Friday, May 5, 2023

ANUBAMDHAM ADITYAHRDAYAM WITH RUDRAM-PART-02

 


 పరమాత్మ రుద్రములో రుద్రునిగాను-ఆదిత్యహృదయములో మండలాంతరగత సూర్యునిగాని రెండు నామములతో కీర్తిస్తున్నప్పటికిని,నమకము ప్రథమ అనువాకములోని 7-8 శ్లోకంలు పరమాత్మయొక్క ప్రసారగుణమును-ప్రసాదగుణమును వివరించుటలో ఏకాభిప్రాయముతోనే ఉన్నవి.

  ఏడవ మంత్రము అసౌ-అన్న సంబోధనతో ఆయననే అసమానమైన పరమాత్మ.అవ్యాజకరుణమూర్తి.అనుగ్రహప్రదాత.

 కనకనే చీకటిపై-జడత్వముపై -పాపములపై తనకున్న

 "హేడ" కోపమును తొలగించుటకు,నిర్మూలించుటకు ఉదయమునుండి-అస్తమయము వరకు మనలను తాకుచున్నాడు.

 రుద్రా-ఇమాంగుం అభితః-ఉదయ సంకేతముగా రుద్రుడు/సూర్యుడు భూమి మీద విస్తరిస్తున్నాడు.

 అంతేకాదు-మరియును అని చెప్పుటకు"ఉత" అనే శబ్దము ప్రయోగింపబడినది.

 రుద్రుడు భూమి మీద సూర్యునిగా ఎలా విస్తరిస్తున్నాడో చెప్పాలంటే అభితః దిశః-అన్ని దిశలయందును/దిక్కులయందును విస్తరిస్తున్నాడు.

 రుద్రుడు అన్ని దిక్కులయందు విస్తరిస్తున్నప్పుడు మూడు రంగులతో 

తామ్ర-అరుణ-బభ్రు-ఎర్రని రంగు-కొంచము లేత ఎరుపు రంగు-బంగరు రంగుతో ప్రకాశిస్తున్నాడు.

 ఇక్కడ దిక్కులు-రుద్రులుగా ప్రస్తుతింపబడు సూర్యకిరణములు పరస్పరాశ్రితములు.

  ఏకం-అనేకం సిద్ధాంతమునకు ప్రతీక.భానుమండల/హిరణ్యగర్భమండలమునకు-భాను కిరనములకు అభేదము.భానుని/రుద్రుని కోపమునకు-భానుకిరణముల-రుద్రుల కోపములకు అభేదము.వారి విస్తరిస్తున్నది జడత్వ/తమో నివారణమునకు.

 మానవ ఉపాధికి /జీవుల పాపములను నిర్మూలించుటకు వారిని దండించుట కూడా వారి కర్తవ్యము.కనుక పరమాత్మ యొక్క సుమంగళత్వమును మరింత సుస్పష్తము చేస్తున్నారు.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...