Friday, December 1, 2017

CHIDAANAMDAROOPAA-NAESA NAAYANAARU


 చిదానందరూపా-నేశ నాయనారు
 **************************

 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 భక్తియను పగ్గమువీడని కాంపిలి మగ్గపు నేతగాడు నేశ
 పంచల చాపునునేయుచున్నను పంచాక్షరియే అతని శ్వాస

 భక్తి-కర్మ-జ్ఞాన-రాజ యోగముల నిలయము ఆతని దేహము
 భగవంతునిచేరగ దారిని చూపెను ఆతని జపము

 భక్తుల గౌరవించు, వస్త్ర సమర్పణము భాగ్యముగా భావించు
 సుకృతమేమో గాని సుందరారు కీర్తనలలో భాసించు

 ప్రతిఫలమును కోరని పవిత్ర జీవనము పరిణితి పొందగా
 పరమేశుని చేరగ,పంచిన పంచెలె కారణమాయెగా

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చు గాక.




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...