Posts

Showing posts from March, 2022

TELUGU PALUKU

చేతల చేతులు. ************* లక్ష్మీపురములోని రాముడు అను యువకునిది ఎముకలేనిచేయి.(గొప్ప దాత.)ప్రజలు అతని దానధర్మములగురించి,మంచితనమును చేయెత్తిచాటిరి.(నమస్కారములతో గౌరవించిరి.నలుదిశలా వ్యాపింపచేసిరి.) ఒకనాడు అతనితో రాజు అను పట్నపు యువకుడు చేయి కలిపెను.(స్నేహితుడయ్యెను)రాజు చెల్లెలు లత.లత మంచితనమునకు ముగ్ధుడైన రాముడు లత చేతిని స్వీకరించెను.(వివాహముచేసుకొనెను) కష్టసుఖములలో కలిసి ఉండెదమని చేతిలో చేయివేసుకొనిరి.(ప్రమాణములు చేసుకొనిరి.)వారి జీవితములోనికి భూపాల్ అను వ్యక్తితో పరిచయము పెరిగినది.భూపాల్ వారికి తన చాకచక్యముతో అరచేతిలో వైకుంఠమును (నమ్మపలికెను-మోసపు ప్రవర్తన) చూపించెను.కల్లాకపటము గుర్తించలేని రాముడు అనాలోచితముగా నిర్దోషులపై సైతము ఆగ్రహముతో చేయిచేసుకొనసాగెను.(కొట్టసాగెను)విషయము అర్థమవుతున్నను లత పరిస్థితి చేతకానిదిగా (నిస్సహాయముగా)నుండెను.రాముని తన స్వార్థప్రయోజనములకు పావుగా వాడుకొనిన భూపాల్ రామునకు చేయిచ్చెను.(మోసగించెను) తన తప్పును తెలిసికొనినరాముడు గ్రామస్థులకు చేయూతగా (సహాయముగా) ఉండాలని నిర్ణయించుకొనెను.అందరు సంతోషముతో నోరు తీపిచేసుకొనుటకు చేతిలో మిఠాయిని పట్టుకొని ఉన్న సమయ...

KAALAMAA! KAIMODPULU.

ఆర్యులు "ఉ" అను అక్షరమును నక్షత్ర సంకేతముగాను," గ" అను అక్షరమును గమన సంకేతముగాను నిర్వచించి,ఉగాది అను సంవత్సరారంభమును బ్రహ్మకల్ప ప్రారంభముగాను గుర్తించారు.యుగ అనే పదమును ద్వయముగా అన్వయించుకుంటే ఈ నక్షత్ర గమనము ఉత్తరదిక్కు-దక్షిణ దిక్కు అను రెండిటి వైపు ఉన్నది కనుక యుగాది గాను భావిస్తారు.తెలుగు సంవత్సరాల నామములు వాటి స్వరూప-స్వభావాలను స్పష్టీకరిస్తుంటాయనుట నిర్వివాదము.ఉదాహరణకు సృష్టి ప్రకటితమైన కాల నామమును ప్రభవ అని ముగియు నామమును క్షయ అని తిరిగి ప్రభవిస్తుంది కనుక అక్షయ అని పేర్కొన్నారు. క్షమాపణ అభ్యర్థిస్తూ సంవత్సరాది ప్రత్యేకతను తల్లిగా-తండ్రిగా-గురువుగా గుర్తించి,గణుతించే ప్రయత్నము చేస్తున్నాను. బ్రహ్మ కూడ తన నియమిత కాలము ముగియగానే అంతరించి,తిరిగి ప్రభవిస్తాడు సృష్టి రచనకు అని అంటారు.వసంతం ప్రారంభమైన చైత్రశుధ్ధ పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా బ్రహ్మ రస జగత్తును సృష్టిచేస్తాడని ఐతిహాస వచనము.శుభకృత్ నామ సంవత్సర చైత్రశుక్ల పాడ్యమి బుధ వారము ఉషకాలమను తల్లి కొత్తసంవత్సరమునకు జన్మ నిచ్చి పురుడు పోసుకున్నది.ఔషధ స్వభావముతో,తన సంతతిని సమర్థవంతముగా సంతోష వంతుల...

KONDA ADDAMAMDU-INTRO

కొండ అద్దమందు **************** "జంతూనాం నరజన్మ దుర్లభం" అన్నది ఆర్యోక్తి. ఒక శిశువు క్రమక్రమముగా పంచభూత ప్రపంచము నుండి తన పోషణకు కావలిసిన ఇంధనములను తన పంచేంద్రియ శక్తిద్వారా గ్రహిస్తూ,తన శారీరక-మానసిక స్వరూప-స్వభావములను పెంపొందించుకుంటున్నది.ప్రకృతిలోని ప్రతిమార్పును అతిసహజముగానే అనుకుంటున్న నాలో ఈ మార్పులకు కారణమేమిటి అన్న సందేహము నన్ను సతమతముచేస్తున్నది. అంటే నాలో జరుగుతున్న మార్పులకు కారణము నేను చూస్తున్న వస్తు/దృశ్య ప్రపంచమా లేక దానికి నాలో నిక్షిప్తముగా దాగిన సూక్ష్మచైతన్యమా? ప్రాపంచికం-పారమార్థికముగా నన్ను భ్రమింపచేయుచిన్న భిన్నతత్త్వములా లేక అజ్ఞానము భిన్నత్వముగా తలపింపచేయుచున్న ఏకత్వమా? మనలో సూక్ష్మముగా దాగిన చైతన్యమే మన కన్నులకు స్థూలముగా ప్రబింస్తున్నదా.అవి నిజమునకు అవిభక్తములా అన్న ఆలోచనలకు సమాధనమును తెలిసికొనుటకు చేయు సాహసమే "కొండ అద్దమందు" అన్న శీర్షిక.

UPANAYANAMU

శ్రీరస్తు శుభమస్తు "గాతారం త్రాయతే ఇతి గాయత్రి" ********************** తొ బె బ్లెస్సెద్ "'తత్సవితృవరేణ్యం-భర్గో దేవస్య ధీమహి" ఈం వొర్షిప్పింగ్ థె ఎన్లిఘ్తెన్మెంత్. డతె......సుముహుర్తమున వేదస్వరూప గాయత్రీమాత అనుగ్రహముగా నమె ఒఫ్ థె బొయ్.చి........ఉపనయన సంస్కారముతో, స్తర్తింగ్ థె జౌర్నెయ్ ఒఫ్ విద్యార్జన విథ్ థె గురు, బాలుడు మారుచున్నాడు బ్రహ్మచారిగ నేడు గురువగుచున్నాడు తండ్రి బ్రహ్మోపదేశము చేసి గురుతరమైనది తల్లి ఆదిభిక్ష తానువేసి మహనీయులు చేయుచున్నమంగళాశాసనములతో త్రివిక్రముడై భిక్షకు ఉపక్రమిస్తున్నాడు ఎడమచేత కర్రతో-కుడిచేతను జోలితో భవతి భిక్షాందేహి అని అర్థిస్తున్నాడు చూడు వందేళ్ళు వర్ధిల్లమని శ్రీరామరక్షగా అందరు అందిస్తున్నారు దీవెనలను భిక్షగా చిన్నారి యజ్ఞోపవీతమును విజ్ఞతతో ధరిస్తూ సంధ్యావందనమును వినయతతో ఆచరిస్తూ మనోవాక్కాయ కర్మలను మంగళప్రద మొనరిస్తూ పటుతర వటువుగా నీ పయనము కొనసాగాలి ప్రతి అడుగు ప్రతిభగా నిన్ను దీవించాలి. మంగళం మహత్. కౌతా కుటుంబము.

HAPPY UGADI-2022

శుభం భూయాత్ ************** అరవై ఏళ్ళపిదప అరుదెంచుచున్నావా శుభస్వాగతమమ్మా ఓ శుభకృత్ వత్సరమా ఎందుకు అరవై ఏళ్ళయినది అంటారా ఎదురుచెప్పలేని నేను ఏమిచేయగలను? పన్నెండురాశులను చుట్టిరావడానికి ముప్పది సంవత్సరములు శని గ్రహము తీసుకుంది పన్నెండు సంవత్సరములు గురుగ్రహముతీసుకుంది. వాటిమధ్య క.సా.గు,అరవై సంవత్సరాలట. ఆ లెక్కల క్రమమే మా గమన ఉపక్రమమట. వారెంతటి మహనీయులో మనము గమనిద్దాము. అనుకూలమో/ప్రతికూలమో అవమానమో/సన్మానమో ఆదాయమో/వ్యయమో లెక్కచేయరట వారు తమ చక్కనైన పయనములో, అంతేకాదు సమయమెక్కువవుతుందని సగములో ఆపేయరట, సతమతమగు నడక యని సహనము కోల్పోవరట, వారి అడుగుజాడలలో మనము నడుద్దాము ఆరురుచుల పచ్చడిని అందలమెక్కిద్దాము శుభకృత్ సంవత్సరమును శుభప్రదం చేద్దాము.

O MAHILA-JEJELU

ఓ మహిళా-జేజేలు ********** మహిళా దినోత్సవము ********************** మగువ సహకారమేగ మగసిరికి ఆకారము మగువ సహనశీలమేగ మన జాతికి శ్రీకారము మగువ గుండె చప్పుడేగ గర్భస్థ శిశువుకి ధైర్యము అది వినబడుట లేదనేగ పుట్టగానే రోదనము మగువ ధన్య స్థన్యమేగ స్థితికారక ఆధారము మగువ ధైర్య స్థైర్యమేగ అభివృద్ధికి అధ్యయనము మగువ చూపు తెగింపేగ మహా యశో ప్రాకారము మగువ సేవా నిరతియేగ విశ్వమాత రూపము అతిశయమే కానరాని ఆ దేవుని ప్రతి రూపము భుజము దిగనీయదు కడవరకు బాధ్యతలను తాను నాలుగు భుజములపై సేదతీరు వరకు కనుక " మేమే గొప్ప" అని హుంకరించకండి మగవారు వానతో పాటుగ శబ్దించిన ఉరుములు అనుకుంటారు ఎందుకంటే ఉరుములు ఎంత ఉరిమినా పంటలు పండించలేవు మౌనముగా కురిసిన వాన చినుకులు తప్ప. నిన్నుపోల్చతగిన పదము ఎంత వెతికినా శూన్యము మహిళా..ఓ మహిళా జేజేలు అను పలుకులు మంగళ వాయిద్యాలైన శుభవేళ వందనమమ్మా,శుభాభినందనలమ్మా