ANUBAMDHAM ADITYAHRDAYAM WITH RUDRAM-PART-02
.jpg)
పరమాత్మ రుద్రములో రుద్రునిగాను-ఆదిత్యహృదయములో మండలాంతరగత సూర్యునిగాని రెండు నామములతో కీర్తిస్తున్నప్పటికిని,నమకము ప్రథమ అనువాకములోని 7-8 శ్లోకంలు పరమాత్మయొక్క ప్రసారగుణమును-ప్రసాదగుణమును వివరించుటలో ఏకాభిప్రాయముతోనే ఉన్నవి. ఏడవ మంత్రము అసౌ-అన్న సంబోధనతో ఆయననే అసమానమైన పరమాత్మ.అవ్యాజకరుణమూర్తి.అనుగ్రహప్రదాత. కనకనే చీకటిపై-జడత్వముపై -పాపములపై తనకున్న "హేడ" కోపమును తొలగించుటకు,నిర్మూలించుటకు ఉదయమునుండి-అస్తమయము వరకు మనలను తాకుచున్నాడు. రుద్రా-ఇమాంగుం అభితః-ఉదయ సంకేతముగా రుద్రుడు/సూర్యుడు భూమి మీద విస్తరిస్తున్నాడు. అంతేకాదు-మరియును అని చెప్పుటకు"ఉత" అనే శబ్దము ప్రయోగింపబడినది. రుద్రుడు భూమి మీద సూర్యునిగా ఎలా విస్తరిస్తున్నాడో చెప్పాలంటే అభితః దిశః-అన్ని దిశలయందును/దిక్కులయందును విస్తరిస్తున్నాడు. రుద్రుడు అన్ని దిక్కులయందు విస్తరిస్తున్నప్పుడు మూడు రంగులతో తామ్ర-అరుణ-బభ్రు-ఎర్రని రంగు-కొంచము లేత ఎరుపు రంగు-బంగరు రంగుతో ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ దిక్కులు-రుద్రులుగా ప్రస్తుతింపబడు సూర్యకిరణములు పరస్పరాశ్రితములు. ఏకం-అ...