Wednesday, June 26, 2024

ADAVAMAJILEE-SARVAROGAHARACHAKRAMU AMTE?


 


  సర్వజ్ఞే సర్వశక్తే సర్వమంగళకారిణి

  సర్వజ్ఞానప్రదే దేవి సర్వేశ్వరి నమోస్తుతే"


    పరమేశ్వరి అనుగ్రహముతో ఇంకొకమెట్టుఎక్కి ఎనిమిది కోణములున్న "సంహార ఆవరణత్రయ చక్ర"మొదటి భాగమైన "సర్వరోగహరచక్రము"లోనికిప్రవేశించాను.

 ఏటు చూసినను బ్రహ్మశబ్దముతో కూడిన పదములు,

 బ్రహ్మచారి,బ్రహ్మపదార్థము,బ్రహ్మముడి,బ్రహ్మజెముడు,బ్రహ్మరాక్షసి,బ్రహ్మరథం,బ్రహ్మ అస్త్రం,బ్రహ్మ ఆనందం,బ్రహ్మాండం, ఎక్కువగా ఆకర్ష్స్తూ,"బ్రహ్మమొక్కటే అన్నది సారాంశం' అన్న పదములు నన్ను ఆశ్చర్య పరుస్తుంటే,ఎన్నెన్నో సందేహములు నన్ను ఆక్రమించాయి.

  

   

  


  

Saturday, June 22, 2024

ARAVAMAJILEE-SARVARAKSHAAKARACHAKRAMU AMTE?


 


 'రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా

  రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితా"


సత్యం-శివం-సుందరమయమిన స్థితికిచేరుటకు ద్వారమైన/జ్ఞానప్రదమైన "సర్వజ్ఞా సదనమూన ప్రవేశించుటకు పరమేశ్వరి వాత్సల్యము నన్నొక మెట్టు పైకెక్కించినది.

  

  ప్రాకామ్యసిద్ధిమాత-సర్వవశంకరి ముద్రా మాత నా వెంటనేఉండి నన్ను నడిపిస్తున్నారు.


    లోపలివైపునకు విచ్చుకొనియున్న పదితేజోమయ త్రికోణములతో వృత్తాకారముగానున్నది ఆ ఆవరనము,"అంతర్దాశము" అన్న నామము నన్ను మరింత ఆకర్షించినది.దీనినే "సర్వరక్షాకరచక్రమూ అని కూడా పిలుస్తారట.

   ఆశ్చర్యము.అచ్చము మా అమ్మలాగానే ఉన్న పదిమంది అమ్మలు పరమవాత్సల్యముతో నన్ను ఏం నాయినా వచ్చావా అంటూ పలుకరిస్తున్నారు.నేను వారి దగ్గరిగా వెళ్లే లోపలనే,

 'గర్భము అనగా ఆధారము

  సర్వజీవసృష్టికి తల్లిగర్భము ఆధారము

  నిగర్భము అనగా నిక్షిప్తపరచబడిన ఆధారము

  సకలజ్ఞాన సిద్ధికి ఈ పదితల్లుల అనుగ్రహము ఆధారము"

    అని చెబుతున్నారు.బహుశా నన్ను ఉద్ధేశించియేనేమో.


    పిల్లలకు ఇష్టమైన పోషకమైన పదార్థములను దాచి తల్లి వారికి ఎలా తగినంత తినిపిస్తుందో,అదేరీతిగా సకలచరాచరములను తమకు ఆధారమైన అమ్మలగన్న అమ్మను చేరుటకు అడ్దంకులను తీసివేశి అర్హతను కలిగించే పరమకరుణాంతరంగలు ఈ పదిమంది అమ్మలు అన్నమాట.కాదు కాదు ఉన్నమాటే.

  అమ్మలాగానేఉన్నా ఈపదిమంది అమ్మలను నేను ఎప్పుడు చూడలేదు.వారి మాటలను



 అంటే---- ఇప్పటి వరకు నేను మా అమ్మనుకున్న ఆమె గర్భము నాకు ఉపాధిని ఇచ్చినది  వాస్తవమే అయినప్పటికిని అది పాంచభౌతికమా?దానికి పదిమంది అమ్మరూపములుగానున్న తేజోశక్తులను(అగ్నిశక్తులను) దర్శించే శక్తిలేదా? మరి నేను ఇప్పుడెలా వీరిని స్పష్టముగాచూడగలుగుతున్నాను?

  జవాబు రానే వచ్చింది లోపలినుండి.ఇప్పుడు నేనున్నది అంతర్దశారము.ఇప్పటి వరకు ఉన్నది బహిర్దశారము.అంటే ఐహికములు తొలగి అసలు నేను అర్థమగుచున్నది.కానిపూర్తిగా కాదు.

 ఎదురుగా అద్భుత సన్నివేశములు.సంభాషణములు.


  ప్రాకామ్యసిద్ధిమాత-సర్వేప్సిత సిద్ధిమాత చేతిలోచేతిని వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు.

  నాకనుబొమలమధ్యన కదలికలు ప్రారంభమయినాయి.

     ఇప్పుడు నేను,

 అంతర్దశారచక్రములో ఒకచిన్నశిశువుని.పదిమంది తల్లులపాలనలోఉన్నాను.అదే ఉపాధి కాని నా మనోవృత్తులు మారిపోయాయి.వారిని చూడగలుగుతున్నాను నాలోని నేనుతో.

  

 1.నాకు చీకటి అంటేభయమనిఒక అమ్మ తాను కాంతిగా మారి నాచేయి పట్తుకుని నడిపిస్తానని అంటున్నది.

 2.నాబలము చాలదని మరొక అమ్మ తాని శక్తిగా మారి పుష్టిని ఇస్తానంటున్నది

 3.ఇంకొక తల్లితాని వ్యాధివినాశినిని అవుతానంటున్నది.నా అనారోగ్యమును/అజ్ఞానమును అణిచివేస్తానంటున్నది.

 4.



 నాకు/నాసాధనకు ఎటువంటిలోటు రాకుండాచూసుకుంటానంటున్నది మరొకతల్లి.

 5.నా అజ్ఞానమును పోగొడతానంటున్నది మరొక అమ్మ హామీ ఇస్తు.

  నేను ఆధారమువుతాను-నేను ఆనందమవుతాను అంటూ పోటీపడుతున్నారు అమ్మలు.

  అంతలో మరొక మాతాశక్తి నేను వీనికి సర్వకాల/సర్వావస్థలయందు తోడుగా ఉండి రక్షిస్తాను అంటోంది.సంతోషముతోచిందులు వేస్తున్నానునేను.

   ఇంతకీ ఇది వారి సంభాషనములా/లేక నాకు చేసిన ఉపదేశములా.రెందవది అయిఉంటుంది.నాకు బాగా అర్థము కావాలని అలా చేసిఉంటారు.

  ఇప్పటి వరకుఈ మాతలు నా శరీర జీర్నశక్తికి సహాయపడు శక్తులనుకున్న నా అవివేకము సిగ్గుతో పారిపోతున్నది.

  తత్-త్వం-అసినువ్వు-నేను వేరుగా ఉన్నామూనుకుంటున్న నాకుకనువిప్పుకలిగి అహం బ్రహ్మాస్మి అనుకుంటున్నది.

  ఆ  భావనాశక్తియే "నేను" అంటే నాలోదాగియున్న  సర్వరక్షాస్వరూపమైన నిన్నుగా పరిచయము చేసుకుంటున్నది.ఆ పరిచయ పరిమళమేకదా సర్వజ్ఞత్వముగానిన్ను భావింపచేయునది.


 "సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధిక వర్జితా" అని కీర్తిస్తున్న చక్రేశ్వరి త్రిపురమాలిని ఆశీర్వచనముతో,ఈ సాధకుడు మరోమెట్టు ఎక్కి,"సర్వరోగహర చక్ర"ప్రవేశమును చేయుటకు సంసిద్ధుడగుచున్నాడు.


  యా దేవిసర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా

  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.


 వినలేదు.వారిఒడిలో నిద్రపోలేదు.

Wednesday, June 19, 2024

IDAVA MAJILEE-SARVAARTHASAADHAKA CHAKRAMU AMTE?


 


  " దశముద్ర సమారాధ్యా  త్రిపురాశ్రీ  వశంకరీ

    జ్ఞాన ముద్ర జ్ఞానగమ్యా జ్ఞాజ్ఞేయ స్వరూపిణీ"

      అని స్తుతిస్తిస్తున్నది పరమేశ్వరిని లలితరహస్య సహస్రనామ స్తోత్రము.


   ఇంకొక మెట్టిఎక్కిన సాధకునకు వృత్తాకారముగా బయటకు కనపడుచున్న వికసిత పది దళములుగల ఆవరణము అత్యంత మనోహరముగా కనిపించింది.పదిమందిమాతృమూర్తులు పరమవాత్సల్యముతో స్వాగతిస్తున్నారు.వారితో పాటుగా "వశిత్వసిద్ధి" మాత,సర్వోన్మాదిని ముద్రా మాత ధైర్యమునిస్తూ నడిపిస్తున్నారు.ఆ పదిమంది స్త్రీమూర్తులను కులోత్తీర్ణ యోగినులు అని గౌరవిస్తారట.

  కులము అన్న శబ్దమునకు సమూహము,వర్ణము అన్నార్థములే కాకుండా,జ్ఞానము అని కూడా భావిస్తారట.మనము ఏ విధముగా ఒకపరీక్షలో నెగ్గిన తరువాత అంతకుమించిన దానిని నేర్చుకునే అర్హతను సంపాదిస్తామో,అదేవిధముగా ఈ పదిమంది మాతలు జ్ఞాన ఉత్తీర్ణతకు/విస్తరణకు మరింతనేర్చుకొనుటకు సహాయపడతారట.

   ఈ అద్భుత ఆవరణమును బహిర్దశారము/సర్వార్థసాధక చక్రము అనిపిలుస్తారట.సర్వము అనగా తురీయ పురుషార్థమైన మోక్షము అన్నమాట.ధర్మ-అర్థ-కామ అవస్థలను దాటిన ఉపాధికి లభించేది.

  మాత సర్వోన్మాదిని ముద్రాశక్తి నా ఆత్మదర్శన కోరికను మరింత బలపరుస్తున్నది.నా ప్రయాణమును మరింత శోభాయమనము చేయుటకు సహాయపడుతున్నది.

 వశిత్వసిద్ధి మాత ఈశ్వరభావన నీకు సర్వ అభీష్టములను తీరుస్తుంది అంటూ,

 "గురుః బ్రహ్మగురుః విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

  గురుః సాక్షాత్ పరబ్రహ్మః తస్మైశ్రీ గురవే నమః" అంటూ గురువు ద్వారా నీవు నేర్చుకొనుటకు ఇదే తగినసమయము అంటున్నది.

  నేనెక్కడ అహంకరిస్తానో అని జ్ఞాన విభాగమును పరిచయము చేస్తున్నది.

 "జ్ఞానినాం తత్త్వ దర్శనః" అనిఒకనిమిషము ఆగి అర్థమయినదా అని,నా స్థితిని గమనించి,ఇలా చెప్పసాగినది.

 జ్ఞానము 

1వాచకజ్ఞానము

2.అనుభవజ్ఞానము అని రెండు విధములు.

  వాచకజ్ఞానము పుస్తకపఠనము/శ్రవనము/సంభాషణము ద్వారా లభిస్తుంది కాని అనుభవమునీయదు.కాని

  అనుభవజ్ఞానములో వాచకజ్ఞానము అంతర్లీనముగా దాగిఉండి అనుభవ ఫలితముగా రెండింటిని పొందకలుతాము.

  అదేవిధముగా గురువుద్వారా లభించే జ్ఞానము/బ్రహ్మమును ఎరుకపరుస్తుంది.అది బ్రహ్మ జ్ఞానము.పరమశివుడే ఆదిగురువు.ఆయన ఎవరో ఒకరి ద్వారా గురువుతానై ఉద్ధరిస్తాడు అంటున్నది.

 నాలో రజో-తమోగుణములను అణచివేసి,సత్వముతానే సర్వముగా మారుతోంది.

  ఇంకొక మాత నన్ను వాత్సల్యముతో చూస్తూ"పది"సంఖ్యను వివరిస్తున్నది.

 0 పూర్ణము.దానికి ఏ అంకెతోను సంబంధము ఉండదు.ఒ ను ఏ అంకెతో కూడినా/తీసివేసినా/గుణించినా/భాగహారించినా "0" గానె మిగులుతుంది.అజ్ఞానము శూన్యమంటుంది కాని జ్ఞానము పూర్ణము అంటుంది.అది శివప్రకాశము కాదు స్వయంప్రకాశము.

 1 ఒ లోని భాగము.అది అన్ని అంకెలలోను/సంఖ్యలలోను దాగి ఉంటుంది.దానికూడిక తీసివేత గుణింతము భాగహారము అంకెలలో/సంఖ్యలలో మార్పును కలిగిస్తుంది.1 ద్వైతముగా ప్రకాశిస్తున్న శక్తి.సగుణ సాకార స్వరూపము.

 ఇంతలో మరొకమాత అంతేకాదు మేము పదిమందిపది ప్రాణశక్తులము.మాలో ఐదుగురిని ప్రధాన ప్రాణములని,మరొకాఇదుగురిని ఉపప్రాణములని పిలుస్తారు.

 పరమాత్మ పరిపరివిధములై పరమాద్భుతములను పరమగురువుగా వివరిస్తున్నాడు.

 నన్ను నేను గమనిస్తున్నాను.నైవేద్యమంత్రం మనలో దాగిన పరమాత్మను ప్రార్థించుట మన అన్నివ్యవస్థలకు జీర్ణము,శ్వాశ,రక్తప్రసరణము,కన్నురెప్పవేయుట,ఆవలించుట,తుమ్ముట ,మలమూత్ర విసర్జనము,అధికవాయును అథోమార్గము ద్వారా వదిలివేయగలుగుట అంతా ఈ అమ్మల అనుగ్రహమన్నమాట.

 అర్థమవుతున్నది అంతరార్థము అనుకుంటూ చక్రేశ్వరి "త్రిపురాశ్రీ"  ఆశీర్వచనముతో,మాతల సహకారముతో,తనను తాను మనసును,ఇంద్రియములను సాధకుడు మరొక మెట్టు ఎక్కి "సర్వ రక్షాకర చక్ర" ఆవరణములోనికి ప్రవేశించుటకు సిద్ధపడుచున్నాడు.

 యాదేవి సర్వ భూతేషు విద్యారూపేణ సంస్థితా

 నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.



Tuesday, June 18, 2024

NAALGAVA MAJILEE-SARVA SAUBHAAGYADAAUAKA CHAKRAMU AMTE?


 


  " భక్తుడు భగవంతుడా నువ్వెప్పుడు బయటకు వస్తావు నేను నిన్ను చూడటానికి అని అనుకుంటాడట,

   భగవంతుడు భక్తుడెప్పుడు తనలోనికి తొంగి చూస్తాడా కనపడదామని అనుకుంటాడట." 

   ఎంతటి నగ్నసత్యము.

 ఏకాకిని "భూమరూపా" నిర్ద్వైతా ద్వైతవర్జితా అని పరమేశ్వరిని కీర్తిస్తుంది స్రీ లలితా రహస్య సహస్రనామస్తోత్రము.

 అన్నిరూపములుఇందే ఆవహించెను అని కీర్తించాడు అన్నమాచార్యులు.

 

 అంతర్యామిగా అన్ని ఉపాధులు తానైన పరమాత్మ ఏదో ఒక ఉపాధితో మనకు మనలను తెలుసుకోవటానికి చేతిని అందిస్తూనేఉంటాడు.

 ఆ చేతిని నమ్మకముతో గట్టిగా పట్టుకుని,విడువకుండా మరొక మెట్టును ఎక్కించేది/ఆవరనములోనికి ప్రవేశింపచేసేది "సౌభాగ్యము" .

 ప్రయాణికుడు అమ్మదయతో పదునాలుగుకోనములు కల వృత్తాకార చక్రము లోనికి ప్రవేశిస్తున్నాడు.దీనినేచతుర్దశార చక్రము అని కూడా పిలుస్తారు.

 మూడు అవస్థలను దాటి,మూడు దేహములను అర్థముచేసుకుంటూ,స్పూక్ష్మము వైపునకు అడుగులు వేయిస్తున్నాయి ఈ పదునాలుగు కోణములు.చురుకుదనమును మెదడుకు అందిస్తూ.

 పదునాలుగురు మాతలు ఈ ఆవరణములో ప్రకాశముతో వెలిగిపోతున్నారు.జడత్వమునకు తావులేదు.తమోగుణము కానరాదు.

  ఇంద్రియములు/మనసుకొంచముకొంచము శుద్ధి అవుతున్నాయి.

 సిద్ధి మాత అయినఈశిత్వసిద్ధి ప్రయాణికునిలో ఈశ్వర భావనకుబీజము వేస్తున్నది.తానుకోరుకోవలిసినవి తాత్కాలిక సంతోషమును కలిగించునవి కాదని అర్థమవుతున్నదతనికి.

  తనలో దాగిన ప్రాణసక్తియే తన కదలికలుమూలమనే విషయము స్పురణకు వస్తున్నది.

  తన ఉపాధియే తాను అన్న భావన జరిగిపోయి తనౌపాధిలో దాగిన చైతన్యము తానుగా కొంచము కొంచము అర్థమవుతున్నది.

  కాని ద్వంద్వములు పూర్తిగా తొలగిపోలేదు.దానికి కారణము తాను చూడాలనుకున్న ఆత్మస్వరూపము మాయచే ఆవరింపబడి యున్నది.

 పదునాలుగురు మాతలు పదునాలుగు భువనములుగా గోచర్సితున్నారు ఒక్కసారి.

 మరింత తేరిపారచూస్తే పదునాలుగు ముఖ్యనాడులుగా (తన ఉపాధిలో) తన ప్రాణశక్తిగా బోధపడుతున్నారు.

   వారు సమ్యక్ ప్రదాతలు.సంప్రదాయ యోగినులు.మనము ముందర చెప్పుకున్నట్లు సాక్షాత్తుగా పరమేశ్వరుడే పదునాలుగు స్త్రెమూర్తులుగా సాధకునికి మాయను తొలగింపచేయుటకు గురువులైనారేమో అనిపిస్తున్నది.

 పదునాలుగు ముఖ్యనాడులు కల ఉపాధి పదునాలుగు లోకములలోనే ఈశ్వరుడున్నాడని,వెతికి దర్శించుకోవాలనే తపనతో ఉంటుంది.

 త్రిపురములు ఏకీకృతమైన వేళ కలిగినమార్పు అందించిన వివేకము క్లేశములను చేదించగలననే విశ్వాసమును కలిగిస్తున్నది.

  తనలోని ఊపిరి-ఆహారము-శక్తి-రక్తము-మాంసము అన్ని భగవత్స్వరూపములే అన్న భావనకలుగుతుంది.

 దేశేంద్రియములు మనసు బుద్ధి చిత్తము  అహంకారముతో కలిసి పదునాలుగు కోణముల గుర్తుతో సత్యప్రకాశ దర్శన బీజమును నాటి మార్గమును చూపించుచున్నారు.

  అందుకేనేమో బ్రహ్మసూత్రములప్రకారముభగవత్సాంగత్యమునకు పదునాలుగు మార్గములు కలవని అన్నది.

  భూమాధికరనము-పరమాత్మ సర్వవ్యాపకత్వమును అర్థముచేసుకోవాలంటే,

 పరమాత్మను,

 ఆకాశముగా,వాయువుగా,జ్యోయిగా,వైశ్వానరునిగా.సూర్యునిగా,ఏదో 

ఒక మార్గమును విడువకుండా పట్టుకుని సాధనతో సత్తును అర్థముచేసుకొనవచ్చును.

  మనసు మంచిచెడులవిచక్షన్ణను చేయలేదు.అదికేవలము సాక్షి.కేవలము బుద్ధిమాత్రమే ఆ ప్రావీణ్యతను కలిగియున్నది

  భవబంధముక్లకు దూరమైతే కాని భగవంతునికి దగ్గరకాలేము.

 తత్-త్వం-అసి ఆ పదార్థమే నీవుగా ఉన్నావు అని తెలిసికొనుటకు,

 మాయావిశిష్ట బ్రహ్మము మోచకరూపక బ్రహ్మ స్వరూపముగా మారుటకు ఇంకాచేయవలసిన ప్రయాణము ఉన్నది.

 సర్వేశ్వర భావనమైన  సర్వవశంకరీ ముద్రాశక్తి సహాయముతో ఈశ్వర విచారణమును ప్రారంభించిన సాధకుడు తనైంద్రియములను,మనోబుద్ధ్యహంకారములను వశముచేసుకోగలుగుతున్నాడు.ఒకవేళ ఏవైనా త్రిగుణ/త్రిపుర సమస్యలు ఎదిరైననుచక్రేశ్వరి వాసిని(గొడ్డలి/ఖడ్గముతో)వాతిణి ఖండించివేసి ఆశ్ర్ర్వదిస్తున్న సమయమున,మరొకమెట్టు ఎక్కడానికి,సర్వార్థసాధకచక్రములోనికి ప్రవేశించుటకు సిద్ధపడుచున్నాడు.

  యాదేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థితా

  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః. 

   .


Monday, June 17, 2024

MUDAVA MAJILEE-SARVA SAMKSHOBHANA CHAKRAMU AMTE?

   

 "అష్టదలకమలమందు నిష్టతో నీ ప్రతిమనిలిపి

  అర్ష్టికర్తవనుచు నీదు చరనములనే నమ్మితిని

  పరమేశ్వరి  నీకిదిగో వందనం"


  స్థూలదేహముతో త్రైలోక్యమోహన చక్రమనే మూడుగీతలు కలిగిన ప్రాకారములోనికిప్రవేశించిన ప్రయాణికుడు అక్కడ సిద్ధిమాతల-సప్తమాతృకల-ఉద్రాశక్తుల సహాయముతో చక్రేశ్వరి ఆశీర్వచనముతో ఒకమెట్టిపైకెక్కి సర్వాశాపరిపూరక చక్రమను పేరుతో నున్న పదహార్రు వికసిత దళములతో వృత్తాకారముగానున్న ఆవరనములోనికి ప్రవేశించి పదహారు అద్భుత శక్తిమాతల,సిద్ధిమాత,ముద్రామాత సహాయముతో స్వప్నావస్థను మనసుతో ల్కలిసిన సూక్ష్మ శరీరముతో అనుభవించి తాత్కాలికమైన ఆనందమునకు లొంగక అణిమలోని మహత్తును,లఘిమలోని పటుత్వమును అర్థముచేసుకుని,చక్రేశ్వరి దీవెనతో మూడవ ఆవరణమైన "సర్వ సంక్షోభణ చక్రమను"పేరుగల మూడవ ఆవరనము లోనికి ప్రవేశిస్తున్నాడు.మహిమా సిద్ధిమాత-సర్వాకర్షన ముద్ర మాత సహాయమునకై తోడుగా ఉన్నారు.ముద్రాసక్తి న్యాసమును తెలియచేయుటతో పాటుగా,సందేహములను సైతము తొలగిస్తున్నది.

 స్వప్నములకు ఇక్కడ చోటు లేదు.ఊహలు ఊసులాదవు.

  ప్రయాణికుడు విశ్వ-తేజదశలను దాటి ప్రాజ్ఞుడవుతున్నాడు.అంటే జ్ఞానమును పరిచయముచేసుకుంటున్నాడు.అజ్ఞానము ఇంకా పూర్తిగా వీడలేదు.

  ఎనిమిది మంది శక్తిమాతలు ప్రయాణికుని మనోభావములకు స్థిరత్వమునుకలిపిస్తున్నారు.దేహభ్రాంతిని తొలగచేస్తున్నారు.గురువులై ఇంద్రియములను-మనసును స్తిమిత పరుస్తున్నారు.వీరిని అనంగ శక్తులని,గుప్తతర యోగినులని పిలుస్తారు.సాధకుని అంతరంగమును అతిగుప్తముగా సమాధాన పరుస్తూ,

 ఎట్టి పరిస్థితులలైనను తనకు తాను సమర్థవంతముగాఉందగలిగే ,తన సమస్యలను పరిష్కరించుకునే అర్హతను కల్పిస్తారు.

 పరమేశ్వరి మహిమను అర్థము చేసుకోవాలంటే మనోదౌర్బల్యములు దూరమై మహిమ సిద్ధిని పొందగలుగుతాడు.

   ఈ ఎనిమిది శక్తులను మన్మథ సంబంధ శక్తులుగా కూడా సమన్వయిస్తూ,అనంగ కుసుమే,మేఖలే,రేఖే ,అంకుశే అంటూ

 చిత్తశుద్ధితో ఎటువంటికోరికనుకలిగియుండాలి,దానికి ఎంతవరకని హద్దునునియంత్రించాలి,ఆకోరికను ఎలా అలవాటు చేసుకోవాలి,ఆ అలవాటుని అభ్యాసముగా ఎలా మార్చుకోవాలి,ఉత్తేజ పరచుకోవాలి,ఆడంకులను ఎలా త్రుంచివేయకలగాలి అన్న వాటి సంకేతములే ఈ ఎనిమిది శక్తిమాతలు.

 సర్వాకర్షిణి ముద్ర సత్తు వైపునకు ఆకరషణను కలుగచేస్తూ,నడిపిస్తూ ఉంటుంది కనుక దేహభ్రాంతి దూరమవుతుంటుంది.

   గాఢ నిద్రలో నున్న దేహమును ఏ స్వప్నములు బాధించవు.ఏఇంద్రియములు తొందరపడవు.మనసు సైతమునిమిత్తమాత్రమై ఉంటుంది.అదినిత్య ప్రళయస్థితి.

  స్థూల సూక్ష్మ దేహములు తమౌనికిని గమనించలేని స్థితి.ఉపాధిఉంటుందికాని ఉపాధి ఉనికిఉండదు.దివ్యానందములో జ్ఞాన-జ్ఞాతృ-జ్ఞేయములో ఏకీకృతమవుతాయి.గాఢనిద్రలో శ్వాస నైసర్గిత శక్తులను స్వీకరించి మరింత ప్రశాంతపడుతుంది.

 "ఆనందో బ్రహ్మః" అన్న స్థితిలోనున్న సాధకుడు ఆ స్థితిని తాను శాశ్వతముగా పొందేందుకు,

 సృష్టిత్రయ" ఆవరనములను దాటి,మరొక మెట్టి పైకెక్కి,సర్వ సౌభాగ్యదాయకచక్ర" ప్రవేశమునకై చక్రేశ్వరి ఆశీర్వచనమునై సంసిద్ధుడగుచున్నాడు.

  " యాదేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థితా

    నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః"



Sunday, June 16, 2024

RENDAVAMAJILEE-SARVAASAA PARIPOORAKAMU AMTE?


 


  " షోడశ కళానిధికి షోడశోప చారములు

    జాడతోన నిచ్చలును సమర్పయామి"


  పరమేశ్వరి అనుగ్రహముతో ప్రయాణికుడు ఒక అంతస్తు అక్కగలిగాడు.చాలా అందమైన వికసిస్తున్న పదహారు రేకులతో గుండ్రముగా ఉన్నది ఆ ఆవరనము."సర్వాశా పరిపూరక చక్రము" అని దానిపేరు అనిచెప్పారు.అక్కడచేరిన వారికి పదహారు శక్తులు అన్ని కోరికలను తీర్చి ఆనందమయులను చేస్తారట.

 అణిమ సిద్ధి దేవత అహంకారమును ఏ వొధముగా తగ్గించుకోవాలో తెలియచేస్తూనే,అణూరణూనాం" అంటూ అణువు యొక్క గొప్పతనమును వివరించింది.అంతే కాక లఘిమా సిద్ధి అని శక్తిమాతను తోడుగా పంపించింది సహాయానికి.సర్వద్రావిణి అను ముద్రాశక్తి సైతము నన్ను సంస్కరించుటకు తాను వచ్చింది.

 ఇంతకీ ఇప్పుడు నా స్థూలదేహము నిద్రలోకి జారుకుంది.ఏమిచేయాలో తోచని నామనసు ఇప్పుడు సూక్ష్మదేహముతో జతకట్టి ఎన్నెన్నో అందమైన కలలను కంటున్నది అనుకుంటున్నాడు ఆ ప్రయాణికుడు తన మజిలీలో.ఇది స్వప్నావస్థ అన్నమాట.ఎన్నెన్నో వింత అనుభూతులు.కాని,తెల్లవారగానే మెలకువ వచ్చింది.కల కరిగి పోయింది.అదే జీవితము.

 చుట్టు తేరిపారచూశాను.పదహారు మంది మాత్రుమూర్తులు నన్ను పలకరిస్తున్నారు.

 ఇప్పుడు నా నడక విధానము కొంచము మారింది.చదరపు నేలపై సూటిగా నడిచిన నేను గుండ్రముగా నున్న పద్మాకారమునుచూస్తూ నా నడకను ఆవృత్తము చేస్తున్నాను.అదొక వింత అనుభవము.ఆ పదహారుమంది స్త్రీమూర్తులు నన్ను విపరీతముగా ఆకర్షిస్తున్నారు.అది వారి స్వభావమట.పైగా నాపేరు కామాకర్షిణి,బుద్ధ్యాకర్షిణి,శరీరాకర్షిణి,స్పరశాకర్షిణి అంటూ చెబుతున్నారు.

  అమ్మ నాకు వివరముగా తెలియచేయాలనుకున్నట్లుంది,వారి వంక తేరిపార చూశాను.పాడ్యమి నుండిపూర్ణిమ/అమావాస్య రూపాలుగా కాలచక్రమును తిప్పుతున్నారు.

  కళ్ళు నులుముకుంటూ మరొకసారిచూశాను.పదహారు జాతక కర్మలను అదే నామకరణము మొదలు పహరాహారు చేతనులకుచేయిస్తూ కనిపిస్తున్నారు.

 నమ్మలేక పోయాను.అందరు అ నుండి ఔ వరకు అక్షరములుగా మారిపోయారు.

 తేరిపార చూశాను,భూమి,నీరు,నిప్పు,గాలి,ఆకాశము,కన్ను ముక్కు చెవి నాలుక ,చర్మము,మనసుగా మరింత స్పష్టముగా కనబడుతున్నారు.

  ఏమిటి ఇన్నిరూపాలతో,నామములతో కనబడుతున్నారు అన్న సందేహములో నేనున్నాను.అప్పుడే లఘిమాశక్తి మాత నా దరిచరి,మాయికా మలము నిన్ను చేరి,నీ మోయలేనంతగా పెరిగి నిన్ను ఇబ్బంది పెడుతున్నది.ఉండు నేను దానిని తొలగించివేస్తాను అంటూ,ఏదో చేస్తున్నది.విచిత్రముగా నా మనసు తేలిక అయింది.పక్కనమాయామోహములు-ఆశాపాసములు,నేను నావేనని భ్రమించే బరువుబాధ్యతలు గుట్టలు గుట్టలుగా నన్ను వీడిపడియున్నాయి.

 ఇంతలో సర్వవిద్రావిణి అను ముద్రాశక్తి మాత నన్ను చేరింది.తేలిక పడిన నా మనసును శుభ్రముచేస్తాననంటు.

  ఇది సర్వ ఆశా పరిపూరకము.అన్నికోరికలను/అదియునిపూర్తిగా తీర్చు ఆవరనము.కాని మనకోరికలు సరియైనవిగా ఉండాలి.లేకుంటే మనమే స్వయముగా కష్టాలను కొనితెచ్చుకుంటాము.

  అసలు మనలో కోరికలు ఏలా కలుగుతాయంటే పూర్జన్మల పాప-పుణ్యకర్మల ఫలితములను అనుభవించుటకు అనుకూలముగా.అవి తీరకానే,అనుభవములోనికి రాగానే మళ్ళీ మొదలు మాయ మనలను బంధించటము.

 అంటే ఇప్పుడు నేను ఇంద్రియముల ఆజ్ఞకు కట్టుబడి ఉందకూడదు.బుద్ధ్యాకర్షిణి శక్తి నన్ను చూసి నవ్వింది.విచిత్రము నా ఇంద్రియములు నన్ను తమకు నచ్చిన విధముగా ఆడించుటకు తడబడుచున్నాయి.మనసు సైతము తనఒరవడినిమార్చుకుంటున్నది.

 నామనసు-వాక్కు-శరీరము (త్రికరనములు) గుప్తయోగినుల,లఘిమాసిద్ధి,సర్వ విద్రావిణి శక్తి మాతల సహాయముతో ఊర్థ్వపయనమునకు,మరో అంతస్తు ఎక్కడానికి సిద్ధమవుతున్నది.చక్ర నాయిక నన్ను ఆశీర్వదించి" 


 


సర్వ సంక్షోభణచక్ర  "ప్రవేశమునకు సంసిద్దము చేస్తున్నది.

  యాదేవి సర్వభూతేషు దయా రూపేణ సంస్థితా

  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః.


MODATI MAJILEE-BHOOPURAMU AMTE?


 


 " అంబ పరమేశ్వరి -అఖిలాండేశ్వరి

   ఆదిపరాశక్తి పాలయమాం

   త్రిభువనేశ్వరి రాజరాజేశ్వరి

   ఆనందరూపిణి పాలయమాం"


   అమ్మావ్యాజ అనుగ్రహము ఎన్నోజన్మల పుణ్యఫలముగా మారి ఆ తొమ్మిదంస్తులభవనమును ఎక్కాలనే కోరికను కలిగిస్తున్నది.పదములను/పాదములను అటువైపుగా నడిపిస్తున్నది.


  ప్రవేశ ప్రాకారము మూడు రంగులగోడలతో చతురస్రాకారముగా నున్నది.నాలుగు వేదములు నాలుగు ప్రవేశ ద్వారములై స్వాగతిస్తున్నాయి.మొదటిగోడ నల్లని రంగులోఉన్నది.ఇక్కడ స్థూల దేహమునకు ప్రవేశము/ప్రాధాన్యము ఉంYఉంది.మనము మెలకువ ఉండే జాగ్రదావస్థ స్థిలో ఈ ఆవరనము ఉంటుంది.ఇక్కడ సిద్ధి మాతా స్వరూపములు సహాయ పడుతుంటారు.వారు చిన్నపరిణామముగా మారుట,పెద్ద పరిణామముగా మారుట,కోరికలు తీర్చుకోగలుగుట,కోరిన రూపమును పొందగలుగుట,వశపరచుకొనగలుగుట,పాలించగలుగుట మొదలగు శక్తులతో సహాయపడుతుంటారు.కాని అవన్నీ శాశ్వతము కాదు.తాత్కాలికమే.ఏదో ఒక ఐహిక ప్రయోజనమునకు ప్రదర్శించుకోవలిసినవే.

 అమ్మభువనేశ్వరి.మూడు భువనములకు మహారాణి.కనుకనే తనవిస్తరనకు హద్దులు "త్రైలోక్య మోహనముగా" భూపురముతో నిర్ణయించినది.

 వీనినే శాస్త్రములో,

 భుః-భువః-సువః అనిపిలుస్తారు.నాదమైన గాయత్రీ మాత.

  1ప్రాపంచికానుభూతి యే -భుః

  2.ఆ సమయములో వచ్చే అడ్దంకులు-భువః

  3.దానిని పరిష్కరించుకొను శక్తి-సువః అని పెద్దలు చెబుతారు.


    నల్లనిగీత తమోగుణముతో/చీకటితోనిండియుంటాయి.బుద్ధిని పనిచేయని ఇంద్రియములు మనసును ప్రభావితముచేస్తుంటాయి.

 మన మానసిక స్థితిమూడు విధములుగా మార్పు చెందుతుంటుంది.

1 జాగ్రదావస్థ-మెలకువగా ఉండంతము.

   ఆ మెలకువ జనించిన కోరిక అమ్మ నుండి వరములను పొందుటకై,స్థూల శరీరముతో మనసు తపన పడుతుంటుంది.కాని ఆ కోరికలు నిజమునకు అంతౌపయోగ కరములు కావు.వాటిని తీర్చేందుకు సిద్ధి శక్తులు తాము బయటకు వచ్చి,ఉపాధిని ధరించి అనుగ్రహిస్తుంటాయి.వర ప్రభావమును దానిని సరిగా ఉపయోగించుకోలేని ఎడల వచ్చే చెడు పరిణామములను హెచ్చరిస్తుంటాయి.మన ఇతిహాసములలో సుపరిచితమే.

  కాని ఆ సిద్ధులు తాత్కాలికమే.శాశ్వత సంతోషమును ఈయలేవు.ఈవిషయము తెలిసికొనిన వారిని ప్రకట యోగినులు తమ నాయిక ఆశీర్వాదము పొందిన తరువాత రెండవ ఎర్రని గీతకల ఆవరనములోని చేరుస్తాయి.

   రజోగుణ సంకేతమే ఆ ఎర్రదనము.మానవుని స్వప్నావస్థ.స్థూలదేహము అలిసి స్వల్పకాలప్రలయమైన నిద్రకు ఉపక్రమిస్తుంది.

  మనసు సూక్ష్మదేహముతో కలిసి స్వప్నములో ఎంతో వింతవింత అనుభవములను పొందుతుంటూంది.అంతలో తెల్లవారుతుంది.స్వప్నము జారిపోతుంది.అంటే ఇదీ తాత్కాలికమే శాశ్వతము కాదని తెలుసుకుంటాడు ప్రయాణికుడు.ఆ శక్తుల సహాయముతో వారి నాయిక ఆశీర్వాదము తీసుకుని మూడవదైన తెల్లని గోడ ఉన్న ఆవరనము లోనికి ప్రవేశిస్తాడు.ఇక్క సుషుప్తి దశలో ఉంటాడు.స్థూల సరీరము-సూక్ష్మ శరీరము వదిలి కారణ శరీర ప్రవేశము చేస్తాడు.తన పూర్వజన్మల పాప-పుణ్యములు నిక్షిప్తమై,వాటిని అనుగ్రహించుతకు ఏ ఉపాధిని తాను పొందవలెనో కొంచం కొంచం అర్థమవుతుంటుంది.అలా అర్థము చేసే మాతృమూర్తులే ముద్రాశక్తులు.అట్టి స్థితిలో నున్న ప్రయాణికుడు తాను ఎక్కవలసినది తొమ్మిదవ అంతస్థుకదా.ఇది మొదటి ప్రాకార మూడవ భాగము.కనుక నేను వీరిని ప్రార్థించి,నాకు అడ్డమైన విషయములను/భావనలను తొలగించుకొనుచు అర్హత పొందుటకు ఈ సక్తులు తలా ఒకటి ఒక్కొకావరనములోఉంటూ మార్గమునుసుగమము చేస్తాయి.

  కొత్త కొత్తవిషయములను తెలుసుకుంటూ ప్రయాణికుడు రెండవ అంతస్తును ఎక్కుటకు సిద్ధమగుచున్నాడు.

  యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా

  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.


Thursday, June 13, 2024

DEVIKHADGAMALA AMTE?


  శ్రీ మాత్రే నమః
  ******************
 " అమ్మవు నీవే  అఖిలజగాలకు-అమ్మలకన్న అమ్మవు నీవే
   నీ చరణములేనమితినమ్మ-శరణము కోరితి నమ్మా భవాని"
  
   అని వేడుకుంటున్న తన బిడ్డలను కరుణించకుండా ఉండగలదా ఆ పరమేశ్వరి.
  అందుకే పరంజ్యోతిగా ప్రకాశములో ఇమిడి ఉన్న తాను దాని నుండి కొంత భాగముగా విడిపోయి,మనలను కాపాడుటకై దిగివచ్చినది అని నా నమ్మకము.
 ఇంకొక విధముగా చెప్పాలంటే ఆలోచన+ఆచరణ అను రెండింటిని సమర్ధిస్తూ అయ్య+అమ్మ ఒకరు కనపడకుండ కథనడిపిస్తూ,మరొకరుకనపడుతు మనలను చేరదీస్తూ,ప్రపంచమనే గారడీని చేస్తున్నారన్నమాట లీలగ.
 నిజమునకు వారిద్దరున్నది ఒకతొమ్మిది అంతస్తుల భవనము.ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క సుందరమైన ఆకారముతో,దాని ప్రాముఖ్యతను తెలియచేస్తుంటుంది.ప్రతి అంతస్తులో ఎందరో మహిమగల మాతృమూర్తులు మనకు పై అంతస్తు చేరుటకు సహాయపడుతుంటారు.పైకి చేరుతున్న కొలది వాతావరనము శుభ్రమైనట్లు,మన మనోభావములు కూడా పరిశుద్ధమగుతుంటాయి.
   మనకు అవసరములేనివస్తువులు ఏవో గ్రహించి వానిని పైకి తీసుకుని వెళ్ళకుండ వదిలించుకుంటూటాము.ఏది నిజము/ఏది అబద్ధము తెలుసుకోగలుగుతాము.


   ఒకే పదార్థము రెండుగా విడినప్పుడు విడిన భాగము తానలో వచ్చిన మార్పుతో ఆఆశ్చర్యముగా ప్రకాశము/పరంజ్యోతి వంక చూడసాగినదట.ఆ చూపుల వలయములు చక్రములుగా/ఆవరణములుగా గిరగిర తిరుగుతూ బిందువు నుండి కిందకు సాగి భూమి వరకుచేరి,అక్కడవిస్తరణను ఆపివేసినదట.మొదలు-చివర మధ్యలో ఏడుమజిలీలుగా తాను పైన సూక్ష్మముగా కిందకు వస్తున్నకొద్ది స్థూలముగా రూపుదిద్దుకున్నదట.
  తాను కిందకు రాగలదు.తిరిగి పైకి వెళ్ళి ప్రకాశములో అంతర్లీనము కాగలదు.సామాన్యులకు ఆ ప్రయాణము అంత సులభము కాదు.కనుక ప్రతి మజిలీలోను/ఆవరణములోను కొన్ని తన ప్రతిరూపములను పరిమిత శక్తులతో సృజించి వారిని మనకు సహాయము చేయమని చెప్పినదట.వారే యోగిని అను పేరుతో గౌరవింపబడుచున్న మాతాస్వరూపములు.వారు వారి నాయిక కలిసి ప్రయాణికులకు సహాయపడుతూ,ఒక్కొక్క అంతస్థులోని ప్రత్యేకతలను తెలియ చేస్తూ,పరిపూర్ణముగా అర్థమయేటట్లు కాలవిలిసిన అర్హతను పెంపొదిస్తూ,వదిలివేయవలసిన వాటిని సూచిస్తూ,కృతకృత్యుని చేస్తారు.
   ఇంతకీ "దేవిఖడ్గమాల అంటే?" అమ్మను స్తుతించటముతో పాటుగా అమ్మ నియమించిన మనకు సహాయపడుతున్న శక్తులను(పరివార దేవతలను) సైతము ఆరాధించటము.ఖడ్గము అన్నపదమునకు స్తుతి అన్న అర్థమును అన్వయించుకుంటూ "శుద్ధ శక్తి మాలా" అనికూడా పిలుస్తారు.అమ్మను ఆర్తితో పిలుచుటయే స్తుతి.అహములేకుండా అర్చించుటయే స్తుతి.ఆస్తుతియే ఖడ్గముగా మారి నీ అడ్డంకులను/అజ్ఞానమును/అహంకారమును/అలసత్వమును/అనుభవములను ఖండించివేస్తుంది.నీవు చూస్తున్నవి/చేస్తున్నవి నీలో దాగిన ప్రాణసక్తి సహకారమని తెలుసుకుంటావు.ఆ ప్రాణశక్తి ఎక్కడ ఉంది?ఎలా ఉంటుంది? తెలుసుకోవాలన్న తపన నీలో ప్రారంభమవుతుంది.తపన తపమవుతుంది.తహతహలాడుతున్న నీ ప్రయాణము ఒక్కొక్క అంతస్తును ఎక్కుతూ,తొమ్మిదవ అంతస్తుచేరగానే,నీ నామరూపములు/కష్టసుఖములు/సంకల్ప వికల్పములు /నేను-నీవు అన్న రెండు విరుద్ధ భావములు లేవని,అంతా ఒక్కటే నన్న భావము కలిగి ఆ ప్రకాశమే పరమేశ్వరి యని ఆమె ఓడిలో కూర్చుని నిన్ను నీవు,నీలో దాగిన ఆత్మ స్వరూపమును తెలుసుకోగలుగుతావు.
 గారడీవాడు గారడీ చేయటము ఆపేస్తాడు.అక్కడ మాయలు/జరిగిన సంఘటనలు మాయమైపోతాయి.
ఇన్నాళ్ళు అలవేరు సముద్రము వేరు అనుకున్న మనము జలము కాసేపు ఆడుకోవటానికి సముద్రమునుండి ఎగిపడుతూ అలయై ఒడ్డువరకు వచ్వ్హి,ఆట చాలనిపించగానే తిరిగి జలముగా మారి సముద్రగర్భమవుతోందని గ్రహిస్తాము.
   వాన పడిన ఆకాసము ప్రకాశ సూర్య కిరనము ప్రసరించగానే ఏడురంగుల హరివిల్లుగా కనిపిస్తున్నప్పటికిని అదే తాత్కాలికమేనని గ్రహించగలుగుతాము.
  అమ్మ ఒడిలోనున్న మనము కర్మఫలితములను అనుభవించుతకు తగిన ఉపాధిని అర్హతగా పొంది తిరిగి అమ్మ ఒడికి చేరతాము అని ఇంతకీ మనతో పాటుగా అమ్మకూడా మన వెంట వచ్చి,మనపోషణకు కావలిసినవి పంచభూతములుగా /ప్రపంచముగా అందించి,మనలో సూక్ష్మముగాదాగి చైతన్యస్వరూపిణియై కంతికి రెప్పవలె కాపాడుతున్నది.
  యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
  నమస్తస్త్యై నమస్తస్త్యై నంస్తస్త్యై నమోనమః.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...