Sunday, July 9, 2017

HAPPY TEACHERS DAY

 జన్మ సార్ధకం
"గు"కారో..అంధకారస్య
"రు"కారో..తన్నివారణం
గురో.దైవరూపస్య
శిష్యత్వం.జన్మ సార్ధకం
..........
ఆకారం.ఇస్తుంది,అనుక్షణం
అభివృద్ధిని.ఆశీర్వదిస్తుంది
అమ్మ,మన..ఆదిగురువు
వందనం..అభివందనం
..........
ఆలోచన.ఇస్తాడు.అనుక్షణం
ఆలంబనగా..మారుతాడు
నాన్న,మన.వేదగురువు
వందనం..అభివందనం
........
ఆకృతి.మారుస్తుండి..అనుక్షణం
ఇకమత్యమే..చాకచక్యముగ
ప్రకృతి.మన.ప్రశస్త.గురువు
వందనం..అభివందనం
.......
విలక్షణం.అంటుంది.అనుక్షణం
రవిచంద్రుల.క్రమశిక్షణ
ప్రకృతి.మన.ప్రశస్త గురువు
వందనం..అభివందనం
.........
ముందే.పరీక్షలు..అనుక్షణం
వందలాది.పాఠాలతో
అనుభవం.మన.ఘనగురువు
వందనం.అభివందనం
........
ఓనమాల.ఆనవాలు.అనుక్షణం
చిన్ననాటి..చిరుసృష్టిగ
బ్రహ్మ.మన.బ్రహ్మాండ గురువు
వందనం..అభివందనం
.........
విజ్ఞానపు.విజయాలు.అనుక్షణం
విశ్వరక్షణము.పోషకత్వము
విష్ణువు.మన.నిష్ణాత.గురువు
వందనం..అభివందనం
........
గరళమును,గంగను.అనుక్షణం
బంధించిన.నేర్పు..ఓర్పు
శివుడు.మన.పరమగురువు
వందనం..అభివందనం
........
సర్.సర్వేపల్లి.సంస్కారం. అనుక్షణం.
నమస్కారం.అంటుంది.గురువులకు
సకలం..మన.సద్గురువులు
వందనం..అభివందనం.
   హర్ష.వర్షిత.ఉపాధ్యాయ.  దినోత్సవ.శుభాకాంక్షలు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...