Saturday, August 8, 2020

mahanyaasamu

నీ మహన్యాసము నన్ను అపహాస్యము చేస్తున్నది నీ అంగ కరన్యాసములు అర్థముగాకున్నవి నీ రుద్ర నమక-చమకములు నన్ను మొద్దు అంటున్నవి నీ సహస్రనామములు పలుకగ సహాయము గాకున్నవి నీ శత ఎనిమిది నమములు నన్ను సతమతము చేస్తున్నవి నీ దండకములు అసలు అండ కానేకానంటున్నవి నీ అష్టకములు నావాక్కు స్పష్టము కాదంటున్నవి నీ షడక్షరీ మంత్రము నన్ను నిర్లక్ష్యము చేస్తున్నది శివ ప్రబంధములు పెద్ద ప్రతిబంధకమగుచున్నవి నీ పంచాక్షరి మంత్రము మించిపోలేదు అంటున్నది గుక్కతిప్పుకోలేని నాకు "శివ" యను చక్కని ఒక్క మాట చాలనవేరస ఓ తిక్క శంకరా! శివుని భక్టుడు తనకు నమక-చమకములు,అంగన్యాస-కరన్యాసములు,పంచాక్షరి-అష్టకములు,అష్టొత్తర-సహస్రనామములు చదువలేనని,కనుక శివ నామ జపమును మాత్రమే చేస్తానని అంటుంటే శివుడు కిక్కురుమనుటలేదు.భక్తుని తికమక పెడుతున్నాడు.నింద. నమకం-నమఃశివాయ-చమకం నమః శివాయ న్యాసం నమః శివాయ-మహన్యాసం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " నా రుద్రో రుద్రమర్చయేత్" రుద్రుడు కాని వాడు రుద్రుని అర్చించలేడు. పంచభూత పంచేంద్రియ తత్త్వమే పరమేశ్వరత్వము అని తెలుపునది పంచాక్షరి.అష్టమూర్తి తత్త్వమును తెలుపునది అష్టకము.మన 27 నక్షత్రముల నాలుగు పాదములను గుర్తించుటయే అష్టోత్తర శతనామావళి.సహస్రము అను శబ్దమునకు వేయి అను సామాన్యార్థమును స్వీకరించినప్పటికిని,అనతత్త్వానికి,అసంఖ్యేత్వానికి నిలయమై ఆనందధారలను జాలువారు ఆదిదేవుని అనుగ్రహ ప్రతీక.భక్తుడు బాహ్యముగా ప్రకటితమగుచున్న తన చేతులలో,శరీర భాగములను కదిలించుచున్న చైతన్యమును ఈశ్వర శక్తిగా గుర్తించి,దానిని గౌరవించుట అంగన్యాస-మహన్యాసములు.శరీరమును చైతన్యమును చేయుచున్న శక్తిని గుర్తించి గౌరవించుటయే మహన్యాసము.తనను నడింపించుచున్న శక్తికి నమస్కరించుట (కృతజ్ఞతతో) ఆరాధనకు సిధ్ధమగుట.అంటే ఇప్పటి వరకు ఈ దేహమనే భాండమును శుధ్ధి చేసి,భక్తి సమర్పణమను పాకమును వండుటకు సిధ్ధమగుతున్నాడు సాధకుడు.అర్హతను అధికారమును శివుని అనుగ్రహముతో పొందినాడు.బాహ్యప్రకటనమును గమనించిన తరువాత -బహిర్ముఖము నుండి అంతర్ముఖమగుటయే శివ నామము.రెండు లక్షణమైన అక్షరములు.గడ్డికొనవలె (నీవార శూకము) మన హృదయములో ప్రకాశించు జ్యోతిని దర్శించగలిగినవాడే ధన్యుడు.అదే శుభము-చైతన్యమును గుర్తించుట.తనలోని రుద్రుని గుర్తించి,తాను రుదునిగా మారుట.అంతా ఈశ్వరానుగ్రహమే కాని ఇతరము కాదు.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

Sunday, August 2, 2020

87

ఓం నమః శివాయ-73
  *****************

 అసత్యమాడు బ్రహ్మపుర్రె అంతగా నచ్చిందా
 ఆభరనముగా చేసి అలంకరించుకున్నావు

 హింసకు గురిచూసే బోయకన్ను నచ్చిందా
 రక్తాశ్రువులను కార్చ అనురక్తిని చూపావు

 అమ్మ దగ్గర ఉండనన్న అర్భకుని వాక్కు నచ్చిందా
 అమృతధారగ మారి ఆర్ద్రతనందించావు

 స్వార్థమే నింపుకున్న కరి ఉదరము నచ్చిందా
 ఉదారతను చూపిస్తు ఒదిగిఒదిగి పోయావు

 పృష్టభాగమున పూజలందు ఆవుచెవి నచ్చిందా
 లంకకు నేరానంటు గోకర్ణమున నిలిచావు

 పెంపును అందించుతావో పంపు అని చంపుతావో
 పెక్కుమాటలేలరా ఓ తిక్క శంకరా.



86



ఓం నమ: శివాయ

" అనిశము వశమగుతావు" పశునామములకు నీవు
"పశుపతి" అని పిలువగానే పరవశమేగా నీకు

"కాల భైరవుని" కాశికాపురపతిని చేసావు
"శరభమువై" నరసిమ్హుని శాంతింప చేసావు

మిక్కుటమగు ప్రేమగల "కుక్కుటేశ్వరుడివి" నీవు
వ్యాళము మీద మోజుగల "కాళేశ్వరుడివి" నీవు

"స్కంధోత్పత్తికి" వనమున లేడిగ క్రీడించావు
వ్యాఘ్రమునకు మోక్షమిచ్చి "వ్యాఘ్రేశ్వరుడివి" అయ్యావు

జంబుకమును అనుగ్రహించిన " జంబుకేశ్వరుడివి"

శ్రీ,హస్తి,కాళములను దయ తలచిన "శ్రీ కాళ హస్తీశ్వరుడవు"

" పాశమేసి" నన్ను బ్రోవ రమ్మంటే,నా భక్తిని
"కప్పల తక్కెడ" అంటావురా ఓ తిక్క శంకరా.

భావము
శివుడు పశుపతి కనుక పశువులన్నా, పశునామములన్నా మిక్కిలి ఇష్టము.కనుక కోడిగానో,పాముగానో,నక్కగానో,కుక్కగానో, పులిగానో, శరభముగానో , దర్శనమిస్తుంటాడు.".శ్రీకాళ హస్తీశ్వరుడిగా" భక్తులను అనుగ్రహిస్తున్నాడు.కాని నర రూపమున నున్న భక్తుని, (నన్ను) అనుగ్రహించమంటే,నా భక్తి నిశ్చలమైనది కాదంటున్నాడని-నింద.
పశువు అంటే జంతువులు,క్రిమి కీటకములు మాత్రమే కాదు.మోహ పాశము,తక్కిన బంధములచే బంధింపబడిన మానవులు సైతము పశువులే.భక్తితో పరమేశ్వరుని కొలిచిన కరుణ అను పాశముతో మనలను కటాక్షించు( ను) "పశుపతి" అయిన పరమేశ్వరుడు. -స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం) 

85

  ఓం నమః శివాయ-32
    ******************
  కంటి నీటిపూసలు కలిమిని అందీయగలవ
  సిగపూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలద
  కట్టుకున్న గజచర్మము పట్టుపుట్టమీయగలద
  నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను ఈయగలద

  కరముననున్న శూలము వరములనందీయగలద
  పట్టుకున్న పాములు పసిడిని అందీయగలవ

  కరుగుచున్న నగము తరగని సంపదనీయగలద
  కదలలేని చందమామ ఇంద్రపదవినీయగలడ

  కాల్చుతున్న కన్ను కాసులనందీయగలద
  ఆదిశక్తి అండనున్న ఆదిభిక్షువైన నిన్ను

  "దారిద్రదుఖః దహనాయ-నమః శివాయ" గ
   ఒక్కరైన నమ్మరురా ఓ తిక్కశంకరా.








paalutaagi



ఓం నమః శివాయ-78
 *********************

 పాలుతాగి విషము కక్కు పాముమీది మోజుతో
 పాలకడలి విషము మింగ పావుగా మారావు

 పచ్చి అబధ్ధాల పుర్రెలమీది మోజుతో
 పరమేష్టి పలుకులలో దొంగగా మారావు

 సూర్య-చంద్ర-అగ్నుల ముక్కంటిని నేననే టెక్కుతో
 అగ్గికన్ను తెరువలేని అసహాయుడవయ్యావు

 గంగను బంధించిన వాడిననే గర్వముతో
 కొంచమైన దించలేని నంగనాచివయ్యావు

 పదహారవ చంద్రకళమీది పరమప్రీతితో
 గ్రహణము తొలగించలేని ఘనుడవు నీవయ్యావు

 గొప్పపనులు నావంటూ పప్పులో కాలేస్తావురా
 ఒక్కసారి గమనించరా ఓ తిక్కశంకరా.

శివునికి పాములనుఆభరణములు గ ధరించుటపైగల ప్రీతి విషభక్షకునిగ మార్చినది.తుంచిన బ్రహ్మ పుర్రెలపైగల మోహము బ్రహ్మచే దొంగగా నిరూపింపచేసినది.వాటిని కనపడేటట్టుగా ఉంచుతాడేకాని దాచిపెట్టడము తెలియనివాడు.వృధ్ధిక్షయము అతీతమైన పదహారవ చంద్రకళను ధరించాననుకుంటాడే కాని గ్రహణమును ఆపలేని అసమర్థుడనుకుంటునారనుకోడు.గంగను బంధించిన మొనగాడను నేనేనను నంగనాచి కబుర్లు చెబుతాడు కాని కొంచము సైపైన దానిని కిందకు దించలేనని చెప్పడు.గొప్పపనులు తనవని అనుకుంటూ దోషిగా నిరూపించబడతాడు.
చంద్రకళనుధరించాననుకుంటాడే కాని గ్రహణ బాధను తొలగించలేడు.అగ్గిని కన్నుచేసి అదుపులో పెట్తాననుకుంటాడు కాని అది తెరువలేక బాధపడుతో0దన్న విషయాన్ని గ్రహించలేడు.అవి కుర్రో-ముర్రో అంటుంటే వాటి సమస్యలను పరిష్కరించలేని అసమర్థుడు శివుడు-నింద.

 ఆభరణము నమః శివాయ-ఆదరణయు నమః శివాయ
 చింతయు నమః శివాయ-నిశ్చింతయు నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


గ్రహణము అంటే స్వీకరించుట గ్రహించుట అని పెద్దలు చెబుతారు.రాహుకేతు గ్రహములను ఛాయగ్రహములంటారు.ఇవి భూమికి ఉపగ్రహము అయిన చంద్రుడు రవి మార్గమును ఖండిస్తు చేయు పయనములోని ఉత్తర దక్షిణ బిందువులు.భూమి సూర్యుని చుట్టు తిరుగుతు,తనచుట్టు తాను తిరిగే ప్రక్రియలో సకల చరాచర జీవరాశులకు అవసరమగు ఔషధ తత్త్వములను కొంతసేపు చంద్రునికి దగ్గరగా జరిగి స్వీకరిస్తుందట.మానసిక ప్రశాంతతకు కూడ తోడ్పదేటట్టు చేస్తుందట.భూమి ఈ గ్రహణ సమయములలో సౌరశక్తులను స్వీకరించి శారీరక పెరుగుదలను,చంద్ర తత్త్వమును గ్రహించి మానసిక మెరుగుదలను అందించుటకు కొద్దిసేపు మాత్రమే దగ్గరగా ఉండే విధానమును పరమేశుడు ప్రవేశపెట్టినాడట.విజ్ఞులు నా అభిప్రాయము తప్పయిన క్షమించి,సరైన వివరణను అందించగలరు.ధన్యవాదములు.


" ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం
  భిత్వామహాబలిభిరీశ్వర నామ మంత్రైః
  దివ్యాశ్రితం భుజగభూషణ ముద్వహంతి
  యే పాదపద్మ మిహతే శివతే కృతార్థః"

     శివానందలహరి.

  శివా నీ పాదపద్మము నిధి వంటిది.దానిని నీ ధ్యానమనే అంజనముతో చూచి,చీకటిగా నున్న స్థానమును నీ నామమనే మహాబలశాలుల ద్వారా ఛేదించి,దేవతలు ఆశ్రయించగా,సర్పములు నిన్ను చుట్టుకొనగలిగినవి అవి ఆభరణముగా అలరారు భాగ్యమును పొందించినది వాటికి నీపై కల అచంచల  కాని మభక్తియేరొక్కటి .కాదు.అవ్యాజ కరుణామూర్తి,నీ పాదనిధిని పొందగలుగు భాగ్యమును ప్రసాదింపుము.

 ఏక బిల్వం శివార్పణం.


























TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...