకు పూనుకుంటాడు.అహం సంవత్సరో అన్నాడు పరమాత్మ.ఋతు సుదర్శన కాలః.చక్కగా దర్శించగలిగిన ఋతుస్వరూపము నేనే అని మనలకు పదేపదే చెబుతున్నాడు.శర్వుడు-(శుభంకరుడు) అన్నమన్నాద ఏవచ అని అన్న స్వరూపము నేనే తన స్థితికారకత్వమును స్పష్టీకరిస్తున్నాడు కాలస్వరూపముగా మనము అన్వయించుకోగలిగితే.

 అన్నము అంటే తినేపదార్థము మాత్రమే కాదు.కంటికి దృశ్యము,చెవికి శబ్దము,మనసుకు తృప్తి ఇలా ప్రతిశక్తిని ఉద్దీపింపచేసే -ఉద్యమింపచేసే ప్రతిశక్తి.దానిని నిక్షిప్తము చేస్తూ-నిర్వహింపచేస్తున్న కాలమనే మహాశక్తిని మనము తంద్రిగా గమనించకుందా-గౌరవించకుండా ఉండగలమా?




 కొత్త సంవత్సరమును తల్లియై సృష్టించిన పరమాత్మ విశ్వం-విష్ణుం గా తండ్రియై అత్మ చైతన్యమును అఖిల చైతన్యముగా మలుస్తున్నాడు."విశతి" ఇతి విశ్వం.పరమాత్మ తనచే ప్రకటింపబడిన ప్రతిదానిలోనికి ప్రవేశించి ప్రభావితము చేస్తు, సమతౌల్యమును సమర్థవంతము చేస్తు, పోషకుడై పుష్టినిస్తున్నాడో అతడు జగత్పిత కాక మరి ఎవ్వరు?కలడంబోధి కలండు గాలి అని ప్రహ్లాదునిచే కీర్తించబడినవాడు శర్వుడు స్థితికారకుడై స్తుతులనందుకొనుచున్నాడు.ప్రకృతి శక్తులను పలు నామరూపములతో పరిభ్రమింపచేస్తూ తన పటిమను నిరూపిస్తున్నాడు.శర్వుని కనుసన్నలలో నడచునది శార్వరి సంవత్సరము.శుభములకు సంకేతము.పాడిపంటలకు ప్రతిరూపము.వ్యాపకత్వమునకు-ప్రాపకత్వమునకు ప్రతిరూపము.పితృదేవో భవ.

 "గు" కారో అంధకారస్య "రు" కారో తన్నివారణం.

 ఉషాదేవి తల్లియై కొత్తసంవత్సరమును సృష్టిస్తే,శర్వ శక్తి పోషణ బాధ్యతను స్వీకరిస్తే,భూమినుండి ఆకాశములోని అద్భుత పరిణామాలను గణించి-గుణించి వాటి ఫలితములను మనకు అందచేయు అద్భుత విజ్ఞానమే పంచాంగమను పరి రక్షణ ప్రస్థానము.సూర్యచంద్రుల ప్రయాణములను పరిరక్షితు,సమస్త శాస్త్రములను సమగ్ర పరుస్తు.సమర్థవంతముచేస్తూ,రాబోవు అడ్డంకులను సూచిస్తూ,పరిష్కారములను ప్రస్తావిస్తుతిథి-వార-నక్షత్ర-యోగ-కరణములను పంచభాగములతో కూడిన అచంచల విశ్వాసము.తిథి సంపదలకు-వారము ఆయుర్దాయమునకు-నక్షత్రము పుణ్యమునకు యోగము వ్యాధి నిరోధక-నాశకత్వమునకు,కరణము ఇష్టకామ్యసిధ్ధికి సంకేతముగా జ్యోతిష్యము గుర్తించి-గౌరవిస్తుంది.

 ఆచరించి చూపించే ఆ పరమాత్మ అద్భుత తత్త్వమును ఆచార్య తత్త్వము అని అనకుందా ఉండలేము కదా.అజ్ఞాన తిమిరహరమా "తం ఆచార్య దేవో భవ " అంటూ మనలను అనుక్షణము అనుసరింపచేస్తాడు.

  కాలమును గౌరవించుటయే సకలమును గౌరవించుట.

మిత్రులారా!


 ( నా అభిప్రాయముతో అంగీకరిస్తే ఆశీర్వదించండి.కాదనుకుంటే క్షమించండి.)

  శుభం భూయాత్.


  






Thursday, March 12, 2020

TAPASYA MASAMU-PARJANYA


  తపస్య మాస పాలనకై వర్షకారకుడైన ఆదిత్యుడు పర్జన్యుడు తన వృష్టి సర్జన కిరన ప్రసరనకు పయనమౌతున్న సమయమున భరద్వాజ ముని వేదపారాయణతో సుసంపన్నము చేస్తున్నాడు.సేనాజిత్ అప్సరస తన నాత్యముతో,విశ్వ గంధర్వుడు తన గానముతో విశ్వమును విలక్షణము చేస్తున్నాడు.ఐరావత సర్పము రథ పగ్గములను పరిశీలించి,ప్రయాణమునకు సిధ్ధము చేస్తున్నాడు.రీతు అను యక్షుడు సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధానము చేస్తున్నాడు.వర్స రాక్షసుడు రథము వెనుక నిలబడి,రథమును ముందుకు జరుపుతుండగా అపాం మిత్రుడు పర్జన్య నామధారియై ప్రాణికోటికి జలమును అందించుటకు తన కిరణములను జరుపుచున్నాడు.

  తం పర్జన్య ప్రణమామ్యహం.


TAPAS MASA-PUSHA



 " పుష్ణాతి ఇతి పూషా". తన కిరణ శక్తులచే సర్వ జగములను పోషించువాడు పూషా నామధేయ ఆదిత్యుడు.మధ్యాహ్న సమయమును అధిష్టించియున్న సౌరశక్తి.గౌత ముని వేదపారాయణతో శుభారంభమునుచేయుచుండగా తపస్ మాస నిర్వహణకు తరలుచున్నాడు స్వామి.ఘృతాచి అప్సరస ఆనందముతో అడుగులు కదుపుచుండగా,సుసేన గంధర్వుడు గానమును ప్రారంభించాడు.ధనంజయ సర్పము రథ పగ్గములను పరిశీలించి,పటిష్టము చేయుచుండగా సురుచి అను యక్షుడు సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధానము చేయుచున్నాడు.వాల రాక్షసుడు రథమును ముందుకు జరుపుచుండగా జగత్ పోషణకు జగన్నాథుడు తన కిరణములను జరుపుచున్నాడు.

   తం పూషా ప్రణమామ్యహం.

SAHASYA MASA-BHAGA

 సహస్యమాసము-భగ
 *******************
 " భర్జతీతి ఇతి భర్గ" భగ నామ ఆదిత్యుడు సహస్య మాసమునకు ప్రభువు.భ అనగా తేజము.గ అనగా గమనము.తేజోవంతమైన తన గమనముతో(కిరణ శక్తులతో) సమస్త అజ్ఞానమును భర్జింపచేసే మహాతేజస్సు.ఆయుర్ముని వేదపఠనమును ప్రారంభిస్తూ స్వామికి లాంఛనముగా మార్గమును చూపించుటకు సిధ్ధముగా నున్నాడు.పూర్వసిత్తి అను అప్సరస అభినయ నాట్యముతో స్వామిని సేవించుచున్నది.అపూర్వముగా అరిష్టనేమి అను గంధర్వుడు తన గళమును సవరించుచు,మాసమును మంగళప్రదమొనరించుచున్నాడు.కర్కోటక సర్పము రథపగ్గములను పరిశీలించి,ప్రయాణమునకు పటిష్టము చేయుచున్నాడు.యక్షుడు ఊమ సప్తాశ్వములను రథమునకు అనుసంధానము చేస్తూ,ఆనందోత్సాహుడైనాడు.స్పూర్జ రాక్షసుడు రథము వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా సకల లోకములను తన కిరణ ప్రకాశముతో జ్ఞాన వంతము చేయుటకు సన్నధ్ధుడైనాడు స్వామి..

    తం భగః ప్రణమామ్యహం.



Saturday, March 7, 2020

SAHAS MASAMU-AMSUMAAN

 " అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః" లోపల బయట సౌరశక్తిపరముగా వ్యాపించి తన కిరణములద్వారా చైతన్యమయము చేయగల పరంజ్యోతి అంశుమాన్ సహస్ మాస

 సంరక్షణకు సన్నధ్ధుడగుచుండగా,పశ్యక (రక్షణ0స్వభావి కశ్యప మహాముని వేదోక్త ప్రారంభమునకు ఆయుత్తుడగుచున్నాడు.ఉర్విని మనోహర మధుకలశముగా మార్చవలెనన్న ఊహకలిగిన ఊర్వశి తన అదుఘులను అతిమనోహరముగా కదుపుచుండగా,ఋతుకర్తను కీర్తిస్తూ ఋతసేన నామ గంధర్వుడు తన గళమును కలుపసాగాడు.యక్షుడు తర్క్య సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధిస్తూ,ఆనందోలాసుడైనాడు.మహాశంఖ సర్పము రథ పగ్గములను పరిశీలిస్తూ,పటిష్టము చేస్తూ,ప్రయాణమునకు సిధ్ధపరుస్తున్నాడు.విద్యుత్చ్చాత్రు రథమును ముందుకు జరుపుటకు ఉద్యమించుచుండగా,ప్రశంసాపాత్రుడు అంశుమాన్ తన కిరణములను ప్రసరించుటకు సన్నధ్ధుడనాడు.

 తం అంశుమాన్ ప్రణమామ్యహం.




URJAMASAMU-VSHNU


 "విష్ణుం జ్ష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం."

 ఉర్జ్య మాస రంరక్షకినిగా ఉద్యమిస్తున్న "ఆదిత్యానాం అహం విష్ణుః" కు అనేక కోటి నమస్కారములు. యాని నామాని గౌణాని అంటూ,విశ్వ శ్రేయస్సుకై విశ్వామిత్ర మహాముని వేదోచ్చారణమును ప్రారంభించాడు.శుభారంభముగా రంభ యను అప్సరస నాట్యమును ప్రారంభిస్తుంటే,గంధర్వ సూర్యవర్చ గానామృత గమకములతో గణుతిస్తున్నాడు.అశ్వత సర్పము పగ్గములను పరిశీలిస్తున్నాడు.యక్షుడు
 సత్యజిత్ సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధిస్తూ,అర్చించుకుంటున్నాడు.మఖపేత రాక్షసుడు స్వామి రథమును వెనుకనుండి జరుపుతూ,జగత్కళ్యానమును కోరుతుండగా వ్యాపకత్వ-అసుర సంహార లక్షనములతో స్వామి కదులుచున్నాడు.

 " తం విష్ణుం ప్రణమామ్యహం."

Friday, March 6, 2020

ISHA MASAMTVASHTA.


 " తనూ కరోతి ఇతి త్వష్టా" సృష్టి లోని ప్రతి పదార్థమునకు ఒక నిర్దిష్ట రూపమును కలిగించేవాడు.

 "రూపము రూపం బహురూపం బభూవ" జగత్తులోని రూపములు ప్రకటింపబడటానికి,వాని గుర్తించగలగడానికి త్వష్ట యే కారణము.

 స్వామి ఈష మాసమున వృక్ష నివాసము చేస్తూ,త్వష్ట నామధేయముతో పరిరక్షిస్తుంటాడు.పెద్దలు త్వష్ట అను నామమునకు మలుచువాడు/తొలుచువాడు అని సమన్వయిస్తారు.మనకు కావలిసిన హరితమును సంభరితము చేస్తూ,ఆహారమునకు కావలిసినవి ఉంచుతూ,కలుపులను తుంచుతూ హరితవాసము చేస్తాడు స్వామి."ఈశావాస్యం ఇదం సర్వం" అన్న సూక్తిని అనుభవైవేద్యము చేస్తాడు.ఆ స్వామికి జమదగ్ని మహాముని వేదసూక్తులతో మోదమునందిస్తుంటాడు.అప్సరస తిలోత్తమ్మ అనుపమాన నాట్యముతో పూజ్స్తుంటుంది.నృత్యం సమర్పయామి అంటూ.దానికి తోడుగా ధృతరాష్ట్రుడను గంధర్వుడు తన భుజబలముతో స్వామి యానగా అవనీతలమును కాపాడుతూ,ఆనందగానము చేస్తుంటాడు.కంబలాశ్వ సర్పము రథపగ్గములను పటిష్టపరుస్తుంటే,యక్షుడు శతాజిత్ తాళ్ళను మెలివేస్తూ,తరలుతున్న గమనశక్తికి గమకము అద్దుతున్నాడు.బ్రహ్మపేత రాక్షసుడు బ్రహ్మాండాధిపతి రథమును వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా,జగములకు తన కరుణను స్పష్టము చేస్తూ,అరిష్టనివారణకై అనుగమిస్తున్నాడు స్వామి.

   తం త్వష్ట ప్రణమామ్యహం.

NABHASYA-VISVAVASU

వ్యాపక లక్షణము కల పరంజ్యోతి వివస్వన్ నామధారియై విశ్వపాలనకు ఉపక్రమించుచున్న శుభతరుణమున భృగుమహాముని వేదపారాయణమునను మోదముతో ప్రారంభించి,స్వామి రథమునకులాంఛన ప్రాయముగా మార్గమును చూపించుటకు సన్నధ్ధుడగుచున్నాడు.అగ్నితత్త్వధారియైన ఆ పరమాత్మను ప్రస్తుతిస్తు అనుంలోచ అను అప్సరస అడుగులు కదపసాగగానే,ఉగ్రసేనుడను గంధర్వుడు ఉత్సాహముతో గానమును ప్రారంభించాడు.శంఖపాలుడను సర్పము పగ్గములను పరిశీలించి పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.యక్షుడు అశరణుడు సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధానము చేస్తూ గమనశక్తిని గమనిస్తున్నాడు.వ్యాఘ్రనామ రాక్షసుడు రథమును వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా నభస్య మాస వైభవమును అందీయుటకు వివస్వంతుడు వెడలుచున్నాడు.

    తం వివస్వన్ ప్రణమామ్యహం.

Wednesday, March 4, 2020

NABHAS-INDRA


వైభవోపేతమైన "నభశ్ మాసము రానే వస్తున్నది.సూర్యనారాయణుడు దేవతలను శత్రువుల నుండి రక్షించుటకు,భవనభాండములను ఐశ్వర్యవంటము చేయుటకు "ఇంద్ర" నామధారియై బయలుదేరుచున్నాడు.అంగీరస ముని మంగళాశాసనములు దిగంతములను చైతన్యవంతము చేయుచున్నవి.ప్రమదముతో అప్సరస ప్రమలోచ హావభావ నాట్యమునకు దీటుగా గంధర్వుడు విశ్వవసు గానము వీనులవిందు చేయుచున్నది.సర్పశ్రేష్టుడు ఎలపాత రథ పగ్గములను పటిష్టము చేయుచు,పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.యక్షుడు శ్రోత స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధించుచున్నాడు.వార్య రాక్షసుడు రథమును ముందుకు జరుపుచుండగా,అందరిని బ్రోచుటకు ఇంద్రుడు తన కిరణప్రసార ప్రయోజనమునకు ఉపక్రమించాడు.

  తం ఇంద్రం ప్రణమామ్యహం.

Tuesday, March 3, 2020

SUCHIMASA-VARUNA

 వరదుడడిగో వరుణనామ ధారియైనాడు.శుచి మాస శుభసంకేతమును సూచిస్తూ,వశిష్ట మహాముని వేదఘోషను ప్రారంభించాడు.అంభోరుహనేత్రి రంభ నాట్యమును ప్రారంభించగనే హూ హూ గంధర్వగానము ఓహో అనేలా జతకలిపింది.ఘర్మసర్జన కిరణ ప్రసాదుని రథపగ్గములను యక్షుడు చిత్రస్వనుడు పరిసీలించి,పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.శుక్ర సర్పము స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధిస్తున్నాడు.సముద్రజలమును త్రాగు స్వామి సంసార మను సముద్రమును దాటించుటకు అవ్యాజ కరుణతో అడుగులు వేస్తున్నాడు.


  " తం వరుణం ప్రణమామ్యహం.

SUKRAMASAMU-MITRA


  చాంద్రమాన చైత్ర-వైశాఖ మాసములను (వసంత ఋతువును) పూర్తి చేసి,సౌరమాన శుక్రమాస శుభములను అందించుటకు,చంద్రుని-సముద్రమునందు మిక్కిలి ఆసక్తి గల మన స్వామి "మిత్ర" నామధారియై కనులవిందు చేయుచు కదులు చున్నాడు.అనుకూల స్వభావము కలవాడు మిత్రుడు అని వాచ్యార్థము.మన స్వామి తన కిరణ ప్రసరణము చేత తైలోత్పత్తులను-ఇంధనములను కలిగించుటకు కదులుచున్నాడు.స్వామి అనుగ్రహము వలనే మనము వాటిని గుర్తించి,ఉపయోగించుకొనగలుగుచున్నాము.

 త్రిగుణాతీతుడు(రజో-తమో-సత్వ)అత్రి మహాముని.వేదోక్త ప్రకారముగా స్వామిని కీర్తిస్తు,లాంఛనముగా రథమునకు దారిచూపుటకు సిధ్ధమవుతున్నాడు అత్రిమహాముని.జన్మాంతరమున విరాటరాజుగా భావింపబడు హా హా అను పేరుగల గంధర్వుడు పాడుతుండగా,మేనక మనోహరముగా నర్తించుచున్నది.సర్పాధిపతి తక్షకుడు పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,అప్రమత్తతో నున్నాడు.రథస్వనుడను యక్షుడు స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధానము చేస్తూ,అనవరత ధ్యానాసక్తుడైనాడు.పౌరసేయుడను రాక్షసుడు రథమును ముందుకు జరుపుచుండగా కదులు చున్న మిత్రస్వామి కిరణములు కళ్యాణప్రదములగు గాక.

 తం మిత్రం ప్రణమామ్యహం.

Monday, March 2, 2020

MADHAVAMASAMU-ARYAMA

అదిగో మధుమాస సంరక్షణను దిగ్విజయముగా పూర్తిచెసుకొని,

   పులహ మహాముని వంశాభివృధ్ధికి కారణమవుతు,వేదవేద్యునికి లాంఛనప్రాయముగా మార్గమును చూపిస్తూ,మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.అప్సరసాంగన పుంజికస్థలి తన దివ్యశక్తులతో నారద గానామృతమునకు అనుగుణముగా నర్తిస్తున్నది.కఛ్చనీరుడను సర్పము ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధపరుస్తున్నాడు ఒద్దికగా.అతౌజుడను యక్షుడు సలక్షణుడై స్వామిరథమునకు సప్తాశ్వములను అనుసంధిస్తూ,ఆనందిస్తున్నాడు.ప్రహేతి రాక్షసుడు పరాక్రమోపేతుడై రథమును ముందుకు జరుపుతున్నాడు.తన కిరణముల ద్వారా ఉష్ణోగ్రతల పెంచుతు,అవనీతలమును ఆనందమయము చేయుటకు మాధవమాస అధిపతియై "ఆర్యమ" నామాలంకృత శోభితుడై తరలు    వాయు తత్త్వ ప్రధాన స్వామీ.
 " తం ఆర్యమ ప్రణమామ్యహం."

MADHUMAASAMU-DHAATA

 మధుమాసము-ధాత
 ******************

 అదిగో! ఆనందోత్సాహము! ఆస్వాదించండి.

 " మననాత్ త్రాయతే మంత్రః" మననము చేసే వారిని రక్షించేదే మంత్రము అను ఆర్యోక్తికి అద్దము పడుతూ,బ్రహ్మ మానసపుత్రుడు,సప్తర్షులలో ఒకరైన పులస్త్యుడు (ప్రథమముగ నుండువాడు),పురాణ సంపదను మానవాళికి చేరువ చేసిన మహనీయుడు వేదవేద్యుని కీర్తిస్తూ,లాంఛన ప్రాయముగా మార్గమును చూపిస్తు మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.క్షీరసాగర మథనానంతరము జలరసముగా ప్రకటింపబడిన/వెలువడిన( అపొ-నీటి-రస-సారము)కృతస్థలి అను అప్సరస అవనీతలమును చిగురింపచేయుటకు ఆడుతూ స్వామిని అనుసరిస్తున్నది.అసమాన సౌందర్యముతో,అప్రమేయ పరాక్రమముతో కోకిలమ్మకు కొత్త కూత నేర్పించుటకా యన్నట్లు,తుంబురుడు తన మధుర గానముతో పరమాత్మను తన్మయ పరుస్తూ,తరించిపోతున్నాడు.

  నాగరాజైన వాసుకి ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధము చేస్తున్నాడు.


 పర్వత పరిరక్షకుడు పరిశీలనా దక్షుడు అయిన రథకృత్ అను యక్షుడు జగములను తన శక్తిచే మాయామోహితులను చేయుటకు స్వామి రథమునకు సప్తాశ్వములకు అనుసంధానమును చేస్తూ, ఆనందిస్తున్నాడు.హేతి రాక్షసుడు రథమునకు వెనుక నిలబడి స్వామి రథమును తన భుజబలముతో ముందుకు జరుపుతున్నాడు.నయనానందకరముగా " ధాత" నామాంకృత శోభితుడై భూతలమును నవనవోన్మేషము చేయుటకు స్వామి తరలుచున్నాడు.

 స్వామి సృష్టికార్యమును తిరిగి ప్రారంభిస్తున్నాడు.మోడుబారిన చెట్లు కొత్తచిగురులు తొడుగుటకు తనతో పాటుగా జలసంపత్తిని (అపరసను) జ్ఞాన సంపత్తిని(పులస్త్య మునిని) మోహవివశులను చేయుటకు రథకృత్ ని,భవసాగర బంధములను (వాసుకిని)సర్పములను ,తమోగుణ హేతి రాక్షసుని సంకేతములుగా తనతో పాటు తరలిస్తున్న ఆ తాపస మనోహరుడు మనలను రక్షించును గాక.
  తం ధాత ప్రణమామ్యహం.

DVAADASAATMAN -NAMOSTUTE.


 ద్వాదశాత్మన్ నమోస్తుతే
 **********************

  "బృహత్వాత్-బృమ్హణత్వాత్ ఇతి బ్రహ్మ."అన్నింటికంటె ఏదిఉత్కృష్టమైనదో అది,బృహతి.బృమ్హణము అంటే వ్యాపకత్వము.ఏది అన్నిటికంటె మహోత్కృష్టమైనదో,ఏది అన్నింటియందు వ్యాపించి యుందో అదియే "బ్రహ్మము." వేదము ఆదిత్యుని బ్రహ్మముగా కీర్తిస్తుంది.సర్వజీవుల యందలి ఆత్మయే బ్రహ్మము.అది జగతఃస్థుషః -తాను కదలకుండ ఉంటూ అన్నింటిని కదిలించే శక్తి గల స్థావర-జంగమాత్మకము.

  ప్రత్యక్ష పరంజ్యోతి ఏడాది పొడవునా ఒకతే స్వరూప-స్వభావాలతో వెలుగులు-వేడి వెదజల్లుతుంటే మనము తట్టుకోగలమా? అసలు ఆ ఊహనే అమ్మో? మన పొట్ట నింపుకోగలమా?విద్య పై పట్టు సాధించగలమా?వైద్యరంగపు మెట్లు ఎక్కగలమా?కొన్ని రోజులు చిగురులు-మరి కొన్ని రోజులు గుబురులు.కొన్ని రోజులు ఎండలు-మరి కొన్ని రోజులు వానలు.కొన్ని రోజులు వెన్నెల-మరి కొన్నిరోజులు శిశిరము.కొన్ని జీవులు పుట్టుట-మరి కొన్ని జీవులు గిట్టుట.కొంత మందికి బాల్యము-మరి కొంత మందికి భారము.ఇవన్నీ కలిగించటానికే " ఏకం సత్ విప్రా బహుదా వదంతే" అన్నట్లు పన్నెడు రాశులలో పన్నెండు రూప -గుణములతో,తన నుండి ప్రకటింప బడిన ఆరు శక్తులతో కలిసి,ఆరగింపులను అందిస్తున్నాడు తన అవ్యాజ కరుణతో.

  సౌరశక్తులు సొబగులు దిద్దుకొని మనకు కానుకలను అందించుటకు కదులు సమయమున జరుగు బ్రహ్మాడోత్సవము(బ్రహ్మోత్సవము) బహు ప్రశంసనీయము.సకల కళల సమ్మోహనం.యక్షులు రథ పగ్గములను పట్టుకుని గట్టిగా లాగుతూ సాగుతుంటేగంధర్వులు మధుర గానముతో,అప్సరసలు నాట్యాభినయనముతో అనుసరిస్తుంటారట.జల సంబంధ -లలితకళ సంబంధ శక్తులు వీరు.యక్షులు-రాక్షసులు మన రక్షణార్థము స్వామి రథమునకు కట్టిన తాళ్ళను గట్టిగా పట్టుకుని,గుట్టుగా మురిసిపోతుంటారట.వాలిఖ్యాది మునులు లాంఛనప్రాయముగా స్వామికి దారిని చూస్తూ,పరవశిస్తుంటారట.జగత్కళ్యాణ జగన్నాథుని సేవాసందర్శనాసక్తుల మనోభీష్టము నెరవేరు గాక.

   చాంద్రమాన ప్రకారము చైత్రము నుండి ఫాల్గుణము వరకు ప్రస్తావింపబడిన పన్నెండు తెలుగు నెలలు,సౌరమాన ప్రకారముగా,

 1.మధుమాసము,
 2.మాధవ మాసము,
3.శుక్ర మాసము,
 4.శుచి మాసము,
 5.నభస్ మాసము,
 6.నభస్య మాసము,
 7.ఈశ మాసము,
 8.ఊర్జ్య మాసము,
 9.సహస్ మాసము,
10.సహస్య మాసము,
11.తపస్ మాసము
12.తపస్య మాసముగా  కీర్తింపబడుతున్నవి.

  అవ్యక్త రూపమును అర్థము చేసుకొనుటకు( సామాన్య మేథ)ఆలంబనగా వ్యక్త నామ రూపములను నిర్దేశిస్తూ,

 పన్నెండు మాసములున్న రాశి చక్ర గమనములో,
 1ధాత,
 2.ఆర్యమ
 3.మిత్ర,
 4.వరుణ,
 5.ఇంద్ర,
 6.వివస్వంత,
 7.త్వష్ట,
 8.విష్ణు,
 9.అంశుమంత్,
 10.భగ,
 11.పూష,
 12.పర్జన్య నామములతో ప్రకాశించు పరమాత్మ ప్రణతోస్మి.

    ప్రసీద మమ భాస్కర.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...