Tuesday, February 15, 2022
SRUSHTI
నాలుగు శరీరములు-త్రిగుణములు
***************************
బ్రహ్మ కల్పాంతమున పునఃసృష్టిని జరుపునపుడు ,తన మనసు నుండి దేవతలు-అసురులు-పితరులు-మనుషులు అను నాలుగు విధములైన్ ఒక్కొక్క గుణమును ప్రధానముగా గల శరీరధారులుగా సృష్టింపదలచెనట.
జలమునందు తన అంశమును నిక్షిప్తము చేసిన తదుపరి,
తమోగుణము ఉద్రిక్తమగుటచే,బ్రహ్మ జఘనములనుండి అసురగణములు జనించినవి.అవి తమోగుణాత్మికమగు శరీరమును పొందినవి.వెంటనే బ్రహ్మదేవుడు ఆ శరీరమును విడిచివేసెను.అదియే రాత్రి.
అనంతరము వేరొక ప్రసన్న శరీరమును ధరించి,సత్వగుణ ఉద్రేకముచే ముఖమునుండి దేవతలను సృష్టించెను.వారికి సాత్విక శరీరము లభించినది.బ్రహ్మ ఆ శరీరమును విడిచివేసెను.అదియే పగలు.
బ్రహ్మ సత్వమయమైన రెండవ శరీరమును ధరించి పితరులను సృష్టించెను.తరువాత ఆ శరీరమును కూడావిడిచివేసెను.అదియే సంధ్యా సమయము.
బ్రహ్మ రజోగుణాత్మికమగు వేరొక శరీరమును గ్రహించి మానవులను సృష్టించెను. దానిని విడిచివేసెను అదియే జ్యోత్స్న.(రాత్రి చివరి+పగలు మొదటి భాగముల కలయిక.
మానవ శరీరము రజోగుణాత్మికము అయినప్పటికిని సత్వ-తమో గుణములు ప్రవేశించుచునుండును.
నాలుగు విధములుగా సృష్టింపబడిన జీవులలో మూడుగుణములు ప్రభావితములై ఉండును.
మార్కండేయ పురాణానుసారముగా గ్రహింపబడినది.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment