Monday, August 29, 2022

SARVARTHASADHAKACHAKRAMU-05

శ్రీచక్ర పంచమావరణదేవతాః
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,
 సర్వార్థసాధక చక్రము-05
 ********************
 "" కులం శక్తిః ఇతి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే"
 బహిర్దశార చక్ర పరివారదేవతలైన ఐదవ ఆవరనములో విలసిల్లుతూ,సధకునికి ఋజుమార్గ పయనమునకు సహాయపడు పదిశక్తులు కులయోగినులు.

  అగ్నికి విస్పులింగములవలె పరమేశ్వరికన్న భిన్నముకాని ,పరమేశ్వరిచే విస్తరింపబడీ శక్తులు.
   మరికొందరు వీరినే దశవాయువులుగాను,నారాయణుని దశావతారములుగాను కీర్తిస్తారు.

   పది త్రికోణమూగా పదిశక్తులు ప్రకటితమయే ఊహాచతురస్రము.
 అనంతశక్తులను దాటి,సర్వము తామై విలసిల్లే సర్వశక్తుల అనుగ్రహముతో సాధకుడు తన లక్ష్యమును సులభముచేసుకొనుచున్నాడు.
 వారే,
 1.సర్వసిద్ధిప్రదే
 2.సర్వ సంపత్ప్రదే
 3.సర్వ ప్రియంకరీ
 4.సర్వ మంగళకారిణీ
 5.సర్వకామ/కాయ ప్రదే
 6.సర్వ దుఖః విమోచనీ
 7.సర్వమృత్యుప్రశమనీ
 8.సర్వ విఘ్ననివారిణీ
 9.సర్వాంగసుందరి
 10.సర్వసౌభాగ్యదాయిని.
     ఇక్కడ మనమొక విషయమును గమనించాలి.సుందరమైన శాశ్వతమైన అమ్మ తత్త్వమును అర్థముచేసుకొనుటకు మనకు అడ్డుపడే విషయములను /విఘ్నములను దుఃఖములను కొన్ని శక్తులు తొలగిస్తుంటే,మరికొన్ని శక్తులు సాధ్యముచేయుటకు సహకరిస్తున్నాయి.
   మానవ నైజము ఎప్పుడో జరిగిపోయిన విషయమును పదేపదే తలచుకొని దుఃపడుతుంటుంది.నిజమునకు జరిగినప్పుడు కలిగే బాధ సమయముతో పాటు సమసిపోతుంది.అదేవిధముగా మానవ అజ్ఞానము దారిని మళ్ళిస్తూ ముందుకు సాగనీయకుండా అడ్డుపడుతుంటుంది.
   వాటిని దూరముచేసి,సాధనకు దగ్గర్చేయుటకు సహాయపడే సహృదయ శక్తులే కులయోగినులు.
   కులము అను పదము యొక్క విశిష్టతను శ్రీలలితారహస్య సహస్రనామములు చక్కగా వివరించాయి.
 అమ్మవారు అకుల.తనను తాను ఎన్నో శక్తులుగా విస్తరింపచేసుకొని,సాధకుని అనుగ్రహించుచున్నది.
   సజాతీయ సమూహము కులము.సుషుమ్నా నాడీమార్గము కులము.సంప్రదాయాచారము కులము.శివశక్తుల సామరస్యము కులము.కుండలినిశక్తి కులము.దానిని జాగృతపరచుశక్తులు కులయోగినులు.
   మానవదేహ పరముగా భావిస్తే విశుధ్ధి చక్రము/వశిత్వసిధ్ధికి సంకేతము ఈ ఆవరణము.
 జ్ఞానేంద్రియ-కర్మేంద్రియ సంకేతములైన ఈ పది యోగినులు సాధకునితో నిద్రాణముగా నున్న చైతన్యమును జాగృతపరచి కులోత్తీర్ణమార్గము వైపునకు నడిపిస్తాయి.చక్రేశ్వరికి నమస్కరిస్తూ భావమోహ వ్యాకులతనువీడి ఆరవ ఆవరన ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను. సర్వాసౌభాగ్యప్రద చక్రములోని సంప్రదాయయోగినుల
 వాత్సల్యమును పొందిన సాధకుడు చక్రేశ్వరియైన  త్రిపురవాసినిదేవికి నమస్కరించి, ఐదవ 
   ఆవరణమైన"సర్వార్థ సాధక చక్రము"లోనికి 
 కులోత్తీర్ణ యోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.

  శ్రీమాత్రే నమః. 

 

SARVASAUBHAAGYADAAYAKA CHAKRAMU-04

శ్రీచక్ర చతుర్థావరణదేవతాః
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,
 సర్వార్థసాధక చక్రము-04
 *****************************
  పదునాలుగు శక్తుల అంతర్ చతుర్దశారము.సమ్యక్ప్రాదాన స్థానము.అదే సంప్రదాయ యోగినుల అనుగ్రహభావనము.
  మనము నవావరన గమనమును మూడుభాగములుగా కనుక వర్గీకరించుకుంటే మనము మొదటి భాగమైన మూడు ఆవరనములను సందర్షించి యోగినిశక్తుల అనుగ్రహమునకు పాత్రులమైనట్లే.త్రైలోక్యమోహనచక్రములోని 28 యోగినులు,దర్వాశాపరిపూరకములోని 16 యోగినులు,సర్వసంక్షోభన చక్రములోని 8 యోగినులు రేకులుగా మార్గమధ్య బిందువులుగా మనకు సూచింపబడినారు
   ఈ విభాగము మనకు త్రికోణ సంకేతములతో,ఒక ఊహావృత్తము చుట్టు ఉన్న 14 త్రికోనములను పరిచయము చేస్తున్నది.ఇకమీదట మనకు త్రికోణములే శక్తులకు ప్రతీకగా వివరింపబడతాయి.సూక్ష్మత్వమునకు ప్రతీకలుగా నాలుగు త్రికోణములు ఊర్థ్వముఖముగాను,స్థూలత్వమునకు సంకేతముగా ఐదు త్రికోణములు అథోముఖముగాను శ్రీచక్రములో సూచింపబడినాయి.ఊర్థ్వముఖకోనలను శివ కోణములగాను,అథోముఖకోణములను శక్తి కోణములగాను కూడా భావించే సంప్రదాయము మనది.

 ఈ ఆవరనములోని పదునాలుగు శక్తులను పదునాలుగు లోకములతోను,పదునాలుగు మానవశరీర ముఖ్య నాడులతోను పోలుస్తూ అంతరార్థమును చెబుతుంటారు.
నాడీమండలముతో పోలిక ఉన్నప్పుడు మన్వస్రము అంటారు.బ్రహ్మనాడి యైన సుష్మ్న పనితీరును వివరిస్తూ,దానికి కుడి ఎడమనున్న ఇడ-పింగళ ప్రాధాన్యమును,మిగిలిన నాడీవ్య్వస్థను ,సాధకునికి అవగతము చేస్తారు.

    రెండవపోలిక ఐన పదునాలుగులోకములలో ఏడు ఊర్థ్వలోకములు-ఏడు అథోలోకములు అని చెబుతూ,భౌతికముద్వరా ఆధ్యాత్మికమునకు వంతెనకట్టే ప్రదేశము.ఇందులోగల సర్వ ద్వంద్వ క్షయంకరీ శక్తి అనుగ్రహమే సౌభాగ్యప్రదము.ద్వంద్వములను వీడుట అంత సులభముకాదు.ద్ర్శ్యాదృశ్యములను సమీకరించుకోగల సామర్థను కలిగియుండవలెను.
 మూడవ ఆవరణములోని అనంగ శక్తుల అనంతత్త్వమును గ్రహించిన సాధకుడు నాల్గవ ఆవరణములో వాని ఉనికిని సంక్షోభనము-విద్రావణము-సమ్మోహనము-స్తంభనము-జృంభణము మొదలైన స్థితులనధిగమించి ఏకత్వమును నకు వశుడై,రంజనుడై,మునిగిపోయి,ఆనందసంపదకు స్వాధీనుడై,ప్రణవములో మునిగి ద్వంద్వాతీతుడగుచున్నాడు.సత్తువైపునకు దృష్టిని మరల్చిన త్రిపురవాసిని నమస్కరించి,ఆరవ ఆవరణమువైపునకు తన అడుగులను వేయుచున్నాడు.

 

Sunday, August 28, 2022

SARVASAMKSHOBHANA CHAKRAMU-03

శ్రీచక్ర తృతీయావరణదేవతాః
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,

 త్రైలోక్యమోహన చక్రములోని ప్రకటయోగినులలోని మాతృకాశక్తులు సిద్ధశక్తులను ముద్రాశక్తులను అనుసంధిస్తూ,సాధకుని గమనమును సర్వాశాపరిపూరకచక్రము అదే రెండవ ఆవరనము దగ్గరకు చేర్చుటకు కారణమైనాయి.రెండవఆవరనములో నున్న పదహారు రేకుల రూపసంకేతముగా నున్న గుప్తయోగినులు సాధకునకు పంచభూతములను,పంచేంద్రియములను,జ్ఞాన-కర్మ లతో పాటుగా మనసు యొక్క పరిమానమును వివరిస్తూ,చైతన్యపరుస్తూ సద్గతికి అనుకూలమైన మూడవ ఆవరణమునకు అదే సర్వ సంక్షోభచక్రమునకు చేరుటకు సహాయపదతాయి.
 సర్వాశాపూరక చక్రమువలె ఈ ఆవరణము సైతము వృత్తాకారముగా ఊహించుకొనుచున్నప్పటికి,రేకుల విషయము ఎనిమిదిగా ఎనిమిది శక్తులు అనంతత్త్వమును పరిచయము చేస్తున్నాయి.
 వీటినే గుప్త తర యోగినులు అని కూడా కీర్తిస్తారు.
   అసలు యోగము అంటే ఏమిటే అర్థమయితే దానిని అనుగ్రహించే శక్తియే యోగినిగా గుర్తించవచ్చును.
   జీవునియొక్క పరమాత్మ సంయోగ విషయమే కదా యోగము.ఏకత్వమునకు చేరువా కావాలంటే అనేకత్వమునకు దూరముకాక తప్పదు.కాని అనేక సహాయముతో ఏకమును దర్శించి,బిందువు విస్తరణము-సంక్ష్ప్తీకరనము అదే సూక్ష్మ తత్త్వము స్థూలముగాను,స్థూలము సూక్ష్మము గాను మారు లీలావిలాసమును అర్థము చేసుకొనవచ్చును

 సంక్షోభము అనగా కదలిక చైతన్యము అను అర్థమును మనము అన్వయించుకుంటే,అనంతత్త్వ ప్రతీకగా తల్లితత్త్వమును 8 శక్తులు వివరిస్తూ,సాధకునికి సన్మార్గమును చూపిస్తుంటాయి.
 అంగ అనగా పరిమితము.పూర్ణములో కొంతభాగము.అనంగ అపరిమితము.సంపూర్ణము.దేశకాల పరిస్థితులకు అతీతము.అమ్మ స్వరూప-స్వభావము.సాధకుడు కుసుమే,మేఖలే,మదనే-మదనాతురే-అనంగరేఖే,అనంగవేగినే-అనంగాంకుశే,అనంగమాలినే అను గుప్తతర యోగినులచే మార్గనిర్దేశకుడవుతాడు.
   ఒకవిధముగా వీటిని చిత్తవృత్తులనుకొనవచ్చును.అవి అనంతములు.వాటిని నియంత్రించి,సమాధానపరచి,సద్గతినొందుటకు సహకరించేవి ఈ ఎనిమిది శక్తులు.
  సాధకునిలో ఒక వినూత్న ఆలోచనలను కుసుమింపచేసి,వానినిపరిధి మేరకు వ్యాపింపచేయు రెండు శక్తులు అనంగ కుసుమే,అనంగ మేఖలగా అనికుంటే,ఆ కొత్తగా విస్తరించిన ఆత్మతత్త్వములో మునిగి రసానుభూతిని ఆస్వాదించుచు,మరింత మునిగితేలుతున్న సాధకుని గమనోన్ముఖునిగా మలుస్తూ,అనంగరేఖే శక్తే ఒక హద్దును ఏర్పరచి,ప్రవాహచైతన్యమైన అనంగవేగినికి అప్పగించగానే ఆ ప్రవాహమునునకు ఒక నిబద్ధతను కలిగిస్తూ అనంగాంకుశిని సన్మార్గమునందు సాగిపోవుటకు సహాయముచేస్తుంటే అమ్మ అనుగ్రహమును అత్యంత సమీపముచేస్తుంది అనంగ మాలిని.అంతా అమ్మ కనుసన్నలలో అమ్మ సామీప్యమునకు తనను తాను సిధ్ధము చేసుకుంటున్నాడు సాధకుడు. సర్వాసంక్షోభణ చక్రములోని గుప్తతరయోగినుల
 వాత్సల్యమును పొందిన సాధకుడు చక్రేశ్వరియైన త్రిపురసుందరి దేవికి నమస్కరించి,నాల్గవ ఆవరణమైన"సర్వ సౌభాగ్యప్రద చక్రము"లోనికి 
 సంప్రదాయయోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.

  శ్రీమాత్రే నమః. 
  
   

 

SARVASAPARIPURAKACHAKRAMU-02

శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః
కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,
 సర్వాశాపరిపూరకము
 ****************
 'మనోబుద్ధయహంకారచిత్తాను" అంటూ ఆదిశంకరులు చిత్తవృత్తులను చిదానందముగా విపులీకరించారు.
 
 " కంజాక్షునకు గాని కాయంబు కాయమే" అంటూ ప్రహ్లాదుని ద్వారా అదే సత్యమును నొక్కివక్కాణించారు.
   షోడశదళపద్మముగా తన శక్తులను 16 విభాగములు చేసి,తనకుతాను పలుమారులు ఆవృత్తమగుచు జీవులను తమకుతాము స్వయంసమృద్ధులుగా భావింపచేస్తోంది అడ్డుగా నిలిచిన మాయ.
 ప్రతి మనిషి తన పంచేంద్రియములద్వారా,పంచభూతముల సహాయముతో,పంచతన్మాత్ర పరంపరతో ప్రకటింపబడుట వెనుక దాగిన పరమరహస్యమే,అజ్ఞాతముగా దాగి,ఆసరగా నిలబడుచున్న పదహారుశక్తుల ప్రస్తావనము.
  ఈ శక్తులను గుప్తయోగినులు/ఆకర్షణశక్తులగాను  భావిస్తారు.
 చిత్తమనే భరిణెలో మనస్సు-బుద్ధి-అహంకారము మొదలగు చిత్తవృత్తులు కొంతసమయముంది మరలినను,వాటివాసనలు జ్ఞాపకములుగా ముద్రింపబడిఉంటాయి.
 కామాకర్షిణి,బుద్ధ్యాకర్షిణి,ఆత్మాకర్షిణి,అహంకారాకర్షిణి,స్మృత్యాకర్షిణి ,శరీరాకర్షిణి మొదలైన సహాయక శక్తులు సాధకుని విచక్షణను స్పష్టీకరిస్తుంటాయి.
 సర్వాశాపరిపూరక చక్రములోని గుప్తయోగినుల
 వాత్సల్యమును పొందిన సాధకుడు చక్రేశ్వరియైన త్రిపురేశి దేవికి నమస్కరించి,మూడవ ఆవరణమైన"సర్వ సంక్షోభణ చక్రము"లోనికి గుప్తతరయోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.

  శ్రీమాత్రే నమః. 

 

Saturday, August 27, 2022

TRAILOEKYAMOHANA CHAKRAMU-PRATHAMA AVARANAMU

 శ్రీచక్ర ప్రథమావరణదేవతాః

అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,


 త్రైలోక్యమోహన చక్రము

 ******************


 అతిసుందరమైన అమ్మ శ్రీమన్నగరానికి ప్రయాణం మొదలైనది అమ్మ ఆశీర్వచనముగా.నిక్షిప్తముగా నున్న అమ్మదయను ప్రక్షిప్తము చేఉకొనే స్తుతిమాలగా.అదే భవతిమిరములను తుంచివేసే ఖడ్గమాలగా.

 బైందవాసన అయిన అమ్మను చేరాలంటే అన్ని మెలికలు తిరుగుతూ ఒకచోట ఒంగుతూ,మరొకచోట ముడుచుకుంటూ,వేరొక చోట ఆకర్షింపబడుతూ,ఇవి నిజమైనవికావని మనకు మనము గ్రహిస్తూ చేరొకోవాలంటే కొన్ని నియమములు,నిర్ణయములు తప్పనిసరియే.

 ఇన్నిదారులు ఇంతకట్టడి  అనే సందేహము మనకు రావచ్చును.నది ఒకనిర్ణీత క్రమములో ప్రవహిస్తుంటే భూమి సస్యశ్యామలము.కట్టలు తెగి నిబద్ధతలేకుండా పరవళ్ళుతొక్కితే వరదలుభూమికి సంక్షోభము.అదేవిధముగా మనలో అంతర్లీనముగా నున్న శక్తి ఒక నిర్ణీత మార్గములో,పరిమిత పాళ్ళలో పయనిస్తే ఆత్మసాక్షాత్కారము.అదిలోపిస్తే అయోమయము.

 


 సాధకుని ప్రయాణమునకు ప్రారంభస్థానమే త్రైలోక్యమోహనచక్రము.ఇక్కడ 28 మంది అద్భుత శక్తులు ప్రకటయోగినులుగా ప్రస్తుతింపబడుతున్నారు.ఈ ఆవరము మూడు ఊహా చతురస్ర మార్గములతో వివరించబడుతున్నది.

  మొదటనున్న మార్గములో అణిమాది సిద్ధిదేవతలు సాధకుడు పాటించవలసిన నిబంధనలను తెలియచేస్తూ ఎక్కడ సూక్ష్మముగా తగ్గి ఉండాలో,ఎక్కడ తనను తాను విస్తరించుకోవాలో,మార్గములోని ఎత్తుపల్లములను చూసుకుంటూ,తలదించుకుంటూ,అవసరమైనపుడు ఎగిరి ఒడిసిపట్టుకుంటూ ముందుకు పోవాలో తెలియచేస్తూ,రెండవ మార్గము వైపునకు మళ్ళిస్తారు.

 రెండవమార్గములో నున్న బ్రాహ్మీ,మాహేశి,కౌమారి మొదలగు అదే సప్త మాతృకాశక్తులు,వాటిని సమన్వయ పరుస్తున్న మహాలక్ష్మి శక్తితో పాటుగా కొలువై సాధకునకు మానసిక పటిష్టను చేకూర్స్తూ,మూడవ మార్గము వైపునకు మళ్ళిస్తారు.ఈ రెండుమార్గములలో పయనించిన సాధకుడు తన శారీరక-మానసిక బలముతో మూడవ మార్గములోనికి ప్రవేశించగలుగుతాడు.

 మూడవ మార్గములో నున్నవి అత్యద్భుతమైన ముద్రాశక్తులు.అవే సర్వ నామాంకిత సర్వ సంక్షోభిణి,విద్రాఇణి,ఆకర్షిణి,ఆహ్లాదిని మొదలగునవి.

  మాతృకాశక్తులు సిద్ధశక్తులను-ముద్రాశక్తులను అనుసంధానము చేస్తూ ,సాధకుని కార్యోన్ముఖునిగా తీర్చిదిద్దుతున్నవి.

 ఈ మూడు మార్గముల ఐకమత్యమే త్రైలోక్యమై సాధకుని మోహమును దాటించే వాత్సల్యము.

 త్రైలోక్యమోహన చక్రములోని ప్రకటయోగినుల

 వాత్సల్యమును పొందిన సాధకుడు చక్రేశ్వరియైన త్రిపురే దేవికి నమస్కరించి,రెండవ ఆవరణమైన"సర్వాశాపరిపూరక చక్రము"లోనికి గుప్తయోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.


  శ్రీమాత్రే నమః. 


Tuesday, August 23, 2022

SARVANAMDAMAYAMU-BHAAVANAAMATRA SAMTUSHTAA

 సర్వానందమయ చక్రము
 ******************
 బైందవాసనా అని లలితసహస్రనామస్తోత్రము కీర్తించుచున్న బిందు స్థానము ఇది.శివశక్తులసమాగమ శక్తి యొక్క సూక్ష్మరూపమే ఈ బిందువు.నిక్షిప్తము చేయబడిన సర్వశక్తిమయము.
 నాద-కళ-బిందువుగా మూడు విభాగముల వైభోగము.
 అవ్యక్త శబ్దము నాదమైతే-దానితోపాటుగా సృష్టి విస్తరణను చేయాలన్న తలపే కల/కళ ఐతే-ఏకముగా నున్న శక్తి అనేకానేకములుగా ప్రకటితమగుటయే,దానికి అనుగుణముగా విస్తరించుకొనుటయే బిందు/బిందువుగా శాక్తేయులు భావిస్తారు.
 అంతేకాదు,ప్రకాశము-విమర్శకముగా కూడా భావిస్తారు.మూలము నుండి విడివడిన శక్తి /శివ అనుకుంటే,విశ్వరచనగా ప్రకటింపబడిన శక్తిని విమర్శగా కీర్తిస్తారు.
 విశ్వవిస్తృత చిచ్ఛక్తియే బిందువు.
 శరీరపరముగా అన్వయించుకుంటే సహస్రారమే ఈ బిందువు.పరాత్పరరహస్య
 యోగిని నివాసము.
షోడశీ మంత్రము నాదము.షడంగదేవత విరాజితము.నిత్యానందరూపము

  బిందువు సర్వావరణములకు ప్రతీక.సర్వశక్తిమిళితము.నవరసమయము
 అద్వైత అమృతానందమయ అనుగ్రహము.
.


 

Sunday, August 21, 2022

GURUMANADALAM-BHAVANAMATRA SAMTUSHUTA


 


 "శివ ఏవ గురుః సాక్షాత్ గురుః ఏవ శివః స్వయం."

 బిందువు,బిందువు చుట్టు ఊహాత్రికోనములో నిత్యాశక్తులు,ఆ త్రికోనముచుట్టునున్న ఊహా వృత్తమును గురుమండలముగా భావించి శాక్త్యేలు ఆరాధిస్తారు.

  కొందరి అభిప్రాయము ప్రకారము గురుమండలము దక్షిణామూర్తితో ప్రారంభింపబడి నారాయణుడు,బ్రహ్మ,సాకాదులు,శంకరాచార్యులు శిష్యులతో అలరారుతుంది.

 గురుప్రియ గురుమూర్తి రెండుతానై గురుమండలరూపిణిగా విరాజిల్లుతున్న సర్వశక్తియే దక్షిణ అవ్యక్త-మూర్తిగా వ్యక్త మూర్తిగా ఆరాధింపబడుతున్నది.

 ఒకవిధముగా చెప్పాలంటే గురుసంప్రదాయమే గురుమండలము.గురుమూర్తి యొక్క ఇచ్చాశక్తియే గురుప్రియగా ప్రకటింపబడుతున్నది.

 గురుమండలము దివౌఘ,సిధ్ధౌఘ,మానవైఘులుగా విభజింపబడి విరాజిల్లుచున్నది.

 శాక్తేయ సంప్రదాయము ప్రకారము త్రిమూర్తులను దివౌఘులుగా,

 "గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః అని సన్నుతిసున్నాము.

  సనకాది మునులను సదా విరాజిల్లే గురువులుగా కీర్తిస్తున్నాము

 పీఠాధిపతులైన గురువులను మానవౌఘ గురువులుగా దర్శించి సన్నుతిస్తున్నాము.

 పైన వివరించిన మూడు వర్గముల గురువులు మార్గదర్శకులే.సాధకుని అర్హత ఔభవము అధ్యనము వారి తత్త్వమును అర్థముచేసుకునేలా చేస్తుంది.

 మరికొందరి అభిప్రాయము ప్రకారము వీరందరు సౌరశక్తి సంపన్న శక్తి సంకేతములు.


Monday, August 15, 2022

BHAVANAAMATRA SAMTUSHTA-NITYA DEVATALU


  

 నిత్యామండలము
 *************
 ఉత్పత్తి-నాశనములేని లేని శక్తి నిత్య.స్థిరమైన/శాశ్వతమైన శక్తి.అటువంటి శక్తి తాను మాత్రము స్థిరముగా ఉంటూనే,తననుండి పదిహేను శక్తులను ప్రకటింపచేసి,వానిని చలింపచేస్తూ/సూర్యుని నుండి చంద్రుని దగ్గరకు,చంద్రుని నుండి సూర్యుని దగ్గరకు చేరుస్తూ,రోజులను,పక్షములను,మాసములను,సంవత్సరములను ఏర్పాటుచేస్తుంది.
   ఈ పదిహేను శక్తులు బిందువు చుట్టు ఉన్న ఊహాత్రికోణములో,ఒక్కొక్క కోనమునకు ఐదు శక్తులు చొప్పున ఉంటాయి.అష్టమి శక్తి అయిన తవరితే మకుటముగా పైన ఉన్న అడ్దకోణము మధ్యలో ఉంటుంది.

  

 కామేశ్వరి-భగమాలిని-నిత్యక్లిన్నే-భేరుండే-వహ్నివాసిని,మహావజ్రేశ్వరి,,శివదూతి,త్వరితే,కులసుందరేన్ నిత్యే,నీలపతాకే,విజయే,సర్వమంగళే,జ్వాలామాలిని,చిత్రే అను పదిహేను శక్తులు మూలశక్తి ఆజ్ఞానుసారముగా,పగటివేళ ప్రకాశముగా,రాత్రులందు విమర్శలుగా ,రాత్రులందు మధువును గ్రహిస్తూ,పగటివేళ మనందరిమీద ప్రసరిస్తూంటాయి.

 మిక్కిలి వాత్సల్యముతో ఈ శక్తులు సూర్యచంద్రుల సమసప్తక స్థితికి,(పౌర్ణమి) సూర్యచంద్రుల సమాగమనమునకు (అమావాస్య)కు కారణమగుచున్నాయి.
  ఈ పదహారుశక్తుల అనుగ్రహమే అక్షరములుగా అమ్మ మాతృకావర్ణరూపిణిగా స్తుతింపబడుతోంది.
  
 

  తత్త్వపరముగా పరిశీలిస్తే,సాధకుని సంకల్పము కామేశ్వర శక్తిగా,ప్రారంభమయి,భగమాలిని ఆ సంకల్పమునకు ఊతమునిస్తుంటే,నిత్యక్లిన్నే సాధకుని సంకల్పముతో నిమగ్నుని చేస్తున్నది.భేరుండే శక్తి అడ్డంకులనే విషమును తొలగించివేస్తుంది.అనుగుణముగా అదననుకొని వహ్నివాసిని సాధకుని సంకల్పమును తేజోవంతము చేస్తుముంది.చీకట్లను పారదోలుతుంటుంది.వజ్ఞివాసిని చిగురింపచేసిన ఆశారేఖయను జ్యోతిని ప్రజ్వరింపచేయుటకు వజ్రేశ్వరి సాధనలోని తీవ్రతను ఇనుమడింపచేస్తుంది.
 శివదూతి సాధకుని సాధనను సాధ్యము దిశగా మళ్ళిస్తుంటుంది.
 మకుటాయమానమైఅ త్వరితే శక్తి సాధనను సుగమము చేస్తుంటుంది.తత్ఫలితముగా కులసుందరి సుష్మ్న నాదీ ద్వారా కుండలిని ప్రయాణమునకు సహకరిస్తూ,నిత్య శక్తిని పరిచయముచేస్తే,నిత్యశక్తి చీకట్లను విడనాడే శక్తినిచ్చే నీలపతాకే అనుగ్రహమునకు సాధకుని చేరుస్తుంది.
 అంతర్యాగము ప్రారంభమై,విజయదిశగా పరుగులుతీయిస్తుంది సక్షాత్తు విజయ నిత్య.దాని మజిలియే కదా సర్వమంగళ సందర్శనము.సర్వశుభంకరము.లీలామాత్రపు వెలుగురేఖ శక్తిని పుంజుకుని జ్వాలామాలిని అయిన చిద్రూపిణిని దర్శింపచేస్తుంది.అమ్మదర్శనము-అనుగ్రహము ముళితమైన వేళ చిద్రూపమే చిద్విలాసముగా చిత్తము నిండినవేళ చిత్రే నీకు వందనము.
 అమ్మ నాలోని చిత్తవృత్తుల ప్రవృత్తులు తొలగి శాంతము మూర్తీభవించిన శుభవేళ శతకోటి నమస్కారములు.

Sunday, August 7, 2022

BHAAVANAAMAATRA SAMTUSHUTAA-INTRODUCTION


 


 ప్రజ్ఞానం బ్రహ్మ-తత్త్వమసి-అయం బ్రహ్మ-అహం బ్రహ్మ అని నాలుగు వేదములలోని మహావాక్యములను విన్నప్పుడు నాలుగింటిలో బ్రహ్మం అనే మాట ఉన్నది కదా

 బ్రహ్మము అంటే ఏమిటి?అన్న సందేహము ను కలిగించి,నివృత్తికై ఖడ్గమాల అను స్తుతిమాలను జ్ఞప్తికి స్పురింపచసిన అమ్మకు అనేకానేక నమస్కారములు.ఖండించేది ఖడ్గము.

 మనము తలచుకొనుచున్న ఖడ్గము లోహనిర్మితముకాదు.తుప్పుపట్టదు.విరిగిపోదు.కాల్చినంతనే కరిగిపోదు.

 మంత్రబీజాక్షర మహిమాన్విత శక్తి.భాగ్యప్రదానము.భావనాతీతము.బహుశుభంకరము.అంతర్యాగ సాధనము.

 పాంచభౌతిక శరీరమే నేను అను మాయను ఖండించి ప్రత్యగాత్మను పరిచయము చేసేందుకు అనుసంధానముచేసి,అహంబ్రహ్మాస్మి అనిపించే ఆలంబన అమ్మవారి ఖడ్గమాల స్తోత్రము..


   


   

Saturday, August 6, 2022

BHAVANAAMAATRA SAMTUSHUTAA-PRAKATAYOGINULU


 ప్రకటయోగినులుగా 28 శక్తిదేవతలు కీర్తింపబడుతారు.వీరుండు స్థానమును త్రైలోక్యమోహనచక్రము అని అంటారు.మూడు ఊహా చతురస్త్రాకారాములుగా విభజింపబడినది.ఈ మూడు విభాగములను భూపురములు అంటారు.
  మూడవ భూపురములో ప్రాప్తి-సర్వకామ అను రెండు ప్రత్యేకసిధ్ధులతోపాటుగా అణిమ-గరిమ-లఘిమ మొదలగు అష్టసిద్ధులు వెరసి 10 శక్తులు పరిపాలిస్తుంటాయి.
  మూలాధారమునకు సంబంధించిన శక్తులు చర్మచక్షువులు గుర్తించగలవు.

    రెండవ భూపురములో మహాలక్ష్మి అను ప్రత్యేక స్థితితోపాటుగా బ్రాహ్మీ-మాహేశ్వరి-కౌమారీ-వైష్ణవీ మొదలగు మానసిక స్థితులు కొలువై ఉంటాయి.

  సాధకునకు తనయొక్క మూలమును తెలుసుకోవాలనే తపనను కలిగించి అనువైన అన్వేషణ మార్గమును చూపిస్తాయి.
  వీరినే అరిషడ్వర్హ సమూహముగాను,సప్తధాతు సమాహారముగాను మరొక కోణములో భావిస్తారు.
    మొదటి భూపురములో సంక్షోభిణి,విద్రావిణి,ఆకర్షిణి,వశంకరి మొదలైన ముద్రాశక్తులు సహాయపడి సాధకునిలోని జడత్వమును తొలగించి,చైతన్యవంతుని చేయుటకు తనను తాను తెలుసుకోవటానికి సర్వాశాపరిపూరక చక్రమును పరిచయము చేస్తాయి. 

 

Friday, August 5, 2022

BHAVANAMATRA SAMTUSHTAA-ATIRAHASYA YOGINULU

 


 భావనామాత్ర సంతుష్టా-అతిరహస్యయోగినులు

 ***************************

 సర్వసిద్ధిప్రద చక్రముగా కీర్తింపబడు పాపిట స్థానములో నున్న నాలుగు ఆయుధశక్తులను,అవస్థలను నియంత్రించు మూడు శక్తులను అతిరహస్య యోగినులుగా ప్రస్తుతిస్తారు.ఊహా చతుర్స్రములో దాగిన  త్రికోణములోని   మూడు బిందువులను జాగ్రత్-స్వప్న-సుషుప్తులను సమన్వయ పరచి,సాధకునకు సహాయపడు మహాకామేశ్వరి-మహావజ్రేశ్వరి-మహాభగమాలిని నామములతో స్తుతిస్తారు.త్రికోణ మూడు కోణములలో నున్న బిందువులుగా భావిస్తారు.చతురస్ర నాలుగు బిందువులను చాపిని-బాణిని-పాశిని-అంకుశిని అను నాలుగు శక్తులుగా,వాటి స్థానములను చతురస్ర నాలుగు మూలల బిందువులుగాను భావిస్తారు.

 సాధకుని మనసనే ధనువు సంధించే జ్ఞానేంద్రియ బాణములను కళ్ళెములు లేని గుర్రములవలె పరుగెత్తనీయకుండా పాశమనే సక్తిదయతో,అంకుశమనే విచక్షణను కలిగించి,జడత్వమును నిర్మూలించి శుద్ధచైతన్యము దర్శించు పాత్రతను కలిగించును.

వీరినే అశ్వారూఢా,సింధురవ్రజా,వారాహి రూపములుగాను భావిస్తారు.ఇవన్నీ

 ఆ శక్తుల సంకేత నామములు.సర్వశుభంకరములు.


BHAVANAAMAATRA SAMTUSHTAA-RAHASYA YOGINULU

 


 భావనామాత్ర సంతుష్టా-రహస్య యోగినులు

*******************************

 లలాటస్థాన నివాసినులైన వశిని మొదలగు ఎనిమిది సక్తులను రహస్య యోగినులుగా కీర్తిస్తారు.వీరినే వాగ్దేవతలని కూడా సంబోధిస్తారు.సనాతన ధర్మ ప్రకారము వీరిచే శ్రీలలితాసహస్రనామములు ప్రకటింపబడినవని విశ్వసిస్తారు.

 వీరిలో వశిని-కామేశ్వరి అను రెండు శక్తులు శీతోష్ణములను సమన్వయపరుస్తు సాధకునికి సహకరిస్తుంటాయి.శబ్ద-స్పర్శలను సైతము నియంత్రిస్తుంటాయి.


   మోదినీ విమల అను రెండు శక్తులను సుఖ-దుఃఖ దాయకములగాను భావిస్తారు.

 జయిని కామేశ్వరి కౌళిని సత్వరజతమోగుణములను సమన్వయపరిచే శక్తులు.మనస్సును మనసులో జనించే రాగద్వేషములను సర్దుబాటు చస్తూ,మూడు అవస్థలలోను సాధకునికి చైతన్యప్రాప్తిని పొందుటకు సహాయపడుతుంటారు 



Wednesday, August 3, 2022

BHAVANAAMAATRA SAMTUSHTAA-GUPTATARA YOGINULU

  భావనా మాత్ర సంతుష్టా-గుప్తతర యోగినులు

 ********************************

 సర్వాశాపరిపూరకచక్రములోని 16 గుప్తయోగినులు పంచేద్రియములను పంచభూతములతో కర్మేంద్రియములను పంచతన్మాత్రలతో అనుసంధానముచేసి ఆత్మసాక్షాత్కారమునకు సిధ్ధముచేస్తుంటే,మరికొంచము ముందుకు సాధకుని సాధనను జరుపుతూ,8 మంది గుప్తతర యోగినులు సర్వసంక్షోభచక్రములో అనంగులై మానసిక పరిపక్వతకై పాటుపడుతుంటారు.ఆకర్షణ శక్తులైన గుప్తయోగినులు ఉపాధిని సిధ్ధము చసిన తరువాత,అనంగ శక్తులు అనగా శరీరమునకు సంబంధములేని ,మనసుతో శరీరమును సైతము నియంత్రించగలిగిన మహిమాన్వితములు.

 అనంగ కుసుమా

 అనంగమేఖలా

 అనంగ మదనా

 అనంగ మదనాతురా

 అనంగ రేఖా

 అనగవేగినీ

 అనంగాంకుశా

   అను ఈ మానసికశక్తులు మంచిభావములను సాధకుని మనసులో కలుగచేస్తూ,ధర్మబధ్ధ ప్రవర్తనను పెంపొందింప చేస్తాయి.అనంగ వేగినీ కొత్త కొత్త ఆలోచనలకు ప్రవృత్తిగా,దురాలోచనలకు నివృత్తిగా అనంగాంకుసినీ శక్తి సహాయపడుతుంటే,అనంగమాలిని శక్తి తటస్థ భావమును కలిగిస్తూ,అనవసర భావనలకు దూరముగా ఉంచుతుంది.


 అనంగదేవతలు సాధకుని అంతరంగములో కుసుమే ఒక సంకల్పమును పుష్పింపచేయుశక్తి అయితే అనంగ మేఖలే అను శక్తి జనించిన కోరికకు హద్దులను చూపెడుతుంది.అనంగ మదనే ఆ జనించిన కోరికను/సంకల్పమును బలపరుస్తుంటే,అనంగ మదనాతురే ఎప్పుడెప్పుడు దానిని పొందగలను అనే ఆతురతను పెంపొదిస్తుంటుంది.ఎక్కడ సాధనలో దారి తప్పుతాడోనని అనంగరేఖే సాధకుని మనసును నియంత్రిస్తుంటుంది.ముందుకు నడిపిస్తూనే,దారిని మళ్ళనీయని అనుగ్రహమే వీరు.వీరికి తోడుగా అనంగ వేగిని సాధనయొక్క తీవ్రతను పెంచుతూ,అడ్దకులను తొలగించమని అనంగాకుశిని రమ్మటూ,అనంగమాలిని జీత్మను పరమాత్మతో అనుసంధిస్తుంటుంది.

 నిరాకారా-నిరంజనమైన పరతత్త్వమును అర్థముచేసుకొనుటకు  మానసిక శక్తులకు నామములను రూపములను కల్పించుకుంటూ సాధకుడు తన సాధనను కొనసాగించుకుంటాడు.

  తక్కిన శక్తులు విచక్షణతో కూడిన పంచేంద్రియ జ్ఞాన సముపార్జనకు సహాయపడుతుంటుంది.

 


BHAAVANAAMAATRA SAMTUSHTAA-GUPTAYOGINULU

 


 భావనామాత్ర సంతుష్టా-గుప్తయోగినులు

 ***************************


  త్రైలోక్య మోహన చక్రమును దాటిన తరువాత నున్న రెండవ ఆవరణమును "సర్వాశాపూరక చక్రము"గా కీర్తిస్తారు.ఇక్కడ పదహారు శక్తులు /ఆకర్షణ శక్తులు

మనలను మనచుట్టునున్న ప్రకృతితో అనుసంధానమును చేసి సాధకుని ఇంద్రియములను శుభ్రపరుస్తుంటాయి.

 కామాకర్షిణి,బుధ్ధ్యాకర్షిణి,శబ్దాకర్షిణి,రసాకర్షిణి,గంధాకర్ష్ణి,రూపాకర్షిణి,స్పర్శాకర్షిణి అను

పంచతన్మాత్రలను,వాటికి మూలకారనమైన పంచభూతములను,

మనలోని పంచ జ్ఞానేంద్రియ-కర్మేంద్రియములతో సమన్వయ పరచి మనకు సహాయపడుతుంటాయి.

 మనకు 

గుడ్డితనము,మూగతనము,అవిటితనము మొదలగు ఇంద్రియ రుగ్మతలను నివారించుచు మనలను కాపాడుతుంటాయి. 

 కామాకర్షిణి ధర్మబధ్ధమైన కోరిక సర్వేజనా సుఖినో భవంతు అనేలా బుధ్ధిని సన్మార్గమువైపు నడిపిస్తూ,ఆత్మతత్త్వమనే అహంకారమును వివరిస్తూ స్వయంప్రకాశమును దర్శింపచేయుటకు సహాయపడుతుంటాయి. 

 


Tuesday, August 2, 2022

BHAVANAA MAATRA SAMTUSHUTAA-NIGARBHAYOGINULU

 


 భావనామాత్ర సంతుష్టా-నిగర్భయోగినులు

 ****************************

 సర్వరక్షాకరచక్రములో ఉండే 10 అద్భుత శక్తులను "నిగర్భయోగినులు"గా కీర్తిస్తారు.

 మనలను గర్భస్థశిశువులుగా ఉన్నప్పటినుంచి మనలను రక్షించుచున్న మహిమాన్వితశక్తులు వీరు.సర్వ ఉపసర్గతోకూడిన వీరిని,

1.సర్జే

2.సర్వశక్తే

3.సర్వైశ్వర్యప్రదాయిని

4.సర్వజ్ఞానమయి

5.సర్వవ్యాధివినాశిని

6.సర్వధారాస్వరూపే

7.సర్వపాపహరే

8.సర్వానందమయీ

9.సర్వరక్షాకరీ

10.సర్వఈప్సితఫలప్రదే

   అను దివ్యనామములచే సంకీర్తింపబడతారు వీరు.

 వీరు సర్వమునకు ఆధారభూతులు.అంతేకాదు శక్తిమంతులు.శక్తిని ఏవిధముగా ఉపయోగించుకోవాలో తెలియచేసే జ్ఞాన సంపన్నులు.కనుకనే మన కోరికలను తీరుస్తూ,మనకు ఆనందమును అందించగలుగుతున్నారు.అంటే మన కోరికలను ధర్మబధ్ధముగా ఉండేటట్లు విచక్షన అను సంపదను  ప్రసాదిస్తున్నారు.

  ఆ సంపద మనలను సర్వవేళలను రక్షిస్తోంది.

  శారీరక పరముగా అన్వయించుకుంటే నిగర్భయోగినులు జీర్ణవ్యవస్థను సక్రమముగా పనిచేయిస్తుంటారు.దానికి అవసరమైన పది వాయువులను సమపాళ్ళలో ప్రసరింపచేస్తుంటారు.

 అంతర్దశార శక్తులైన వీరు భక్ష్య-భోజ్య-చోష్య-లేహ్యములను నాలుగు విధములను పచనము చేయిస్తూ మనలను పరిపాలిస్తుంటారు.


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...