Tuesday, March 30, 2021

TIRUVEMBAVAY -29


 


 తిరువెంబావాయ్-29
 ****************



 విణ్ణక తేవరు నన్నవు మాట్టా

 విళుప్పొరుళె ఉన్ తొళుంబు అడియోగళ్




 మణ్ణగ తేవందు వాళచేదోనే

 వం తిరు పెరుంతురై యాయ్ వళి అడియోం




 కణ్ణగ తేనిన్రు కళిదరు తేనే

 కడలముదే కరుంబే విరంబు అడియాల్




 ఎణ్ణగతాయె ఉలగిత్తు  ఉయిరాయ్


 ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె.



 పరంపర శివానుగ్రహదాయా పోట్రి

 ******************************


 తిరుమాణిక్యవాచగరు,
 1. కనులారా స్వామిని దర్శించారు.
 2.నోరారా స్వామిని కీర్తించారు.
 3.మనసారా స్వామిని అర్చించారు.

 వారి స్మరణమే శుభప్రదము.వారి ఔన్నత్యమును ఈ పాశురము చెప్పకనే చెబుతుంది.

 మనముఇప్పుడు స్వామి సంస్మరణా సౌభాగ్యవంతులమగుటకు మూలకారణము తిరు మాణిక్యవాచగరే.వారు స్వామిని ప్రసన్నులు చేసుకొని,సమర్పించిన సవినయ విన్నపమే.

  1.కణ్ణగతే నిన్రు కళిదరో తేనే,

   కన్నుల పండుగగా నేను నీ దర్శన సౌభాగ్యమును ఆస్వాదించగలుగుతున్నాను.
 
  2.చేదోనేవం,

  మా మీది అనుగ్రహముతో తిరుపెరుంతురైకు విచ్చేసి,మీ దివ్యపాదసేవా భాగ్యమును అందించిన,
 వళి అడియోం-
తేజోమయ పాదపద్మములను మనసారా అర్చించగలుగుతున్నాము.

 3.కడలముదే కరుందే-

    కళ్యానకరమైన మీ నిర్హేతుక( మాకు యోగ్యత/అర్హత లేనప్పటీకిని) ఆశీర్వచన అనుగ్రహమునునోరారా కీర్తించగలుగుతున్నాము.

 మా ఇంద్రియములు ధన్యమైనవి ఆత్మానందా.

 నా జన్మ తరించిన.కాని మనసులో ఒక చిన్న వెలితి,నిన్ను ఒక కోరిక తీర్చమని అడుగుటకు తొందరపడుచున్నది.ఆపై నీ దయ.
 స్వామి మందస్మితము మాణిక్యవాచగరును మరికొంత మాట్లాడనిచ్చినది.

  స్వామి నీ కరుణ చేయలేనిది ఏదీలేదు.దానిని మేము ,
 స్వర్గములోనున్న దేవతలు సైతము ,
 విణ్నరు తేవరు-
 నీ నీ నిరంతర సామీప్య-సాంగత్యములకు నోచుకోలేకయున్నారు,

 కాని మర్త్యలోక వాసులమైన మేము ,
 మణ్నగ-అతి సామాన్యమైన మానవులము,
 మా తిరుపెరుంతురైలో మిమ్ము సేవించుకొనగలుగుతున్నాము.


ఇది మా పాత్రత అవునో/కాదో తెలుసుకోలేని వారలము.

   స్వామి మునుపు/పూర్వము..పూర్వము ఆగి స్వామివైపు చూశారు మాణిక్యవాచగరు.
 కళ్లతోనే కాదననులే అన్నట్లున్నారు స్వామి వారికి.

   మళ్ళీ ప్రారంభించారు మాణిక్యవాచగరు.
 ఉన్ తొళంబు అడియోగల్-
  శరణాగత రక్షకములైన మీ దివ్య చరణములను,
 విళుప్పొరుళే- ఇక్కడ చరనములను అన్వయించుకుంటే బహుముఖములుగా ప్రకటింపబడి ఎందరినో భాగ్యవంతులను చేసినవి.
  చరణ సేవకులకు అన్వయించుకుంటే ఎన్నో తరముల నుండి,మా వంశ పూర్వజులచే పూజింపబడి వారిని పునీతులను చేసినవి.
  ప్రస్తుతము మాతరమును కూడ మహోత్సాహ భరితులను చేయుచున్నవి.
 మళంద మణవాలా-వణక్కంగళ్.

  అదేవిధముగా మా ముందుతరములవారికి కూడ మీదివ్యచరణారవింద సేవా సౌభాగ్యమును ప్రసన్నుడవై ప్రసాదించు.ఈసత్సంప్రదాయమునుకొనసాగించుటకు మేలుకోవయ్యా.మేలుకొని మమ్ములను ఏలుకోవయ్యా.


  తిరు మాణిక్యవాచగరు అరుళ ఇది
   తిరువెంబావాయ్ తోత్తియ పోట్రి
    నండ్రి.వణక్కం.  

  

TIRUVEMBAVAY-28

 


  తిరువెంబావాయ్-28


 **************


ముందియ ముదలనాడ్ ఇరుదియుం మాణా


మూవరం అరికిలార్ యువర్మట్రు అరివార్




పందనై విరిళియుం నీయుం  నిన్ అడియార్


పలంకుడి తోరుమెళుందు అళురియ పరనే


శెందలై పురైతిరు మేనియుం కాట్టి

తిరుపెరుం తురైయురై కోయిల కాట్టి




 అందణున్ అవదుం కాట్టివందు ఆండాయ్


 ఆరముదె పళ్ళి ఎళుందళురాయె.




 అశ్వనాథ/గుదుర స్వామియే పోట్రి


 ***************************

 ఎంతటి అద్భుతమీ అనుగ్రహ పాశురము.స్వామికి మనమీదకల అవ్యాజకరుణా ప్రకటనమును తిరుమాణిక్యవాచగరు మనకు వివరిస్తున్నారు.

 

 స్వామి కుడిపార్శ్వమై-ఎడమపార్శ్వముగా భూగోలములతో బంతులాడు భవానితో కన్నుల పండుగ గా కనిపించుచున్నారు.

 

 "పందనై విరళియుం" స్వామి నీవు నీ పరివారముతో,మా పూర్వపుణ్యఫలమేమో కాని మాముందు సాక్షాత్కరించి,మమ్ములను ఆశీరదించుచున్నావు.


 స్వామి నీవు,

 ముందల ముదల్నాడ్-ఆదివి.అంతేకాదు,

 ఇరుడియాం-ఇప్పుడు నీవే.

 భూతకాలము-వర్తమాన కాలము-భవిష్యత్తు మూడును నీవైన కాలపురుషుడివి.అంతేకాదు,

మూవరుం-త్రిమూర్తులు నీ ఉనికిని గుర్తించలేకపోయి,నీ పాద దాసులుగా శరణు జొచ్చిరి.

 స్వామి నిన్ను మించిన రక్షకుడు వేరెవ్వరు? లేరు కదా.అందుకే నీ అనుగ్రహము కాపరిగా మారినది.వేటికి?

 శెందలై పురైతిరు మేనియుం కాట్టి.

దివ్య ప్రకాసముతో తిరుపురమునమ్యు కావలి కాస్తున్నవు.

 తిరుపెరుంతురైయురై కోయిల కాట్టి.

 తిరుపెరుంతురై కోవెలను -ధర్మాన్ని-దయయును పరిరక్షిస్తున్నావు.

 అంతేకాదు,

 అందనన్-అవదుం-ఆండయుం కాట్టి

 భువనభాండములకు సమస్త చరాచరజీవులకు కాపరియైన మహాదేవా,


 అంతేకాదు స్వామి నీఅవ్యాజకరుణ ప్రాప్తికి తర-తమ మన/ఇతర అను భేదములు లేవు.ధనిక/పేద భేదములు అసలే లేవు.


 అన్నమయ్య సంకీర్తించినట్లు,

 నిండార రాజు నిద్రించు నిద్దుర ఒకటే

 అండయు బంటు నిద్ర అదియు ఒకటే

 స్వామి దయకు,

 ఇందులో జంతుకులమంతయు నొకటే


 అన్నట్లుగా,

 స్వామిని ఆహ్వానించటానికి ఆడంబరముల ఆవశ్యకత లేదు అని మహాభారతములో విదురిని ఇంటికి శ్రీకృష్ణపరమాత్మ వెళ్ళి ఆసీర్వదించారట.

 మన స్వామియును,

 తోరుమెళుందు-మిక్కిలి ప్రేమతో,

 అళురియ-ఆశీర్వచనములను అందించుటకు

  వెళతారట.ఎవరి/ఎతువంటి ఇంటికి?

 భక్తుల,

 పలంకుడి-పూరి గుడిసెలోనికి,

 పరమానందముతో ప్రవేశిస్తాడట.ప్రసన్నతతో సేవలను పరిగ్రహిస్తాడట.పాహి పాహి పరమ శివా.

 మధుర మకరందమును మాకు ప్రసాదించుటకు మేల్కొనవయ్యా-మేలుకొని మమ్మేలుకోవయ్యా.సదా

 నీసేవకులము.

 తిరుపెరుంతురై అరుళ ఇది.

 అంబా సమేత ఆత్మనాథ తిరువడిగళియే పోట్రి.


 నండ్రి.వణక్కం.








TIRUVEMBAVAY-27


 


 




  తిరువెంబావాయ్-27


  *****************




 అదుపళ చువయన అముదెన అరిదర్కు


 అరిదెన ఎళిదెన అమరరుం అరియార్




 ఇదు అవన్ తిరువురు ఇవర్ అవన్ ఎనవే


 ఎంగళై ఆండుకొండు ఇంగెళుందు  అరుళుం





 మధువళల్పొళి     తిరుఉత్తరకోశ 


 ముగైయుల్ ఉళ్ళాయ్ తిరప్ పెరుంతురై మన్నర్





 ఎదుఎమ్మై పణికుళం మారదుకేట్పం


 ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందళురాయ్.






 మధువన విరాజితాయ పోట్రి


 **********************


  తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో స్వామి అనుగ్రహము ఏ విధముగా మనచే ఆస్వాదింపబడుతున్నదో ఆత్మీయముగా ఆవిష్కరించారు.


  స్వామి నామ-రూప-గుణ వైభవాస్వాదనము మూడు మధురపదార్థములను గ్రోలుటతో పోల్చినారు.అవి,

 మొదటిది,

1.అదుపళ అరిదర్కు,

 పండ్ల మాధుర్యమును ఆస్వాదించినట్లు.

 ఇక్కడ మనకొక భక్తుని భావప్రకటనము అనిపిస్తుంది.


 కంచర్ల గోపన్న శ్రీనామ స్మరణమును ఆస్వాదిస్తు అన్న పలుకులు అవి.



 శ్రీ రామ నీనామమేమి రుచిరా

 ఓ రామ నీనామ మెంత రుచిరా అంటు,


  కదలీ-ఖర్జూరాది ఫలములకధికమౌ కమ్మన,

 అయిన సంతృప్తిగా అనిపించక,

 

 పనస-జంబు-ద్రాక్ష ఫలరసముల కంటె ఘనమౌ-ఆనందములో మునిగినవారికి పోలికలతో పనిఏమి?


  సమానము-అధికము ఉంటే కద పోల్చటానికి,మైమరచిపోవటము తప్ప.


రెండవది,

చువయన అరిదర్కు,

 మకరందమును మధుపము త్రాగుచున్నట్లు,


 స్వామి మీపాదపద్మముల కరుణ యను మధువును,నీ అనుగ్రహము మమ్ములను మధుపములుగా/తుమ్మెదలుగా చేరి ఆస్వాదించనీ.


 ఇక్కడ మనకు ప్రహ్లాద భక్తి ,


  మందారమకరంద మాధుర్యమును గ్రోలు మధుపంబు పోవునే మదనములకు అన్నట్లు,

 స్వామి నీదివ్య పాదపద్మ సందర్శనా సౌభాగ్యము కన్న అన్యము వద్దు.



మూడవది-

అముదెన అరిదర్కు,

 అమృతము నీ పాదసేవా భాగ్యము.స్వామి అనవరతము ఆనందముతో గ్రోలనీ అమృతమును.


 అదియే పాదారవింద చింతనామృతము.


 స్వామి నీ అనుగ్రహము సులభ-దుర్లభములకు అతీతము.


కనుకనే, అమరరుం-మరణమును జయించిన వారైన అమరులు,

ఇరు అవన్-ఇదియే నీవు అని నిర్ధారించుకొని,తిరిగి అది నీవు అనుకొని,

ఆదు కాదు,ఇదికాదు-అది కాదు,

 అయినప్పుడు ఏది నీవు అని నీ నిజతత్త్వమును కనుగొనలేక,

 అరియార్-నీ సేవకులుగా మారి సత్యమును గ్రహించకలుగుతున్నారు.



 మా అదృష్టమును

 మేమని వర్ణించగలము?

ఓ తిరుపెరుంతురై మన్నార్-ఓ తిరుపెరుంతురై మహాదేవ/మా ప్రభువా

 మా ఊరి ఉత్తరదిశగా నున్న మధువనము,



 నీవు విరాజమానమగుటచే పునీతమైనది.మా మనసులు మధువనమైనవి మహదేవ నీ అనుగ్రహముతో.ఆశీర్వచనముతో.



మన్నార్-మా పాలక!మాదొక విన్నపము.

 అది ఏమిటంటే?

 మారదు కేట్పం-ఉపాయమును నీవే మాకు చెప్పు

 ఏమిటా ఉపాయమంటే,

 మా సేవలు నీకు ప్రీతి కలిగించాలంటే,అవి ఏవిధముగా ఉండాలో చెప్పి,మమ్ములను అనుగ్రహించుటకు మేలుకోవయ్యా-మేలుకొని మమ్మేలుకోవయ్యా.


 

 తిరుపెరుంతురైఅరుళై ఇది.

 సుందరేశన్ తిరువడిగళియే పోట్రి.

 నండ్రి.వణక్కం.









Monday, March 29, 2021

TIRUVEMBAVAY-26

 


 




 








  తిరువెంబావాయ్-26




  *****************




 పప్పర విట్టిరుం దుణరుం నిన్ అడియార్




 పందనై వందరు

దా అవరుం పలరుం








 మైపురు కణ్ణియ మానుడత్తి    ఇయల్బి




 వణంగు కిరార్ అనంగిన్ మణవాళా









 శెప్పొరు కమలంగళ్ మలరుందన్ వయల్శూల్






 తిరుపెరుం తురైయురై శివపెరుమానే








 ఇప్పిరప్ప అరుందెమ్మై ఆండరుపురియుం




 ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందళురాయ్.






  గిరిజాసమేత మహాదేవాయపోట్రి


  *******************************




 గౌరి కళ్యాణ వైభోగమే-మహదేవ కళ్యాణ సౌభాగ్యమే,




 తిరు మాణిక్యవాచగరు మనకు ఈ పాశురములోశివ-శక్తుల పరిణయము-శుభకరపరిణామములను నర్మగర్భముగా తెలియచేస్తూ,అర్థనారీశ్వర తత్త్వ పరమార్థమును ప్రస్తుతిస్తున్నారు.


 నమః పార్వతీ పతియే హరహర మహాదేవ శంభో.




 స్వామి మీరు మా మైపురు కణ్ణియ-లేడికన్నుల వంటి కన్నులు కలిగిన పార్వతీదేవికి,


 మానుదత్తి ఇయల్బి-తగిన వరుడు.


 ఇది నిస్సందేహము.


 ఈ సందర్భములో మనకు పోతన మహాకవిదర్శించిన,


 "తగునీచక్రి విదర్భరాజ సుతకున్


  తథ్యంబు వైదర్భియున్ తగు నీ చక్రికి"


 మన మాణిక్యవాచగరు గిరిజ-గిరీశుల దాంపత్యమును దర్శించి,ధన్యులైనారు.




 వారు మన కోసము,అమ్మ-అయ్య,



శెప్పొరు కమలంగళ్-ఆహ్లాదకరమగు పద్మములు విరబూసిన,పచ్చని పొలములతో నిండిన మన


              తిరు పెరుంతురైలోకొలువైనారు.




 అదిగో అటుచూడు ఆ కోలాహలము.




 ఎందరో దేవతలు భక్తులు ,మహాదేవా!




 నిన్ అడియార్-నీ దాసులము/సేవకులము అంటు,నిన్ను సేవించుటకు,





 పందనై వందరు దా.-గుంపులు గుంపులుగా వస్తున్నారు నిన్ను ప్రస్తుతిస్తు,




 వారు సంతోషముతో సన్నుతిస్తున్నారు ఏమనంటే,


పప్పర విట్టిరందు-బంధములు విడివడినవి/తొలగించబడినవి.




 నీఅనుగ్రముతోమేము భవబంధ విముక్తులమైనాము.మా భవతారకుడవునీవే అని ,


స్వామి నీఅనుగ్రహము మమ్ములను రక్షిస్తూనే ఉన్నది.


  కరుణాంతరంగ మాదొకచిన్న విన్నపము.ఇంత అని కొలువలేనిది నీ కరుణ.


 కనికరముతో మమ్ములను నీ సేవకులుగా/బానిసలుగా/దాసులుగా స్వీకరించి,


 మాకు జన్మరాహిత్యమును ప్రసాదించు 




 పాత్రత లెక్కించని నీ అవ్యాజ అనుగ్రహ విశేషమును మాపై ఆశీర్వదించుటకు మేల్కాంచు.అనుగ్రహించు.




 తిరు పెరుంతురై అరుళ ఇది


 ఆవుడయార్ తిరువడిగళే పోట్రి.


 నండ్రి.వణక్కం. 

       
























Sunday, March 28, 2021

TIRUVEMBAVAY-25

  



 



తిరువెంబావాయ్-25


*****************




పూదంగల్ దోరుం

 ఎన్రాయిన్ అల్లాల్


పోక్కిలన్ వరవిలన్ ఎననినై పులవోర్




గీదంగళ్ పాడోదల్ అడుదల్ అల్లాల్


కేట్టరియో ఉన్నై కణ్దరి వారై


 


శీదనంకోల్ వయిల్ తిరువ్ పెరుంతురై మన్నార్



శిందనక్క అరియాయ్

 యేంగన్ మున్ వందు





ఏదంగళ్ అరుత్తు ఎమ్మై

 ఆండరు పురియుం


ఎంపెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె





  పంచభూత/సర్వభూత స్వరూపా పోట్రి


  ********************************

 వ్యూహ-అర్చా మూర్తి తత్త్వమును ఈ పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు అందించుచున్నారు.


 1.పోక్కిలన్ వరవిలన్ ఎననినై పులవోర్


    స్వామి జగద్రక్షణ కోసము నీవు నిరాకార-సాకార స్థితులకు రాకపోకలు చేస్తావు.


 స్వామి రాకపోకలు జరుపుతాడా? అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానమును విజ్ఞులు చెబుతారు.


 నిరాకార-నిర్గుణ-నిరంజన-నిస్తుల-నిశ్చలస్థితి పరమాత్మ స్వస్వరూపము.


 అయినప్పటికిని సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను జరుపుటకు స్వామి

 సాకార-సద్గుణ-సమ్రక్షణ-అను గుణములతో-స్వప్రకాశ దివ్య మంగళ స్వరూపముతో మనలకు అందుబాటులోనికి వస్తు,ఆశీర్వదిస్తూ-అనుగ్రహిస్తుంటాడు.

 ఇది స్వామి రాక.

 తిరిగి మూల స్థితికిచేరుట పోక.

 

 స్వామి క్రీడగా రాకపోకలను సాగిస్తూనే ఉంటాడు.

 ఆ ఆటలో తాను పంచభూతాత్మికమగుతు మంచిని ఆవిష్కరిస్తుంటాడు.


 పూదంగళ్-భూతములు ( అనగా ఉన్నవి)

 పంచభూతములు నింగి-నేల-గాలి-నీరు-నిప్పు తానై ప్రపంచ స్థితిని నెలకొల్పుతాడు.

  స్వామి అవ్యాజ అనుగ్రహము అనేకానేకములుగా భక్తుల మస్తిష్కములోనికి ప్రవేశించి వారిని దివ్యానుభూతికి పరవశులను చేస్తుంది.


 అప్పుడు వారు వారిభావనావిష్కారముచే స్వామి రూపగుణవైభములను దర్శిస్తారు.(అర్చామూర్తిని) పాడుతారు-ఆడుతారు-పద్యములు చెబుతారు.పరిపరి విధముల ప్రకటిస్తుంటారు.


 గీదంగళ్ పాడోదల్ ఆడుదల్ అల్లాల్


 అప్పుడు ఎవరైన వారిని సమీపించి ఇదియేన స్వామి నిర్దిష్ట రూపము-గుణము-వైభవము అని కనుక ప్రశ్నిస్తే,

 వారు కచ్చితముగా ఇది ఒక్కటే అని చెప్పలేరు.మాకు అలా కనిపించింది-అనిపించింది.అందుకు పులకించి స్తుతించాము అంటారే తప్ప ఏకరూప నిర్ధారణమును చేయలేరు.


 కాని ఒక్క విషయమును మాత్రము అందరు ఏకగ్రీవముగా అంగీకరిస్తారు.అదిఏమిటంటే,

 శిందనక్కి-మన మనసులోని స్వామి,

 ఏంగన్-తనకు తానే

 మున్ వందు-ముందరే వచ్చి,

 ఎమ్మై ఏదంగళ్-మన పాపములన్నింటిని,

 అరుత్తు-హరించివేస్తాడు/తొలగిస్తాడు.

 కనుక కేట్టరియో

-మనము విన్నాము ఎందరో చెప్పగా,

  స్వామిని దర్శించి-అనుభవించుటకు,దానికి కావలిసిన పరిపక్వతను మాకు అందించుటకు,స్వామి!

 నీవు మేలుకొని-మమ్మేలుకోవయ్యా.


 తిరు పెరుంతురై అరుళ ఇది

 ఆత్మనాథ స్వామి తిరువడిగళియే పోట్రి.

  నండ్రి.వణక్కం.








   



Saturday, March 27, 2021

TIRUVEMBAVAY-24

 


 




తిరువెంబావాయ్-24




 *************








  ఇన్నిశయ వీణయన్ యాళినర్ ఒరుపాల్




  ఇరుక్కొదు తోత్తిరం ఇయంబినర్ ఒరుపాల్








  తున్నియ పిణై మలర్ కయ్యనార్ ఒరుపాల్




  తొళి కయ్యర్ అళుకయ్యర్ కువల్ కయ్యర్ ఒరుపాల్




  చెన్నియ అంజలి కుప్పినార్ ఒరుపాల్




  తిరుప్పెరున్ తురై యురై శివపెరుమానే









 ఎన్నయు అండుకొండు ఇన్నరుళ్ పురియుం




 ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె




 అత్మనాథస్వామి తిరు వడిగలే పోట్రి




 ***************************


  తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో భగవదనుగ్రహము-భగవదారాధన,  ఏ విధముగా బహు ముఖములైభాసించుచున్నవో వివరించుచున్నారు.


 భగవదనుగ్రహము ఆధారమైతే దానిని ఆలంబనము చేసుకొని అర్చించుచున్నభగవద్భక్తి ఆధేయము.




 స్వామి,


అండుంకొండుం-అనేకానేకములైన/అనేకవిధములైన/ఈ తీరుననే అని నిర్ణయించలేనిదైన,




 నీ అనుగ్రహ ఆశీర్వచనము ఎన్ని విధములుగా ప్రకటింపబడుతున్నదో,


 పురియం-నాకు పరిచయముకావింప బడుతున్నదో,పరమ సంతోషాంతరంగముతో నీకు నివేదిస్తాను.


ఈ పక్క-ఒరుపాల్,ఆ పక్క అనికాదు.ఎటు పక్క చూసినను నీ అర్చనావిధానము,అతి రమణీయమై అలరారు చున్నది.


 మొదటిది,


ఒరుపాల్-ఒక పక్కన,


ఇన్నిశయ వీణయర్-నీమహిమలను నినదించుచున్న,


వీణయర్ 


యుళినర్-వీణా నాదములు,


రెండవది,


ఒరుపాల్-ఇంకొక పక్కన,


ఇయంబినన్-శ్రావ్యముగా వినబడుచున్నది ఆ నాదము, ఏమిటది?


 తోత్తిరం-స్తోత్రములు/వేద స్వరూపినిగా నిన్ను కొనియాడబడుచున్న స్తోత్రములు మమ్ములను పునీతులను చేయుచున్నవి.


 చెవులే కాదు మా కన్నులును ఎంతటి భాగ్యమును చేసుకొనినవో తెలియదు.


 కనుకనే అవి చూడగలుగుతున్నవి.ఎటువంటి దృశ్యములను?


మొదటిది,


మలర్ కయ్యనార్-చేతులలో పూలతో,పూలదండలతో,భక్తిని నింపుకొని యున్న/నీ సేవకై కుతూహలముగా వేచియున్న,


తున్నియె పిణ్ణై-భాగ్యశాలులైన పిల్లలు.


రెండవది,




ఒరుపాల్-ఇంకొక వైపున,


 రుద్ర భాష్యము చెప్పినట్లు,


 అంగన్యాస-కరన్యాసములతో ఆ పరమాత్మను తమ యందు న్యాసము చేసుకొనుచున్నారా యన్నట్లు,మన శరీరావయములను-మనసును దివ్యత్వముతో నింపుకొనుచున్నారా యన్నట్లు,


 తొళుకయ్యన్-వారి హస్తములను భుజముల మీద,


 కువల్ కయ్యర్-తమ శరీరమునందుంచి,పవిత్రము చేసికొనుచు,


 అశ్రునయనులై-అళు కయ్యర్,




 నీ ఆరాధనకై వేచియున్నారు.




 ఒరుపాల్-మరొక వైపు ,


 శెన్నయ్ అంజలి కుప్పినార్-త్రికరణములో నమస్కారములను అర్పించుచున్నారు.


 ఒక పక్క వినిపించు వీణా నినాదములు,


 ఒక పక్క ఘోషించు వేద నాదములు,


 ఒక పక్క నిను చేర పూలహారములు,


 ఒక పక్క నిండైన నమస్కారములు


 అటువైపు-ఇటువైపు-ఎటువైపు చూసిన


 శరణు ఘోషలు నిన్ను స్మరియించు వేళ,


 ఎం పెరుమానె-నా పాలిటి రక్షకుడా,


 మేలుకొని,మమ్మేలుకోవయ్యా.




 ఇక్కడ మనకొక చిన్న విషయము గుర్తుకు వస్తుంది.వీరందరు స్వామి దర్శన సౌభాగ్యమున తమను తాము సంస్కరించుకొను సౌభాగ్యవంతులే.


స్వామిదర్శనము కాలేదని తాళలేని పరిస్థితిలో నున్నవారే.వారికి స్వామి అనుగ్రహమేమో కాని ఉపచారములే ఉపశమనమునకుకారణములైనవి. కలతను ఉపశమింపచేయుచున్నవి.


 స్వామి ఇక ఆలస్యము చేయకుండా నీ దివ్యమంగళ సందర్శన భాగ్యమును అనుగ్రహించు.సదా మీ సేవకులము.




  తిరుపెరుంతురై అరుళ ఇది


  ఆత్మనాథ తిరువడిగళియే పోట్రి.


   నండ్రి.వణక్కం.





 






Friday, March 26, 2021

TIRUVEMBAVAY-23

 


 



 



 తిరువెంబావాయ్-23


 *****************




 కూవిన పూంగుయిల్ కూవిన కోళి


 కురుగుకు ఇయంబిన ఇయంబిన శంగం




 ఓవిన తారకై ఒళిఒళి ఉదయత్తు


 ఒరుప్పడు కిన్రాడు విరొప్పొడు నమక్కు




 తేవన తెరికళల్ కాలి కాట్టాయ్


 తిరుపెరుం తురైరురై శివపెరుమానే




 యా వరుం ఆరివరి ఆయమ కడయాయ్


  ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె.




  అనుగ్రహాభరణ పాదయే పోట్రి


  *********************




 తిరుమాణిక్యవాచగరు మనకు అందించిన ఈ అద్భుత సుప్రభాత సేవలో ఇంతవరకుపద్మములు-సూర్యుడు స్వామి ముఖారవిందకాంతిని తమతో తెచ్చుకుని ప్రకాశిస్తూ-ప్రశంసిస్తున్నారు.




 ఈ పాశురములో కాంతిని నాదము అనుసరించి స్వామిని అర్చించుచున్నది. అవి ఏమనగా,


కూవిన పూంగుయల్-కోకిల సుస్వరములు,


కూవిన కోళి-కుక్కుట/కోడి సుప్రభాతములు,


ఇయంబిన కురుగుకళ్-పక్షుల కిలకిలారావములు,


శంగం ఇయంబిన-శంఖనాదార్చనలు,


 శబ్దసేవతో పునీతములగుచున్నవి.




 స్వామి నీ కనుసన్నలలో నడచు ప్రకృతి,నియమానుసారముగా ప్రవర్తించుచు నిన్ను సేవించుచున్నది.అవిగో,


తారకె ఓవినై-నక్షత్రములు కనుమరుగగుచున్నవి.


 ఒళి-ఒళి-తేజస్సును క్రమముగా ఒక పుంజమును మరొక పుంజము అనుసరించుచు,


 ఉదయితు-ఉషోదయ కాంతిరేఖలను విస్తరింపచేయుచున్నది.


 తిరుమాణిక్యవాచగరు ఇక్కడ,


 ఒళి-ఒళి అను కాంతిసంకేతమును రెండు సార్లు ప్రయోగించి,చమత్కరించినారు.


 మొదటి ఒళి అవి స్వామి ముఖబింబము నుండి తెచ్చుకున్నవి/స్వామి వాటికి అనుగ్రహించినది.


 ఇక రెండవ ఒళి ఏమిటి అంటే తెలవారుచున్నదన్న సంతోషము,నీ దర్శనమును చేసుకోగలమను ఆనందము మాముఖములయందు ప్రకాశించుచుండగా,సూర్య కిరణములు వాటిని కూడా తమయందు ప్రతిబింబించుకొని తేజోవంతముగా ,


 ఒరుప్పడుం కిన్రడువిరుప్పొడుం నమక్కు


 వ్యాపిస్తూ,తరిస్తున్నవి.




 మూడవ విషయము బహురమణీయమైనది.మమ్ములను భాగ్యవంతులను చేయునది.అది ఏమనగా బ్రహ్మ-విష్ణు-సురలకు లభ్యము కాని,


మంజీరాలంకృత పాదపద్మములు మాకు సేవా సౌభాగ్యమును ప్రసాదించుచున్నవి.


 


స్వామి అరివరియాయ్ అడియాయ్-స్వామి మంజీరాలంకృత పాదములు,


యా వరుం-తామే మాదగ్గరకు వచ్చి,


 అనుగ్రహించుచున్నవి.


ఓ శివ పెరుమానే,


 మమ్ములను చైతన్యవంతులను చేయుటకు,ఏలుకొనుటకు,


 మేలుకొనవయ్యా.


 తిరు పెరుంతురై అరుళ ఇది.


 ఆత్మనాథ స్వామి తిరువడిగళే పోట్రి.


   నండ్రి.వణక్కం.















 





Thursday, March 25, 2021

TIRUVEMBAVAY-22

 


తిరువెంబావాయ్-22


***************




  అరుణన్ ఇందిర దిశై అణుగీనన్ ఇరుళ్ పో


  అగండ్రదు ఉదయం మలత్తిరు ముగత్తిన్




  కరుణను శూరియ యళయళ నయన


  కడిమలర్ మలరమర తణ్ణనల్ కణ్ణా




  తిరనిరై అరుపదం మురల్వన్ ఇవైయో


  తిరుపెరున్ తిరైయురై శివపెరుమానే




  అరుళిరి తరువరం ఆనందమలయే


  అలైకడలే పళ్ళి ఎళుందరుళాయె.






 పూసలర్ పూజిత తిరువడిగళే పోట్రి.


 ************************


  తిరు మాణిక్యవాచగరు కిందటి పాశురములో పద్మములు ఏ విధముగా స్వామి అనుగ్రహకాంతిని స్వీకరించి సంతోషముతో పరవశిస్తు-వికసిస్తూ-ప్రకాశిస్తున్నాయో సంకీర్తించారు.


 ఈ పాశురములో స్వామి తన ముఖకాంతిని సూర్య కిరణములకు ప్రసాదించించి,జగములను చేతనవంతము చేస్తున్నాడో ప్రస్తుతిస్తున్నారు.

శివపెరుమానే-మహాదేవా!

ఇరుళ్-చీకట్లు నిష్క్రమించినవి.

 ఎందువలన?

అరుణన్-నీ అనుగ్రహమనే ఎర్రని సూర్యుడు,

చేరుకున్నాడు-ఎక్కడికి?

ఇందిరన్ దిసై-తూరుపు దిక్కునకు.

 తత్ఫలితముగా మా హృదయపద్మములు వికసిస్తూ,తమోగుణమనే చీకట్లను తరిమివేస్తున్నాయి.

 ఆ అరుణోదయ భానురేఖల భాగ్యమును నేనేమనగలను?అవి ఎంత ధన్యతను పొందినవో-సాక్షాత్తు నీ ముఖ కాంతులను తమతో కూడ తెచ్చుకొని.


 ఇప్పుడేకొంచము కొంచము విచ్చుచున్న మొగ్గలు నీతెరిచి-తెరియను,అప్పుడే కొంచము కొంచము విప్పారుచున్న నేత్ర సౌభాగ్యమును పోలి యున్నవి.

  నీ నేత్ర దర్శనావిష్కారము మాకు రెండు విధములుగా ఆనందమును ప్రసాదించుచున్నది స్వామి.

 మొదటిది-నీ దయాంతరంగమును మా దరిచేర్చుచు ,

అరుళాలై కడలే-ఆశీర్వచనమును తన ఘోషల ద్వారా అందించుటకు ఉవ్విళ్ళూరుచున్నది.

 రెండవది మా మనోమందిరములో స్వామి సుఖాసీనుడై,పూసలర్ నాయనారు అనుగ్రహించినట్లు,మమ్ములను ఆశీర్వదించునని ఆనందఘోషను చేయుచున్నది మా మనసనే సముద్రము అలలతో ఎగిసిపడుతు-ఎద నిండ నిన్ను నింపుకుంటు.

 మమ్ములను చైతన్యవంతులను చేయుటకు మేలుకొని,మమ్మేలుకోవయ్యా.నీశరణార్థులము.

 తిరు పెరుంతురై అరుళ ఇది.

 ఆత్మనాధ తిరువడిగళియే పోట్రి.

  నండ్రి.వణక్కం.



Wednesday, March 24, 2021

tTIRUVEMBAVAY-21

 


 




 పరమాద్భుతము పరమాత్మ అనుగ్రహము.ఆరుద్రనక్షత్ర దర్శన అడుత్తనాళ్-మరుసటిరోజు నుండి శైవ సనాతన ధర్మమును అనుసరించి తిరుమాణిక్య వాచగరు దర్శించి-స్తుతించిన,"తిరుపళ్ళిఎళుచ్చి" పది పాశురములతో,తురుపెరుం తురై లో కొలువైన అవుడయార్ కోవెల లోని ఆత్మనాథస్వామికి సమర్పించు "సుప్రభాత సేవ" గా దీనిని భావిస్తారు.




 స్వామికి మన ఉపాధి ధర్మములను ఆపాదిస్తూ,మనలో ఒకనిగా భావిస్తు,తెలవారుచున్నదని,నిదురను చాలించి,మేల్కాంచి జగద్రక్షణను జరుపమనుట వాచ్యార్థము.





 నిజమునకు స్వామి అనవరతము జాగరూకతతో మనలను కంటికి రెప్పవలె కాపాడుతుండుట కాదనలేని సత్యము.



అయితే మరి ఈ


 తిరు -శుభకరమైన,మంగళప్రదమైన


 పళ్ళి-నిదుర-పవళింపు నుండి,


ఎళుచ్చి-మేల్కొలమనటములోని అంతరార్థము ఏమిటి?


 పళ్ళి అనే పదమునకు విజ్ఞులు పాఠము అని కూడ అన్వయిస్తారు.


 స్వామి! ఓ అంతరాత్మ మేము ఉపాధి ధర్మమును అనుసరించి,స్వల్పకాలిక లయమును ముగించి తిరిగి జాగరూకులమైనాము.

( నీ అనుగ్రహముతో)






 స్వామి మాకు యుక్తాయుక్త విచక్షణమను పాఠమును బోధించి మమ్ములను ఉధ్ధరించు.






 పళ్ళి అనే పదమునకు ఉపచారమును కూడా కొందరు భావిస్తారు.


 ఈ ఉపచారము మనకు ఉపశమనమును కలిగిస్తుంది కనుక నీ భక్తులు నీవనుగ్రహించిన వారి శక్తి సామర్థ్యములను అనుసరించి నిన్ను సేవించుటకు సిధ్ధముగా నున్నారు.కనుక మేల్కాంచి వారిని ఆశీర్వదించి,అనుగ్రహించు.


 బహిర్ముఖుడవై మా  బడుగుల బాగోగుల బాధ్యతను స్వీకరించు.మేల్కొనియున్న మా మనసు మమ్ములను తికమక పెట్టుతు అకలావికలము చేస్తుంది చంచలత్వముతో గంతులు వేస్తుంటుంది.




   తిరుపెరుంతురు లోని ఆత్మనాథ మమ్ములను సంరక్షించు.


తిరువెంబావాయ్-21


***************




 పోట్రియన్ వాళ్ముదల్ ఆగియపొరుళె


 పూలందద పూంకళత్తు కినైయునై మలర్కొండు




  ఏట్రివన్ తిరుమగణ్ తెనుక్కురళ్ మలరుం


  ఎళిన్లగై కొండుం తిరువడి తొళొకోం




  శేట్రిదళ్ కమలంగళ్ మలరుందన్ వయిల్శోల్


  తిరుప్పెరుం తురైయురై శివపెరుమానే




  ఏట్రియార్ కొడి ఉడియాయె ఎన ఉడియాయె


  ఎం పెరుమానె పళ్ళి ఎళుందరుళాయె




 


 వృష కేతనాయ పోట్రి




 ********************


 తిరుమాణిక్యవాచగరు ఈ పాశురములో మనచే రెండు అద్భుతములను ఆవిష్కరింపచేస్తున్నారు.




 మొదటిది,


 తిరుపెరుంతురై లోని అవుడియార్ కోవెల.




  ఈ కోవెల నిర్మాణముమన కంచర్ల గోపన్న భద్రాచల కోవెల నిర్మాణముతో పోలిక కలిగియున్నది.




  మంత్రిగా నున్న మాణిక్యవాచగరు అశ్వములను కొనుటకు తెచ్చిన రాజధనమును కోవెల నిర్మాణమునకు వెచ్చించి,స్వామి కృపాకటాక్షమునకు సాక్ష్యము తానైన వృత్తాంతము.




   రెండవది,


 "తిరుపళ్ళిఎళుచ్చి" అను అద్భుత స్తోత్రరాజ ఆవిష్కారము చేసి,మనలను అత్యంత అదృష్టవంతులుగా ఆశీర్వదిస్తున్నారు.




   తిరుపెరుంతురైలో విరాజిల్లుతున్న నా శివస్వామి,


నీవు-వాళ్ముదల్ ఆగియ పొరులు.


 ప్రధమముగా ప్రకటింపబడినది నీ దివ్య మంగళ విగ్రహము.


 నీ పాదపద్మములు -మాకు శరణములు.


 అవి ఆశ్రిత రక్షణములు.అవ్యాజ కరుణాకరములు.


 కనుకనే ,


 మేము సామాన్య కన్నులతో చూడగలుగుచున్న కమలములు ఎంతచమత్కారమును చేయుచున్నవో.




 వెలుగురేఖలు వ్యాపిస్తున్నాయి.సూర్యుడు మెల్లగ తన బంగరు కిరణములతో కొలను లోని కమలములతో కరచాలనము చేస్తున్నాడు.అవి పులకించి విప్పారుతు ప్రకాశిస్తున్నాయి.


కాని అవి అంతకు ముందే,


 తిరుముగన్-నీ ముఖారవిందపు,


 నీ తిరువడి తొళుకో-నీ పాదారవిందముల కాంతిని,


 ఎళినగై కొండు-తమతో తీసుకొని వచ్చాయి అని అనిపిస్తున్నది.


 తూరుపు వేకువ రేఖలు విస్తరిస్తున్న సమయమిది స్వామి మేలుకొని మమ్ములను ఏలుకొనవయ్యా. 


  


 తిరుపెరుంతురై అరుళ ఇది


 అంబే ఆత్మనాథ తిరువడిగళియే పోట్రి.


  నండ్రి.వణక్కం.





 









Tuesday, March 23, 2021

tiruvembavay-20

 


 




 తిరువెంబావాయ్-20


*****************




 పోట్రి అరుళగనిల్ ఆదియాం పాదమలర్


 పోట్రి అరుళగనిల్ అందామన్ శెందళిర్గళ్






 పోట్రి ఎల్లా ఉయిర్కుం తోట్రమాం పొర్పాదం


 పోట్రి ఎల్లా ఉయిర్కుం బోగమాం పుణ్కళల్కళ్




 పోట్రి ఎల్లా ఉయిర్కుం ఈరాం ఇళై అడిగళ్


 పోట్రిమాల్ నాన్ ముగముం కాణాద పుండరీకం




 పోట్రియాం ఉయ్య ఆర్ కొండరళుం పొన్ మలర్గళ్


 పోట్రియాం మార్గళినీర్ ఆడేరో ఎంబావాయ్


 పేరింబమా-పెరుకరుణయా పోట్రి

 ***************************


 తిరుమాణిక్యవాచగరు మహదానందముతో మన స్వామికి మంగళాశాసనములను చేయుచున్నాడు .


 అచంచలభక్తి ఆత్మీయమై అచలాధీశునికి ,

 

 పోట్రి-పోట్రి-పోట్రి జయము-జయము-జయము అంటు పరవశిస్తు దీవిస్తున్నది.

 

  తిరుమాణిక్యవాచగర్ వాల్గ.

  *******************


  ఇంతటి అద్భుత అనుగ్రహమైన తిరువెంబాయ్ అను స్వామి సంకీర్తమును ముందుతరములకు అందించిన మహనీయ వర్ధిల్లు.


 మాణిక్యవాచగరు స్వామి పాదపద్మములను పరిపరి విధములుగా,పలు నామములతో ,


 

 పాదమలర్

 శెందళిర్గళ్

 పొర్పాదం

 పుణ్కళల్ కళల్

 ఇళై అడిగళ్

 పుండరీకం

 పొన్ మలర్గళ్ అంటు పదే పదే ప్రశంశిస్తు-పరవశిస్తున్నారు.


 స్వామి పొర్పాదము ఎల్లా ఉయిర్కుం తోట్రమాం,


 సమస్తమును సృష్టిస్తు స్వామి పాదము నిత్యనూతనముగా ప్రకాశిస్తున్నది.

 స్వామి సృష్టికార్యమును క్జరుపుచున్న నీ పాదములకు మంగళాశాసనములు.


  పుణ్కళల్కళల్-స్వామి నీ 

లేతచిగురుల వంటి నీ పాదములు సమర్థవంతముగా స్థితికార్యమును నిర్వహించుచున్నవి.

 ఎల్లా ఉయిర్కుం బోగమాం 

 అత్ట్తి స్థితికారకములైన నీ దివ్యచరణారవిందములకు పోట్రి-మంగళాశాసనములు.


  ఈలై అడిగల్-సమస్తమును తనలోనికి లీనము చేసుకొనుచున్న నీ అతిపవిత్ర లయకారకమైన నీ దివ్య చరణములకు

 మంగళా శాసనములు.


 పుండరీకములు-స్వామి బ్రహ్మ విష్ణు దేవాదులకు వెతుకగా లభ్యము కాని,నీ అనుగ్రహ ఆశీర్వచనముగా మేము శేవించుకొనుటకు తమకు తామె తరలి వచ్చిన మీ దివ్యపాదములకు మంగళాశాసనములు. 


 పొన్ మలర్గళ్-బంగరు పాదములు,అసంభవమును సంభవముగా చేసి అవ్యాజకరుణతో అలరారుచున్న బంగారు పాదములకు బహువిధముల/బహుముఖముల మంగళా శాసనములు.


 ప్రప్రధమ దివ్యమంగళ స్వరూపముగా ప్రకటింపబడిన ఆదిపాదములకు మంగళాశాసనములు.


 ప్రళయకాలమునందు సైతము నిలబడిన ఏకైకసాక్షివైన /సాక్షులైన కెందామరల వంటి నీ పాదములకు మంగళాశాసనములు.


 నీ దివ్యనామ సంకీర్తనమనే మడుగులో అనవరతము ఆడిపాడు అభీషమును ప్రసాదించిన అరుణగిరి నిలయా నీకు అనేకానేక మంగళా శాసనములు అంటు ఆనందాబ్ధిలో మునకు వేస్తున్నారు ఆ రమణులు.


 అదిగో ఆరుద్ర నక్షత్రము మనలను ఆశీర్వదిస్తున్నది.


ఆలస్యము చేయకుండ తిరుమాణిక్య వాచగరు చేతిని పట్టుకుని,మన అడుగులను అత్యంత భక్తితో కదుపుతు,

 రేపు తిరుపెరుంతురై లో తిరుపళ్ళి ఎళుచ్చిని సంకీర్తిస్తు కలుసు కుందాము.


 తిరు అన్నామలయై అరుళ ఇది

 అంబే శివే తిరు వడిగళే పోట్రి.

  నండ్రి.వణక్కం.

 






.






 






Monday, March 22, 2021

TIRUVEMBAVAY-19

 


 




తిరువెంబావాయ్-19


 *****************




 ఉంగయ్యర్ పిళ్ళై ఉనక్కే అడైక్కలం ఎన్రు


 అంగుం అప్పళం సొల్ పుదుక్కురుం అచ్చత్తాల్




 ఎంగళ్ పెరుమానునక్కొండ్రు ఉరేయ్ పొంగే


 ఎంగొంగై నిం అంబల్ అళ్ళారో శేయక్క




 ఎంగై ఉనకళ్ళదు ఎప్పణియు శేయార్క


 కంగళ్ పగల్ ఎంగళ్ మట్రోరుం కాణర్క




 ఇంగి ఇప్పరిశె యమక్కేందో నల్గుదియల్


 ఎంగళి ఎన్ న్యాయయిది ఎమక్కేలో రెంబావాయ్




  క్షిప్రప్రాసాదాయ పోట్రి.


  *******************


 తిరు మాణిక్య వాచగర్ మనకు ఈ పాశురములో పరిణితిచెందిన భక్తి, పరమాత్మతో చనువు తీసుకొని పరవశముతో వాగ్దానమును చేయించుకుంటున్నది.అదియే,


సొల్-చెప్పు స్వామి మాతో,


అప్పళం సొల్-వెంటనే నీవు మాకు మాట ఇవ్వు.




  ఏమని?


 మేము అర్హతకలిగిన వారమో? కాదో?


 అయినప్పటికి,


 ఉన్-నీయొక్క


 కయ్యర్-చేతిని పట్టుకుని ఉన్నవారలము.


 పిళ్ళై-నీ పిల్లలము.


  అంతేకాదు


 ఎన్రు-ఎప్పుడును/సర్వకాల సర్వావస్థలయందును మేము నీకు,


 ఉనక్కే అడైక్కలం-నీ అధీనులము.


 నీ దయమీదనే ఆధారపడియున్నవారలము.




 భక్తి పొందిన బలమేమో అది లేదా భగవంతుడిచ్చిన చనువో వారిచే మరల మాట్లాడిస్తున్నది.


 స్వామి నువ్వు మమ్ములను సంపూర్ణముగా అనుగ్రహించాననుకుంటున్నావేమో.


 అదే కనుక నిజమైతే,


 కమలేశు చూడని కన్నులు కన్నులే,


 తను కుడ్య జాల రంధ్రములు గాక అని


 ప్రహ్లాదుడు వినతి చేసినట్లు 


 మా నయనములనే ఇంద్రియములు సదా నీ దివ్ర మంగళ స్వరూప దర్శనముతో తరించవలెను కాను అన్యదర్శన చింతనము రారాదు.అవి చూడరాదు.


 అ శుభసమయములో మా మనస్సులో/హృదయములో,


 నిన్ అంబర్-నీవు తప్ప


 నీ స్మరణము తప్ప


అళ్ యారో-వేరెవరో


 మా భావనలో స్పురించరాదు.


 అట్టి జీవాత్మ-పరమాత్మ మహాద్భుత మమేకములో నున్న మాకు,


 కంగుల్-పగల్-ఎంగల్ -మట్రోరు కాణర్క,


 ఇది రాత్రి చీకటి సమయము-ఇది పగలు-వెలుగు సమయము అనువాటితో ద్వంద్వములతో-బాహ్యములతో సంబంధము లేని నిశ్చల-నిర్వికార స్థితిలోఅంతర్ముఖులమై ఆత్మానందముతో మాలో కొలువైన నిన్ను దర్శించుచు-సేవిస్తు-ఉండే


ఇప్పరిసె-ఈ వరమును/బహుమతిని కోరుకొనుచున్నాము.


 అది కనుక నీ వనుగ్రహించకపోతే,


 సమస్తలోకములు,


 ఎంగళి ఎన్ న్యాయ ఇది?


 ఇదెక్కడి న్యాయము? ఇదేమి న్యాయము? అని నిన్ను ఆడిపోసుకుంటారు ఆదిదేవా!


 మమ్ములను అనుగ్రహించి అంటూ గట్టిగా

 హెచ్చరిస్తు,అద్వైత ఆనందములో మునిగితేలుటకు మడుగులోనికి ప్రవేశించి,పునీతులగుచున్నారు.





 " కాయేన వాచా మనసేంద్రివాయే


   బుధ్ధాత్మనావా ప్రకృతే స్వభావే


   కరోమి యత్ తత్ సకల్మ్ పరస్మై


   పరమేశ్వరాయేతి సమర్పయామి."




    తిరు అన్నామలయై అరుళ ఇది


    అంబే శివే తిరువడిగళే పోట్రి.


    నండ్రి.వణక్కం.







Saturday, March 20, 2021

TIRUVEMBAVAY-18

 



 

  తిరువెంబావాయ్-18

  ******************


 అన్నామలైయన్ అడిక్కమలం శెన్రి ఇరంజు

 విణ్ణోర్ ముడియన్ మణిత్తోకై విరట్రార్పోల్


 కణ్ణార్ ఇరవై కదిర్వందు కార్కరప్పన్

 తణ్ణార్ ఒళి మళింగి తారకైకర్ తామకల


 పెణ్ణాయ్ ఆణాయ్ అళియుం పిరన్ గొళిచేర్

 విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయం వేరాగి


 కణ్ణార్ అముదమాయ్ నిన్రన్ కళల్పాడి

 పిణ్ణే ఇంపుం పూంపునల్ పాయిందు ఆడేలో రెంబావాయ్


  సర్వాత్మా-సర్వరూపా పోట్రి

  *************************

 " సర్వేంద్రియాణాం నయనం ప్రధానం

   సాక్షాత్కరాణాం నయనం ప్రమాణం."


   తిరుమాణిక్యవాచగరు మనకు నోమునోచుకొనుచున్న పడుచుల అమృతసేవనమును గురించి ప్రస్తుతిస్తున్నారు.


 ఏమా అమృతము? వారు దానిని ఏ విధముగా సేవిస్తున్నారు? అను సందేహము కనుక మనకు వస్తే, అది

 కణ్ణార్ అముదమాయ్-కన్నులను అమృతము.నయన మనోహరము.నానాదోష పరిహారము.విడివడి రాలేని సౌభాగ్యము.


 తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో స్వామిలీలా విసేషములలోని రెండింటిని మచ్చునకు మనకు వివరిస్తున్నారు.

 మొదటిది స్వామి స్వయం ప్రకాశకత్వము.

 రెండవది స్వామి సర్వ ఉపాధికత్వము.


  స్వామి స్వయం ప్రకాశకత్వము ముందు మూడు అంశములను ఉదాహరనములుగా మనకు సూచిస్తు అవి ఏ విధముగా కాంతిహీనములై,వెలవెలబోయినవో చెబుతున్నారు.

 అవి దేవతలు ధరించిన వారి కిరీటములలో నున్న మణుల ప్రకాశము.

 వారు స్వామికి పాదనమస్కారమును చేయుటకు వారికిరీటములలోని,

మణిత్తోకై-మణుల ప్రకాశము వెలవెలబోయినది మన స్వామి పాదపద్మములకు నమస్కరిస్తు.

 బహుషా స్వామిసేవా సౌభాగ్యము వాటిని తమలో కలుపుకున్నవేమో ఆ ఆశ్రిత వాత్సల్య చరనములు.


 రెండవ ఉపమానము,

 కణ్ణార్-సూర్యుడు తన కిరణ ప్రకాశమును  కోల్పోయి వెలవెలబోతున్నాడట చిన్నబోయి.

 అంతేకాదు

తణ్ణార్-చంద్రుడు-తారకై-నక్షత్రములు

 కైకర్ తామకల-మినుకు మినుకు మనుచున్నవట.

 ఈ సంకేతము మనకు దేనిని సూచిస్తున్నాయి?

 మణుల ప్రకాశము కొంత స్థలము వరకే పరిమితము.దాని దాటి ప్రకాశించలేదు.

 సూర్య-చంద్ర-తారకల ప్రకాశము (పూర్తిగా) కొంత సమయము వరకే పరిమితము.

 సూర్యాస్తమయము తరువాత చంద్రోదయము.తారక ప్రకాశము.

కాని ఫ్రకృతి ధర్మ ప్రకారము చంద్రుడు తారకలు మనకు కనుమరుగు కావలిసినదే.సూర్యోదయమును స్వాగతించవలసినదే.

 స్వామి పరంజ్యోతి తత్త్వము స్వయంప్రకాశము.సామంతత్త్వము కాదు.దానికి సమయ-స్థలములతో నిర్బంధము లేదు.అదినిస్తుల ప్రకాశము.

 ఒక్కసారి ప్రహ్లాదుడు ప్రస్తుతించిన పరబ్రహ్మ తత్త్వమును గుర్తుచేసుకుందాము.

 తండ్రి అడిగిన ప్రశ్నకు తగినరీతిలో,

 

 "కలడాకాశంబున కుంభినిన్

  కలండగ్నిన్-దిశలన్

  పగళ్ళ నిశలన్

  ఖద్యోత-చంద్రాత్మలన్

  అంతటన్ కలండీశుండు

  వెతకంగా నేల ఈ ఆ ఎడన్"

  తెలియచేసినాడు.తిరుమాణిక్యవాచగరు ఇదేవిషయమును మరొక్కసారి మనవి చేస్తున్నారు.

 అదియును దర్శించి-ధన్యత నొందిన వారి అంతరంగము ద్వారా ఈ విధముగా,

 పెణ్ణాయ్-స్త్రీ ఉపాధిలో-

 ఆణాయ్-పురుష ఉపాధిలో

 ఆళియుం-వాటికి ఇతరములైన సకల చరాచరములలో చైతన్యముగా,

 పిరన్ కొళిచేర్-పరమాత్మ ప్రకటింపబడుతు కరుణతో మనలను పరిపాలిస్తున్నాడు.

 ఇది తెలుసుకొనినవారు 

కళల్ పాడి -స్వామి మహిమలను కీర్తిద్దామనుకుంటున్నారు.

 ఏ విధముగా

నిన్రన్-నిలబడి అంటే నిలుచుని యనియా?

 కాదు ఇక్కడ నిలబడవలసినది వారి మనసు.వారి శరీరము కాదు.


 నిశ్చల భక్తితో నిరంజనుని కీర్తించుటకు 

 పిణ్నే-ఓ బాలా! రా.

మనము ఈ పువ్వులతో ప్రకాశించుచున్న మడుగులోనికి ప్రవేశించి,స్వామి పాదసేవా సౌభాగ్యమనే క్రీడతో ధన్యులమగుదాము.

 పిణ్ణే-ఓ బాలా! 

 ఇం పూంపునల్ పాయింద్- ఈ పూలమడుగులో

 ఆడేలో రెంబావాయ్-వ్రత విధిగా క్రీడిద్దాము. 

 

 తిరు అన్నామలయై అరుళ ఇది

 అంబే శివే తిరు వడిగళియే పోట్రి.

 నండ్రి.వణక్కం.

 

  

 



TIRUVEMBAVAY-17


 



  






 






 తిరువెంబావాయ్-17




 **************








 శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్




 ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్








 కొంగుం కరుణ్ కుళలి నందమ్మాఇ కోదాట్టి




 ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి








 శంగమల పొట్పాదం తందరళుం సేవగనై




 అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై








 నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్




 పంగయపూం పునల్ పాయిందాడేలోరెం బావాయ్.


 త్రయంబక-దిగంబర పోట్రి


 **********************




  












 












 తిరువెంబావాయ్-17

 **************


 శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్ దేవర్గళ్ పాల్


 ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్


కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్ కోదాట్టి

ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి


 శంగమల పొట్పాదం తందరళుం సేవగనై

 అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై


 నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్

 పంగయపూం పునల్పాయిందాడేలోరెంబావాయ్.










అరుణగిరిస్వామియే పోట్రి


 *********************


 "త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం" అని రుద్రము స్వామిని సంకీర్తించుచున్నది.


 స్వామి మూడు నేత్రములు సూర్య-చంద్ర-వైశ్వానరులుగా(అగ్నిగా) భావిస్తూ,


  ముక్కంటి మా ఇక్కట్లను తీర్చవయ్యా అంటు శరణుకోరుతుంటారు.




 స్వామి కన్నులు దయాసముద్రములు.కనుకనే మార్కండేయుని చిరంజీవిని చేసినవి.




 మోహపాశమునకు స్వామి కన్నులు దహనకారకములు.కనుకనే మన్మథుడు దహించివేయబడినాడు.





   స్థితికార్యమునకు స్వామి కన్నులు ఆధారములు.చేతనప్రదములు.కనుకనే మనలోని కుండలిని జాగృతమగుచున్నది.




 స్వామి కన్నులు భక్తి పరీక్షాపరికరములు.కనకనే తిన్నని-కన్ననిగా కరుణించినవి.


 స్వామి కన్నుల సౌందర్యమును-సామర్థ్యమును-సౌభాగ్యమును వివరించుట సాధ్యము కానిదని పుష్పదంతుడను గంధర్వుడు "శివ మహిమ్నా స్తోత్రము"లో ఒప్పుకున్నాడు.


 చెలి! ఓ అరాల కుంతలా! తుమ్మెదలను ఆకర్షింపచేయకల కేశబంధము కలదానా!




 కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్-కరుణ అను సుగంధముతో నొప్పుచు, పరిమళించుచున్న సౌభాగ్యవతి,




 మన స్వామి,


 అవన్ పాల్-మనందరి రక్షకుడు. 


  అంతే కాదు


 తిశై ముగన్ పాల్-దిక్కులన్నింటికి పరిపాలకుడు


  అది మాత్రమే కాదు


 దేవర్గళ్ పాల్-దేవతలందరికి పాలకుడు




 స్వామి చల్లని చూపే సమస్తమును చల్లగా సంరక్షిస్తున్నది.


 స్వామి కన్నులు,


 శెన్ కణ్-కెందామరలు.


 జ్ఞాన సంకేతములు-ధర్మ సంస్థాపనములు-దయాంతరంగములు.




 తిరు మాణిక్య వాచగరు మనకు ఈ పాశురములో స్వామి ఏ విధముగా మన హృదయాంతరంగ వాసియై ఆశీర్వదించుచున్నాడో వివరిస్తున్నారు


 స్వామి సర్వాంగములు శొభాయమానములే-శోక నివారణము

లే.


 స్వామి ఇల్లంగళ్ ఎళుంది అరుళి -అనుగ్రహహించుచున్న ఆశీర్వచనము మనము మన స్వామి ఉనికిని తెలియచేసినది.




 స్వామి శెన్-కమల్-కెందామర వంటి పాదపద్మములను సేవించుటకు,


అంగణ్-సార్వభౌమాధికారులు


అరసన్-దేవతా సమూహములు


నిష్ఫలులైనారు-కారమాదై-చేయలేక పోయినారు.


 అంటు వారు మడుగు వైపునకు చూడగానే విరబూసిన పద్మములు

 స్వామి పాదసంకేతములుగా ప్రకటితమగుతు-పరిమళిస్తూ-పరవశిస్తూ తామరలు కొలనులో తరిస్తూ-మనలను తరింప చేస్తూ,తాదాత్మ్యమునకు తావైన వేళ,పావన పంకజమయమైన పొయిగైలోనికి ప్రవేశించి,స్వామి పాదములను వీడక-పరవశిస్తూ పాడుకుందాము.


 తిరు అన్నామలయై అరుళ ఇది


 అంబే శివే తిరువడిగళే పోట్రి.


 నండ్రి.వణక్కం.


















 
















 
























 








 









Friday, March 19, 2021

16

 


 




.












 తిరువెంబావాయ్-16


 **************




 మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్


 ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్




 మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్


 పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం




 ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్


 తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు




 మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే


 ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.




 శ్యామలా తాయియే పోట్రి


 ****************




  తిరుమాణిక్యవాచగరు మనౌ ఈ పాశురములో ఒక సామాన్యమును విశేషముతో-విశేషమును సామాన్యముతో అన్వయిస్తు అద్భుతావిష్కరణమును చేస్తున్నారు.




  అమ్మతో పోల్చబడిన నల్లని మేఘమా తరియించినదమ్మా నీ ఉపాధి.


  సముద్రమా-సాటిలేనిదమ్మా నీ సహాయగుణము.


 సంక్షిప్తపరచబడి తల్లితో పోల్చబడి తరించినావు.




 కుదించిన సముద్రమే కదా ఆ నీలిమేఘము.


 అది విస్తరించినచో సముద్రమేకదా!




 మనకు దర్శనీయములైన సముద్రము-మేఘము-మెరుపు-ఉరుము-హరివిల్లు-మడుగు తల్లి స్వరూప-స్వభావములకు ఉపమానములై సన్మానమునందుచున్నవి. 




 ఏ విధముగా మన కామాక్షి తాయి మనకు రక్షణగా నుండి కాపాడుచున్నదో-ఆ అమ్మ అంతరంగమే ఆ నల్లని మేఘముగా నాకు తోచుచున్నది అని మన సౌభాగ్యవతులు పరస్పరము సంభాషించుకొనుచున్నారు.




 వారి భావములు మన భాగ్యవశమున బహిరంగపరచుచున్నారు.


 ఈ సంభాషమును జరుపుచున్న ఇద్దరు పడుచులు పరమ పాండిత్యముకలవారే.


ప్రజ్ఞాధనులే మాత్రమేకాదు వారు పరమ దయాంతరంగులు.కనుకనే పరస్పర సంభాషణమను పరమార్థము ద్వారా తల్లిని ప్రస్తుతిస్తు మనలను సంస్కరిస్తున్నారు.


 మొదతగా వారికి కనిపించినది తల్లి కరుణ వారిపై/మనదరిపై వర్షించుటకు సిధ్ధమై యున్నది.


 చెలి అటుచూడు ఆకాశమువైపు.ఎంతటి మహాద్భుతము ఆవిష్కరింపబడుతున్నదో అని అనగానే పక్కనున్న చెలి అమాయకముగా,


 చెలి! నీవా నల్లని మేఘమునా నాకు చూపిస్తున్నది? అని ప్రశ్నించినది.




 సర్గా చూడు చెలి! అది సామాన్యమైన నల్లమబ్బు కాదు.


 వర్షించి,మనలను పోషించుటకు సిధ్ధముగా నున్న తల్లికరుణ.


మనలను కరుణించుటకై,ఆ మబ్బు ఎంతకష్టపడినదో ఒక్కసారి ఆలోచించు.అప్పుడు నీకు అది పరమపూజ్యమే అవుతుంది అని,తిరిగి తన చెలితో 


అది ఇంతకు మునుపే ఏమిచేసిందో నీవు గమనించావా?




 మున్ని-ముందరే


 కడలై-సముద్రపు నీటిని కడుపునిండా తాగి,పైకిలేచి-సురుక్కి-దాని పరిమానమును తగ్గించి,ఆవిరిగా మార్చుకొని-తాగునీటిగా మార్చుకొని మనకు అందించుటకు సిధ్ధముగా నున్నది.ఈ ప్రక్రియ వలన దానికేమి ప్రయోజనము లేదు.మనకు అందించిన తృప్తి తప్ప. అని అంటుండగానే 


 మొదటి విచిత్రము,


 అకాశము మెరుపులతో మెరియసాగినది.


 రెండవ చెలి అవిగో మెరుపులు మెరుస్తు ఎంత బాగున్నాయో కదా! అనగానే




 చెలి.అవి సామాన్యమైన మెరుపు కావు.మనసుతో చూడు.నీకు ఏమనిపిస్తుందో తెలియచేయి అనగానే,అమ్మ కరుణ ఉంటే అసాధ్యమేముంది.అంతరంగమున నిండి అమృతవాక్కుగా ప్రకటితమవుతోంది.


 మధురాతి మధురముగా తాయి అనుగ్రహ తన్మయత్వముతో చెలి,


 అది సామాన్యమైన మెరు కాదు అది అమ్మ,


 ఇట్టదియన్.


 కనిపించి-కనిపించని సూక్ష్మమైఅ/శూన్యముగా తోచు నడుము కదా. అవునవుననుకుంటుండగానే మరో అద్భుతము.


 ఉరుములు ఊరుకుంటాయా? అమ్మతో సారూప్యమును పొందకుండా.వాటి ఉత్సాహ ఉత్సవమునేమనగలను? తెలిసికొనుటకు ఆసక్తిని చూపుట తప్ప.


 అవిగో ఎంత సుస్వరనాదమును ఆలపిస్తున్నవి మన తల్లి,


 పాదములకు ధరించిన-తిరువడిమేర్,


పొన్న-బంగరు


చిలంబిర్ చిలంబిత్-మువ్వల సవ్వడి వింటు మైమరచిపోతున్నసమయములో,


 "సుధాసారాభి వర్షిణి" 


 అలా వారు ఎంతసేపు అమ్మగుణగానమనే సంకీర్తనములో మునితేలుతున్నరో వారికే తెలియదు.దయామృతములో మునిగి ధన్యులైనారు.బహిర్ముఖులు కాగానే ఆకాశము తాను తలపుల  హరివిల్లుతో చిందులు వేస్తుంటే చెలి చూశావా.అమ్మ మంగళప్రదమైన కనుబొమల వొంపు ఇంద్రధనుసుగా ఆవిష్కరింపబడుతు, మనలను ఆశీర్వదిస్తున్నది.


 "వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా" 




.












 తిరువెంబావాయ్-16


 **************




 మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్


 ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్




 మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్


 పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం




 ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్


 తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు




 మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే


 ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.




 శ్యామలా తాయియే పోట్రి


 ****************




  తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో ఒక సామాన్యమును విశేషముతో-విశేషమును సామాన్యముతో అన్వయిస్తు అద్భుతావిష్కరణమును చేస్తున్నారు.




  అమ్మతో పోల్చబడిన నల్లని మేఘమా తరియించినదమ్మా నీ ఉపాధి.


  సముద్రమా-సాటిలేనిదమ్మా నీ సహాయగుణము.


 సంక్షిప్తపరచబడి తల్లితో పోల్చబడి తరించినావు.




 కుదించిన సముద్రమే కదా ఆ నీలిమేఘము.


 అది విస్తరించినచో సముద్రమేకదా!




 మనకు దర్శనీయములైన సముద్రము-మేఘము-మెరుపు-ఉరుము-హరివిల్లు-మడుగు తల్లి స్వరూప-స్వభావములకు ఉపమానములై సన్మానమునందుచున్నవి. 




 ఏ విధముగా మన కామాక్షి తాయి మనకు రక్షణగా నుండి కాపాడుచున్నదో-ఆ అమ్మ అంతరంగమే ఆ నల్లని మేఘముగా నాకు తోచుచున్నది అని ,



   అంతర్ముఖ జనానందదాయినిని గురించి,

మన సౌభాగ్యవతులు పరస్పరము సంభాషించుకొనుచున్నారు.




 వారి భావములు మన భాగ్యవశమున బహిరంగపరచుచున్నారు.


 ఈ సంభాషమును జరుపుచున్న ఇద్దరు పడుచులు పరమ పాండిత్యముకలవారే.


ప్రజ్ఞాధనులే మాత్రమేకాదు వారు పరమ దయాంతరంగులు.

 కనుకనే పరస్పర సంభాషణమను పరమార్థము ద్వారా తల్లిని ప్రస్తుతిస్తు మనలను సంస్కరిస్తున్నారు.


 మొదటగా వారికి కనిపించినది,

 మహాతిశయ లావణ్య నిధి అంతరంగము.ఏమా లావణ్యము?


 సుధాసారాభివర్షిణి గా మనలను అనుగ్రహించుట.ధన్యులము మాతా.







 తల్లి కరుణ వారిపై/మనందరిపై వర్షించుటకు సిధ్ధమై యున్నది.


 చెలి అటుచూడు ఆకాశమువైపు.ఎంతటి మహాద్భుతము ఆవిష్కరింపబడుతున్నదో అని అనగానే పక్కనున్న చెలి అమాయకముగా,


 చెలి! నీవా నల్లని మేఘమునా నాకు చూపిస్తున్నది? అని ప్రశ్నించినది.




 సరిగా చూడు చెలి! అది సామాన్యమైన నల్లమబ్బు కాదు.


 వర్షించి,మనలను పోషించుటకు సిధ్ధముగా నున్న ,

 అవ్యాజకరుణామూర్తి-అజ్ఞాంధకార దీపిని కరుణ.



తల్లికరుణ.


మనలను కరుణించుటకై,ఆ మబ్బు ఎంతకష్టపడినదో ఒక్కసారి ఆలోచించు.అప్పుడు నీకు అది పరమపూజ్యమే అవుతుంది అని,తిరిగి తన చెలితో 


అది ఇంతకు మునుపే ఏమిచేసిందో నీవు గమనించావా?




 మున్ని-ముందరే


 కడలై-సముద్రపు నీటిని కడుపునిండా తాగి,పైకిలేచి-సురుక్కి-దాని పరిమానమును తగ్గించి,ఆవిరిగా మార్చుకొని-తాగునీటిగా మార్చుకొని మనకు అందించుటకు సిధ్ధముగా నున్నది.ఈ ప్రక్రియ వలన దానికేమి ప్రయోజనము లేదు.మనకు అందించిన తృప్తి తప్ప. అని అంటుండగానే 


 మొదటి విచిత్రము,

 భావనామాత్ర సంతుష్ట కరుణ,


 అకాశము మెరుపులతో మెరియసాగినది.


 రెండవ చెలి అవిగో మెరుపులు మెరుస్తు ఎంత బాగున్నాయో కదా! అనగానే




 చెలి.అవి సామాన్యమైన మెరుపు కావు.మనసుతో చూడు.నీకు ఏమనిపిస్తుందో తెలియచేయి అనగానే,

అమ్మ కరుణ ఉంటే అసాధ్యమేముంది.అంతరంగమున నిండి అమృతవాక్కుగా ప్రకటితమవుతోంది.


 మధురాతి మధురముగా తాయి అనుగ్రహ తన్మయత్వముతో చెలి,


 అది సామాన్యమైన మెరుపు కాదు అది అమ్మ,


 ఇట్టడియన్న్.అమ్మ నడుము.ఉన్నదా/లేదా యన్నట్లున్నది.అందుకేనేమో అమ్మను

 " లతాఫల కుచద్వయీ" అని స్తుతిస్తారు భక్తులు.




 కనిపించి-కనిపించని సూక్ష్మమముగా/శూన్యముగా తోచు నడుము కదా. అవునవుననుకుంటుండగానే,


 "శింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజా"



 మరో అద్భుతము.


 ఉరుములు ఊరుకుంటాయా? అమ్మతో సారూప్యమును పొందకుండా.వాటి ఉత్సాహ ఉత్సవమునేమనగలను?


 " దేవి మీనాక్షి ముదం-దేహిమే సతతం" అంటు






 


 అవిగో ఎంత సుస్వరనాదమును ఆలపిస్తున్నవి మన తల్లి,


 పాదములకు ధరించిన-తిరువడిమేర్,


పొన్న-బంగరు


చిలంబిర్ చిలంబిత్-మువ్వల సవ్వడి వింటు మైమరచిపోతున్నసమయములో,


 అలా వారు ఎంతసేపు అమ్మ గుణగానమనే సంకీర్తనములో ఆ సుధాసారాభి వర్షములో,

 మునిగితేలుతున్నరో వారికే తెలియదు.దయామృతములో మునిగి ధన్యులైనారు.బహిర్ముఖులు కాగానే ఆకాశము ఆనందమను హరివిల్లుతో చిందులు వేస్తుంటే చెలి చూశావా.ఆ ఇంద్రధనుసు మనతో చేయుచున్న ఇంద్రజాలము.మనసు మరలుటకు ఇచ్చగించుటలేదు.ఎంత చక్కని కన్నులపండుగ అన్నిటిని మరిపిస్తున్నది అనగానే,


 అవునవును అమ్మ తిరుపురవం కదా! కాసేపు కళలనద్దుకొని మనలను అనుగ్రహించినది అంటూ,



 




 బాహ్యమునకు వచ్చారేమో మడుగు మరింత ఉత్సాహముతో కేరింతలో పోటిపడుతు ,


 తన్నీర్ తురవిళాం ఎణ్కోమల్-నేను ముందు రక్షిస్తాను అని అమ్మ అంటే-


స్వామి కాదు కాదు నేను ముందు రక్షిస్తాను జగములను, అని పోటీపడుతున్నట్లుగా  ,లేదు కురిసిన కరుణతో నిండి


 మున్ని అవళ్ నమక్కు-మనలను 


 ఇన్నరుళే -ఆశీర్వచన అనుగ్రహమనే సౌభాగ్యముతో మనలను పునీతులను చేయాలని,

మున్ని అవళ్ నమక్కు-మనలను 


 ఎంతటి ఆరాటముతో నిండిన అనుగ్రహము.ఆ ఆదిదంపతులది.


 పద చెలి మనము ఆ మడుగులోనికి ప్రవేశించి,మనస్పూర్తిగా-మహోత్సాహముతో మునకలు వేద్దాము.

మళయేలో రెంబావాయ్.మళయేలో రెంబావాయ్.




 తిరు అన్నామలయై అరుళ ఇది


 అంబే శివే తిరువడిగళే పోట్రి.


  నండ్రి.వణక్కం.









 






    








 బాహ్యమునకు వచ్చారేమో మడుగు మరింత ఉత్సాహముతో కేరింతలో పోటిపడుతు ,


 తన్నీర్ తురవిళాం ఎణ్కోమల్-నేను ముందు రక్షిస్తాను అని అమ్మ అంటే-


స్వామి కాదు కాదు నేను ముందు రక్షిస్తాను జగములను అని పోటీపడుతున్నట్లుగా  ,


 మున్ని అవళ్ నమక్కు-మనలను 


 ఇన్నరుళే -ఆశీర్వచన అనుగ్రహమనే సౌభాగ్యముతో మనలను పునీతులను చేయాలని,


 ఎంతటి ఆరాటముతో నిండిన అనుగ్రహము.


 పద చెలి మనము ఆ మదుగులోనికి ప్రవేశించి,మనస్పూర్తిగా-మహోత్సాహముతో మునకలు వేద్దాము.మళయేలో రెంబావాయ్.మళయేలో రెంబావాయ్.




 తిరు అన్నామలయై అరుళ ఇది


 అంబే శివే తిరువడిగళే పోట్రి.


  నండ్రి.వణక్కం.








 






    






Thursday, March 18, 2021

TIRUVEMBAVAY-16

 


.






 తిరువెంబావాయ్-16

 **************


 మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్

 ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్


 మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్

 పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం


 ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్

 తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు


 మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే

 ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.


 శ్యామలా తాయియే పోట్రి

 ****************


  తిరుమాణిక్యవాచగరు మనౌ ఈ పాశురములో ఒక సామాన్యమును విశేషముతో-విశేషమును సామాన్యముతో అన్వయిస్తు అద్భుతావిష్కరణమును చేస్తున్నారు.


  అమ్మతో పోల్చబడిన నల్లని మేఘమా తరియించినదమ్మా నీ ఉపాధి.

  సముద్రమా-సాటిలేనిదమ్మా నీ సహాయగుణము.

 సంక్షిప్తపరచబడి తల్లితో పోల్చబడి తరించినావు.


 కుదించిన సముద్రమే కదా ఆ నీలిమేఘము.

 అది విస్తరించినచో సముద్రమేకదా!


 మనకు దర్శనీయములైన సముద్రము-మేఘము-మెరుపు-ఉరుము-హరివిల్లు-మడుగు తల్లి స్వరూప-స్వభావములకు ఉపమానములై సన్మానమునందుచున్నవి. 


 ఏ విధముగా మన కామాక్షి తాయి మనకు రక్షణగా నుండి కాపాడుచున్నదో-ఆ అమ్మ అంతరంగమే ఆ నల్లని మేఘముగా నాకు తోచుచున్నది అని మన సౌభాగ్యవతులు పరస్పరము సంభాషించుకొనుచున్నారు.


 వారి భావములు మన భాగ్యవశమున బహిరంగపరచుచున్నారు.

 ఈ సంభాషమును జరుపుచున్న ఇద్దరు పడుచులు పరమ పాండిత్యముకలవారే.

ప్రజ్ఞాధనులే మాత్రమేకాదు వారు పరమ దయాంతరంగులు.కనుకనే పరస్పర సంభాషణమను పరమార్థము ద్వారా తల్లిని ప్రస్తుతిస్తు మనలను సంస్కరిస్తున్నారు.

 మొదతగా వారికి కనిపించినది తల్లి కరుణ వారిపై/మనదరిపై వర్షించుటకు సిధ్ధమై యున్నది.

 చెలి అటుచూడు ఆకాశమువైపు.ఎంతటి మహాద్భుతము ఆవిష్కరింపబడుతున్నదో అని అనగానే పక్కనున్న చెలి అమాయకముగా,

 చెలి! నీవా నల్లని మేఘమునా నాకు చూపిస్తున్నది? అని ప్రశ్నించినది.


 సర్గా చూడు చెలి! అది సామాన్యమైన నల్లమబ్బు కాదు.

 వర్షించి,మనలను పోషించుటకు సిధ్ధముగా నున్న తల్లికరుణ.

మనలను కరుణించుటకై,ఆ మబ్బు ఎంతకష్టపడినదో ఒక్కసారి ఆలోచించు.అప్పుడు నీకు అది పరమపూజ్యమే అవుతుంది అని,తిరిగి తన చెలితో 

అది ఇంతకు మునుపే ఏమిచేసిందో నీవు గమనించావా?


 మున్ని-ముందరే

 కడలై-సముద్రపు నీటిని కడుపునిండా తాగి,పైకిలేచి-సురుక్కి-దాని పరిమానమును తగ్గించి,ఆవిరిగా మార్చుకొని-తాగునీటిగా మార్చుకొని మనకు అందించుటకు సిధ్ధముగా నున్నది.ఈ ప్రక్రియ వలన దానికేమి ప్రయోజనము లేదు.మనకు అందించిన తృప్తి తప్ప. అని అంటుండగానే 

 మొదటి విచిత్రము,

 అకాశము మెరుపులతో మెరియసాగినది.

 రెండవ చెలి అవిగో మెరుపులు మెరుస్తు ఎంత బాగున్నాయో కదా! అనగానే


 చెలి.అవి సామాన్యమైన మెరుపు కావు.మనసుతో చూడు.నీకు ఏమనిపిస్తుందో తెలియచేయి అనగానే,అమ్మ కరుణ ఉంటే అసాధ్యమేముంది.అంతరంగమున నిండి అమృతవాక్కుగా ప్రకటితమవుతోంది.

 మధురాతి మధురముగా తాయి అనుగ్రహ తన్మయత్వముతో చెలి,

 అది సామాన్యమైన మెరు కాదు అది అమ్మ,

 ఇట్టదియన్.

 కనిపించి-కనిపించని సూక్ష్మమైఅ/శూన్యముగా తోచు నడుము కదా. అవునవుననుకుంటుండగానే మరో అద్భుతము.

 ఉరుములు ఊరుకుంటాయా? అమ్మతో సారూప్యమును పొందకుండా.వాటి ఉత్సాహ ఉత్సవమునేమనగలను? తెలిసికొనుటకు ఆసక్తిని చూపుట తప్ప.

 అవిగో ఎంత సుస్వరనాదమును ఆలపిస్తున్నవి మన తల్లి,

 పాదములకు ధరించిన-తిరువడిమేర్,

పొన్న-బంగరు

చిలంబిర్ చిలంబిత్-మువ్వల సవ్వడి వింటు మైమరచిపోతున్నసమయములో,

 అలా వారు ఎంతసేపు అమ్మగుణగానమనే సంకీర్తనములో మునితేలుతున్నరో వారికే తెలియదు.దయామృతములో మునిగి ధన్యులైనారు.బహిర్ముఖులు కాగానే ఆకాశము తనాందమను హరివిల్లుతో చిందులు వేస్తుంటే చెలి చూశావా.అమ్మ మంగళదమైన కనుబొమల వొంపు ఇంద్రధనుసుగా ఆవిష్కరింపబడుతు మనలను ఆశీర్వదిస్తున్నది.


 బాహ్యమునకు వచ్చారేమో మడుగు మరింత ఉత్సాహముతో కేరింతలో పోటిపడుతు ,

 తన్నీర్ తురవిళాం ఎణ్కోమల్-నేను ముందు రక్షిస్తాను అని అమ్మ అంటే-

స్వామి కాదు కాదు నేను ముందు రక్షిస్తాను జగములను అని పోటీపడుతున్నట్లుగా  ,

 మున్ని అవళ్ నమక్కు-మనలను 

 ఇన్నరుళే -ఆశీర్వచన అనుగ్రహమనే సౌభాగ్యముతో మనలను పునీతులను చేయాలని,

 ఎంతటి ఆరాటముతో నిండిన అనుగ్రహము.

 పద చెలి మనము ఆ మదుగులోనికి ప్రవేశించి,మనస్పూర్తిగా-మహోత్సాహముతో మునకలు వేద్దాము.మళయేలో రెంబావాయ్.మళయేలో రెంబావాయ్.


 తిరు అన్నామలయై అరుళ ఇది

 అంబే శివే తిరువడిగళే పోట్రి.

  నండ్రి.వణక్కం.




 



    



Wednesday, March 17, 2021

TIRUVEMBAVAY-15


 తిరువెంబావాయ్-15 


    ***************




 ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్


 శీరోరుకాల్ వాయోవల్ శిత్తం కళికూర




 నీరొర్కాల్ ఓవా నెడందరై కన్ పణిప్పన్


 పారోర్కాల్ వందనయాల్ ఎణ్ణోరై తాం పణియాన్




  పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు


  ఆరోరువర్ ఇవ్వణ్నం ఆట్కోళం  విత్తకర్తాళ్




  వారురువ పూణ్మలైయార్ వాయార్  ఆనాంపాడి


  ఎరురువం పూం పునల్ పెయిరేలోరెంబావాయ్



 ఎం పెరుమాన్-నం పెరుమాన్ పోట్రి

 *******************************

 నామస్మరణం ధన్యోపాయం-నహి నహి దుఃఖం ....... ఈ పాశురములో తిరు మాణిక్యవాచగరు శివనోమును చేసూంటున్న పడుచులకు లభ్యమైన అంతర్ముఖ అనుగ్రహమును మనకు వివరిస్తున్నారు.


 వారికి అంతా ఆధ్యాత్మిక ఆనందమయమే.ఆ ఆదిదేవుని ఆశీర్వాదానుభవమే.అన్యము తృణప్రాయమైనది.

 వారి అనుభవసారమును నేనేమని వర్ణించగలను.? అంతటి భాగ్యశీలురు వారు. కనుకనే ,

 అంతర్ముఖులైనవారు అప్పుడప్పుడు మంద్రముగా, మెల్లగా,

 శీరొరుకాల్-శుభప్రదమైన 

 ఎం పెరుమాన్-మహాదేవుడు,

 నం పెరుమాన్-మన సంరక్షకుడు అని పలవరిస్తున్నారు.పూర్తిగా బహిర్ముఖులగుటకు ఇష్టపడుటలేదు.

  అదియును/ఆ పలవరింతయును

శిత్తం కళికూర-చిత్త శిధ్ధితో/మనస్పూర్తిగా

వాయ్ ఓవాన్-విసుగు చెందని వాక్కుతో,


 నిర్విరామముగా/నిశ్చలముగా నిటలాక్షమయమైనది వారి అంతరంగము.

 నింపుతున్నది ఆర్ద్రతను నిర్విరామముగా.

 నిస్తుల అనుగ్రహము కన్నులనుండా నిండి-ఆనందాశ్రువులుగా ,

కణ్పణప్పన్-కన్నులనుండి,

ఓవాన్ ఎడుందారై-నిరంతరాయముగా వర్షిస్తూనే ఉన్నాయి.

 వారి మనస్సు-వాక్కు-బాహ్యము-అంతరంగము సమస్తము సర్వేశ్వరాధీనమై సన్నుతిస్తున్నవి.


 ఎంతటి ధన్యులో ఆ సుందరీమణులు -సుందరేశానుగ్రహ పాత్రులైనారు.

 ఆ సమయము అతిపవిత్రము.కనుకనే వారికి అన్యము-అన్యదేవతలు 

 విణ్ణోరై తాపణియాళ్,

 స్పురించుటలేదు.అంతా శివమయమే.శుభప్రదమే.

 ఆ ఆనందానుభవములో వారు తమ పాదములను భూమిమీద పెట్తలేక పోతున్నారు.

పారొరుకాల్ వంద-బహిర్ముఖులు కమ్మంటే,

 వారిని అనిర్వచనీయానందము నుండి మరళి,తమ కాలును భూమిమీద పెట్టమంటే/ఐహికములను ఆలోచించమంటే  వారిమనసు,

నయాళ్-వినుటలేదు.

 మందార మకరందమును ఆస్వాదించువారు మరలగలరా మరి ఇతరములకు?


 వారికి సాక్షాతు స్వామిగా జ్ఞానమనే పువ్వులతో ప్రకాశిస్తున్న ,

 ఏరురవం పూంపునల్ లో పాయింద్-మునిగి,

ఆడేలోరెంబావాయ్-ఆనందానుభూతిలో మునిగితేలుతున్నారు.

 తిరు అన్నామలయై అరుళ ఇది

 అంబే శివే తిరువడిగళే పోట్రి.

 నండ్రి.వణక్కం.



Tuesday, March 16, 2021

TIRUVEMBAVAY-14



  తిరువెంబావాయ్-14


 *************



 కాదార్ కుడైయాడ పైపూంకలానాడ

 కోదై కురళాడ వండిన్ కుళామాడ



 సీద పునలాడి చిట్రం బలం పాడి

 వేద పొరుల్పాడి అప్పొరుళ మాపాడి



 శోది తిరం పాడి శూల్కొండ్రై తార్పాడి

 ఆది తిరంపాడి అందం ఆమా పాడి



 పేదిత్తు నమ్మై వళతెడుత్త పెయ్వలైదన్

 పాదతిరం పాడి పాడేలొ రెంబావాయ్



 



 అరువం-ఉరువం-అరు ఉరువం పోట్రి

 *****************************

 తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో,

 అరువం-అవ్యక్తము

 ఉరువం-వ్యక్తము

 అరు ఉరువం-వ్యక్తావ్యక్తము అను మూడు లీలా విశేషములను,సంకీర్తన సేవా మార్గము ద్వారా వివరిస్తున్నారు.




 కనుకనే ఈ పాశురములో పరమభాగ్యవంతులైన కన్యలు స్వామిని నాలుగు విధములుగా సంకీర్తించి,దర్శింప చేసినారు. అవియే,

 మొదటిది-అవ్యక్తము.

 వేద పొరుళ్ పాడి-స్వామి శబ్ద స్వరూపముగా ప్రకటితమైనాడు.



 రెండవది ఆ రూప వ్యాపకత్వము.

 వేదము-సత్యము కనుక ఆ వేదస్వరూపము తానంతట తానై సమస్తమును విస్తరించి-వ్యాపించినది.

 అప్పొరుళ్ ఆమాం పాడి.



మూడవది-శోది తిరం పాడి.

 అరూపము మన మీది అనుగ్రహముతో,

 అగ్నిస్తంభ జ్యోతిగా ప్రకటింప బడినది. ఇది వ్యక్తము.కాని మానవ నేత్రములకు పూర్తిగా అర్థము కానిది.కనుక వ్యక్తావ్యక్తము.మహాశివ లింగ రూపము కూడా వ్యక్తమే కాని కొంత అవగాహన మనకు అవసరము.

 ఇంకను దయతో స్వామి మనకు అర్థమయ్యేలాగ సుందరరూపముతో-సులభ భక్త పరాధీనతతో వ్యక్తమై మనలకు సాక్షాత్కారమును ప్రసాదించుచున్నాడు.

 వ్యక్తము-అవ్యక్తము-వ్యక్తావ్యక్తము అను మూడును పరమాత్మ క్రీడలే కదా చెలి అని వారు పాడుచున్నారు.



 ఇప్పటి వరకు చెలులందరు తమకు తోచిన విధముగా తాము దర్శించి-అనుభవించిన స్వామి అనుగ్రహమును బహుముఖములుగా బహిరంగపరిచారు.ఇప్పుడు వారి భావములన్నీ ఏకీకృతమైనవి.అనుగ్రహము అద్భుతమై అమృతత్త్వమును వారికి-మనకు అందించుచున్నది.

 కనుకనే వారు ఆది తిరం పాడి-అందం ఆమా పాడి అంటున్నారు.ఆదియును-అంతమును రెండును తానైన స్వామిని,వారు సంకీర్తిస్తున్నప్పుడు వారి,

 కాదార్ కుడైయాడ-పైపూంకలాడ-కోదై కుళలాడ-వండిన కుళామాడ అని అంటున్నారు మాణిక్యవాచగరు.కర్ణములు శ్రవణమునకు ఆభరణములైనవి.కేశములు మంత్రమయములైనవి.అనన్య శేషషులై.అనన్య శరణులై వారు,

పేయ్దిత్తు నమ్మాఇ-వారి శరీరములను సార్థకపరచుకొనుచు,స్వామి యొక్క శివశక్తుల స్వరూపమును అవిభాజ్యముగా-అనుగ్రహ పదముగా గుర్తించి,సేవించుచున్నారు.

పేయ్ వలదైన్ -

ఇక్కడ మనకు మహానుభావుడు భ్రంగి వృత్తాంతము గుర్తుకు వస్తుంది.మీకు తెలియనిది కాదు.నా అనందమును పంచుకొనుటకు మరొక్కసారి.

  పరమ శివభక్తుడైన భృంగి అమ్మవారికి నమస్కరించేవాడు కాదట.శివుడొక్కడే తన దైవముగా భావించి పూజించేవాడట.తల్లి వానినిపరీక్షించదలచి,అవిభాజ్యమైన అర్థనారీశ్వ రూపములో దర్శనమిచ్చిందట.



 అప్పుడు భృంగి తానొక తుమ్మెదగా మారి వారిమధ్యనున్న చిన్న ప్రదేశములో తాను దూరుతు కేవలము శివస్వరూపమునకు మాత్రమే ప్రదక్షిణలను చేసాడట.తల్లి ఆగ్రహించి వానిని శక్తిహీనునిగా శాపమిచ్చి,తిరిగి వానికి మూడవ కాలిని ప్రసాదించి కనువిప్పు కలిగించారట.ఇదంతా మనకు కనువిప్పు కలిగించుటకు ఆదిదంపతుల ఆట.దానికి పావుగా మారిన భృంగి ఎంతటి పుణ్యమును చేసుకొన్నాడో కద.

   తిరు అన్నామలయై అరుళ ఇది.

   అంబే శివే తిరువడిగళే పోట్రి.

   నండ్రి.వణక్కం.








  



  


Monday, March 15, 2021

TIRUVEMBAVAY-13

 


  




 






  తిరువెంబావాయ్-13


 *****************




 పైంగువళై కార్మలరార్ శెంగమల పైంపోదాల్


 అంగం కురు గినత్తార్ పిన్నుం అరవత్తార్





 తంగళ్ మనంకళవు వార్వందు సార్దనినాల్


 ఎంగళ్ పిరాట్టియుం ఎంకోన్రుం పోర్నిశెయింగ




 పొంగుమడువీర్ పుగప్పాందు పాయిందు


 శంగం శిలంబ శిలంబు కలందార్ప




 కొంగకళ్ పొంగ కుడైయుం పునల్పొంగాన్


 పంగయుంపూం పునల్పాయిందాలే రెంబావాయ్'


 మీనాక్షి-సుందరేశనయే పోట్రి

 *********************************



 




 ఎంగళ్-మనందరి,


 పిరాట్టి-పరిపాలకురాలు,


 ఎంకోన్రుం-విరాజితమైన,


 పొంగుం అడువీర్-వారి పాదములను తాకుతున్న,


 పుగప్పాందు-సుడులు తిరుగుచున్న పాయిందు-అలలు ఎలా ఉన్నాయంటే,


 ఎలా చప్పుడు చేస్తున్నాయంటే-శిలంబ,


 శంఖములు గిరగిర తిరుగుతు,ప్రణవమును జపిస్తున్నాయా యన్న







 మీనాక్షి సుందరేశాయ పోట్రి


 **********************

 తిరు మాణిక్యవాచగరు ఈ పాశురములో ,మడుగులో విరాజిల్లుతున్న నీలి కలువలను-ఎర్ర తామరలను సాక్షాత్తు మీనాక్షి తాయి-సుందరేశన్ అప్ప తమకు తాముగా కొలను ప్రసన్నతతో ప్రకటింపబడి పరిరక్షించుచున్నట్లున్నదంటున్నారు.

 ఇక్కడ మనకు బాహ్యమునకు కనపడు వాటి వర్నములు-స్వభావములు వారి సంరక్ష్ణా తత్పరతకు సంకేతములు.

  మన తాయి మీనాక్షి అమ్మను,

 మడుగులోని నీలి కలువగా కీర్తించారు.

 కార్ మలరార్-నీలితనముతో ప్రకాశిస్తున్నది తల్లి.

ఏమిటా నీలితనము/నల్లతనము?


 ఏ విధముగా మేఘము వర్షించుటకు ముందు తనలో నిండిన జలముతో నీలముతో కూడిన నలుపుతో ఉంటుందో అది అమ్మస్వభావముతో అది పోల్చబడుతున్నది.అది దాని అదృష్టము.


 మన తాయికూడ మనపై అర్ద్రతతో కూడిన మనసుతో అనురాగమును వర్షించుటకు ఎల్లప్పుడు సిధ్ధముగా ఉంటుంది.అదియే ఆమె వర్ణ విశేషము.


 అంతే కాదు-మాణీక్యవాచగరు ఆమె మృదు స్వభావమును-సహజ కోమలత్వమును,

 పైగువలై అన్న విశేషనముతో వివరించారు.

 అమ్మ మనసు దయా సముద్రము. మరి అయ్యది?

 శెణ్-కమల -కెందామర/ఎర్రని పద్మము.


   స్వామి మనలను రక్షించుటకు అధర్మముపై/విషయవాసనలపై తన వీరమును చాటుచుడును.

 స్వామి మనసుయు దయా సముద్రమే.


 వీరి స్వభావ స్వరూపములు మనకు చెప్పకనే మన్మథ సంహార ఘట్టమును-తిరిగి పునర్జీవితుని చేయు కరుణను సూచిస్తున్నది.


  ఇది జలకములాడుచున్న పరమభాగ్యశాలురైన నలుగురి చెలుల మధ్య సాగిన వారి దర్శన-అనుభవముల సంభాషణము.


 మొదటి చెలి తక్కిన వారితో,చెలులారా!


 అంగం కురుగినిత్తార్-అని అంటున్నది

 కురుగినిత్తార్-పైనుండి కిందకు దిగి వచ్చిన,

 అంగం-అతి సుందరమైన-అద్భుతమైన,


 పుష్పహారమువలె నున్నవి ఈ పూవులు.మన స్వామి-తాయి మెడలో అలంకరించబడు అదృష్టమునకై తహతహలాడుచు చేరుచున్నట్లున్నవి అనగానే,


 రెండవ చెలి ఎంత సుందరమీ భావన.


 కాని చెలులారా-నాకు పుష్పములున్న మడుగులోని జలము మెలికలు తిరుగుతు ప్రవహిస్తుంటే,స్వామి మెడలో అవయములకు ఆభరంఉలుగా మారే అదృష్టము కోసము పరుగులు తీస్తున్నట్లున్నది కదా.

పిన్నుం అరవత్తాల్-


 అనగానే నిజమే చెలి.నీ భావనయును సమజసముగానే ఉన్నది.


 మీ ఇద్దరి భావనలకంటే భిన్నముగా నాకు ,

తంగళ్ మలకళవు వార్-ఎందరో మహానుభావులు,పరమ పూజ్యులు-యోగ్యులు,

వందు-వచ్చి-స్వామిని,

సార్దనినాల్-సేవించుకొనుచున్నట్లుగా తోస్తున్నది.


 అనగామ్నే మిగతా వారందరును ఆ భనలో తన్మయులైనారు.

 అంతలోనే వేరొక చెలి,చెలులారా! 


 ఇప్పటి వరకు మన నయనేంద్రియములు పునీతములైనవి.

 అబ్బ ! ఎంతటి మహత్ భాగ్యము మన చెలికి లభించినది.చెలి! ఏమా పరవశము-మాతో పంచుకొని మమ్ములను ఆనందింపచేయి అనగానే,ఆమె,చెలులారా!  


 కన్నులకు-వీనులకు అతి మనోహరమైన మహదానందము.


 అవిగో తెల్లగా/స్వచ్చముగా సుడులు తిరుగుతు శబ్దమును చేయుచున్న జలము,

 స్వామి నాదార్చనకు వరుసగా వచ్చి ఆనందించుచున్న శంఖములా అన్నట్లున్నవి.


 శంగం శిలంబ -శిలంబు కలందార్ప,

 ఆ దర్శనము -దృశ్యము అంతా వారి దయ ఆవిష్కారమే కదా అనుకొనుచున్న సమయములో-స్వామి అనుగ్రహమేమో మరి అది-వారందరు కలిసి,

ఇంతవరకు మనమూహించుకొనినవన్నీ మనకు ఇప్పుడు,

 సాక్షాత్తు,

మీనాక్షి-సుందరేశునులే ఇవన్నియు ,

 సర్వం శివమయం జగము అన్న భావనను కలిగిస్తున్నాయి.

 పదండి కొంగైకళ్ పొంగ-వారి(అమ్మా-నాన్నల) ఆలింగనాగ్రహమును పొందగ మడుగులో జలకములాడుదాము.


 తిరు అన్నామలయై అరుళ ఇది.

 అంబే శివే తిరు వడిగళే పోట్రి.

 నండ్రి.వణక్కం.



 


 


 





















  




 






  తిరువెంబావాయ్-13


 *****************




 పైంగువళై కార్మలరార్ శెంగమల పైంపోదాల్


 అంగం కురు గినత్తార్ పిన్నుం అరవత్తార్





 తంగళ్ మనంకళవు వార్వందు సార్దనినాల్


 ఎంగళ్ పిరాట్టియుం ఎంకోన్రుం పోర్నిశెయింగ




 పొంగుమడువీర్ పుగప్పాందు పాయిందు


 శంగం శిలంబ శిలంబు కలందార్ప




 కొంగకళ్ పొంగ కుడైయుం పునల్పొంగాన్


 పంగయుంపూం పునల్పాయిందాలే రెంబావాయ్'


 మీనాక్షి-సుందరేశనయే పోట్రి

 *********************************



 




 ఎంగళ్-మనందరి,


 పిరాట్టి-పరిపాలకురాలు,


 ఎంకోన్రుం-విరాజితమైన,


 పొంగుం అడువీర్-వారి పాదములను తాకుతున్న,


 పుగప్పాందు-సుడులు తిరుగుచున్న పాయిందు-అలలు ఎలా ఉన్నాయంటే,


 ఎలా చప్పుడు చేస్తున్నాయంటే-శిలంబ,


 శంఖములు గిరగిర తిరుగుతు,ప్రణవమును జపిస్తున్నాయా యన్న







 మీనాక్షి సుందరేశాయ పోట్రి


 **********************

 తిరు మాణిక్యవాచగరు ఈ పాశురములో ,మడుగులో విరాజిల్లుతున్న నీలి కలువలను-ఎర్ర తామరలను సాక్షాత్తు మీనాక్షి తాయి-సుందరేశన్ అప్ప తమకు తాముగా కొలను ప్రసన్నతతో ప్రకటింపబడి పరిరక్షించుచున్నట్లున్నదంటున్నారు.

 ఇక్కడ మనకు బాహ్యమునకు కనపడు వాటి వర్నములు-స్వభావములు వారి సంరక్ష్ణా తత్పరతకు సంకేతములు.

  మన తాయి మీనాక్షి అమ్మను,

 మడుగులోని నీలి కలువగా కీర్తించారు.

 కార్ మలరార్-నీలితనముతో ప్రకాశిస్తున్నది తల్లి.

ఏమిటా నీలితనము/నల్లతనము?


 ఏ విధముగా మేఘము వర్షించుటకు ముందు తనలో నిండిన జలముతో నీలముతో కూడిన నలుపుతో ఉంటుందో అది అమ్మస్వభావముతో అది పోల్చబడుతున్నది.అది దాని అదృష్టము.


 మన తాయికూడ మనపై అర్ద్రతతో కూడిన మనసుతో అనురాగమును వర్షించుటకు ఎల్లప్పుడు సిధ్ధముగా ఉంటుంది.అదియే ఆమె వర్ణ విశేషము.


 అంతే కాదు-మాణీక్యవాచగరు ఆమె మృదు స్వభావమును-సహజ కోమలత్వమును,

 పైగువలై అన్న విశేషనముతో వివరించారు.

 అమ్మ మనసు దయా సముద్రము. మరి అయ్యది?

 శెణ్-కమల -కెందామర/ఎర్రని పద్మము.


   స్వామి మనలను రక్షించుటకు అధర్మముపై/విషయవాసనలపై తన వీరమును చాటుచుడును.

 స్వామి మనసుయు దయా సముద్రమే.


 వీరి స్వభావ స్వరూపములు మనకు చెప్పకనే మన్మథ సంహార ఘట్టమును-తిరిగి పునర్జీవితుని చేయు కరుణను సూచిస్తున్నది.


  ఇది జలకములాడుచున్న పరమభాగ్యశాలురైన నలుగురి చెలుల మధ్య సాగిన వారి దర్శన-అనుభవముల సంభాషణము.


 మొదటి చెలి తక్కిన వారితో,చెలులారా!


 అంగం కురుగినిత్తార్-అని అంటున్నది

 కురుగినిత్తార్-పైనుండి కిందకు దిగి వచ్చిన,

 అంగం-అతి సుందరమైన-అద్భుతమైన,


 పుష్పహారమువలె నున్నవి ఈ పూవులు.మన స్వామి-తాయి మెడలో అలంకరించబడు అదృష్టమునకై తహతహలాడుచు చేరుచున్నట్లున్నవి అనగానే,


 రెండవ చెలి ఎంత సుందరమీ భావన.


 కాని చెలులారా-నాకు పుష్పములున్న మడుగులోని జలము మెలికలు తిరుగుతు ప్రవహిస్తుంటే,స్వామి మెడలో అవయములకు ఆభరంఉలుగా మారే అదృష్టము కోసము పరుగులు తీస్తున్నట్లున్నది కదా.

పిన్నుం అరవత్తాల్-


 అనగానే నిజమే చెలి.నీ భావనయును సమజసముగానే ఉన్నది.


 మీ ఇద్దరి భావనలకంటే భిన్నముగా నాకు ,

తంగళ్ మలకళవు వార్-ఎందరో మహానుభావులు,పరమ పూజ్యులు-యోగ్యులు,

వందు-వచ్చి-స్వామిని,

సార్దనినాల్-సేవించుకొనుచున్నట్లుగా తోస్తున్నది.


 అనగామ్నే మిగతా వారందరును ఆ భనలో తన్మయులైనారు.

 అంతలోనే వేరొక చెలి,చెలులారా! 


 ఇప్పటి వరకు మన నయనేంద్రియములు పునీతములైనవి.

 అబ్బ ! ఎంతటి మహత్ భాగ్యము మన చెలికి లభించినది.చెలి! ఏమా పరవశము-మాతో పంచుకొని మమ్ములను ఆనందింపచేయి అనగానే,ఆమె,చెలులారా!  


 కన్నులకు-వీనులకు అతి మనోహరమైన మహదానందము.


 అవిగో తెల్లగా/స్వచ్చముగా సుడులు తిరుగుతు శబ్దమును చేయుచున్న జలము,

 స్వామి నాదార్చనకు వరుసగా వచ్చి ఆనందించుచున్న శంఖములా అన్నట్లున్నవి.


 శంగం శిలంబ -శిలంబు కలందార్ప,

 ఆ దర్శనము -దృశ్యము అంతా వారి దయ ఆవిష్కారమే కదా అనుకొనుచున్న సమయములో-స్వామి అనుగ్రహమేమో మరి అది-వారందరు కలిసి,

ఇంతవరకు మనమూహించుకొనినవన్నీ మనకు ఇప్పుడు,

 సాక్షాత్తు,

మీనాక్షి-సుందరేశునులే ఇవన్నియు ,

 సర్వం శివమయం జగము అన్న భావనను కలిగిస్తున్నాయి.

 పదండి కొంగైకళ్ పొంగ-వారి(అమ్మా-నాన్నల) ఆలింగనాగ్రహమును పొందగ మడుగులో జలకములాడుదాము.


 తిరు అన్నామలయై అరుళ ఇది.

 అంబే శివే తిరు వడిగళే పోట్రి.

 నండ్రి.వణక్కం.



 


 


 






























TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...