Monday, February 28, 2022

GIRISAMCHA-ABHICHAKASI

గిరిశంచ-అభిచాకశీ **************** శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది. గిరిశంచ అను పదమునకు పెద్దలు, కొండయందు-మన గుండెయను కొండయందున్నవాడు, వేదములయందుండి జగములకు మోదమొనరించువానిగను, ఇచ్చిన మాటయందుండి-అభయమిచ్చి-ఆర్తరక్షణమును చేయువానిగను భావిస్తారు. సర్వ్యాపకత్వముతో తానున్నానని (నమకములో) చెప్పుటయేకాక, తాను ఎట్లా ఉన్నానంటే, తన ప్రకాశకత్వముతో సర్వ సమర్థవంతముగా చేస్తున్నాడు కనుకనే ఆ పరమాత్మ, గిరిశంచ-అభిచాకసీ. *************** నమకములో దర్శనీయమైనది చమకములో దర్శకత్వమై మనలను ఉధ్ధరిస్తున్నది.నమకములో దర్శించిన ఒక వెదురు చమకములో ఒక నిచ్చెనగా మారి మనలను ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చుచున్నది. చమక పారాయనము , 'అజ్ఞా-విష్ణుసజోష" అంటు అగ్ని-విష్ణు నామములుగల రెండు చైతన్యంతమైన శక్తులను ప్రార్థించుటతో ప్రారంభమవుతుంది.ఇవి ఆ సక్తుల కేవ వ్యవహారిక నామములా/ కావుకదా! అయితే సాధకుడు ఆ మహాద్భుతశక్తులను సూక్ష్మముగా తన శరీరములోనికి-స్థూలముగా విశ్వశరీరములోనికి ఎందుకు ఆరాధిస్తూ ఆహ్వానిస్తున్నాడు అన్న సందేహము మనకు కలుగవచ్చును. ఏమా అగ్ని? ఎవరా విష్ణువు? అన్న సందేహమునకు పెద్దలు ఏమి చెబుతున్నారంటే, మనలో నిద్రాణమై యున్న కుండలిని శక్తిని జాగృతపరచుట మొదటిపని. జాగృతమైన కుండలిని శక్తి ముడులు విప్పుకుంటూ సహస్రారమును చేరి,అమృతకలశము నుండి సుధాసారమును వర్షింపచేయుట రెండవ పని. కుండలిని జాగృతపరచు శక్తిని అగ్నిగా,దానిని వ్యాపింపచేయుశక్తిని విష్ణువుగా సార్థక నామధేయములతో ఆ పరమాత్మ సమర్థవంతములు చేయుచున్నాడు. వాజశ్చమే- ......... స్వామి నాకు పోషకత్వముకల ఆహారము/అన్నము కావాలి.దానిని భుజించుటకు తగిన ఆసక్తి/అర్హతయైన ఆకలిని నేను కలిగియుండాలి.దానిని జీర్ణముచేసుకునే( శక్తిని) నా శరీరము యజ్ఞనిర్వహణము కలదిగా యుండాలి.నా ఇంద్రియ యజ్ఞము నిరంతర నియమబధ్ధమై "యజ్ఞేన కల్పంతాం" గా ఉండాలి.అందులకు, శంచమే-మయశ్చమే. ******************** ఇహలోక సౌఖ్యమును-పరలోక సౌభాగ్యమును అందింపచేయగల, యంతాశ్చమే-ఆచార్యుడు కావలెను. అంతే కాదు అభ్యాస సమయమున నా మనసు, జ్యేష్ఠంచమ-ఆధిపత్యంచమే, ప్రతికూలతలను ఎదుకొనగలిగే స్థితప్రగ్నతతో నుండాలి. నా యజ్ఞ నిర్వహణ సమయమునందు నీవు,కార్య-కారణ సంబంధములకు సోదాహరణములుగా, అగ్నిశ్చమ ఇంద్రశ్చమే-సోమశ్చమ ఇంద్రశ్చమే, అంటు, మహేశ్వరత్వమును-మహేంద్రత్వముగా మలుస్తూ,కార్య-కారణ సంబంధమును విశ్లేషిస్తూ,జంటగా వచ్చి నా యాగ హవిస్సులను స్వీకరించు.వర్షములను కురిపించు. అశ్వమేథశ్చమే .............. యజ్ఞఫలితముగా అశ్వ శరీరముునుండి తలను వేరుచేసినట్లుగా,విషయవాస నలను శరీరమును-మేథస్సు అను తలనుండి వేరుచేసి(నరికివేయమనికాదు-తొలగించి) శివశక్త్యాత్మక భగవతత్త్వమును దర్శింపచేయుటయే మానవత్వముతో ప్రారంభించిన దీక్షను మాననీయ అవబృథస్నానముతో ముగించిన సాధకుని లక్ష్యము సకల మంగళములనొనరించుగాక.సన్మార్గమును చూపించునుగాక. సర్వే జనా సుఖినో భవంతు.స్వస్తి. ఏక బిల్వం శివార్పణం.

SAHASRAARAMU

AJNAA CHAKRAMU

VISUDHDHI

ANAHATAMU

Sunday, February 27, 2022

MANIPURAKA CHAKRAMU.

మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుతా- మూడవ చక్రమైన మణిపురము నాభీస్థానములో నుండును.జలతత్త్వముతో కూడినది.మణిపుర చక్రము కిందనున్న లోకములు చీకట్లతో/అజ్ఞానముతో నిండియుండుటచే ఇక్కడ శివశక్తులు మెరుపు-మేఘముల వలె నుందురు.గ్రహములో గురువునకు ప్రాధాన్యత.ఇక్కడి పద్మము పది ప్రాణములను పది రేకులను కలిగియుండును.జీర్ణవ్యవస్థను పరిరక్షించుచుండును.

SVAADHIStHAANA CHAKRAMU.

స్వాధిష్ఠాన చక్రము-02 **************** స్వతంత్రముగా తన స్థానములో కూర్చొనగల స్వభావము కలది ఈ చక్రము.ఇక్కడనున ధాతువు మేథ.శుక్రుడు గ్రహాధిపతి.మొసలి దీని స్వభావమును పోలిన జంతువు.(అభిమానములేని స్వభావము)తన పిల్లలను తానే తిని తన ఆకలిని తీర్చుకొను నైజము.తనకు ప్రతికూల పరిస్థిలలో వాటిని ఎదుర్కొనక తప్పించుకొని పోవు విధానమును అవలంభించును.కన్ను ప్రధాన ఇంద్రియము.బాహ్య విషయములను అనుభవించుటనందు ఆసక్తిని కలిగి యుండును. స్వాధిష్ఠ అనగా ఆనందానుభూతులలో ఓలలాడు స్వభావముకలది.మూలాధారములోని నల్లని గంభీరమైన ఏనుగు స్థాణువులైన ధాతువులకు ప్రతీకగా ఉంటూ,ఇంకొంచము ముందుకు సాగుతు చైతన్యముతో కూడిన జలతత్త్వమును ప్రవేశిస్తుంది భౌతిక అవసరములను తీర్చుకొనుటలో మనసు కూడా జోక్యము చేసుకుని తలపులను విస్తరింపచేస్తుంది.

Wednesday, February 23, 2022

MOOLAADHAARA CHAKRAMU

మూలాధారచక్రము ************* మూలాధారచక్రము ఎరుపు రంగులో ఉంటుంది.నాలుగురేకుల పద్మము ఉంటుంది.ఎముకులకు ఘనపదార్థములను పరిరక్షిస్తుంటుంది.ఇంద్రియ వ్యాపారములకు సంబంధించినదై ఇంద్రునివాహనమైన ఏనుగు(నల్లని) సంకేతముగా ఉంటుంది.శని గ్రహము అధిపతిగా ఉంటుంది.బాలబ్రహ్మ పురుషశక్తిగాను-సాకెనీ శ్త్రీశక్తిగాను నెలకొని ఉంటారు.లం బీజము సంకేతముగా ఉంటుంది.ముక్కు ప్రధాన ఇంద్రియము. ఇక్కడ కుండలినీ శక్తి శివలింగముగా కనిపించు శక్తిని మూడున్నరచుట్ట్లు చుట్టుకుని ఊర్థ్వ పయనమునకు సిధ్ధమవుతుంది. మూలాధార చక్రములు ప్రాపంచిక సంబంధమైన ఆకలిదప్పులునిద్రా మొదలగు భౌతికావసరలముపై కేంద్రీకరించి ఉంటుంది.మనసుకు ప్రాధాన్యత కనిపించదు.

Tuesday, February 15, 2022

SRUSHTI

నాలుగు శరీరములు-త్రిగుణములు *************************** బ్రహ్మ కల్పాంతమున పునఃసృష్టిని జరుపునపుడు ,తన మనసు నుండి దేవతలు-అసురులు-పితరులు-మనుషులు అను నాలుగు విధములైన్ ఒక్కొక్క గుణమును ప్రధానముగా గల శరీరధారులుగా సృష్టింపదలచెనట. జలమునందు తన అంశమును నిక్షిప్తము చేసిన తదుపరి, తమోగుణము ఉద్రిక్తమగుటచే,బ్రహ్మ జఘనములనుండి అసురగణములు జనించినవి.అవి తమోగుణాత్మికమగు శరీరమును పొందినవి.వెంటనే బ్రహ్మదేవుడు ఆ శరీరమును విడిచివేసెను.అదియే రాత్రి. అనంతరము వేరొక ప్రసన్న శరీరమును ధరించి,సత్వగుణ ఉద్రేకముచే ముఖమునుండి దేవతలను సృష్టించెను.వారికి సాత్విక శరీరము లభించినది.బ్రహ్మ ఆ శరీరమును విడిచివేసెను.అదియే పగలు. బ్రహ్మ సత్వమయమైన రెండవ శరీరమును ధరించి పితరులను సృష్టించెను.తరువాత ఆ శరీరమును కూడావిడిచివేసెను.అదియే సంధ్యా సమయము. బ్రహ్మ రజోగుణాత్మికమగు వేరొక శరీరమును గ్రహించి మానవులను సృష్టించెను. దానిని విడిచివేసెను అదియే జ్యోత్స్న.(రాత్రి చివరి+పగలు మొదటి భాగముల కలయిక. మానవ శరీరము రజోగుణాత్మికము అయినప్పటికిని సత్వ-తమో గుణములు ప్రవేశించుచునుండును. నాలుగు విధములుగా సృష్టింపబడిన జీవులలో మూడుగుణములు ప్రభావితములై ఉండును. మార్కండేయ పురాణానుసారముగా గ్రహింపబడినది.

AHAM BHOKTAA-NAMASKAROEMI.-01

అహం భోక్తా -నమస్కరోమి ********************* పరమాత్మ పరముగా వేదమంత్రములు,మండలపరముగాకిరణములు ,శరీరపరముగా నాడులు మహోన్నతములు. ఇప్పుడు కిరణములు అనుపదమును సూర్యకిరణములుగా కనుక అన్వయించుకుంటే , కిరతి-వెదజల్లు స్వభావముకలవి ,కిరతి కనుక కిరణములు. కిరణముల నామ-రూప-స్వభావములను తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. వస్తు-జ్ఞాన లక్షణమును కలిగించేవి కనుక కేతవః అంటారు. లోపల-బయట వ్యాపించే లక్షణములు కలవికనుక అంశువులు అంటారు. వికసన స్వభావమును కలిగిఉండుటచే కిరణములు పద్మిని పేరుతో కీర్తింపబడుతున్నాయి. జలమును తాగు కిరణములను కపి అంటారు. తైలసంపదను అనుగ్రహించే కిరణములను మిత్ర అంటారు. వ్యాపించే లక్షణములు కల కిరణములను అశ్వ అంటారు. దూకుడు స్వభావము కల కిరణములను ప్లవంగము అంటారు. భూమినంతటిని ఆకుపచ్చగా మలచు కిరణములను హరిదశ్వము అంటారు. వేగముగా పయనించే శక్తి కలవి కనుక రెక్కలు/గరుత్తులు అని కూడా పిలుస్తారు. తమ చైతన్యమును వర్షిస్తూ,సర్వమును చైతన్యమును/సంపత్ప్రదము గావించునవి కనుక వృషభములు అని పిలుస్తారు.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...