Wednesday, June 19, 2024

IDAVA MAJILEE-SARVAARTHASAADHAKA CHAKRAMU AMTE?


 


  " దశముద్ర సమారాధ్యా  త్రిపురాశ్రీ  వశంకరీ

    జ్ఞాన ముద్ర జ్ఞానగమ్యా జ్ఞాజ్ఞేయ స్వరూపిణీ"

      అని స్తుతిస్తిస్తున్నది పరమేశ్వరిని లలితరహస్య సహస్రనామ స్తోత్రము.


   ఇంకొక మెట్టిఎక్కిన సాధకునకు వృత్తాకారముగా బయటకు కనపడుచున్న వికసిత పది దళములుగల ఆవరణము అత్యంత మనోహరముగా కనిపించింది.పదిమందిమాతృమూర్తులు పరమవాత్సల్యముతో స్వాగతిస్తున్నారు.వారితో పాటుగా "వశిత్వసిద్ధి" మాత,సర్వోన్మాదిని ముద్రా మాత ధైర్యమునిస్తూ నడిపిస్తున్నారు.ఆ పదిమంది స్త్రీమూర్తులను కులోత్తీర్ణ యోగినులు అని గౌరవిస్తారట.

  కులము అన్న శబ్దమునకు సమూహము,వర్ణము అన్నార్థములే కాకుండా,జ్ఞానము అని కూడా భావిస్తారట.మనము ఏ విధముగా ఒకపరీక్షలో నెగ్గిన తరువాత అంతకుమించిన దానిని నేర్చుకునే అర్హతను సంపాదిస్తామో,అదేవిధముగా ఈ పదిమంది మాతలు జ్ఞాన ఉత్తీర్ణతకు/విస్తరణకు మరింతనేర్చుకొనుటకు సహాయపడతారట.

   ఈ అద్భుత ఆవరణమును బహిర్దశారము/సర్వార్థసాధక చక్రము అనిపిలుస్తారట.సర్వము అనగా తురీయ పురుషార్థమైన మోక్షము అన్నమాట.ధర్మ-అర్థ-కామ అవస్థలను దాటిన ఉపాధికి లభించేది.

  మాత సర్వోన్మాదిని ముద్రాశక్తి నా ఆత్మదర్శన కోరికను మరింత బలపరుస్తున్నది.నా ప్రయాణమును మరింత శోభాయమనము చేయుటకు సహాయపడుతున్నది.

 వశిత్వసిద్ధి మాత ఈశ్వరభావన నీకు సర్వ అభీష్టములను తీరుస్తుంది అంటూ,

 "గురుః బ్రహ్మగురుః విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

  గురుః సాక్షాత్ పరబ్రహ్మః తస్మైశ్రీ గురవే నమః" అంటూ గురువు ద్వారా నీవు నేర్చుకొనుటకు ఇదే తగినసమయము అంటున్నది.

  నేనెక్కడ అహంకరిస్తానో అని జ్ఞాన విభాగమును పరిచయము చేస్తున్నది.

 "జ్ఞానినాం తత్త్వ దర్శనః" అనిఒకనిమిషము ఆగి అర్థమయినదా అని,నా స్థితిని గమనించి,ఇలా చెప్పసాగినది.

 జ్ఞానము 

1వాచకజ్ఞానము

2.అనుభవజ్ఞానము అని రెండు విధములు.

  వాచకజ్ఞానము పుస్తకపఠనము/శ్రవనము/సంభాషణము ద్వారా లభిస్తుంది కాని అనుభవమునీయదు.కాని

  అనుభవజ్ఞానములో వాచకజ్ఞానము అంతర్లీనముగా దాగిఉండి అనుభవ ఫలితముగా రెండింటిని పొందకలుతాము.

  అదేవిధముగా గురువుద్వారా లభించే జ్ఞానము/బ్రహ్మమును ఎరుకపరుస్తుంది.అది బ్రహ్మ జ్ఞానము.పరమశివుడే ఆదిగురువు.ఆయన ఎవరో ఒకరి ద్వారా గురువుతానై ఉద్ధరిస్తాడు అంటున్నది.

 నాలో రజో-తమోగుణములను అణచివేసి,సత్వముతానే సర్వముగా మారుతోంది.

  ఇంకొక మాత నన్ను వాత్సల్యముతో చూస్తూ"పది"సంఖ్యను వివరిస్తున్నది.

 0 పూర్ణము.దానికి ఏ అంకెతోను సంబంధము ఉండదు.ఒ ను ఏ అంకెతో కూడినా/తీసివేసినా/గుణించినా/భాగహారించినా "0" గానె మిగులుతుంది.అజ్ఞానము శూన్యమంటుంది కాని జ్ఞానము పూర్ణము అంటుంది.అది శివప్రకాశము కాదు స్వయంప్రకాశము.

 1 ఒ లోని భాగము.అది అన్ని అంకెలలోను/సంఖ్యలలోను దాగి ఉంటుంది.దానికూడిక తీసివేత గుణింతము భాగహారము అంకెలలో/సంఖ్యలలో మార్పును కలిగిస్తుంది.1 ద్వైతముగా ప్రకాశిస్తున్న శక్తి.సగుణ సాకార స్వరూపము.

 ఇంతలో మరొకమాత అంతేకాదు మేము పదిమందిపది ప్రాణశక్తులము.మాలో ఐదుగురిని ప్రధాన ప్రాణములని,మరొకాఇదుగురిని ఉపప్రాణములని పిలుస్తారు.

 పరమాత్మ పరిపరివిధములై పరమాద్భుతములను పరమగురువుగా వివరిస్తున్నాడు.

 నన్ను నేను గమనిస్తున్నాను.నైవేద్యమంత్రం మనలో దాగిన పరమాత్మను ప్రార్థించుట మన అన్నివ్యవస్థలకు జీర్ణము,శ్వాశ,రక్తప్రసరణము,కన్నురెప్పవేయుట,ఆవలించుట,తుమ్ముట ,మలమూత్ర విసర్జనము,అధికవాయును అథోమార్గము ద్వారా వదిలివేయగలుగుట అంతా ఈ అమ్మల అనుగ్రహమన్నమాట.

 అర్థమవుతున్నది అంతరార్థము అనుకుంటూ చక్రేశ్వరి "త్రిపురాశ్రీ"  ఆశీర్వచనముతో,మాతల సహకారముతో,తనను తాను మనసును,ఇంద్రియములను సాధకుడు మరొక మెట్టు ఎక్కి "సర్వ రక్షాకర చక్ర" ఆవరణములోనికి ప్రవేశించుటకు సిద్ధపడుచున్నాడు.

 యాదేవి సర్వ భూతేషు విద్యారూపేణ సంస్థితా

 నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...