Thursday, March 24, 2022
KONDA ADDAMAMDU-INTRO
కొండ అద్దమందు
****************
"జంతూనాం నరజన్మ దుర్లభం" అన్నది ఆర్యోక్తి.
ఒక శిశువు క్రమక్రమముగా పంచభూత ప్రపంచము నుండి తన పోషణకు కావలిసిన ఇంధనములను తన పంచేంద్రియ శక్తిద్వారా గ్రహిస్తూ,తన శారీరక-మానసిక స్వరూప-స్వభావములను పెంపొందించుకుంటున్నది.ప్రకృతిలోని ప్రతిమార్పును అతిసహజముగానే అనుకుంటున్న నాలో ఈ మార్పులకు కారణమేమిటి అన్న సందేహము నన్ను సతమతముచేస్తున్నది.
అంటే నాలో జరుగుతున్న మార్పులకు కారణము నేను చూస్తున్న వస్తు/దృశ్య ప్రపంచమా లేక దానికి నాలో నిక్షిప్తముగా దాగిన సూక్ష్మచైతన్యమా?
ప్రాపంచికం-పారమార్థికముగా నన్ను భ్రమింపచేయుచిన్న భిన్నతత్త్వములా లేక అజ్ఞానము భిన్నత్వముగా తలపింపచేయుచున్న ఏకత్వమా?
మనలో సూక్ష్మముగా దాగిన చైతన్యమే మన కన్నులకు స్థూలముగా ప్రబింస్తున్నదా.అవి నిజమునకు అవిభక్తములా అన్న ఆలోచనలకు సమాధనమును తెలిసికొనుటకు చేయు సాహసమే "కొండ అద్దమందు" అన్న శీర్షిక.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment