Thursday, December 7, 2017

CHIDAANAMDAROOPAA- NAKKEERARU

చిదానందరూపా-నక్కీరర్
***************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
తిరుమురుక్కరు పాలై రచయిత మధుర తముళ కవి నక్కీరర్
నమ్మినసత్యమునకు నిలిచిన,పరమేశ్వరునే చర్చకు రప్పించెను
తివిలై యడయల్ తెలియగ రానివి దేవుని-జీవుని ఆటలు
ఆటకు నాందియైనది అమ్మ ఘనపూంగదై పరిమళ సందేహము
పరిష్కారమునకై పసందుగ రాజుచే ప్రకటనము బహుమానము
పరమేశుడు రాసిన పద్యము ప్రవేశించినది ధారుమి చదువగ
నక్కీరుడు పట్టిన దోషము, నడిపించెను శివుని సభకు చర్చకు
అతి మూర్ఖత్వమె ఆదిదేవుని అనుగ్రహమునకు కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
నక్కీరర్ మథురలోని తమిళకవి.స్వామి అనుగ్రహ సూచకముగ "తిరు మురుక్కరు పాలై" పెద్ద మూర్ఖుని అనుగ్రహించిన స్వామి అను గ్రంధమును శివానుగ్రహముతో రచించెను.తిరువిలై యడర్
అనగ భగవంతునితో భక్తుని ఆటలు అనేపురాణము సాక్షాత్తు పరమశివుని తోనే చర్చలకు దిగి,ఆ దైవ రచననే లోపభూఇష్టమనిన మూర్ఖుడు.తను నమ్మిన సిద్ధాంతమునకై దైవాగ్రహమునకు గురియై, కరుణచే మరల రక్షించబడినవాడు.శివలీలల పరమార్థమును తెలిసికొనుట ఎవరికి సాధ్యము. నిందాస్తుతులచే కీర్తించబడే స్వామి,నిందించిన వానిని కరుణించుటయే భాగ్యముగా కలవాడు.దానికి పాత్రధారులుగాస్వామి, పాండ్యరాజును-ధార్మీ ని భక్తులుగా చేసెను. రాజునకు అమ్మవారికి కేశ పరిమళము సహజమా లేక సుగంధ పుష్పములను తురుము కొనుట వలన అబ్బినదా అను సందేహమును కలుగచేసెను.నక్కీరుని భక్తి ప్రకారము ఘనపూంగంఐ తల్లి థమ్మిల్లము సహజ పరిమళ స్వభావము కలది.కథను రక్తి కట్టించుటకు ధారుమి అను పరమశివభక్తునిపేదరికము,రాజ బహుమానముపై మనసును మళ్ళించినది.స్వామిని ప్రార్థించగ నక్కీరుని స్థిరభక్తికి పరీక్షగా స్వామి ఒక పద్యము వ్రాసి,ధారుమికి ఇచ్చి రాజసభలో దానిని చదివి బహుమతిని తీసుకొమ్మనెను.కాని నదురుబెదురు లేని నక్కీరుడు ఆ పద్యములో లోపమున్నదని అడ్డుకొనగా,ధారిమి తిరిగి శివుని వేడుకొనెను. స్వామి దిగివచ్చి నక్కీరునకు దివ్యత్వమును ప్రసాదించెను. ! ఓం నమః శివాయ.నక్కీరుని అదృష్టమేమని వర్ణించగలను.స్వామి ఎన్నివాదముల వాదించినని నక్కీరుడు తన మాటను విడనాడలేదు.దానితో ఆగ్రహించిన సామి అగ్గి కన్నును తెరువగానే,వేడిని తాళలేని నక్కీరుడు,చెంతనేనున్న పావన గంగాజలాశములో పడెను.అహము దహించుకు పోయినది.అణువణువు శివమయమైనది.ధన్యుడవు నక్కీరా.స్వామి కరుణ నిన్ను సర్వ శుభలక్షణుని చేసినది.ఈనాటికి మధుర మీనాక్షి అమ్మవారి మండపమున మీ ఇద్దరి సంవాదనము నిత్యోత్సవము చేయుచున్నది.
( ఏక బిల్వం శివార్పణం.)

)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...