Tuesday, August 2, 2022

BHAVANAA MAATRA SAMTUSHUTAA-NIGARBHAYOGINULU

 


 భావనామాత్ర సంతుష్టా-నిగర్భయోగినులు

 ****************************

 సర్వరక్షాకరచక్రములో ఉండే 10 అద్భుత శక్తులను "నిగర్భయోగినులు"గా కీర్తిస్తారు.

 మనలను గర్భస్థశిశువులుగా ఉన్నప్పటినుంచి మనలను రక్షించుచున్న మహిమాన్వితశక్తులు వీరు.సర్వ ఉపసర్గతోకూడిన వీరిని,

1.సర్జే

2.సర్వశక్తే

3.సర్వైశ్వర్యప్రదాయిని

4.సర్వజ్ఞానమయి

5.సర్వవ్యాధివినాశిని

6.సర్వధారాస్వరూపే

7.సర్వపాపహరే

8.సర్వానందమయీ

9.సర్వరక్షాకరీ

10.సర్వఈప్సితఫలప్రదే

   అను దివ్యనామములచే సంకీర్తింపబడతారు వీరు.

 వీరు సర్వమునకు ఆధారభూతులు.అంతేకాదు శక్తిమంతులు.శక్తిని ఏవిధముగా ఉపయోగించుకోవాలో తెలియచేసే జ్ఞాన సంపన్నులు.కనుకనే మన కోరికలను తీరుస్తూ,మనకు ఆనందమును అందించగలుగుతున్నారు.అంటే మన కోరికలను ధర్మబధ్ధముగా ఉండేటట్లు విచక్షన అను సంపదను  ప్రసాదిస్తున్నారు.

  ఆ సంపద మనలను సర్వవేళలను రక్షిస్తోంది.

  శారీరక పరముగా అన్వయించుకుంటే నిగర్భయోగినులు జీర్ణవ్యవస్థను సక్రమముగా పనిచేయిస్తుంటారు.దానికి అవసరమైన పది వాయువులను సమపాళ్ళలో ప్రసరింపచేస్తుంటారు.

 అంతర్దశార శక్తులైన వీరు భక్ష్య-భోజ్య-చోష్య-లేహ్యములను నాలుగు విధములను పచనము చేయిస్తూ మనలను పరిపాలిస్తుంటారు.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...