SIVA SANKALPAMU-35
ఓం నమ: శివాయ్-35
పొట్టచీల్చి గజాసురుని మట్టి కరిపించావు
చుట్టుకుంది అతని తల నీ సుతుని శరీరమునే
కన్నుతెరిచి మన్మథుని కన్ను మూయించావు
కన్నుల పండుగ అయినది నీ కళ్యాణములో
బాణమేసి వరాహము ప్రాణమే తీసావు
పాశుపతము చేరింది అర్జునుని చేతికి
హరిని అస్త్రముచేసి త్రిపుర సం హారము చేసావు
విరచితమైనది జగతి వీరముగా హరిమహిమ
దారుణ మారణ కాండలను కారుణ్యము అంటుంటే
ఎటుచూసిన నీ గతము పాతకముగ మారుతుంటే
"మహాదేవం-మహాత్మానాం-మహా పాతక నాశనం" ఏమిటంటే
చక్క బరచుట అంటావురా ఓ తిక్క శంకరా.
Comments
Post a Comment