Wednesday, June 30, 2021

DHYAAET IPSITA SIDHDHAYAET-07

 


  ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-07

   ***********************


 వర్షాకాలం ప్రారంభమైనది.పొలమును దున్నుతున్నారు.అంతే బీడునేల పంటభూమిగా మారబోతున్నది.చుట్టు ఉన్న కలుపు మొక్కలను తీసిపారేస్తున్నారు రైతులు.అవి మొక్కలుగా కనిపిస్తున్న పంట విద్రోహక శక్తులు.నేలసారమును స్వీకరించి పంటకు సారమునందనీయని అడ్డంకులు.


 ఒక విధముగా ఆలోచిస్తే మన విశేషములు అంతే.సామాన్యమును కననీయని అడ్డంకులు.ఏ విధముగా రైతు వానిని తీసివేస్తున్నాడో అదే విధముగా 

మనము సామాన్య విశేషముల నుండి విసేషములను తొలగించుకొనుటకు ప్రయనించాలి.ఒక్కసారి మాత్రమే కాదు.ఏవిధముగా రైతు ధాన్యమును నూర్చి తప్పగింజలను తూర్పారపదతాడో అదే విధముగా.తప్పగింజలు తప్పుకొనేలా చేసుకోవాలి.


  మన చుట్టు-మన మనసు చుట్టు ఎన్నో గజబిజి ఆలోచనలు ఆవరించి,పరిస్థితులుగా పరిణామము చెందుతు మనలను ప్రశ్నిస్తూనే ఉంటాయి.వాటిలో సమాధానమీయవలసిన యోగ్యత అన్నింటికి ఉండదు.వాటిలో కొన్ని మన సాధనకు అనుకూలములు-కొన్ని ప్రతికూలములు.


 మనము అత్యంతశక్తిహీనులమని సరనాగతి మార్గమునకు చేర్చునవి అనుకూలములు.


  సత్యమును అసత్యముగా-అసత్యమును సత్యముగా మనలచే భ్రమింపచేయు మాయ ప్రతికూలము.అయినప్పటికిని అది మాలోని అహముతో జతకూడి మన యుక్తాయుక్త విచక్షణను మరుగున పరుస్తుంది.

   విస్తరించియున్న విజ్ఞానములోని జ్ఞానమును దర్శించనీయదు.


 కనుక సాధనతో మనము విశేషములోదాగి వింతలు చేస్తున్న సామాన్యమును సత్-చిత్తును గుర్తించగలుగుటకు చేయు ప్రయత్నమే ఆధ్యాత్మికత.


    మరొక చిన్న ఉదాహరణమును పరిశీలిద్దాము.

 తెల్లని కాగితముపై నల్లని అక్షరములు కూర్చబడినాయి.దానిని చూసి చదివి-అర్థముచేసుకొని కధ యని పద్యము అని సామెత అని పొడుపుకథ అని రకరకములుగా మనము వర్గీకరిస్తున్నాము.తెల్లకాగి

తము ఆ అక్షరములను తనపై ముద్రింపహేసి మనకు మరొక నామరూపములతో ప్రకటితమగుచున్నది.


  దానిని మనము తెల్ల కాగితము అనటములేదు-అక్షరములు అనటము లేదు.అది వేరొక రూపును దిద్దుకొన్నది.అక్ష్రములు వరుస కూరుపు మారినదనుకోండి.మరిక నామ రూపములు.తెల్ల కాగితము మాత్రము ఎప్పుడు తెల్లకాగితము వలెనే ఉన్నది.కాసేపు మనము దానిని సామాన్యము అనుకుందాము.దానిపైన పలు నామరూపములు సంతరించుకొనుచున్న అక్షరములను విశేషములనుకొందాము.


  అయితే ఆ కూర్పును చేసినదెవరు? దానిని గుర్తించకలిగిన శక్తిని మనకు అందించున దెవరు? ఆ సక్తి-ఈ శక్తి ఒక్కటేనా?

  అమ్మబాబోయ్? ఇన్ని సందేహములా? మీకొక అమస్కారం? అంతలోనే మరో కొత్త సందేహము--అసలు నమస్కారం అంతే కేవలము రెండుచతులను కలుపు బాహ్య చేయనా లేక ఇంకేమైనా ఆంతర్యము ఇందులో దాగి ఉందా,


  సందేహములతో సతమతమవుతున్న నన్ను,మనలను ఆ పరమేశ్వరుడు సహనముతో రక్షించును గాక.


  పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.





  



  


Saturday, June 19, 2021

DHYAAYAET IPSITA SIDHDHAYAET-06

 


 ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-06

 **************************


 సత్యమును అసత్యమని-అసత్యమును సత్యమని ప్రత్యర్థిని ఓడించి దానిని సమర్థించుకునేందుకు కాలం తన గమనములో నిర్దేశించిన అవకాశము రానే వచ్చింది.


 సమాధానమును సమర్థించవలసిన వారు ప్రశాంతముగానే ఉన్నారు.ఎదురుచూస్తున్న సభ్యులలోని అభ్యంతరాలు ఆందోలనను నింపుకుని చిందవందరగా ఉన్నాయి.


  సభావందనమును చేసిన తరువాత మర్యాదపూర్వకముగా తమ సమర్థనను ప్రారంభించారు.


 అయ్యా వందనములు.మొదట మీరు మాముందుంచినది పుష్పగుచ్ఛము.అందులో ఒక సామాన్యము మరొక విశేషము కలిసి యున్నవి.నిజమేనా? ఇప్పుడు ప్రశ్నించుట వీరి వంతుగా మారినది.


   అంటే అంటే  తడబడ్డారు వారు అవుననలేక/కాదనలేక.


 ఒక్క నిమిసము నిశ్సబ్దము తరువాత ,

 మీరన్నదే నిజమైతే ఇందులో సామాన్యము ఏది? విసేషము ఏది?దేనికి ఏది ఆధారము?దేనికి ఏది ఆభాస? వీటి పర్యవసానము ఏమిటి?


  గంభీరమైన గళము గులాబీలు-వాటి వివిధ రంగులు-రూపములు-స్వభావములు విశేషములు.వానిలో దాగియున్న శక్తి శాశ్వతము.


   మరింత వివరణ అవసరము అంటూ ....


   సరే చెబుతాను వినండి.నిన్నటి ముందు వరకు ఈ గులాబీలు ప్రకటితమగు శక్తి లేక,వేరొక శాశ్వత శక్తిని ఆశ్రయించుకొని గుప్తముగా నున్నాయి.ఆ శక్తి సహాయముతో మెల్ల మెల్లగా చిన్ని చిన్ని మొగ్గలుగా లీలా మాత్రముగా ప్రకటితమయినవి.మరికొంత విచ్చుకొనినవి.ఆపైన రంగు-రూపము-గుణము అను గుణములను తమలో నింపుకొని మనకు కనపడుచున్నవి.వీటి రంగులు రూపములు స్వభావములు ప్రత్యేకతలు అనేకములు.వాటికి వానిని అందించినది మాత్రము ఏకైక పరమాద్భుతము.అది అనుమతించిన వరకే వాటికి ఈ లక్షనములు.అనంతరము అవి వాటి స్వాభావికత కోల్పోయి మూలము లోనికి విలీనము కావలిసినదే.ఆ మూలమే శాశ్వతమైన ఏకత్వము.


 దీనివలన ఏమి ఉపయోగము? మరొక ప్రశ్న సంధించబడినది వారి సమర్థనకు అనుసంధానము చేయుటకు.


 మందహాసముతో పరమాద్భుతమును పరికించుటకొక పరికరము ఈ విశేషము.


  కరతాళ ధ్వనుల ఘన ప్రశంసతతో.


  పండ్లు అంతే.పక్షులు అంతే.జంతువులు అంతే.

 పండ్ల రూపము పరిమానములు మాధుర్యములు పరమాత్మ పరమాద్భుత శక్తి యొక్క బహుముఖ ప్రకటనముల వైభోగములు.అవి ఏవి స్వతంత్రములు కావు.స్వయం సమృద్ధములు కావు.శాశ్వతములు కావు.ఈ విశేష రూపములు సామాన్యము అందించు శక్తి ద్వారా ప్రకటిత మవవలసినదే.తిరిగి ఆ సక్తిలోనికి అంతర్గతమవవలసినదే.


   అదే కనుక నిజమయితే మరి వీరి అందరి అభ్యంతరములకు కారణమేమిటి?


  మదహాసముతో మాయ-మాయ-మాయ.


   అంటే? అందరి సందేహము


  నిజమునకు ఏ వస్తువు నామరూప విశేషములను సహజముగా కలిగియుండదు.కాని వాటిచే కప్పివేయబడి ఉంటుంది.


 కప్పబడిన దానిని సత్యమనుకొని,అందులో దాగిన సత్య నిత్యమును లేదనుకొనుటయే మాయ.అది ఉన్నదానిని లేనిదిగా-లేని దానిని ఉన్నట్లుగా మనచే భ్రమింపచేసే ఎండమావి.


   తెరను తొలగించి అంతర్గతమైన సామాన్యమును దర్శించుటకు చేయు ప్రయత్నమే సాధన అంటు స్వస్తివాక్యముతో సమావేశమును పూర్తిచేశారు.


 సర్వం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.


Friday, June 18, 2021

DHYAAYAET IPSITA SIDHDHAYAET-05

 


  ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-05

  ***********************


    

  మనసంతా ఒకటే గందరగోళం.మనము చూసేదిది నిజమైనది -శాశ్వతమైనది కాదా? శాశ్వతమైనది సులభముగా మనము దర్శించలేమా?


  లోపల బయట తానే యున్నదంటున్నారు కొందరు "జగమెవ్వని లోపలనుండు "అంటు.


  అంటే ఈ దృశ్యప్రపంచము ఎచరో మనకు తెలియని వాని లోప ఉందా? 


  లోపకనుక ఉంటే మనలను బయటనే ఉన్నట్లు ఎలా భ్రమింపచేస్తున్నది.


  ఇది భ్రమ తత్త్వమా? బ్రహ్మాండ తత్త్వమా?


  ఒక సందేహమునకు తోడుగా మరొక సందేహమును జతకలుపుకొనుటకా అన్నట్లు,


 పనులన్నీ చేసుకొని కాసేపు కాలక్షేపం కోసము చర్చావేదికను చూచుటకు టి.వి ముందు కూర్చున్నాను.



 కార్యక్రమము ప్రారంభమైనది.చర్చకు ఇరువర్గముల వారు అభిముఖముగా అసీనులైనారు.ఆసనముపై న్యాయనిర్ణేత వారిని గమనిస్తున్నారు.



        గులాబీలతో,


  సహకారపరికరములుగా కొన్ని వస్తువులను ప్రవేశపెడుతూ చర్చా కార్యక్రమమును ప్రారంభింపచేసారు.




 వారిద్దరి మధ్యన రంగురంగు గులాబీలతో, అలంకరింపబడిన పుష్పగుచ్చమును ఉంచారు.గులాబీలలో కొన్ని ఎర్రవి.కొన్ని పసుపుపచ్చవి.కొన్ని తెల్లనివి.మరికొన్ని గులాబీ రంగువి.ఎన్నోరంగులతో మరెన్నో హంగులతో పరిమాళాలు వెదజల్లుతు అక్కడున్న వారిని పరవశింపచేస్తున్నాయి.ఏమా సుకుమారత. ఏమా సుందరత.ఏమా సుగంధము.




 నా ఆలోచనలకు అడ్దుకట్ట వేస్తు మొదటి వర్గమువారు రెండవ వర్గము వారిపై ప్రశ్నను సంధించారు తామే గెలుస్తామన్న గట్టి నమ్మకముతో.


 పూలగుత్తిని తమ చేతిలో పట్టుకుని,


 ఇది ఏకమా? అనేకమా? అంటు.

ఒక్క సారిగా ఉలిక్కిపడటము నా వంతైంది.


 లోపల-బయట అనే చిక్కే కాకుండా,ఏకమా-అనేకమా అనే మరో సమస్యనా...




 ప్రశ్నకు సమాధానము మరింత ప్రసన్నముగా


 ఇది ఏకము.అనేకము కాదు అంటు వచ్చింది.


 మరొక్కసారి పరిశీలించి చెప్పండి హెచ్చరించింది మొదటి వర్గం.


 ఇది ఏకమే అనేకము కాదు ప్రశాంతముగా సమాధానమిచ్చింది.


  మరొక హెచ్చరికను జారీ చేసింది తికమక పెడుతుప్రత్యర్థిని.


 

  ముమ్మాటికి ఇది ఏకమే.స్థిరముగా వచ్చినది సమాధానము.


 అంగీకారాన్ని తమ మౌనముతో తెలియచేసింది పశ్నించిన వర్గము.


 ఎన్నో రంగుల పూలున్న గుత్తిని ఏకమే అంటున్నారు అంటే కచ్చితముగా వీరు గుత్తిని మాత్రమే పరిగణనలోనికి తీసుకున్నారన్నమాట.పొరబాటు పడ్డారు అనుకున్నాను.


 రెండవ  పర్యాయము సహకారముగా

                      జామ-మామిడి-సపోట-పనస-ద్రాక్ష- దానిమ్మ......... ఎన్నో పళ్లతో నిండిన గంపను ప్రవేశ


మళ్ళీ అదే ప్రశ్న.ఈ పళ్ళన్నీ-ఉన్న గంప కాదు


   ఏకమా? అనేకమా? అదే ప్రశ్న.

 మళ్ళీ అదే సమాధానము నిశ్చలముగా.



 ముచ్చటగా   మూడవ అవకాశము అంటు 


 కాకి-కోకిల-చిలుక-కోడి-కోతి-ఆవు-మేక-చిత్రములున్న పటమును చూపిస్తు,


 ఇవి చేయు శబ్దములు ఏకమా? అనేకమా?

అంటే ఈ ఏక-అనేకములు దృశ్యములకు మాత్రమే కాక శబ్దములకు కూడ వర్స్తిస్తుందా? మరొక సందేహ సందడి.



 ఇదే చివరి అవకాశము.సరిగా గమనించి-ఆలోచించి చెప్పంది అన్నది ఠీవిగా.


  అన్ని ప్రశ్నలకు అదే సమాధానము.వాటి శబ్దములన్నీ ఏకమే కాని అనేకములు కాదు.


 ఏకమైన శబ్దశక్తి అనేకములుగా తన ప్రాభవమును ప్రకటిస్తున్నది.


 ఓటమిని ఒప్పుకుంటు తలవంచింది.మొడటి వర్గము.అభ్యంతరములు లేవన్నాడు న్యాయ నిర్ణేత.


 ఈసారి అయోమయములో పడటము నా వంతు అయింది.ఇదెక్కడి న్యాయమయ్యా.వీళ్లు తప్పు సమాధానములను ఒప్పంటు గొప్పగాఒప్పుకుంటున్నారు.


 దానితో ఆగక సమాధానమిచ్చిన వారిని సత్కరించుటకు సన్నాహాలు చేస్తున్నారు.


 ప్రేక్షకులు ఎక్కువశాతం మంది సన్మానానికి అభ్యంతరాన్ని తెలియచేస్తూ,అరవసాగారు.


 అది గమనించిన నిర్వాహక వర్గము వారి సందేహ నివృత్తి కార్యక్రమమును వచ్చేవారానికి వాయిదా వేసారు.


  సర్వం పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...