Wednesday, January 4, 2023

AALO REMBAAVAAY-21

 


  




  పాశురము-21


  ************


 " సరికాదని దరిచేరననకు జితబాణులము కాదయ్యా


   నినుకాదని మరలగలేము జితగుణులము  మేమయ్యా."



   వారికి ఎవరు సహాయము చేసినారో-ఏమి ఉపాయము చూపినారో  కాని,ఇప్పుడు వారిమధ్య,


" దూరములేదు-దూషణములేదు


 దురుసుతనములేదు-దుడుకుతనము లేదు


 దురితములు లేవు-దుఃఖములు లేవు


 వ్రతము ధ్యాసలేదు-వంటి సోయలేదు


 అపేక్ష మాసినది-ఆపేక్ష మురిసినది.


   గోపికల ఇంద్రియము కృష్ణకేంద్రీకృతము గావించిన ,


'పుగళందు పోత్తియాం వందోం" అనిపించిన గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.


ఇరవై ఒకటవ పాశురము

*********************


ఏట్ర  కలంగళ్  ఎదిర్ పొంగి మీదళప్ప

మాట్రాదే పాల్శొరియం వళ్ళల్ పెరుం పశుక్కళ్


ఆట్ర పడైత్తాల్ మగనే అరివురాయ్

ఊట్రం ముడైయాయ్ పెరియాయ్ ఉలగినిల్


తోట్రమాయ్ నిన్ర శుడరే తుయిళెలాయ్

మాట్రార్ ఉనక్కు వలితుళైందు  ఉన్ వాశల్ కణ్


ఆట్రారు వందు ఉన్ అడిపడియు మాపోలే


పోట్రియాం వందోం పుగళేందో రెంబావాయ్.


   




 ప్రస్తుత పాశురము గోపికలయొక్క నిరుపాధి-నిరపేక్ష-నిరతిశ-నిస్తుల -నిర్గుణ వైభవమును వారు మాటిమాటికి అన్న -ఆట్రపడైత్తాల్-లెక్కపెట్ట లేనన్ని-అన్న-    అనంత శబ్దముతో,ఔదార్యమునకు ప్రతీక యైన వల్లాల్ శబ్దముతో వ్యక్తపరుస్తున్నారు.


 


 1,మొదటగా వారు ప్రస్తావించినది,


 ఆట్రపడైత్తాల్ పెరుం పశుక్కళ్


   పూర్వపాశురములలో సైతము వారు గోవుల ప్రస్తావనను-క్షీర ప్రస్తావనను తెచ్చినప్పటికిని,ప్రస్తుత పాశురములోని పెరుం పశుక్కళ్-ఏత్తం కలంగల్-ఎన్నెన్ని కుండలను తమ ముందుంచినను ,


ఎదిర్పొంగి మీదళిప్ప పాల్శోర-కుండలు నిండి పొంగిపొరులునట్లు పాలధారలను వర్షించుచున్నవి.


 ఇక్కడ దూడల ప్రస్తావనలేదు.పాలు పితుకుట లేదు.నేల తడియుటలేదు.


 కుండలలోనే కురియుచున్నవి.పొంగిపొరలుటకు సిద్ధమవుతున్నవి.


 ఇది ఒక భావము.


 ఇక్కడ పెరుంపశుక్కళ్-ఆచార్యులు.కుండలు -శిష్యులు-


 వారు అందించుచున్న క్షీరము జ్ఞానము.


ఆ జ్ఞానము-ఆ క్షీరము కొలుచుటకు అశక్యము.అది 


" ఆట్రపడైత్తాల్". వారు ఉదారులు.వల్లాల్.



2.ఆట్రపడైత్తాన్ మగనే-అని సంబోధించారు.

 అంటే నందగోపన్ ఆట్రపదైత్తాన్-లెక్కకు మించిన సద్గునములు కలవాడు.

కూర్వేళ్ తొళి అను ప్రథమ పాశురములో వీరత్వమును,నాయగన్ మరుమగలే అన్న పాశురములో నాయకత్వమును,అంబరమే తన్నీరే పాశురములో దానధార్మికత్వమును,ఉందుమదగళిత్తు పాశురములో బలమును,ఐశ్వర్యమును"ఆట్రపదైత్తాన్" మగనే అన్న ప్రస్తుత పాశురములో ఐశ్వర్యమును  ప్రస్తావించి అట్టివాని  కుమారుడా అని సంబోధించారు.

3. ఆట్రిపదైత్తాన్ శుడరే అని స్వామిని కీర్తిస్తున్నారు.

 ఇక్కడ  మనము ఇంద్రుని-బ్రహ్మను ఒకసారి వారికి కలిగిన  తలపులను-ఫలితములను గుర్తుకు చేసుకుందాము.


 ఇంద్రుడు గోవర్ధనగిరిపై రాళ్లవాన కురింపించుట,స్వామిని గుర్తించుట జరిగినది.అదేవిధముగా ఒక సారి బ్రహ్మ కృష్ణుని పరాభవించాలని,గోవులను,గోపబాలకు చెరయందుంచినాడట.స్వామి తానే గోవులుగా-గోపబాలులుగా మారి బృందావనమున సంచరించు,బ్రహ్మగర్వమునకు భంగము గావించినాడట.


ఆచార్యానుగ్రహమును పొందిన  గోపికలు  వారి స్వామి యొక్క కాంతిరేఖలనే నందునిగా,యశోదగా,బలరామునిగా,సర్వులుగా గుర్తించగలుగుతున్నారు.


3. ఆట్రాపుదైత్తాన్ ప్రస్తుతము ప్రకాశముతో 

ఉలగనిల్  తోట్రమాయ్ నిన్ర-మనకోసము కృష్ణునిగా అవతరించి మనలో ఒకడైనాడు అనగానే ఇంక స్వామి మనతో నోమునకు వచ్చుట ఏమిటి?మనము పిలుచుట ఏమిటి? అన్న భ్రమలు తొలిగి వారి స్వామితో,

ఉన్ అడిపణియ-నీ తలుపుదగ్గర మేము

 ఏవిధముగా నీ భుజబలమునకు-నీ బాణముల దెబ్బలకు ఓర్వజాలక నీ  శరణాగతికై,తమ పరాక్రమవంతులమను తలపును విడనాడి వచ్చి ఆట్రాపుడైత్తాన్ లెక్కించలేనంతమంది                   నిలబడినారో 

4.ఆట్రాపుదైత్తాన్ -వచ్చి నిలబడిన లెక్కకు మించిన పూర్వ శత్రువులు-ప్రస్తుత శరణార్థుల వలె మేముసైతము         నిలిచియున్నామని విన్నవించుకొనిరి.

   అంతలోనే స్వామి అదేమిట్ర్రా.మనమందరము గోకులలోని వారమే కదా.మనమందరము కలిసి-మెలిసి ఆడుకొనవచ్చు-పాడుకొనవచ్చును-వ్రతము చేసుకొనవచ్చును అంటున్నట్లుగా భావించి

 5.అదికాదు స్వామి వారిని నీవు నీ బాణములచే జయించినావు.వారు భయముతో నీ గదపదగ్గర శరణార్థులై వచ్చి నిలబడియున్నారు.

 వేదవేద్యా! విశ్వరూపా! అనంతకళ్యాణ గుణ శోభితా!  నీవు మమ్ములను  నీ గుణములచే  జయించితివి.కనుక నీ గుణవైభవమును మనసారా సంకీర్తించుదామని వచ్చాము,మమ్ములననుగ్రహించు అని అంటున్న,

 ఆండాళ్  దివ్య తిరువడిగళే శరణం.





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...