Monday, July 10, 2017

BATUKAMMA (1)

ఎంగిలిపువ్వు-వెలుగులురువ్వు
       ***********************
1.వర్షాకాలములో చెరువులో బురద పేరుకుని ఉంటుంది.(మట్టి గౌరమ్మను)బొడ్డెమ్మను తయారుచేయుటకు గ్రామస్థులు తలాఇంత పూడిక తీయుటతో నీరు శుభ్రపడుతుంది.

2.పూలుపేర్చుట కొరకై పొలిమేరదాటి, కొండగట్టు,చేలగట్తు పక్కన నడచి వెళ్ళుటతో స్వచ్చమైన గాలి పీలుస్తుంటే ఆరోగ్యం బాగుంటుంది.

3.పూలను  తెంపుతున్నప్పుడు ఆ ప్రదేశంలో వెలువడు మూలికాపరమైన రసాయనములు ,గాలి,  వాతావరణము రోగనిరోధకశక్తిని పెంపొదిస్తుంది
.
4.పూలను   పేర్చుటలో రంగులు అద్దుటలో,ఆట-  పాటలలో లయ ప్రాధాన్యత
వినోద,విజ్ణాన,సందేశాత్మక విలువలు ద్యోతకమౌతాయి.

5.సదాచారమనే చాందసవాద ముసుగులో కొన్ని పూలను మాత్రమే పరిమితం చేసి పూజకు   పనికి రావన్న గునుగు,తంగేడు,రుద్రాక్ష,బంతి,బీర మొదలగు పూలకు పెద్దపీట వేసి,ప్రకృతి రూపంలో పరమాత్మునిప్రసాదమైన ప్రతిపువ్వు చిరునవ్వేనని తెలియ చేస్తుంది
.

6 . అహల్యశాప సమయమున ఇంద్రునికి శరీరమంతా కన్నులుగా శాపము లభించిందని,తనువంతా కనులు కలిగిన సీతాఫలము నైవేద్య నిషేధమనిన కుహనా సంప్రదాయమునకు తెరతీసి ,మనకు మధురత్వమును అందించుటకు కఠినత్వమును శరీర  మంతయు భరించిన ,భరిస్తున్న శిల్పక్కకు పెద్దపీట వేసిన సంస్కారము
.
7.ఆరోగ్యకర పదార్థములైన పిండి,నెయ్యి,బెల్లముతో తయారుచేసిన "మలీద"ప్రసాదము శక్తికారకమౌతుంది
.

8  స్వాతంత్రసాయుధ పోరాట చతురత,ఆడపడుచులను ఆదరించు నైతికత,ఉల్లాస ఉత్సాహ భరిత మానవత.
9.ఎక్కడినుండి వచ్చామో తిరిగి అక్కడికే.ఐనా ఉన్నన్నాళ్ళు పరోపకారమును చాటే ,మన లోపల,బయట విస్తరించి యున్న గాలి,నీరు,నిప్పు నింగి,నేల,కొండ కోన,వాగువంకల గొప్పతనము వివరించే   గోరంత పూజల కొండంత పండుగ.
10.పదికాలాలు  ప్రజల-ప్రకృతి పరవశించి కలిమిలేములు పంచుకుంటు,ఆడిపాడే ఆనందములో తేలియాడిస్తూ వెలుగులు చిందించేదే ఎంగిలిపువ్వు

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...