Saturday, June 19, 2021

DHYAAYAET IPSITA SIDHDHAYAET-06

 


 ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-06

 **************************


 సత్యమును అసత్యమని-అసత్యమును సత్యమని ప్రత్యర్థిని ఓడించి దానిని సమర్థించుకునేందుకు కాలం తన గమనములో నిర్దేశించిన అవకాశము రానే వచ్చింది.


 సమాధానమును సమర్థించవలసిన వారు ప్రశాంతముగానే ఉన్నారు.ఎదురుచూస్తున్న సభ్యులలోని అభ్యంతరాలు ఆందోలనను నింపుకుని చిందవందరగా ఉన్నాయి.


  సభావందనమును చేసిన తరువాత మర్యాదపూర్వకముగా తమ సమర్థనను ప్రారంభించారు.


 అయ్యా వందనములు.మొదట మీరు మాముందుంచినది పుష్పగుచ్ఛము.అందులో ఒక సామాన్యము మరొక విశేషము కలిసి యున్నవి.నిజమేనా? ఇప్పుడు ప్రశ్నించుట వీరి వంతుగా మారినది.


   అంటే అంటే  తడబడ్డారు వారు అవుననలేక/కాదనలేక.


 ఒక్క నిమిసము నిశ్సబ్దము తరువాత ,

 మీరన్నదే నిజమైతే ఇందులో సామాన్యము ఏది? విసేషము ఏది?దేనికి ఏది ఆధారము?దేనికి ఏది ఆభాస? వీటి పర్యవసానము ఏమిటి?


  గంభీరమైన గళము గులాబీలు-వాటి వివిధ రంగులు-రూపములు-స్వభావములు విశేషములు.వానిలో దాగియున్న శక్తి శాశ్వతము.


   మరింత వివరణ అవసరము అంటూ ....


   సరే చెబుతాను వినండి.నిన్నటి ముందు వరకు ఈ గులాబీలు ప్రకటితమగు శక్తి లేక,వేరొక శాశ్వత శక్తిని ఆశ్రయించుకొని గుప్తముగా నున్నాయి.ఆ శక్తి సహాయముతో మెల్ల మెల్లగా చిన్ని చిన్ని మొగ్గలుగా లీలా మాత్రముగా ప్రకటితమయినవి.మరికొంత విచ్చుకొనినవి.ఆపైన రంగు-రూపము-గుణము అను గుణములను తమలో నింపుకొని మనకు కనపడుచున్నవి.వీటి రంగులు రూపములు స్వభావములు ప్రత్యేకతలు అనేకములు.వాటికి వానిని అందించినది మాత్రము ఏకైక పరమాద్భుతము.అది అనుమతించిన వరకే వాటికి ఈ లక్షనములు.అనంతరము అవి వాటి స్వాభావికత కోల్పోయి మూలము లోనికి విలీనము కావలిసినదే.ఆ మూలమే శాశ్వతమైన ఏకత్వము.


 దీనివలన ఏమి ఉపయోగము? మరొక ప్రశ్న సంధించబడినది వారి సమర్థనకు అనుసంధానము చేయుటకు.


 మందహాసముతో పరమాద్భుతమును పరికించుటకొక పరికరము ఈ విశేషము.


  కరతాళ ధ్వనుల ఘన ప్రశంసతతో.


  పండ్లు అంతే.పక్షులు అంతే.జంతువులు అంతే.

 పండ్ల రూపము పరిమానములు మాధుర్యములు పరమాత్మ పరమాద్భుత శక్తి యొక్క బహుముఖ ప్రకటనముల వైభోగములు.అవి ఏవి స్వతంత్రములు కావు.స్వయం సమృద్ధములు కావు.శాశ్వతములు కావు.ఈ విశేష రూపములు సామాన్యము అందించు శక్తి ద్వారా ప్రకటిత మవవలసినదే.తిరిగి ఆ సక్తిలోనికి అంతర్గతమవవలసినదే.


   అదే కనుక నిజమయితే మరి వీరి అందరి అభ్యంతరములకు కారణమేమిటి?


  మదహాసముతో మాయ-మాయ-మాయ.


   అంటే? అందరి సందేహము


  నిజమునకు ఏ వస్తువు నామరూప విశేషములను సహజముగా కలిగియుండదు.కాని వాటిచే కప్పివేయబడి ఉంటుంది.


 కప్పబడిన దానిని సత్యమనుకొని,అందులో దాగిన సత్య నిత్యమును లేదనుకొనుటయే మాయ.అది ఉన్నదానిని లేనిదిగా-లేని దానిని ఉన్నట్లుగా మనచే భ్రమింపచేసే ఎండమావి.


   తెరను తొలగించి అంతర్గతమైన సామాన్యమును దర్శించుటకు చేయు ప్రయత్నమే సాధన అంటు స్వస్తివాక్యముతో సమావేశమును పూర్తిచేశారు.


 సర్వం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...