మకర సంక్రమణ శుభాకాంక్షలు
Friday, January 13, 2023
HAPPY PONGAL-2024
AALO REMBAAVAAY-30
కళ్యాణ పాశురము-30
***********
" ప్రతి ఒక మాతృమూర్తి సాక్షాత్తుగా కరుణతో గోదరక్షగా
ప్రతి ఒక్కరి ఆర్తి తీర్చి లక్ష్యము చేర్చు గోవిందుని సాక్షిగా."
ఇంతవరకు మనము తెలుసుకున్న విషయములన్ని కేవలము అమ్మ అనుగ్రహము వల్లనే తక్క స్వయముగా సంపాదించుకొన్నది కాదని "అడియేన్" భావిస్తున్నది.
వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై
తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రు ఇరెంజి
అంగు అప్పరై కొండ అత్తై అణిపుదువై
ప్పైంగమలత్తణ్ తెరియల్ పట్టర్ పిరాందై
శంగత్తమిళ్మాలై ముప్పదుం తప్పామే
ఇంగుం ఇప్పరిశు ఉరైపార్ ఈరిరండుమాల్
శెంగణ్ తిరుముగుత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువర్ ఎంబావై.
అంగు-అప్పుడు-ఇంగుం-ఇప్పుడు ఎప్పుడైన స్వామి పాలసముద్రమును చిలుకునపుడు సహాయముచేసినను,గోకులములో పెరుగు సముద్రము చిలుకునపుడు సహాయపడటమునకు కారణము కేవలము మనమీది అవ్యాజవాత్సల్యమే.
అదే విషయమును త్యాగరాజు "ఓడను నడిపే ముచ్చట గనరే" అని తాదాత్మ్యతతో దర్శించి ధన్యులైనారు.
అదే కరుణను గోదా రంగనాథులు మనపై వర్షిస్తున్నారనుటకు,
ఓం నమో నారాయణాయ
**********************-
అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది
నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది.
శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన
అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో
ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన
ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో
పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన
పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో
అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన
అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో
వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము
వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము.
గోదామనన్య చరణం శరణం ప్రపద్యే.
Thursday, January 12, 2023
AALO REMBAAVAAY-29
శాత్తుమరై పాశురము-29
******************
"ఆలకించనీయననదు నీ అనురాగపు ఆంతర్యము
ఆలసించగనీయదు అనుమతింప నిత్యకైంకర్యము"
మంగళప్రదమైన పాశురములో ఇష్టప్రాప్తి-అనిష్ట నిర్మూలనము ను స్పష్టము చేయించి ఇటు ఏడుతరములను-అటుఏడు తరములను స్వామి అనుగ్రహప్రాప్తులను (మన పూర్వీకులను-ఉత్తర వంశస్థులను) ఉద్ధరించుటయే కాక,రంగనాధుని అనుగ్రహమును పొంది-కొత్త పెళ్ళికూతురుగా ముస్తాబవబోతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,వారనుగ్రహించనంతమేరకు (వింజామర) పాశురమును అనుసంధానము చేసుకునేందుకు ప్రయత్నమును చేద్దాము.
ఇరువది తొమ్మిదవ పాశురం
**********************
శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్
పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ తుణ్ణం కులత్తిల్ పిరందు నీ
కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు
ఇత్తైపరై కొళివాన్ అన్రుగాణ్ గోవిందా
ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు
ఉత్తోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయ్ వోం
మత్తైనం కామంగళ్ మాత్తు ఏలోరెంబావాయ్.
గోపికలు ప్రథమ పాశురము నుండి స్వామి పఱ ను తమకు అనుగ్రహిస్తాడని-దానిని స్వీకరించి నోమును నోచుకుందామని ప్రతిపాశురములో చెబుతున్నారు.
ఒక్కొక్క పాశురములో వారు ఆచార్యుల అనుగ్రహముతో ఒక్కొక్క విషయమును ఒక్కొక్క వస్తువులను బహుమతులుగా పొందుతున్నారు.సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపము సైతము వీరి పక్షమునకు వచ్చి స్వామిని అనుగ్రహించమంటున్నది.అంతే స్వామి సైతము వర్షములను-పాడిపంటలను-శంఖ -చక్రములను-నోమునకు కావలిసిన వస్తువులను,నోచుకొనువారికి కావలిసిన ఆభరనములను అనుగ్రహించాడు.వారు స్వామితో మేము నీ నుండి అర్థిస్తున్నది నీ సంశ్లేషణము.పఋఅ ను అనుగ్రహిస్తే కాదనము అని రాజీకి వచ్చారు.కాని విచిత్రము వారు ఇప్పుడు పూర్తిగా ఇన్నిరోజులు వారు స్వామిని అర్థించిన పరను కోరుటలేదు అంటున్నారు.మాకు అసలు పఱ వద్దంటున్నారు.కాని స్వామి బ్రహ్మీ ముహూర్తములోనే శుద్ధులమై నిన్ను సమీపించి,నీ పాదపంద్మములను కీర్తిస్తూనే,మాకు కావలిసిన దానిని నిశ్చయ జ్ఞానముగా (ఇంక ఏమీ మార్పు ఉండదు) అర్థిస్తున్నాము
కేళిరో-వినవలసినది.అంటున్నారు.
సంభ్రమాశ్చర్యములతో స్వామి వీరిని చూస్తున్నాడు.అయితే నేనిచ్చినవన్నీ కాక మరేదైనా మీరు నా అనుగ్రహముగా కావాలని అర్థిస్తున్నారా అని అడిగాడు.(అర్థమయినప్పటికిని)అదొక వేడుక.
అంతే అదే అదునుగా స్వామి నీవు జ్ఞానివని యోగులు ముక్తపురుషులు అనగా విన్నాను కాని అదంతవరకు నిజమో తెలియుటలేదు.మరొకసారి చెబుతాము విను.కాదనకు.ఇదే మా అసలయిన కోరిక.కన్నులార్పకుండా స్వామి వారిని కాంచుతున్నాడు.
"విను.నేను ఒకపరి కస్తురిని నీ నుదుటను అలంకరిస్తాను.ఊహు.తృప్తిగా లేదనకో.నేనే.ఒకపరి కస్తురి కుంకుమగా మారి నీ నుదుటను పరిమళిస్తూ-ప్రకాశిస్తాను.నీ సిగను చుదతాను.కాదుకాదు శిఖిపింఛమునవుతాను. కౌస్తుభమణి నవుతాను,కంకనముగా మారతాను.కాలి అందెనవుతాను.ఘల్లుమంటుంటాను.ముక్కెరనవుతాను.చక్కదనమునిస్తాను.నా సఖి వేణువవుతుంది.నేనుమోవి చేరతాను.మధువులు చిందిస్తాను.మాధవా అంటాను పీతాంబరమునై నిన్ను పొదవుకొంటాను.నేనొకసారి నా చెలులింకొకసారి మారి మారి నిన్ను చేరి మైమరచిపోతాము.హరిచందమవుతాము.అయీఅ .ఇంకా తనివి తీరటము లేదు.ఆగు కృష్ణా.స్వామి కొంచము సమయమునిస్తే అందరము కలిసి ఒకే ఒక సౌభాగ్యమును అర్థిస్తాము అన్నారు గోపికలు.ఏమనగలడు వారి ఎడదనెరిగినవాడు?కాదనగలడా? కామినుల వీడి కదలగలడా?కటాక్షించటమే కాని ఇతరము తెలియనివాడు.విస్తుపోతున్నాడు.అంటే అంటే
కాని మాకామితమును అడ్దగిస్తున్నదయ్య ఒకటి.దానిని నిశ్సేషముగా నిర్మూలించు.
మత్తైనం కామంగళ్ మాట్రు ఓ గోవిందా.
మా విష(య) వాసనలు అడ్దుకుంటున్నాయి.వాతిని మట్టుపెట్టు.అర్థమైనది
నిత్యకైంకర్య సేవాసౌభాయమును నిశ్చయమనముతో కోరుకుంటున్నారు మీరు అంతేనా అన్నాడు.
అంతే కాదు మాకే కాదు
ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం -మా ముందరి ఏడుతరాలకు-మా అనతరపు ఏడుతరాలకు నిత్యకైంకర్య భాగ్యమును ప్రసాదించు అంటూ వారు
తాము ఏ విధముగా శ్రీనోముద్వారా నాలుగవ అవస్థలోని చేర్చిన స్వామిని స్తుతిస్తున్నారు.
మొదటిది యతనావస్థ.
******************
కోరికలను ప్రయత్నపూర్వకముగా నియంత్రించుకొనుట
పాలు తాగము-నెయ్యి తినము-కాటుకను అలంకరించుకొనము-పువ్వులను ముడుచుకొనము.కొండెములు చెప్పము అంటొ ఏమీ చేయవలెనో-చేయకూదదో తెలుపుతు పాటించుటకు చేయు ప్రయత్నము.
వ్యతిరేకావస్థ
**************
వదిలివేశామనుకుంటారు కాని వాటిఛాయలు కనిపిస్తుంటాయి తలపులలో-మాటలలో.
అదేవారు గోపికలను మేల్కొలుపునప్పుడు చేయు నిందారోపనములు-నీలాదేవిని అర్థించునపుడు స్వామిని అనుగ్రహించమనుట మొదలగునవి.
కేంద్రీకృతావస్థ
*********
లక్ష్యము పైననే మనసును-ఇంద్రియములను కేంద్రీకరించి స్వామిని ఆహ్వానించుట,గోకులక్షేమమునకై కర్తృత్వ భావమును వీడి కర్మాచరనమునందాసక్తిని చూపుట-సమాశ్రయణ సంస్కారములను అనుగ్రహించమనుట-భోగత్వమైన కూడారై ను ప్రస్తావించుట మొదలగునవి.
వశీకరణావస్థ
***************
ఇదియే నిత్యకైంకర్యానుగ్రహమను పరమావధిని గుర్తించి పరమాత్మను వేడుకొనుట.పఱను మించినది పరమాత్మ తత్త్వమని గ్రహించి చేతనుడు చైతన్యముగా మారుట.తానేకాదు తనవారినందరిని అనుగ్రహించమని సకలచేతనులను పరస్పరాశ్రితులుగా అనుగ్రహించుచున్న,నిత్యశుద్ధ విభూతి
"కస్తూరి తిలకం లలాటఫలకే
వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవ మౌక్తికం
కరతలే వేణుం
కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం
కంఠేశ ముక్తావళి
గోపస్త్రీ పరివేష్ఠితుడైనాడు గోవిందుని,
రంగనాధునిగా పెండ్లికొడుకు చేయించు వేళ మనమ0దరము కనులారా కాంచుటకు తనతో పాటుగా మన చేతిని పట్టి తీసుకుని వెళ్ళుచున్న,
ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Wednesday, January 11, 2023
AALO REMBAAVAAY-28
పాశురము-28
************
" కానల గోవుల మేపుతున్నది జ్ఞానసంబంధములేనిది మా ఉపాధి
కానిల గోకులమ్మను జననసంబంధము ఉన్నది ఓ దయానిధి"
"స్వధర్మో- నిధనం శ్రేయః" అన్న ఆర్యోక్తిని నిరూపిస్తూ,పరంధాముని ప్రసన్నునిగా చేసుకొను సిద్ధోపాయమును సైతము అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ అమ్మ అనుగ్రహించిన మేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
నిన్నటి పాశురములో గోపికలు అర్థించినవాటిని స్వామి తప్పక అనుగ్రహిస్తాడన్న విశ్వాసముతో వారు భావనావీధులలో బాహ్యమును మరచి భగవదానుభవమును ఆస్వాదిస్తున్నారు.
"కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె
బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె
జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె
దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె
పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె
తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ
పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో
యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి
భాగ్యశాలియో
రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్."
ఇరువది ఎనిమిదవ పాశురం
*********************కరవైగళ్ పిన్శెన్రు కానం శేరిందు ఉణ్బోం
అరివొన్రుం ఇల్లాద అయ్ కులత్తు ఉందన్నై
ప్పిరవి పెరుందనై పుణ్ణియం నుం ఉడైయోం
కురైవొన్రుం ఇల్లాద గోవిందా! ఉందన్నోడు
ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఓళియాదు !!
అరియాద ప్పిళ్ళైగళోం! అంబినాల్ ఉందన్నై
చ్చిరుపేర్ అళైత్తనవుం శీరి అరుళాదే
ఇరైవా! నీ తారాయ్ పరై ఏలోరెంబావాయ్.
Tuesday, January 10, 2023
AALO REMBAAVAAY-27
పాశురము-27
************
"సమవర్తిత్వము సాధించునుకదా స్వామి నీదు తీర్మానము
సమాశ్రయణము అందచేసినది మాకదే పెద్ద సన్మానము."
మాలే మణివణ్ణా పాశురములో తమ నోమునకు కావలిసిన వస్తువులను అర్థిస్తున్నట్లుగా సాక్షాత్తుగా విభవోపేతుడైన స్వామిని అర్థించారు. ఇప్పుడు వారు కోరుకొనునది స్వామి సమాగమము.జీవాత్మ తన బాహ్యలక్షణములను విడిచి,పంచసంస్కారములను పొంది, పరమాత్మను సమీపించి స్వామి గుణవైభవములను అనుభవించగలుగుట.ఐహికములో తనలో సంకోచించుకు పోయిన శౌర్యం,వీర్యం,ధై ర్యం,చాతుర్యం,ఔదార్యం ,మాధుర్యం,జాజ్వల్యం,ఔచిత్యం అను స్వామి అష్టగుణములను
ముక్తపురుషుడై వ్యాకోపింపచేసుకొని స్వామి సారూప్యమును-సాలోక్యమును-సాంగత్యమును అంతకు మించి సాయుజ్యమును చేరుటను మనకు అందించిన రామానుజ సోదరికి అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,గోవిందానుభూతినందించు,
"అక్కార్ అడిసెల్" అను కూడారై అను విశేష పాశురమును అనుగ్రహించినంతమేరకు అనుసంధానము చేసుకుందాము.అమ్మ కూడి ఇరందు కుళిరేందో అని స్వామి సంపూర్ణ సమాగమ సావకాశమును కల్పించు సమాశ్రయణములను వివరించిన విధానమును అర్థము చేసుకునే ప్రయత్నముగా ఒక్కసారి పాశురమును చూద్దాము.
ఇరవై ఏడవ పాశురం
****************
కూడారై వెల్లుం శీర్ గోవిందా! ఉందన్నై
ప్పాడిపరై కొండు యుం పెరు శెమ్మానం
నాడు పుగుళుం పరిశినాల్ నన్రాగ
శూడగమే తోళ్వళైయే తోడే శెవిపూవే
పాడగమే ఎన్రనైయ పల్కలనుం యాం అణివోం
ఆడై ఉడుప్పోం ; అదన్ పిన్నే పాల్శోరు
మూడ,నెయ్ పెయ్దు ముళంగై వళివార
కూడి ఇరుందు కుళిరుందు ఏలోరెంబావాయ్!
వ్రతప్రారంభములో వారు చెప్పిన పాలుం నోం-నెయ్యిన్నోం-అన్న ఆహార నియమములకును,మయ్యెత్తు న ఎళుదుం-మలరిట్టు న ముడిదం అన్న నియమములకు అతీతముగా స్వామి నీ మా వ్రతఫలము నీ అనుగ్రహముతో ముందే ప్రాప్తించుచున్నది.
వానలతో గోకులము సస్యశ్యామలమైనది.గోవులు సమృద్ధిగా పాలను వర్షిస్తున్నాయి.నెయ్యి సైతము పుష్కలముగా నీ ప్రసాదమైన క్షీరాన్నములో తేలియాడుటకు త్వరపడుచున్నది.మా పెద్దలు సైతము నీ నామమును కీర్తించుటకు,నీ దరి చేరుటకు మమ్ములను సమ్మతించినారు.
వారు ఏ విధముగా సమ్మతినిచ్చినారో అదేరీతిగా మేము నీనుండి పెరు సన్మానమును కోరుకుంటున్నాము.బహుమతులను మా అలంకరణకై అర్థిస్తున్నాము.నీవు వాటిని అనుగ్రహించు అంటున్నారు గోపికలు/గోదమ్మ స్వామితో.
అంటే గోపికల నోము పూర్తి అయినట్లుగా భావిస్తున్నారా? అందిన ఫలముతో తృప్తి పడినారా?అలంకారములెందుకు కోరుతున్నారు.రంగురంగు వస్త్రములను ధరించి,స్వామి అదనముగా ఇచ్చిన ఎన్రనైయ పల్కలనుం యా ఆభరణములను అలంకరించుకొని స్వామి దగ్గరకు వస్తారట.
అప్పుడు స్వామి తన చేతిని చాపి వారిని దగ్గరకు తీసుకుంటాడట.చెవిలో గుసగుసలాడతాడట.
వీరి నుండి వచ్చే చెవిపూవుల వాసనను సేవిస్తూ మరింత మైమరచి బిగికౌగిలి ఇస్తాడట.అప్పుడు వారి భుజకీర్తులను చూసి మురిసిపోతాడట.వారు ధరించిన రంగురంగు పీతాంబరముల స్పర్శతో పులకించిపోతాడట.పాదములకున్న మంజీరములను చూస్తూ నేను మీ పాదాక్రాంతుడినే ఎప్పుడు అంటాడట.
అది వారు స్వామిని కలిసి పొందవలసిన అనుభవమట.అంతకు మించి అన్యము వారి భావనలో సైతము ఏదీ రాలేదట.
స్వామి నీవు మాకు చేయుచున్న సన్మానము ఎంత ప్రసిద్ధము కావాలంటే
పరిశినాల్ నండ్రిక నాడుం పగళం- అంటున్నారు
గోకులమంతా పులకించిపోవాలి కాదుకాదు
జగములెల్లా పరవశించిపోవాలి అంటున్నారు.
స్వామికి వారు కోరుకొను ఆభరణములను చెబుతున్నారు.
1.శూడగమే-కంకణములు-అవియును సాధారణ మైనవి కాదు.వృత్తాకారములో ప్రణవమును నిరంతరము నినదించు అష్టాక్షరి మంత్రం.
2.తోడే-సెవిపూవే
రెండుచెవులకు తమ్మెకు పెట్టుకునే దిద్దులు,పైభాగమున అలంకరించుకునే పుష్పాలు
ద్వయ మంత్రము.
అంటే స్వామి వారితో కరచాలనము చేసి,దగ్గరకు తీసుకుని అష్టాక్షరీ మంత్రమును,ద్వయి మంత్రమును చెవిలో ఉపదేశించాలట.
ఎంతటి చాతుర్యము వీరి అభ్యర్థన ఐహికమును తలపిస్తూ-ఆముష్మికమును అందించునది.
3.తోళ్ వళియే-భుజకీర్తులు-శంఖ-చక్రములు.
స్వామి నీవు మా చెవిలో అష్టాక్షరిని-ద్వయి మంత్రమును ఉపదేశించినపుడు మా చెవిపూల పరిమళమును ఆఘ్రాణిస్తూ మరింత ప్రేమతో మమ్ములను ఆలింగనము చేసుకొనునప్పుడు మా భుజములపై నీ వనుగ్రహించిన శంఖు-చక్రములను భుజ కీర్తులు మమ్ములను ముక్తపురుషులుగా, నీ సామీప్య-సారూప్యమును-సాలోక్యమును కోరువారిగా గుర్తుచేయాలి.
మాకొరకై చిటికెనవేలిపై గోవర్ధనగిరినెత్తి,ఇంద్రునిచే పట్టాభిషిక్తుడవై 'గోవింద" అను బిరుదుతో ప్రకాశించుస్వామి నీ చూపు మా పాద మంజీరములపై వ్రాలుట అనగా మేము నీ పాదసేవానురక్తులము .కాదనకయ్యా అని విన్నవించుకొను విన్నపములు.
సమాశ్రయణమును అనగా సంపూర్తిగా-సమ్యక్-ఆశ్రయణమును పొందించిన నీ అనుగ్రహము మేము ఎంతని పొగడగలము.
నీవు -శీర్ గోవిందా-శుభములను అనుగ్రహించువాడా,
స్వామి నీవు కూడని వారిని (అభిముఖులను-ప్రణయకుపితులను-తటస్థులను-విముఖులను-ఉదాసీనులను సైతము) నీ శౌర్యముతో-సౌకుమార్యముతో-సౌందర్యముతో-సౌలభ్యత్వముతో అనుగ్రహించి చేరదీస్తావు అని మాకు ఇప్పుడే తెలిసినది.
మనమందరము కలిసి పాల్ శోరుం-పాలలో ఉడికించిన బియ్యముతో(వడ్ల లోని ఊకపోగా మిగిలిన ధాన్యము తో-అంటే ఐహికమనే ఊహలను తోసివేసిన ఉపాధులలో నున్న మేము-నీ క్షిప్రప్రసాదగుణములను మధురమును కలిపి శుద్ధసత్వమనే తెల్లని పాలలో నుడికించిన కూడార ప్రసాదమును, పద్మము లా నిన్ను మా మధ్యన కూర్చుందపెట్టుకుని, విచ్చుతున్న రేకుల్లా,మేము నీ చుట్టూ కూర్చుని, అదియును స్వామి మాకును-నీకును మధ్యన సమానమైన దూరములో-సమానమైన దగ్గరలో, సంపూర్ణమైన భావనతో,
నిన్నే అంటుకుని యుండే-మరలలేని నెయ్యి అనే వాత్సల్యము మా మోచేతిదాకా కారుచుందగా నిన్ను ముక్తపురుషులుగా చేరుతూ,నీ కళ్యాణగుణ వైభవమును తనివితీరా గ్రోలనిమ్ము అని
అంటున్న (చాలా చాలా చెప్పాలని ఉంది కాని ...)
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Monday, January 9, 2023
AALO REMBAAVAAY-26
పాశురము-26
*************
" శరణార్థులు నీ సంశ్లేషమునే కోరువారని గ్రహించు
శంఖములు-దీపములు-కొలుచువారిని, అనుగ్రహించు"
స్వామి నీకు మాయందుగల వాత్సల్యము-మాకు నీయందుగల వ్యామోహము నీ నీలమణివర్ణ పారదర్శకత పదేపదే చెబుతున్నది.అయినను మా మీది అనుగ్రహము నీతో పదేపదే "సంభాషించు భోగమును" ప్రసాదించుటకా యన్నట్లు" ఏమికావాలని ఏమీ తెలియనట్లు"
ప్రశ్నించుచున్నావు అని అంటున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
ఇరువది ఆరవ పాశురం
*********************
మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడు వాన్
మేలైయార్ సేవననగళ్ వేండువన కేట్టియేన్
ఞాలాత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తున్ పాంజశన్నియమే
పోలవన శంగంగళ్ పోయ్ ప్పాడు డయనవే
శాలప్పెరుం పరయే, పల్లాండు ఇశైప్పారే,
కోళ విళక్కే,కొడియే,వితానమే
ఆలిన్ ఇలైయాం! అరుళ్ ఏలోరెంబావాయ్!
మాలే-ఆశ్రితవాత్సల్య స్వరూపమా!
మణివణ్ణా-మా మనసులోని భావములను గ్రహించినవాడా!
యాం వేండువన కేట్టియేల్-మాకు కావలిసినవాటిని స్పష్తముగా చెబుతాము.శ్రద్ధగా వినుము.తరువాత వీలేదాకు.మాకు వాటిని అనుగ్రహిస్తే నోము నోచుకొనుటకు వెళ తాము అంటున్నారు చతురగోపికలు.
నిన్నటి పాశురములో స్వామి మాకు నోము సంకల్పము-నోము ఆచరణము-నోముఫలము నీవే అన్న మాట మరిచినారా ఏమిటి? ఈ రోజు మాకు కావలిసిన వస్తువుల పట్టికను మీముందుంచుతాము అంటున్నారు అన్న సందేహము రాకమానదు.
పైగా వారికి కావలిసిన వస్తువుల సంఖ్యలు అనేకానేకములట,అతి సమర్థవంతములట ,అంతెందుకు వాటికవే సాటి అంటున్నారు.
జాబితాని ఒకసారి పరిశీలిద్దాము.
1.శంఖములు
2.పఱ వాయిద్యములు
3.భాగవతులు
4.మంగళదీపములు
5.కేతనములు
6.మేలుకట్లు/చాందినీలు
7.ఆశీర్వచనములు.
ఓస్ ఇంతేనా అనుకుంటే పొరబడినట్లే.
అదితెలుసుకొనుటకు మరింత జాబితాను పరిశీలిద్దాము.
1.శంఖములు.
*********
స్వామి శంఖములేకదా వైకుంఠములోతాను ధరించినదో,ఆణిమళై కన్నా పాశురములో పద్మనాభుని చేతిలోనిదో,లేదా గోవులను అదిలించుటకు బృందావనములో తానాడుకొనుచున్నదో ఇద్దామనుకొన్నట్లున్నాడు.అది గమనించిన గోపికలు,
1.అనేకానేక సంఖ్యలలో శంఖములు కావాలి.
2శంఖములు పాలవలె తెల్లగా స్వఛ్చముగా ఉండాలి.
3.వాటిని పూరించినపుడు సకలజగములు భయముతో గదగడలాడాలి.
4. ఇన్నిమాటలెందుకు అసలు పాంచజన్యములే కావాలి అని అడుగుతున్నారు.
ఞాలాత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తున్ పాంజశన్నియమే
ఏమిటా పాలనుపోలిన తెల్లదనము-స్వచ్ఛత అనగా
శుద్ధసత్వగుణశోభితములుగా ఉండాలి.
కాని అవసరమైనప్పుడు
పూరించినవేళ జగములన్నీ గడగడలాడాలి.అంటున్నారు.(ప్రణవము) నినదిస్తుండాలి.
సంబరముగా వింటున్నాడు స్వామి.
2.ముందుచూపుతో శాలం పెరుంపఱ్యై-కావాలన్నారు.
స్వామి ఎక్కడ వామనావతారములో ఆనందముతో జాంబవంతుడు మ్రోగించిన పఱను ఇస్తానంటాడోనని
శ్రీరామావతారములో లంకను జయించిన సందర్భముగా మ్రోగించిన పఱను ఇస్తానంటాడేమోనని అవి పఱ,పెరుం పఱ మాకు కావలిసినది నీవు కుంభనృత్యముచేయునప్పుడు నడుముకు కట్టుకుంటావే అది,ఆ
"శాలప్పెరుంపఱ" అని స్పష్టముగా చెప్పారు.
ఇక్కడ మనము పెద్దలు చెప్పిన శ్రీకృష్ణుని కుంభ నృత్యమును ఒక్కసారి స్మరించి-తరిద్దాము.
స్వామి నడుమునకు పఱను కట్టుకుని,కుండలను ఎగురవేసి,దానిని పట్టుకునే లోపల ఒక్కసారి పరవాయిద్యమును చేసి పైనుంచి వచ్చే కుండను పట్టుకునేవాడట.
కించిత్ ఆశ్చర్యముతో గోపికల మాటలను వింటున్నాడు స్వామి.
3.పల్లాండు ఇసై పారే
************
వ్రతమునకు నాందిగా శంఖమును పూరిస్తాము.పఱను వాయిస్తాము.స్తోత్రములు చేయుటకు మాకు "గుంపుగాయకులు" కావాలి.వారు తత్త్వము తెలిసినవారై యుండాలి.తన్మయులై నిన్ను కీర్తించగలగాలి.సకల జనులను తరింపచేయగల సామర్థ్యమును గలిగియుండాలి అను అడుగుతున్నారు.(ఆళ్వారులను)
తనను తాను మరచిపోయి తలనూపుతున్నాడు స్వామి.
అంతలోనే బహిర్ముఖునిచేస్తూ గోపికలు,
4.మేము నోము ప్రారంభసూచకముగా 'దీప ప్రజ్వలనమును చేయాలికదా."దీపేన సాధ్యతే సర్వం" అని కదా అంటారు.కనుక మాకు మామూలు దీపములు కాదు.అనేకానేక మంగళదీపములు కావాలి అని అడిగారు.
మందస్మితముతో "మహాలక్ష్మి నీలాదేవి" మీదగ్గరే ఉన్నదికదా అనుగ్రహించాను అన్నాడు అప్రయత్నముగా.
5.స్వామి మాకు మీ భవనమును గుర్తించుటకు సులువైన మార్గముగా "నాయగనాయ్' పాశురములో కొడి ని చెప్పావు.మానోము స్థలిని గుర్తించుటకు అంతే పవిత్రమైన ధ్వజము /కేతనము కావాలి.అది బలముగా ఎగురగలగాలి.నోము ఫలమును అందించగలగాలి అని అన్నారు.
ఆలోచిస్తున్నాడు స్వామి.అందుకున్నారు గోపికలు.
అదే నీ గరుత్మంతుని మా నోముస్థలిని గుర్తించుటకు కేతనముగా పంపు అన్నారు.
పరవశించిపోతున్నాడు స్వామి.బదులు పలుకలేక యున్నాడు.
ఇంకా పూర్తికాలేదంటూ
6.స్వామి మా వ్రతమును ఎవరు అడ్దుకుంటారో అసలే చుట్టు అసురులు అందుకని మాకొక మేలుకట్టు/చాందినీ అదియును మామూలిది కాదు.మహా విశాలముగా ఉండాలి.వేయికనులతో చూస్తూ విపత్తులను తరిమివేయాలి అన్నారు.ఏది అంటే ఆదిశేషుని అనుగ్రహించవయ్యా అంటున్నారు.
ఆశ్చర్యపోవటము స్వామి వంతు అయినది.
నన్ను చేరుతామని నిన్న అన్నారు.నా విభవముతో సహా నేడు తమదగ్గరికి తరలిరావాలంటున్నారు అనుకొని,
పైకి అమాయకముగా
ఇంతేనా? చాలా/ ఇంకా ఏమైనా కావాలా?
అయినా
ఇవన్నీ నేనెక్కడి నుండి తేగలను? అని అడిగాడట గోపికలను.
అందులకు వారు ప్రసన్నముగా నీ సామర్థ్యము మాకు తెలుసులే,
ఆలిన్ ఇళయాం-ఓ వటపత్ర శాయి అని సంబోధించారట.
ప్రళయ సమయములో ప్రపంచమంతయు మునిగిపోయినను(స్వామి ఉదరములో దాగినను)మార్కండేయ మహాముని చెక్కుచెదరక (చిరంజీవికదా) పుణ్యఫలముగా వటపత్రశాయిని దర్శించగలిగినాడట.స్వామి ప్రత్యక్షమై వరము కోరుకోమనగానే పులకితుడై కృష్ణమాయలో లేశమును తాను అనుభవించే భాగ్యమును కలిగించ మన్నాడట.వెంటనే స్వామిదయతో జలములోనికి వెళ్ళినాడట
చూసిన అక్కడ ఏమీ కనీసము స్వామికూడా, మార్కండేయ మునికి కనిపించలేదట.చింతాక్రాంతుడైన మునిని కరుణించి స్వామి పున:దర్శన భాగ్యమును కలిగించాటడ.మన గోపికలలో మార్కండేయ మహాముని తత్వచింతనయే తలపునకు వచ్చింది.
" కరార విందేన పదారవిందం
ముఖార విందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటెశయనం
బాలం ముకుందం మనసా స్మరామి"-బాల ముకుందాష్టకం (లీలా శుకులు)
స్వామి అవియే కాదు వాటితో పాటుగా నీ ఆశీర్వచనముగా నీ పీతాంబరమును మాకు శేషవస్త్రముగా అనుగ్రహిస్తే సంతోషముగా నోముస్థలికి చేరుతాము అన్నారట.
స్వామి చిలిపిగా ఇన్ని విషయములు తెలిసిన మీకు నోమును నోచుట అవసరమా అని అడుగగానే వారు వినయముతో,
మేలైయార్ సేవనగల్
***************
మా పెద్దలు లోకక్షేమమునకై నమ్మి ఆచరించిన సంప్రదాయముతో మేముసైతము పెద్దల అనుమతితో గోకుల సుభిక్షతకై ప్రతినపూని నియమములతో ఆచరిస్తాము.
స్వామి నీ అనుగ్రహము వలన మేము వదలవలసినది కర్మానుష్ఠానము కాదని అది చేయువేళ ఆవహించు కర్తృత్వము ( నేను చేస్తున్నాను అన్న) భావనని తెలుసుకున్నా మనుచున్న గోపికలతో నున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Sunday, January 8, 2023
AALO REMBAAVAAY-25
పాశురము-25
***********
"అఖిలాండ రక్షణముగా చేసితివి మాకొరకై అజ్ఞాతము
అనవరతకటాక్షముగాద అవతార రహస్యజ్ఞానము."
ఇరవై ఐదవ పాశురం
*****************
ఒరుత్తు మగనాయ్ పిరందు,ఓర్ ఇరవిల్
ఒరుత్తు మగనాయ్ ఒళిత్తు వళర
తరుకిల్లానాంగి తాంతీంగు నినైన
కరుత్తై పిళ్ళైపిత్తు క్కంజన్ వయిత్తిల్
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! ఉన్నై
అరుత్తిత్తు వందోం ; పరై తరుదియాగిల్
తిరుత్తక్క శెల్వముం శేవగమం యాంపాడి
వరుత్తముం తీరందు మగిళిందు ఏలోరెంబావాయ్!
ఏకము-అనేకముగా అనుగ్రహిస్తున్న వైనమును గోపికల ద్వారా మనకు తెలియచేస్తున్నది.వారు,
1.మగిళిందు వందోం-సంతోషముగా వచ్చారట
2.శెల్వముం-సేవగమం యాంపాడి-నీ యొక్క పరాక్రమము సంపదను పాడుతూ వచ్చాము.అంటున్నారు.
వారి సంతోషమునకు కారణము
ఓర్ ఇరవిల్ అంటున్నారు.
ఒక రాత్రి వారి సంతోషమునకు కారణమై ప్రకాశిస్తున్నదట.
బాహ్యమునకు విరుద్ధము.
చీకటి తొలగితే కాని మనము ప్రకాశమును కాంచలేము.కాని వీరికి చీకటి ప్రకాశముగా భాసిస్తూ,ప్రమోదమును కలిగిస్తోందట.
పైగా మాకే కాదు ఆ ఒకే ఒక రాత్రి,
1.మధురా నగరమునకు సంతోషమును కలిగించినది జన్మస్థానమై.
2.దేవకీదేవికి సంతోషమును కలిగించింది స్వామి నిత్యవిభూతి సాక్షాత్కారముతో.ఎవ్వనిచే జనించు జగము-ఎవ్వని లోపలనుండు.
3.చెరసాలకు సంతోషమును కలిగించినది అచేతనములని మనము భావించు ద్వారగడియలకు చేతనత్వమును ప్రసాదించి
4.నందుని సంతోషపరచినది స్వామి వాహన భాగ్యమును ప్రసాదించి
5.యమునను సంతోషపరచినది స్వామిని స్వాగతించు సౌభాగ్యముతో
6.ఆదిశేషుని సంతోషింపచేసినది స్వామికి ఆఛ్చ్హాదనముగా
7.యశోదమ్మను సంతోషపరచినది-నందుని సతి యా యశోద ముందరనాడెదవు --ప్రారంభమునకు లీలావిభూతిగా.
8.రేపల్లెను సంతోషపరచినది -తాను ఆడిపాడగా
9.గోకులమును సంతోషపరచినది గోవిందుని చేరి మురియగా.
10.అంతెందుకు మమ్ములను ఏశాస్త్రమును అధ్యయనము చేయని గోపకాంతలను సంతోషపరచినది ఆ
ఓరు అరియల్
ఆ అర్థరాత్రి అంటున్నారు.
బాహ్యమునకు ఎవరిపేరు చెప్పినా స్వామికి ప్రమాదము తలపెడతారనే అమాయకత్వము.
నిన్నేమని పిలవాలి-నిన్నెవరని కొలవాలి-అన్నీ నీవే అయినప్పుడు అన్న అవతార రహస్యము
చక్కగా తెలియచేసినది గోదమ్మ.
స్వామి పిరందు అని జన్మించాడని పాడింది.
అంటే జననము-అవతారము ఒకటికాదా అనే సందేహమునకు సమాధానము చెబుతున్నారు గోపికలు.
1.పిరందు-అవతారము/జన్మము/
ఏమిటా జన్మమునకు గల ప్రత్యేకత?
పూర్వజన్మ కర్మములను అనుభవించుటకు వాటి ఫలితములను మూటకట్టుకుని తమతో పాటుగా జన్మించుట చేతనులది.
పూర్ణానుగ్రహముతో కరుణను పెద్దమూటగట్టుకొని సంకల్పమాత్రమున సారూప్యతను సంతరించుకొనునది స్వామి ఆవిర్భావము.స్వామి తనమూలతత్త్వమునుండి(నిరాకారతను విస్మరించి) సాకారుడై సాక్షాత్కరింపచేసుకొనిన అదృష్టము ఆ అర్థరాత్రిది.
సంతోషము స్వామి అవతార రహస్య జ్ఞానము లభించినందులకు అయిన వారిదగ్గర ఇంకను విచారమున్నదట.దానిని పోగొట్టుకోవాలని వచ్చారట.అంతటి జ్ఞానమును ప్రసాదించిన స్వామి అమాయకముగా ఇంతకు మీరు పర కావాలన్నారు అది మీకిస్తే సంతోషమేనా అని అడిగాడు స్వామి వారి మనోభావాలను మరింత స్పష్టము చేయాలని.దానికి వారు
ఓ నెడుమాలే! ఉన్నై
అరుత్తిత్తు వందోం ; పరై తరుదియాగిల్
నీవు సంసారమనే కంసుని సంహరించినావి భావార్థము.నీ మేనమామ అయిన (శారీరక సంబంధములు అను కంసుని) గుండెలో కుంపటివై భస్మము చేసినావు.
ఓ నెడుమాలే
నిండుగా వ్యాపించియున్న భక్తవాత్సల్యమా!
నీ అనుగ్రహము వలనే
1.మేము నిన్ను చూదగలుగుతున్నాము.
2.నీతో మాట్లాడగలుగుతున్నాము
3.నీవిభవమును కీర్తించగలుగుతున్నాము.
4.నిన్ను అర్థించగలుగుతున్నాము.
5.నీ దయచే మేము నిన్నే సాక్షాత్తుగా నిన్నే కోరుదామని వచ్హాము.
నీవు గొల్లలో గొల్లనిగా,గోవులలో గోవుగా,గోపికలలో గోపికగా మాతో పాటుగా ఆడుతూ-పాడుతూ మునిగితేలని.
"పరను" అనుగ్రహించుట నీ ఇష్టము.
" పరమాత్మనే అనుగ్రహముగా పొందుట మా అభీష్టము".
అని వేడుకుంటున్న గోపికలతో పాటుగా నున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Saturday, January 7, 2023
AALO REMBAAVAAY-24
పాశురమునకు పోట్రి,
**********************
" మాయావుల మదమదచిన పాదములకు పల్లాండ్లు
మా యానగ నీదరిచేరలేవు మాధవ కడగండ్లు"
సుతుడనుచు దశరథుడు-హితుడనుచు సౌమిత్రి
క్షితినాథుడనుచు భూపతులు కొలిచిరిగాని
అని త్యాగరాజుచే కీర్తించబడిన రామావతార విశేషములను "అన్రు" అని-కృష్ణావతార విశేషములను "ఇన్రు" అంటూ భగవంతునితో-భాగవతులుగా వారికున్న సంబంధజ్ఞానమును సంకేతిస్తూ,శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా స్వామికి మంగళాశాసనములను అందించుటయే మహద్భాగ్యమనుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమేరకు "పోత్తి" పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
ఇరువది నాలుగవ పాశురం
*************************
అన్రు ఇవ్వులగం అళందాయ్ !అడిపోట్రి
శెన్రంగు త్తెన్నిలింగై శెట్రాయ్! తిరల్ పోట్రి
పొన్ర చ్చగడం ఉదైత్తాయ్! పుగళ్ పోట్రి
కన్రు కుణిలా ఎరిందాయ్! కళల్ పోట్రి
కున్రు కుడైయా ఎడుత్తాయ్! గుణం పోట్రి
వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయల్ వేల్ పోట్రి
ఎన్రెన్రు ఉన్ శేవగమే ఏ తిప్పరై కొళివాన్
ఇన్రుయాం వందోం ఇరంగేలోరెంబావాయ్.
అనన్యార్థ శేషత్వము-అనన్యార్థ శరణత్వము-అనన్యార్థ భోగత్వమును (అకారత్రయ) అధిగమించిన అవస్థ మనగోపికలది.వారు సామాన్యులుకారు.భాగవతోత్తములు-నిత్యసూరులు-సాక్షాత్తుగా నీలాదేవిని-గోదమ్మను కూడియున్నారు.వారు దర్శిస్తున్నది సాక్షాత్తుగా పరమాత్మను.కడువిచిత్రముగా వారి మనోభావములు నవవిధభక్తులను దాటి నవనవోన్మేషమైన "మైత్రీ భజరో మన్ మే " ఎల్లలను మరచినది.వారున్న స్థితి కాలాతీత-గుణాతీత-భావాతీతము.
గోదమ్మ ఒక్కొక్క పాశురములో ఒక్కొక్క విభూతులను వివరిస్తూ దివ్యానుభవములో విహరింపచేస్తున్నది.
స్వామి వామనునిగా-శ్రీరామునిగా-బాలగోపాలునిగా జగములను రక్షించుటకు ఎంత శ్రమపడి-అలిసిపోయినాడో అనుచున్న గోపికలను,
బద్ధులదశనుండి- ముక్తులదశకు
ముక్తులదశ నుండి-నిత్యులదశకు చేర్చి వామనావతారవైభవమును-శ్రీరామావతార ప్రాభవమును-కృష్ణావతార పరాక్రమమును ప్రస్తుతించేలా చేస్తున్నది .
1.అన్రు ఇవ్వులగం అళందాయ్.
స్వామి అప్పుడెప్పుడో ఈప్పుడు మేమున్న భూమిని కొలిచిన నీ పాదములకు మంగళాశాసనములు.
2.శెన్రంగు త్తెన్నిలింగై శెట్రాయ్!
రామావతారములో లంకకు వెళ్ళి రావణుని సంహరించిన నీ భుజబలమునకు మంగళాశాసనములు.
3.పొన్ర చ్చగడం ఉదైత్తాయ్
శకటాసురుని తన్ని పడివేసిన నీ కీర్తికి మంగళాశాసనములు.
4.కన్రు కుణిలా ఎరిందాయ్!
దూడను కర్రగా ఉపయోగించి కపిత్తాసురునిపై విసిరివేసి వారిద్దరిని సంహరించిన నీ పాదములకు మంగళాశాసనములు.
5.కున్రు కుడైయా ఎడుత్తాయ్
పర్వతమును గొడుగుగా మలచి గోకులమును రక్షించిన నీ కరుణకు మంగళాశాసనములు.
మైమరచి మంగళాశాసనములు చేస్తున్న వారిని స్వామి ప్రస్తుతములోనికి తెచ్చేశాడు.ఇది యొక లీలా విభూతి.అంతే
6.ప్పరై కొళివాన్
ఇన్రుయాం వందోం ఇరంగేలోరెంబావాయ్
వారే వీరై స్వామికి చేస్తున్న మంగళాశాసనములు మరచిపోయినారు
స్వామి పఱను తీసుకుని వెళ్ళుదామని ఇక్కడకు వచ్చాము.నీవనుగ్రహిస్తే తీసుకుని నోముస్థలికి మిమ్ములని గొని వెళతాము అంటున్నారు.
ఇది వాచ్యార్థము.నిజముగా గోపికలు సర్వజ్ఞులయితే మళ్ళీ వ్రతము-పఱ అని ఎందుకు అంటున్నారు.
గోపికలను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తు పరమాత్మకు దగ్గరగాచేర్చుచున్నది గోదమ్మ.స్వామియును తానొక్కొక్క మెట్టు దిగుతు వచ్చి వారిని చేరదీసుకుంటున్నాడు.ఎంతటి సుందరము సుమధురము ఆ సన్నివేశము.
అధర్మముతో బలి-కామముతో రావణుడు-ప్రలోభముతో ధేనుకాసుర కపిత్తాసురులు,క్రోధముతో ఇంద్రుడు స్వామిని సమీపింపచేసారు.వారి విరోధిభావనలను సైతము స్వామిచే అనుకూలములుగా మలచబడినాయి.వారిని ,అఘరహితులను చేసినవి.
స్వామి తమకై దిగివస్తున్నప్పుడు వారికి ప్రధమముగా స్వామి పాదారవిందములు దర్శనమిచ్చాయి.అవి కెందామరలవలె ప్రకాశిస్తున్నాయి.మన గోపికలకు మాత్రము అవి ఎర్రగ కందిఉన్నట్లుగ కనపడునట్లు చేస్తున్నది వారికి స్వామిపై గల వాత్సల్యము.ఖిన్నవదనములతో వారు అవును మరి త్రివిక్రముడై,ఎత్తు-పల్లాలతో,రాళ్ళు-రప్పలతో కఠినముగా నున్న భూమిపై పాదమును మోపి,కొలుచుటచేకందినది.కాని ఇంతవరకు ఆ విషయమును ఎవరును-కనీసము తిరిగి సామ్రాజ్యమును అనుభవించిన ఇంద్రుడైనను గమనించలేదు అనుకొని,ఆ దివ్య చరణారవిందములకు,
" అన్రి ఇవ్వులగం అళిందాయ్ అడి పోట్రి " అని కీర్తిస్తు స్వామి పాదధూళి ప్రసాదమును పొందగలిగారు.
ఇంకొక మెట్టు ఎక్కారేమో తమకై స్వామి చేతి చాచి అందిస్తుండగా వారికి స్వామి తోళ్వళి-విశాలభుజములు దర్శనమిచ్చాయి.అవును అజ్ఞానమయమైన లంకలోనికి ప్రవేశించి,రావణుని సమ్హరించి,తిరిగి అక్కడ వెలుగులు పంచిన స్వామి,
"శెన్రంగు తెన్నిలింగై శెత్తాయ్! తిరల్ పోట్రి" అని ,
దశకంఠునిపరిమార్చిన దాశరథి,నీకు
జయమంగళం-నిత్యశుభమంగళం. .
భుజబలమును కీర్తిస్తూ పరాక్రమ ప్రాభవమును ఆస్వాదించగలిగారు.
ఇంతలో వెనుకనున్న గోపికలు మమ్ములను స్వామి పాదములను దర్శించనీయండి అని ముందుకు వచ్చారు.ముసిముసి నవ్వులతో వారికి స్వామి తాను శకటాసుర-వృతాసుర సమ్హారమునకై వంచిన తన పాదపు విరుపును అనుగ్రహించాడు దర్శనముకై.
పులకించిన మనస్సులతో వారు,
'పొన్నర్చగడం ఉడైత్తాయ్! పుగళ్ పోట్రి"
పరాక్రమమును ముందరి గోపికలు వర్ణిస్తే,పరాక్రమము ద్వారా లభించిన కీర్తిని వీరు మూర్తిమంతము చేసి ఆశీర్వదించారు.
శకట-వృత సంహారునికి శతమాన మంగళం.
ఇంకొక మెట్టు పైకి ఎక్కుతున్నారేమో,
మరికొందరు వీరిని కొంచము జరుగమని ముందుకు వచ్చి అదియేకాదు,స్వామి పాదపు వంపును మేము వెనుక నుండి దర్శిస్తున్నాము.మీరును చూడండి, అంటు
" కన్రు కుణిలం ఎరిందాయ్! కళల్ పోట్రి"
అంటు,వత్సాసురుని విసిరినప్పుడు ఉన్న నీ పాదభంగిమకు మంగళమని" వాత్సల్యముతో ప్రస్తుతిస్తున్నారు.
ఆలకిస్తూ-ఆస్వాదిస్తూ -అనురాగముతో అందిస్తున్నాడు స్వామి తన చేతిని గోపికలకు .అంతలో స్వామి చేతి చిటికెనవేలు,చిటెకలో గుర్తుచేసింది వారికి అప్పటి ఇంద్రుని రాళ్ళవాన-గోవర్ధనగిరికి వారుచేయుచున్న పూజ,దానికి సంరక్షకునిగా గోవిందుని పర్యవేక్షణ తెరలుతెరలుగా కదులుతున్నాయి వారి మనోఫలకముపై.బరువైన హృదయములతో స్వామి మాకొరకు గొడుగై,గోవర్ధనమును గొడుగు చేసి నీ చిటికిన వేలుపై నిలబెట్టి మములను రక్షించిన నీ చిన్నివేలెంత కందెనో.ఇన్నిరోజులు మేమా విషయమును గమనించలేదంటు,
గోవర్ధనగిరినెత్తిన వేలికి గోపికల మంగళం అని యశోదలై తరిస్తున్నారు
యశోదమ్మలుగా మారగానే నందగోపుని కూర్వేల్ మనసులో మెదిలినట్లుంది.స్వామి నీ యొక్క శౌర్యపరాక్రమములకే కాదు-నీ చే ధరింపబడు ఆయుధములకు కూడా మంగలాశాసనములు.
స్వామి నీ పరాక్రమము-దాని ప్రకాశము ఎప్పుడు చూసిన-ఎక్కడ చూసిన ప్రతిఫలిస్తూనే ఉంది.మేమెన్ని చెప్పగలము.నిన్నేమని కీర్తించగలము అని వారంటుంటే,
వామనుడై-శ్రీరాముడై-యాదవుడై అన్నీ తానై అవధరిస్తున్నాడుస్వామిఆనందాతిరేకముతో.
అనుభవిస్తున్నాము మనము అదృష్టముగా.
అంతలో స్వామి వాత్సల్యముతో,
అయ్యో పిల్లలు అసలు వచ్చిన విషయమునే మరచి అంతగా ఆరాధిస్తు-ఆశీర్వదిస్తున్నారు.గుర్తుచేద్దాము వారికి వారు వచ్చిన పనిని అని అనుకున్నట్టున్నాడు -గోపికలు బహిర్ముఖులై స్వామి ,
ఇరంగుక్కు-కరుణతో,
పరై కొల్వాన్-పరమాత్మ నిన్ను సేవించు భాగ్యమును కల్పించుటకు,పఱ అను పూజా విశేషమును అందించండి.
ఓం (నమో) నారాయణాయ -షడక్షరీ మంత్రము.
ఆరుసార్లు చేయు మంగళా శాసన విశిష్టత ఏమిటి? .అమృతధారలుగా అరుదైన విషయములు అనుసరించినవి.ఆరు ఋతువులందును,ఆరు రుచుల యందును,ఆరు శత్రువుల యందును,ఆరు విషయములందును ( పంచేంద్రియములు+మనసు) ఆరు పోయుట యందును (వారు పోయుట)స్వామి ఆరు రంగనాథ క్షేత్రములందును( ఆద్య రంగము-పరిమళ రంగము-వట రంగము-సారంగము-అప్పలి రంగము-అంతరంగము) ఆనందమయముగా నుండుటకు గోపికలు మంగళమును పాడిరి.అవన్నీ పరమాత్మ రూపాలే.పరమానంద ప్రదములే. .
ఆహ్వానించుచున్న గోపికలతో నున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము స్వామిని సిరినోమునకు ఆహ్వానిద్దాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం
.
Friday, January 6, 2023
AALO REMBAAVAAY-23
పాశురము-23
***********
" స్వామి సౌకుమార్యమునకు ఆతసీపుష్పములు
సింహగతిని వీక్షించుచు ఆనందభాష్పములు"
సర్వవాహనుడైన స్వామిని శీరియ సింహాసనారూఢినిగా మనకు దర్శింపచేస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకుందాము.
అజ్ఞానము పురూరవ శాపముగా యాదవులకు సింహాసనాధిష్థత నిషేధముకదా మరి స్వామిని వచ్చి, శీరియసింహానముపై కూర్చుని వారిని అనుగ్రహించమనుచున్నారేమిటి? అని ప్రశ్నించవచ్చును.
ఇక్కడ స్వామి అధిష్ఠించవలసినిది రాజ్యసింహాసనము కాదు.రాజిల్లు హృత్పద్మసింహాసనము.అదియును శీరియసింగము వలె.లక్ష్మీనారాయణులుగా.
ఇరవదిమూడవ పాశురం
*********************
మారిమలై ముళింజిల్ మన్నికొడందు ఉరంగం
శీరియశింగం అరిఉత్తు త్తీవిళిత్తు
వేరి మయిర్ పొంగ వెప్పాడుం పేరొందు ఉదరి
మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు
పోదరుమా పోలే ,నీ పూవై పూవణ్ణా! ఉన్
కోయిల్ నిన్రు ఇంగనే పోందరుళి,కోప్పుడయ
శీరియశింగాసనత్తు ఇరుందు యాం వంద
కారియం ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్
"మృగానాంచ-మృగేంద్రోహం." అన్నాడు స్వయముగా పరమాత్మ-
నరసింహ పాశురముగా కీర్తింపబడు ప్రస్తుత పాశురములో గోదమ్మ కారణస్థితి నుండి స్వామిని కార్యస్థితికి ఉన్ముఖునిగా చేసి దర్శింపచేస్తున్నది. సివంగిని కూడికొండ గుహలో సింహము తాదాత్మ్యతతో సర్వముమరచి నిదురిస్తున్నది
(బాహ్యము).చుట్టు జలము.
"ప్రణయముగా భాసించుచున్న ప్రళయసమయము."
విశిష్టాద్వైతము.
స్వామి తనతట తాను నిదురలేవాలి.సింహగతిని (సింహపు నడక దర్శనమును) మనకు అనుగ్రహించాలి.వచ్చి సింహాసనమును అధిష్ఠించాలి.గోపికలందరు చేయుచున్న విన్నపములను ఆరాతీసి,అనుగ్రహించాలి.ఇది వాచ్యము.
అందుకే అమ్మ
1.ఓ శీరియసింగమా! అని సంబోధించినది.
శౌర్యపరాక్రమ సింహమా-అనునది ఒక భావము.
శ్రీదేవిని కూడి యున్నవాడా.అని మరియొక భావన.
2 మారి-వానాకాలములో
మళైముళింజిల్-కొండగుహలలో
మన్నికొడందు-ఏ ఇతర ఆలోచనలు లేక
ఉరంగుం-నిదురించుచున్నావు.
మున్నీట శయనించు---స్వామి
3.అరివిత్తు-తెలివి తెచ్చుకో
తీవిళిత్తు-తీక్షణముగా చూడు
స్వామి నీవు జలప్రళయములోపల సకలచరాచరములను ప్రకృతిని కూడి నిదురించుచున్నావు.మీరు పురుషునిగా-ప్రకృతిగా రెండు రూపములుగా ఏర్పడండి.నీ నుండి ప్రకృతి కాంతను విడదీసి-విస్తరింపచేయుమా.అని ప్రార్థిస్తున్నారు.
4.విస్తరణ సంకేతముగా సింహము
వేరిమయిర్-సుగంధభరితమైన (పంచభూతములను) తన జూలును
ఎప్పాడుం-అన్ని దిక్కులందు
పొంగి-నిటారుగా/నిక్కపొడుచుకుని నిలుచునట్లుగా
పేరిందుదరి-విదిలించుకుని విస్తరింపచేసినది.
5.మూరి నిమిరిం దు-కాళ్ళను ముందుకు సాచింది.
చైతన్యవంతము చేస్తున్నది తన సృష్టిని.
6.ముళంగి-గర్జిస్తున్నది
శబ్దములను-అపౌరుషేయములను/వేదములను నాదమును అందించింది.
7.సివంగి స్థూల ప్రపంచముగా కార్యస్థితిని పొందినది.కారణము నుండి విడివడినది.
8.ఉన్ కోయిల్ పురంపట్టు-తన నివాసమునుండి బయలుదేరినది.
సింహము ఏ విధముగా బయలుదేరినదో దర్శించాము.
సింహపు నడక ప్రత్యేకత ఏమిటి?
భగవంతుడు గజగతి,వృషభగతి,శార్దూలగతి,వివిధగతులుండగా వీరు సింహగతిని ఎందుకు కోరుకున్నారు.
సింహము మృగరాజు.ఠీవితో నడుస్తుంది.అన్యాయముగా ఏ జీవిని హింసించదు.ఏ జీవికి భయపడదు.అంతే కాదు నాలుగు అడుగులు వేసి వెనుకకు తిరిగి చూస్తుంది.రెండు అడుగులు వేసి అటు-ఇటు చూస్తుంది.తనవారిని రక్షించుటకై.
స్వామి అదే విధముగా మాకు ఇచ్చిన వరములను ఒక్కసారి గుర్తు తెచ్చుకో.నీ నేత్ర సౌందర్యము దర్శించి-నీ నడక సౌందర్య దర్శనమునకై వేచియున్నాము.కనుక గోపబాలురమైన మా ప్రార్థనలను మన్నించి వచ్చి,శీరియ చక్కగా అమరిన/అమలిన సింహాసనముపై కూర్చుని ,మా తో ముచ్చటించి,మమ్ములను అనుగ్రహించు అంటున్నారు.
ఒక్కొక్క పాశురము మనకు నేర్పిస్తున్న పాఠములను "సింహావలోకనము" పునః పరిశీలనము చేసుకుంటే,
4.వ పాశురములోనే వారు ఆళిమళై కన్నా అని వాన కొరకు ప్రార్థించారు పద్మనాభుని.
5.వ పాశురములో స్వామి తనంతట తాను భక్తికి కట్టుబడతాడని గ్రహించారు.
6.గోపికలను మేల్కొలుపుతు పక్షులు,పశువులు,యోగులు-మునులు ఏ విధముగా పంచభూతములలో అర్థపంచకమును గ్రహించి స్వామిని అర్చిస్తున్నారో అర్థముచేసుకున్నారు.
7 ఆచార్య సంప్రదాయానుసారముగా నిత్యసూరులను మేల్కొలుపుతూ స్వామి లీలలను సంకీర్తించారు.
8.నీలా-నీలమేఘుల మైథున భావనమును ,
నీలాదేవి పురుషకారత్వమును పొందగలిగారు.
ఇప్పుడు వారు స్వామి శౌర్యపరాక్రమములతో పాటుగా సౌకుమార్యమును సైతము గుర్తించి, "నీ పూవై పూవణ్ణా"
"అతసీపుష్పసంకాశం-
పీతవాస సమచ్యుతం
యే నమస్యంతి గోవిందం
న తేషాం విద్యతే భయం"
అని అంటున్న
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Thursday, January 5, 2023
AALO REMBAAVAAY-22
Wednesday, January 4, 2023
AALO REMBAAVAAY-21
పాశురము-21
************
" సరికాదని దరిచేరననకు జితబాణులము కాదయ్యా
నినుకాదని మరలగలేము జితగుణులము మేమయ్యా."
వారికి ఎవరు సహాయము చేసినారో-ఏమి ఉపాయము చూపినారో కాని,ఇప్పుడు వారిమధ్య,
" దూరములేదు-దూషణములేదు
దురుసుతనములేదు-దుడుకుతనము లేదు
దురితములు లేవు-దుఃఖములు లేవు
వ్రతము ధ్యాసలేదు-వంటి సోయలేదు
అపేక్ష మాసినది-ఆపేక్ష మురిసినది.
గోపికల ఇంద్రియము కృష్ణకేంద్రీకృతము గావించిన ,
'పుగళందు పోత్తియాం వందోం" అనిపించిన గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
ఇరవై ఒకటవ పాశురము
*********************
ఏట్ర కలంగళ్ ఎదిర్ పొంగి మీదళప్ప
మాట్రాదే పాల్శొరియం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆట్ర పడైత్తాల్ మగనే అరివురాయ్
ఊట్రం ముడైయాయ్ పెరియాయ్ ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ర శుడరే తుయిళెలాయ్
మాట్రార్ ఉనక్కు వలితుళైందు ఉన్ వాశల్ కణ్
ఆట్రారు వందు ఉన్ అడిపడియు మాపోలే
పోట్రియాం వందోం పుగళేందో రెంబావాయ్.
ప్రస్తుత పాశురము గోపికలయొక్క నిరుపాధి-నిరపేక్ష-నిరతిశ-నిస్తుల -నిర్గుణ వైభవమును వారు మాటిమాటికి అన్న -ఆట్రపడైత్తాల్-లెక్కపెట్ట లేనన్ని-అన్న- అనంత శబ్దముతో,ఔదార్యమునకు ప్రతీక యైన వల్లాల్ శబ్దముతో వ్యక్తపరుస్తున్నారు.
1,మొదటగా వారు ప్రస్తావించినది,
ఆట్రపడైత్తాల్ పెరుం పశుక్కళ్
పూర్వపాశురములలో సైతము వారు గోవుల ప్రస్తావనను-క్షీర ప్రస్తావనను తెచ్చినప్పటికిని,ప్రస్తుత పాశురములోని పెరుం పశుక్కళ్-ఏత్తం కలంగల్-ఎన్నెన్ని కుండలను తమ ముందుంచినను ,
ఎదిర్పొంగి మీదళిప్ప పాల్శోర-కుండలు నిండి పొంగిపొరులునట్లు పాలధారలను వర్షించుచున్నవి.
ఇక్కడ దూడల ప్రస్తావనలేదు.పాలు పితుకుట లేదు.నేల తడియుటలేదు.
కుండలలోనే కురియుచున్నవి.పొంగిపొరలుటకు సిద్ధమవుతున్నవి.
ఇది ఒక భావము.
ఇక్కడ పెరుంపశుక్కళ్-ఆచార్యులు.కుండలు -శిష్యులు-
వారు అందించుచున్న క్షీరము జ్ఞానము.
ఆ జ్ఞానము-ఆ క్షీరము కొలుచుటకు అశక్యము.అది
" ఆట్రపడైత్తాల్". వారు ఉదారులు.వల్లాల్.
2.ఆట్రపడైత్తాన్ మగనే-అని సంబోధించారు.
అంటే నందగోపన్ ఆట్రపదైత్తాన్-లెక్కకు మించిన సద్గునములు కలవాడు.
కూర్వేళ్ తొళి అను ప్రథమ పాశురములో వీరత్వమును,నాయగన్ మరుమగలే అన్న పాశురములో నాయకత్వమును,అంబరమే తన్నీరే పాశురములో దానధార్మికత్వమును,ఉందుమదగళిత్తు పాశురములో బలమును,ఐశ్వర్యమును"ఆట్రపదైత్తాన్" మగనే అన్న ప్రస్తుత పాశురములో ఐశ్వర్యమును ప్రస్తావించి అట్టివాని కుమారుడా అని సంబోధించారు.
3. ఆట్రిపదైత్తాన్ శుడరే అని స్వామిని కీర్తిస్తున్నారు.
ఇక్కడ మనము ఇంద్రుని-బ్రహ్మను ఒకసారి వారికి కలిగిన తలపులను-ఫలితములను గుర్తుకు చేసుకుందాము.
ఇంద్రుడు గోవర్ధనగిరిపై రాళ్లవాన కురింపించుట,స్వామిని గుర్తించుట జరిగినది.అదేవిధముగా ఒక సారి బ్రహ్మ కృష్ణుని పరాభవించాలని,గోవులను,గోపబాలకు చెరయందుంచినాడట.స్వామి తానే గోవులుగా-గోపబాలులుగా మారి బృందావనమున సంచరించు,బ్రహ్మగర్వమునకు భంగము గావించినాడట.
ఆచార్యానుగ్రహమును పొందిన గోపికలు వారి స్వామి యొక్క కాంతిరేఖలనే నందునిగా,యశోదగా,బలరామునిగా,సర్వులుగా గుర్తించగలుగుతున్నారు.
3. ఆట్రాపుదైత్తాన్ ప్రస్తుతము ప్రకాశముతో
ఉలగనిల్ తోట్రమాయ్ నిన్ర-మనకోసము కృష్ణునిగా అవతరించి మనలో ఒకడైనాడు అనగానే ఇంక స్వామి మనతో నోమునకు వచ్చుట ఏమిటి?మనము పిలుచుట ఏమిటి? అన్న భ్రమలు తొలిగి వారి స్వామితో,
ఉన్ అడిపణియ-నీ తలుపుదగ్గర మేము
ఏవిధముగా నీ భుజబలమునకు-నీ బాణముల దెబ్బలకు ఓర్వజాలక నీ శరణాగతికై,తమ పరాక్రమవంతులమను తలపును విడనాడి వచ్చి ఆట్రాపుడైత్తాన్ లెక్కించలేనంతమంది నిలబడినారో
4.ఆట్రాపుదైత్తాన్ -వచ్చి నిలబడిన లెక్కకు మించిన పూర్వ శత్రువులు-ప్రస్తుత శరణార్థుల వలె మేముసైతము నిలిచియున్నామని విన్నవించుకొనిరి.
అంతలోనే స్వామి అదేమిట్ర్రా.మనమందరము గోకులలోని వారమే కదా.మనమందరము కలిసి-మెలిసి ఆడుకొనవచ్చు-పాడుకొనవచ్చును-వ్రతము చేసుకొనవచ్చును అంటున్నట్లుగా భావించి
5.అదికాదు స్వామి వారిని నీవు నీ బాణములచే జయించినావు.వారు భయముతో నీ గదపదగ్గర శరణార్థులై వచ్చి నిలబడియున్నారు.
వేదవేద్యా! విశ్వరూపా! అనంతకళ్యాణ గుణ శోభితా! నీవు మమ్ములను నీ గుణములచే జయించితివి.కనుక నీ గుణవైభవమును మనసారా సంకీర్తించుదామని వచ్చాము,మమ్ములననుగ్రహించు అని అంటున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Tuesday, January 3, 2023
AALO REMBAVAY-20
పాశురము-20
************
"ఉక్కముం-తట్టొళియం లేక తీరదు మా ఆర్తి
నిక్కము సురపక్షపాతివని చేరు నిను అపకీర్తి."
ఇప్పటివరకు మన గోపికలు గోదమ్మతో కలిసి నీలమ్మను నిద్రలేపుతున్నారు.కాని నీలమ్మ స్వామితో నున్నదో ఏమో వీరికి సమాధానమును ఇచ్చుటలేదు.అయినను విచిత్రము వీరు మనకెందుకులే అని నీలమ్మ ఇంటిని వదిలివెళ్ళుటలేదు.నోము చేయుతలుపును వీరిని విడనాడుటలేదు.పూర్తిగా మనలను మైమరపించే ఆత్మస్వరూప-స్వభావములను అర్థమయ్యే రీతిలో మనకు ఆచరించుటకు ఊతగా భగవానుని యోగ-క్షేమ కారకత్వమును అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్శెన్రు
కప్పం తవిర్కుం కలియే !తుయిలెళాయ్
శెప్పం ఉడయాయ్ ! తిఱలుడైయాయ్ శేత్తార్కు
వెప్పం కొడుక్కుం విమలా!తుయిలెళాయ్
శెప్పన్మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱుమఱుంగళ్
నప్పినై నంగాయ్ తిరువే తుయిలెళాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ మణాళనై
ఇప్పోదో ఎమ్మై నీరాట్టు ఏలోర్ ఎంబావాయ్.
Monday, January 2, 2023
AALO REMBAAVAAY-19
పాశురము-19
***********
"పెరుమాళ్ళు -పిరాట్టి ఇంతవరకు ఒకరికొకరు
పంచశయన మిథునమంటున్నది వారు "ఒకేఒకరు."
ఆహా గోపికలదేమి భాగ్యము.ఎన్నితపముల మనలకు ఫలము.గోదమ్మ వారికి-వారితో పాటుగా నీలాకృష్ణుల శయనసౌందర్యమును దర్శింపచేస్తున్నది.
చేతనులకు వారు అనవరతము మునిగితేలుచున్న సంసారములోని సింగారమును చూపిస్తు ముక్తిసోపానములను ఎక్కిస్తున్నది. అవిభక్తమైన పరమాత్మానుగ్రహమును అర్థమయ్యేటట్లుగా వారి రహస్య సన్నివేశములను సదస్యముగా వివరిస్తూ, ఆరి ఓడిలోని చేర్చుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పంచేంద్రియ తర్పణ పాశురమును అమ్మ అనుగ్రహించినంతమేరకు అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
మెత్తెన్ర పంచశయనత్తిల్ మేలేరి
కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నయై కొంగైమేల్
వెత్తుకిడంద మలర్మార్పా వాయ్ తిరవాయ్
మైత్తిడం కణ్ణిణాయ్ నీ ఉన్ మణాలనై
ఎత్తనై పోదుం తుయిలెళ ఒట్టయ్ కాణ్
ఎత్తన ఏలుం పిరివాట్ర గిల్లయాల్
తత్తువ మన్రు తగవేలో రెంబావాయ్.
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...