Monday, March 7, 2022

HAPPY UGADI-2022

శుభం భూయాత్ ************** అరవై ఏళ్ళపిదప అరుదెంచుచున్నావా శుభస్వాగతమమ్మా ఓ శుభకృత్ వత్సరమా ఎందుకు అరవై ఏళ్ళయినది అంటారా ఎదురుచెప్పలేని నేను ఏమిచేయగలను? పన్నెండురాశులను చుట్టిరావడానికి ముప్పది సంవత్సరములు శని గ్రహము తీసుకుంది పన్నెండు సంవత్సరములు గురుగ్రహముతీసుకుంది. వాటిమధ్య క.సా.గు,అరవై సంవత్సరాలట. ఆ లెక్కల క్రమమే మా గమన ఉపక్రమమట. వారెంతటి మహనీయులో మనము గమనిద్దాము. అనుకూలమో/ప్రతికూలమో అవమానమో/సన్మానమో ఆదాయమో/వ్యయమో లెక్కచేయరట వారు తమ చక్కనైన పయనములో, అంతేకాదు సమయమెక్కువవుతుందని సగములో ఆపేయరట, సతమతమగు నడక యని సహనము కోల్పోవరట, వారి అడుగుజాడలలో మనము నడుద్దాము ఆరురుచుల పచ్చడిని అందలమెక్కిద్దాము శుభకృత్ సంవత్సరమును శుభప్రదం చేద్దాము.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...